
ప్రవీణ్‌కుమార్ (ఫైల్)
యాదమరి (చిత్తూరు జిల్లా): ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రకటించిన రూ.50 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. దేశ సరిహద్దులో ఉగ్రవాదుల దాడులో అమరుడైన జవాన్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి పరిహారంగా రూ.50 లక్షలను సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిహారానికి సంబంధించిన చెక్‌ను ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి శనివారం అందజేశారు. వారు మాట్లాడుతూ..వీర జవాన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని చెప్పారు. ఈ సందర్భంగా వీరజవాన్ ప్రవీణ్ చిత్రపటానికి మంత్రులు, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు, శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రవీణ్‌కుమార్ కుటుంబసభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment