తెలుగుతమ్ముళ్లకే కండువాలు వేసుకుంటున్న టీడీపీ నేతలు
అనుకూల మీడియాలో మద్దతు పెరుగుతున్నట్లు ప్రచారం
నాన్ లోకల్ నాయకులు అభ్యర్థులు కావడంతో ప్రచారం కోసం తాపత్రయం
సీఎం జిల్లా పర్యటన తర్వాత జోష్ మీదున్న వైఎస్సార్‌సీపీ
ఈ ఫొటోలో పచ్చ కండువా కప్పించుకుంటున్న వ్యక్తి కడప బాలాజీనగర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ రాజశేఖరరెడ్డి. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన ఆయన టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి సమక్షంలో తిరిగి టీడీపీలో చేరారు. టీడీపీ నేతగా గత కొంతకాలంగా కడపలో చలామణీ అవుతున్నారు. అంతలోనే చంద్రబాబు వద్ద మరోమారు అదే మాజీ కార్పొరేటర్‌కు టీడీపీ కండువా కప్పించారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి చేరికలంటూ ప్రచారం చేసుకున్నారు.
ఇతను ప్రొద్దుటూరు 22వ కౌన్సిలర్ మహమ్మద్‌గౌస్. టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తీసుకెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్పించారు. మూడు నెలల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మరోమారు టీడీపీ కండువా కప్పి, తెలుగుదేశం పార్టీ చేరినట్లు ప్రచారం చేపట్టారు.జిల్లా వ్యా ప్తంగా ఇలాంటి చేరికలను టీడీపీ ప్రోత్సహిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కడప: అంతంత మాత్రమే ఉన్న ప్రజామద్దతు... ఎక్కడికెళ్లిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబి్ధదారుల ప్రతిఘటన. పైగా నాన్ లోకల్ ఎఫెక్ట్.. ఇవన్నీ మరిపించేందుకు తెలుగుదేశం అభ్యర్థులు చీప్‘ట్రిక్స్’కు పాల్పడుతున్నారు. వలసల ఉధృతి అంటూ ప్రచార ఎత్తుగడలకు పాల్పడుతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అనువుగా ఎల్లోమీడియా ప్రచారం కల్పిస్తోంది. వాస్తవంలో టీడీపీ నాయకులు నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమయ్యారు. ఐదేళ్లుగా ప్రజల చెంతకు చేరకుండా ఉనికి కోసం మమ అన్పిస్తూ కాలక్షేపం చేశారు. ఎన్నికలు సమీపించే కొద్ది చీప్‘ట్రిక్స్’ప్రదర్శిస్తూ ప్రజల్లో చర్చకు ఆస్కారం ఇస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.
నాన్ లోకల్ అభ్యర్థిత్వం మరిపించేందుకు....
జిల్లాలో టీడీపీకి స్థానికంగా అభ్యర్థులు కరువయ్యారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులున్నా, డబ్బులున్నవారికే ఆ పార్టీ అధిష్టానం టికెట్లు కట్టబెట్టింది. ఈ కోవలో కడప, రాజంపేట అభ్యర్థులు మాధవీరెడ్డి, సుగవాసి బాలసుబ్రమణ్యం పేర్లు చెప్పవచ్చు. ఇద్దరు రాయచోటి నియోజకవర్గానికి చెందిన వారు. కడపకు మాధవీరెడ్డి అభ్యర్థిత్వం ఖరారయ్యాక సోషల్ మీడియాలో ఫోకస్ కోసం తాపత్రయం పడుతున్నారు. లేని ఊపును సృష్టించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడో నివాసం ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నా మాధవీరెడ్డి సోషల్ మీడియాలో పొందుతున్న ప్రచారాన్ని పసిగట్టిన టీడీపీ అభ్యర్థులు అదే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులో ఈవీ సుధాకర్‌రెడ్డి, ముక్తియార్, కడపలో చలపతి, సత్య లాంటి నేతలకు తాజాగా కండువాలు కప్పడమని పలువురు ఉదహరిస్తున్నారు. మరోవైపు ఐదేళ్లు టీడీపీ కోసం కష్టపడిన వారిని కాదని అభ్యరి్థత్వాలు ఖరారు చేయడం కూడా ఇలాంటి టీప్‘ట్రిక్స్’కు ప్రధాన కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. రాజంపేటలో కూడా ఇలాంటి పరిస్థితే తెరపైకి వచ్చింది. స్థానిక నాయకులను కాదని రాయచోటికి చెందిన సుగవాసి సుబ్రమణ్యం అభ్యరి్థత్వాన్ని ఖరారు చేశారు. ఇంకా ప్రచా రం చేపట్టిన ఆయన ఇలాంటి ఎత్తుగడలతోనే ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
వైఎస్సార్‌సీపీలో జోష్...
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన తర్వాత వైఎస్సార్‌సీపీ జోష్ మీదున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పైగా నా హయాంలో మీకుటుంబానికి లబ్ధి చేకూరి ఉంటేనే మీ బిడ్డను మరోమారు ఆశీర్వదించండి. తర తమ భేదం లేకుండా పేదలకు మేలు చేసి ఉంటేనే ఓట్లు వేయండని ధైర్యంగా అభ్యరి్థస్తుండడం వైఎస్సార్‌సీపీకి అదనపు అర్హత అయిందని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు.
ఈ పరిణామం తెలుగుదేశం పారీ్టకి రుచించడం లేదు. దీంతో టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ‘మేమంతా సిద్ధం’కార్యక్రమం తర్వాత వైఎస్సార్‌సీపీ ఊపు పెరగడమే అందుకు కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అనేక మంది టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, మైదుకూరులో రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కొండారెడ్డి, కమలాపురంలో సాయినాథశర్మ లాంటి నాయకులు వచ్చి చేరడాన్ని పలువురు ఉదహరిస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment