హైదరాబాద్: గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కరెంట్ చార్జీలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడలో నిరాహార దీక్ష చేసిన చంద్రబాబు తాము అధికారంలోకొస్తే ఒక్క రూపాయి కూడా పెంచనని చెప్పిన విషయం గుర్తులేదా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు.
ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఇచ్చిన మాటను విస్మరించి చంద్రబాబు ఒక్క కలంపోటుతో కరెంట్ చార్జీలను పెంచి ప్రజలపై రూ.వెయ్యి కోట్ల భారం మోపారని దుయ్యబట్టారు. కరెంటు చార్జీలను పెంచడాన్ని శాసనసభలో తమ పార్టీ వ్యతిరేకిస్తే.. అధికారపక్షం బరితెగించిందన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏ కేటగిరీకి ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఆయన గుర్తుచేశారు.
ఆనాడు అన్న మాటలు గుర్తులేవా?: చెవిరెడ్డి
Published Wed, Mar 25 2015 2:03 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement