
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టే అన్ని వర్గాలు ఆయనకు అండగా నిలుస్తున్నాయని వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, నిరుద్యోగులకు వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల వ్యతిరేకి అని విమర్శించారు. చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు నష్టపోయారని అన్నారు.
యువతకు ఉపాధి కల్పించాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదని, నాలుగేళ్లైనా ఇప్పటివరకు డీఎస్సీ నిర్వహించలేదని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒకేసారి 50 వేల మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. వైఎస్సార్ 25 వేల మందికి పోలీసు శాఖలో ఉపాధి కల్పించారని వెల్లడించారు. నిరుద్యోగ సమస్య తీర్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment