తిరుపతి: రానున్న 2014 ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ 50 శాతం ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారని, కానీ ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీని 18 శాతం ఓట్లతో దివాలా దిశకు తీసుకెళ్లారని వారు విమర్శించారు.
రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాల వ్యవస్థాపకుడు చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్‌కుమార్ రెడ్డిలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఒక విధానం అంటూ లేదని వారు చెప్పారు. వైఎస్‌ఆర్ మరణానంతరం ఆయన కుటుంబాన్ని చంద్రబాబు టార్గెట్ చేశారని అన్నారు. అప్పటినుంచి టీడీపీ పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
`2014 ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు`
Published Tue, Dec 31 2013 3:50 PM | Last Updated on Sat, Aug 11 2018 3:37 PM
Advertisement
Advertisement