terrorist attack
-
కశ్మీర్లో కాల్పులు.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, స్థానిక పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగతున్నాయి. ఈ ఎదురుకాల్పులల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. డచిగామ్‌లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని కశ్మీర్ పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం డచిగామ్‌లో టెర్రరిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసు బలగాల చేతిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ మృతిచెందినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గగన్‌గీర్, గందేర్బల్ సహా పలు ప్రాంతాల్లో దాడులకు సూత్రధారి జునైద్ అని పోలీసులు చెబుతున్నారు. అక్కడ టెర్రరిస్టుల దాడుల కారణంగా సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు. ఈ ఎదురుకాల్పుల ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. In the ongoing operation, one terrorist was killed and has been identified as Junaid Ahmed Bhat (LeT, Category A). The said terrorist was involved in civilians killing at Gagangir, Ganderbal and several other terror attacks. Operation continues in the upper reaches of Dachigam by… pic.twitter.com/8JhMfc1qMH— ANI (@ANI) December 3, 2024ఈ ఏడాది అక్టోబర్ నెలలో కశ్మీర్లో గందేర్బల్ జిల్లాలోని గగన్‌గిర్ వద్ద ఓ ప్రైవేటు కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరం కాల్పులు జునైద్ టీమ్ కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ వైద్యుడితో పాటు, ఆరుగురు వలస కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ కార్మికులు గగన్‌గీర్ నుంచి సోనామార్గ్ వరకు చేపడుతున్న జడ్-మోర్హ్ సొరంగం పనుల్లో పాల్గొంటున్న క్రమంలో ఉగ్రదాడి జరిగింది. -
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.. రెండు వారాల్లో నాలుగోసారి..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వలస కార్మికులే టార్గెట్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్‌లో శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడిన ఇద్దరిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు ఉస్మాన్ మాలిక్ (20), సోఫియాన్ (25)గా గుర్తించారు. అయితే, వారిద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా.. గత రెండు వారాల్లో కశ్మీర్ లోయలో వలస కార్మికులపై నాలుగో సారి దాడి జరిగింది. అక్టోబరు 20న గందర్బల్ జిల్లాలోని సొరంగం నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రదాడిలో స్థానిక వైద్యుడు, బీహార్‌కు చెందిన ఇద్దరు కార్మికులతో సహా ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. -
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
ఢిల్లీ,సాక్షి: కాశ్మీర్‌లోని పూంచ్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న రాష్ట్రీయ రైఫిల్స్ గాలిస్తున్నారు.దాడి జరిగిన ప్రదేశానికి పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులు చేరుకుని పరి స్థితిని సమీక్షిస్తున్నారు. దాడి ఎలా జరిగిందనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు. -
పోలీస్టేషన్‌పై ఉగ్రదాడి.. 10 మంది పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. డేరా ఇస్మాయిల్‌ఖాన్‌లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రమూకలు దాడిచేశారు. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. "ఉదయం 3 గంటలకు, ఉగ్రవాదులు పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసు భవనంలోకి ప్రవేశించి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు." అని పాకిస్తాన్ పోలీసు అధికారులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లో గత కొద్ది రోజులుగా ఉగ్రదాడుల ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: Denver: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి! -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో గురువారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. కథోహలెన్ ప్రాంతంలో ఉగ్రవాదికి భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయని సైన్యం తెలిపింది. భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు సమాచారం. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్)తో ఉగ్రవాది అనుబంధం కలిగి ఉన్నాడని అధికారులు తెలిపారు. హతమైన ఉగ్రవాదిని మైజర్ అహ్మద్ దార్గా గుర్తించినట్లు పేర్కొన్నారు. మరో ఘటనలో అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. రామ్‌ఘర్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాను మృతి చెందాడు. కశ్మీర్‌లోయలో అక్టోబర్ 30 నుంచి జరిగిన మూడు వరుస కాల్పుల ఘటనలకు పాల్పడిన ఉగ్రవాదుల జాడ తెలిపిన వారికి రూ.10 లక్షలను ఇస్తామని జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. అక్టోబర్ 29న పోలీసు ఇన్స్పెక్టర్ మసూర్ అలీ వాని క్రికెట్ ఆడుతుండగా ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. మరుసటి రోజు యూపీ నుంచి వలసవచ్చిన కూలీ ముఖేష్ కుమార్‌ను దుండగులు కాల్చి చంపారు. ఆ మరుసటి రోజే హెడ్ కానిస్టేబుల్ గులామ్ మహ్మద్‌ని కాల్పి చంపారు. ఇదీ చదవండి: దారుణం: 150సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని భార్య.. అనుమానంతో 230 కి.మీ. వెళ్లి మరీ.. -
హమాస్ మెరుపు దాడి..ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్
-
కుల్గామ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: కశ్మీర్‌లోని కుల్గామ్‌లో భారత బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఒకపక్క రాజౌరీ జిల్లాలో 48 గంటలుగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుండగానే కుల్గామ్‌లోని కుజ్జర్ ప్రాంతంలో ఉగ్రవాదుల అలజడిపై పక్కా సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగారు. కార్డాన్ సెర్చ్‌లో భాగంగా కుల్గామ్‌లో ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఉన్నట్టుండి మాపై కాల్పులు జరపగా వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపామని ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని వారి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపాయి కశ్మీర్ పోలీస్ వర్గాలు. ఇదిలా ఉండగా రాజౌరీ జిల్లాలోని కలకోట్ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందడంతో భారత బలగాలు కార్డన్ సెర్చ్ మొదలుపెట్టాయి. ఈ సెర్చ్ ఆపరేషన్ ఇప్పటికే మూడోరోజుకు చేరుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు పారా కమాండోలతో పాటు మరో ముగ్గురు సైనికులకు గాయపడ్డారు. దీంతో భారత భద్రతా బలగాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్న న్యూస్‌క్లిక్ అధినేత -
పాక్‌లోని చైనీయులకు బులెట్ ప్రూఫ్ కార్లు.. ‘ఇమ్రాన్’ కాల్పులే కారణమా?
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో టెర్రరిస్టు దాడులు పెరిగిపోతుండటంపై ఆందోళన పడుతోంది చైనా. చైనా-పాకిస్థాన్ సంయుక్తంగా చేపట్టిన ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)లో పని చేస్తున్న తమ దేశీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సీపెక్ ప్రాజెక్టులో పని చేస్తున్న చైనీయుల కోసం బులెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ఇటీవల కాల్పులు జరిగిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇమ్రాన్ ఖాన్ ఘటనతో చైనా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో వివిధ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న చైనా కార్మికులకు భద్రత కల్పించటం డ్రాగన్‌కు తలనొప్పిగా మారింది. ప్రాజెక్టుల వద్ద భద్రత బలగాలు, దర్యాప్తు దళాలను బలోపేతం చేసేందుకు అంగీకరించినట్లు సీపెక్‌కు చెందిన 11వ జాయింట్ కోఆపరేషన్ కమిటీ(జేసీసీ) తెలిపింది. ‘ప్రాజెక్టుల్లో పని చేస్తున్న చైనా ఉద్యోగులు బయటకి పనుల కోసం వెళ్లేందుకు బులెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించాలని నిర్ణయించారు.’అని వెల్లడించింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవలే చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా పాక్‌లో పని చేస్తున్న తమ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. బులెట్ ప్రూఫ్ వాహనాలు వినియోగించాలని నిర్ణయించటం చైనా ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్నట్లయిందని పాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఆ వీడియోని చూసి...కన్నీళ్లు పెట్టుకున్న పాక్ నాయకుడు -
రష్యాకు ఊహించని షాక్.. మిలిటరీ క్యాంప్‌పై కాల్పులు.. 11 మంది మృతి
మాస్కో: ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాకు ఊహించని షాక్ తగిలింది. ఉక్రెయిన్ సరిహద్దులోని బెల్గొరోడ్ ప్రాంతంలో రష్యా సైనిక శిక్షణ కేంద్రంపై టెర్రరిస్ట్‌లు దాడి చేశారు. ఇద్దరు దుండగులు కాల్పులు జరపటంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మాజీ సోవియేట్ స్టేట్‌కు చెందిన ఇద్దరు పౌరులు.. సైనికులకు శిక్షణ ఇస్తున్న క్రమంలో కాల్పులు చేపట్టారు. ఇరువురు దుండగులను బలగాలు మట్టుబెట్టినట్లు రష్యా మిలిటరీ వెల్లడించింది. ‘బెల్గొరోడ్ ప్రాంతం పశ్చిమ మిలిటరీ డిస్ట్రిక్ట్‌లోని సైనిక శిక్షణ కేంద్రంపై సీఐఎస్ దేశం పౌరులు ఇద్దరు అక్టోబర్ 15న కాల్పులు జరిపారు. ఉక్రెయిన్‌లో ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ కోసం వలంటీర్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.’ అని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. సైనిక చేరికలను పెంచుతున్నట్లు సెప్టెంబర్ 21న ప్రకటించిన తర్వాత.. ఇప్పటి వరకు 2 లక్షలకుపైగా చేరినట్లు తెలుస్తోంది. సైనిక బలగాల నియామకాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
భారత్‌లోని కీలక నేత లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి ప్లాన్!
మాస్కో: భారత్‌లో దాడులు చేపట్టేందుకు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఓ కీలక ఉగ్రవాదిని రష్యా బలగాలు పట్టుకున్నాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడే ఉద్దేశంతో భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టును పట్టుకున్నట్లు ప్రకటించింది రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ). భారత ప్రభుత్వంలోని కీలక నేతపై దాడి చేసేందుకు ఉగ్రవాది పతకం రచించినట్లు పేర్కొంది. ‘ రష్యాలో నిషేధించిన ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టును రష్యన్ ఫెడరేషన్‌కు చెందిన ఎఫ్ఎస్బీ గుర్తించి అదుపులోకి తీసుకుంది. సెంట్రల్ ఆసియా ప్రాంతంలోని ఓ దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించింది. ఆ ఉగ్రవాది భారత్‌లోని ప్రభుత్వానికి చెందిన ఓ కీలక నేత లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేసే ప్రణాళికతో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.’ అని పేర్కొన్నారు రష్యా అధికారులు. ఇస్లామిక్ స్టేట్ ఆమిర్‌కు విధేయతతో ఉంటానని ఆ ఉగ్రవాది ప్రమాణం చేసినట్లు తెలిపారు. ఆ తర్వాతే హైప్రొఫైల్ ఉగ్రదాడికి పాల్పడేందుకు భారత్ వెళ్లేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలు చేపట్టినట్లు తెలిసిందన్నారు. సూసైడ్ బాంబర్‌ను ఐఎస్ఐఎస్ టర్కీలో తమ సంస్థలో చేర్చుకున్నట్లు పేర్కొంది ఎఫ్ఎస్బీ. ఇదీ చదవండి: అరెస్టు చేసే క్రమంలో నిందితుడి పై దాడి: వీడియో వైరల్ -
ఆర్మీ క్యాంపు పై ఆత్మాహుతి దాడి
-
బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపిన ఉగ్రవాది.. వీడియో ఇదే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మేనేజర్ క్యాబిన్లో ఉన్న విజయ్ కుమార్‌ను ఓ ఉగ్రవాది తన చేతుల్లోని తుపాకీతో కాల్చేశాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో మేనేజర్ అక్కడే కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకు వచ్చాయి. విజువల్స్‌లో ఉగ్రవాది రెండు బ్యాంక్ తలుపుల నుంచి చూస్తూ వెనక్కి వెళ్తూ కనిపించాడు. తరువాత మరోసారి బ్యాంక్‌లోకి వచ్చి మేనేజర్‌పై అంత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌కు చెందిన విజయ్ కుమార్ కుల్గామ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బ్యాంక్‌లోకి చొరబడిన టెర్రరిస్ట్ తుపాకీతో మేనేజర్ విజయ్ను కల్చి చంపాడు. కాల్పుల అనంతరం విజయ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. కాగా కశ్మీర్లో కొన్ని రోజులుగా హిందువులపై ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. రెండు రోజుల ముందు ఇదే కుల్గామ్‌లోనే రజనీ బాలా అనే ప్రభుత్వం టీచర్‌ను కూడా చంపేశారు. అంతేగాక ఒక్క మే నెలలోనే అయిదుగురుప్రభుత్వ ఉద్యోగులను హతమార్చారు. మరోవైపు ఈ హత్యలను కాశ్మీరీ పండిట్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. చదవండి: కోవిడ్ బారిన సోనియా.. ట్వీట్ చేసిన ప్రధాని #WATCH | J&K: Terrorist fires at bank manager at Ellaqie Dehati Bank at Areh Mohanpora in Kulgam district. The bank manager later succumbed to his injuries. (CCTV visuals) pic.twitter.com/uIxVS29KVI — ANI (@ANI) June 2, 2022 -
వాళ్ల వైఖరి ఆందోళనకరం..ఉగ్రవాదులని 'జీ అని పిలుస్తారు!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడో దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హర్దోయ్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాల పై విరుచుకుపడ్డారు. "సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ నాయకుల వైఖరి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ వ్యక్తులు ఒసామా వంటి ఉగ్రవాదులను 'జీ' అని సంబోధిస్తున్నారు. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల నిర్మూలనపై ఈ వ్యక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు" అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు 2008లో అహ్మదాబాద్ వరుస పేలుళ్ల గురించి ప్రస్తావిస్తూ...కొన్ని పార్టీలు ఉగ్రవాదంపై మెతకగా వ్యవహరించడమే కాక సానుభూతి వ్యక్తం చేస్తున్నాయని ఆరోపించారు. అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 14 ఉగ్రవాద దాడుల కేసులలో అప్పటి సమాజ్‌వాదీ ప్రభుత్వం చాలా మంది ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు ఇచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నాయకులు పాకిస్తాన్ వ్యవస్థాపకుడు అలీ జిన్నాకు మద్దతుదారులని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతలపై అలక్ష్య పెట్టి 'కట్టా' (దేశంలో తయారు చేసిన పిస్టల్స్)ని వినియోగించే స్వేచ్ఛనిచ్చిని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వాన్ని, వారి కార్యకర్తలని హర్దోయి ప్రజలు తప్పక గుర్తుంచుకుంటారని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాదు బుజ్జగింపు రాజకీయాలతో పండుగలను ఆపేసే వారికి మార్చి 10న ఉత్తరప్రదేశ్ ప్రజల నుంచి సరైన సమాధానం వస్తుందని నొక్కి చెప్పారు. (చదవండి: కాంగ్రెస్‌కే ఓటు వేయండి అని బీజేపీ ప్రచారం ! తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ) -
శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి.. నలుగురికి తీవ్రగాయాలు
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ సిటీలో ఉగ్రవాదులు గ్రెనేడ్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. కాగా, వీరు స్థానికంగా ఉన్న హైస్ట్రీట్ వద్ద మంగళవారం సాయంత్రం బాంబు దాడికి తెగబడ్డారు. పోలీసుల ప్రకారం.. భద్రత సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల బాంబు దాడితో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. అక్కడి ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. గ్రెనేడ్ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక భద్రత సిబ్బంది, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి భారీ ఎత్తున బలగాలను మోహరించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యంకోసం ఆసుపత్రికి తరలించారు. భద్రత అధికారులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఏవైన పేలుడు పదార్థాలు ఉన్నాయా.. అన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, రిపబ్లిక్‌డే వేడుకలకు ఒక రోజు ముందు ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి ప్రస్తుతం తీవ్ర కలకలంగా మారింది. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టారు. Jammu & Kashmir | Grenade attack at Hari Singh High Street in Srinagar Details awaited. pic.twitter.com/ioU2AQABgh — ANI (@ANI) January 25, 2022 చదవండి: రైతుకు ఘోర అవమానం.. స్పందించిన ఆనంద్ మహీంద్రా -
నీ కడుపుకోత తీర్చలేం.. ‘జై హింద్ మాజీ’
సాక్షి, ఇంటర్నెట్: తల్లి ప్రేమ గురించి పూర్తిగా చెప్పడానికి ఈ ప్రపంచంలో సరైన పదాలు లేవు. అమ్మ అన్న పిలుపులో అమృతం ఉంటుంది. అందుకే దేవతలు సైతం.. ఆ ప్రేమను పొందడానికి మనుషులుగా పుడతారని చెప్పుకుంటారు. అంత గొప్పది తల్లి మనసు. తాను ఎలాంటి స్థితిలో ఉన్నా సరే బిడ్డ క్షేమం, సుఖసంతోషాల గురించి అనునిత్యం పరితపిస్తుంది. తన ఆయుషు కూడా పోసుకుని బిడ్డ నిండ నూరేళ్లు.. చల్లగా బతకాలని కోరుకుంటుంది తల్లి. అటువంటిది.. తన కళ్ల ముందే బిడ్డ మరణిస్తే.. ఆ తల్లి కడుపుకోతను తీర్చే శక్తి ఎవరికి లేదు. ఆమె బాధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. అది చూసి ప్రతి ఒక్కరి మనసు బాధతో విలవిల్లాడుతోంది. ఆ వివరాలు.. శత్రువులతో భీకరంగా పోరాడి వీర మరణం పొందిన అమరులకు బుధవారం ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేశారు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో 2019లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ బిలాల్ అహ్మద్ మాగ్రే వీర మరణం పొందారు. ఈ ఆపరేషన్‌లో మాగ్రే తీవ్రంగా గాయపడినప్పటికి తన ప్రాణాలను పణంగా పెట్టి.. ముష్కరులతో భీకరంగా పోరాడి.. పౌరులను కాపాడాడు. ఈ క్రమంలో ఆయన మృతి చెందారు. మాగ్రే సాహసానికి గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు సైన్యంలో మూడవ అత్యున్నత పురస్కారం అయిన శౌర్య చక్రను ప్రకటించింది. (చదవండి: ఎన్కౌంటర్లతో దద్దరిల్లిన కశ్మీర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా కొడుకు తరఫున ఈ పురస్కారాన్ని ఆందుకోవడానికి మాగ్రే తల్లి సారా బేగం ఢిల్లీకి వచ్చారు. ఇక అవార్డు ప్రకటించిన అనంతరం నాటి భద్రతా ఆపరేషన్‌లో మాగ్రే చూపించిన సాహసం.. ప్రాణాలు పణంగా పెట్టి ముష్కరులను ఎదిరించిన తీరు.. పౌరులను కాపాడిన విధానం గురించి వర్ణించారు. కొడుకు పేరు మైక్‌లో వినపడగానే ఆ తల్లి పేగు కదిలింది. బిడ్డ జీవితం అంతా ఆమె కళ్ల ముందు మెదిలింది. ఇక కుమారుడు లేడనే వాస్తవం ఆమెను ఉక్కిరిబిక్కిర చేసింది. లోపల నుంచి దుఖం తన్నకువచ్చింది. కానీ తాను ఏడిస్తే.. కొడుకు చేసిన సాహసం తక్కువవతుందని భావించిన ఆ తల్లి.. తన బాధను దిగమింగుకుంది. భోరున ఏడవాలని అనిపించినా.. అతి కష్టమ్మీద దుఖాన్ని ఆపుకుంది. అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ చేతుల మీదుగా కుమారుడికి లభించిన శౌర్యచక్ర పతకాన్ని ఆందుకుంది. (చదవండి: 'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా') ఆ తల్లి మనోవేదనకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వీరమాతకు సెల్యూట్ చేస్తున్నారు నెటిజనులు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత సారా బేగం తన వెనుక కూర్చున్న సీనియర్ మంత్రులను పలకరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ తల్లిని ఓదార్చారు. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) నాడు ఏం జరిగింది అంటే.. బారాముల్లాలోని ఓ ఇంటి వద్ద ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని అవార్డుకు సంబంధించిన ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. "బిలాల్ అహ్మద్ మాగ్రే స్వయంగా రూమ్ ఇంటర్వెన్షన్ ఆపరేషనల్ పార్టీలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అనంతరం ఆయన ఉగ్రవాదుల టార్గెట్ హౌస్‌లో చిక్కుకున్న పౌరులను ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో దాక్కున్న ఉగ్రవాది అనేక హ్యాండ్ గ్రెనేడ్లను కాల్చాడు’’. ‘‘మాగ్రేతో పాటు అతని కార్యనిర్వాహక సహచరులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఫలితంగా మాగ్రే, అతడి పార్టీ కమాండర్ ఎస్సై అమర్ దీప్, సోనూ లాల్ అనే ఒక పౌరుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి," అని ప్రశంసా పత్రంలో ఉంది. అంతేకాక తీవ్రంగా గాయపడినప్పటికీ, మిస్టర్ మాగ్రే "అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించి.. గాయపడిన వారిని, ఇతర పౌరులను బయటికి తరలించాడు" అని పేర్కొంది. దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికి. స్పృహ కోల్పోయే వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నాడని పేర్కొంది. చదవండి: అంత్యక్రియల కోసం దాచిన సొమ్ము లూటీ.. పోలీసాఫీసర్‌పై ప్రశంసలు -
మరొకరిని పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలు
శ్రీనగర్: శ్రీనగర్‌లో 24 గంటల వ్యవధిలో ఉగ్రవాదులు మరొకరిని పొట్టనబెట్టుకున్నారు. బొహ్రి కదల్ ప్రాంతంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మొహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. బందిపొర జిల్లాకు చెందిన మొహమ్మద్ ఇబ్రహీం మహరాజ్‌గంజ్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఘటన నేపథ్యంలో భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఆదివారం సాయంత్రం బాటామాలూ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పోలీసు కానిస్టేబుల్ ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే. -
Jammu Kashmir: జమ్మూలో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో బుధవారం భద్రత సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భద్రత సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు. కాగా, జమ్మూలోని షోపియన్ జిల్లా డ్రాగడ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రత సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య కాల్పులు సంభవించాయి. గత కొన్ని రోజులుగా టెర్రరిస్ట్‌లు అమాయక వలసకూలీలను టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పులలో ఇప్పటికే అమాయక కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో భయపడిపోయిన కూలీలు ఇప్పటికే జమ్మూ విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. చదవండి: చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఎంత పనిచేసింది.. -
జమ్మూకశ్మీర్: కుల్గాంలో ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం సాయంత్రం మరో ఇద్దరు స్థానికేతరులను కాల్చిచంపారు. ముష్కరుల కాల్పుల్లో ఒక కార్మికుడు గాయపడ్డాడు. ఇది గత 24 గంటల వ్యవధిలో స్థానికేతరులపై జరిగిన మూడో దాడి కావడం గమనార్హం. బిహార్ నుంచి వచ్చిన ఇద్దరు కార్మికులను పొట్టనపెట్టుకున్నారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వరుసగా జరుగుతున్న ముష్కరుల దాడులతో పోలీసు ఉన్నతాధికారుల అప్రమత్తమయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను తక్షణమే సమీపంలోని సెక్యూరిటీ క్యాంపులకు తరలించాలంటూ ఆదేశాలిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఈ నెలలో ఇప్పటిదాకా 11 మంది బలయ్యారు. ఉగ్రవాదుల దుశ్చర్యలపై నిరసన జ్వాలలు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు భద్రతా సిబ్బందితోపాటు సామాన్య ప్రజలపై దాడులు చేస్తూ, వారి ప్రాణాలను బలి తీసుకుంటుండడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండిస్తూ ఆదివారం పలు ప్రజా సంఘాలు రాష్ట్రంలో వేర్వేరు చోట్ల నిరసన ప్రదర్శన చేపట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాద శక్తులకు పాక్ సర్కారు మద్దతునిస్తోందని ధ్వజమెత్తారు. పాక్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. పాక్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇటీవల ముష్కరుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి ప్రజలు నివాళులర్పించారు. శివసేన డోంగ్రా ఫ్రంట్, ఆల్ జమ్మూకశ్మీర్ పంచాయత్ కాన్ఫరెన్స్, రాష్ట్రీయ భజరంగ్ దళ్, జమ్మూ వెస్టు అసెంబ్లీ మూమెంట్, రాజ్‌పుత్ కర్ణీ సేన, భారతీయ జనతా యువమోర్చా నిరసనల్లో పాల్గొన్నాయి. ఉగ్రవాదులను ఏరిపారేస్తాం: లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతి రక్తం బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రతిన బూనారు. ఆదివారం రేడియో కార్యక్రమం ‘ఆవామ్ కీ ఆవాజ్’లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సాధారణ ప్రజలను, స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చి చంపుతుండడంపై ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులను వేటాడుతామని హెచ్చరించారు. -
మంచుకొండల ఆత్మఘోష
మంచుకొండల కాశ్మీరం మళ్ళీ రక్తమోడుతోంది. బరి తెగించిన ముష్కరుల దాడుల్లో అమాయకులు బలి కావడం పెరిగింది. కొద్దిరోజులుగా జమ్మూ – కశ్మీర్లో జరుగుతున్న వరుస సంఘటనల్లో అక్కడి అల్పసంఖ్యాక వర్గాలైన కశ్మీరీ పండిట్లు సహా అనేకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. భద్రతాదళాల ప్రాణత్యాగం చేయడం ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాం. కానీ, గడచిన ఆరేళ్ళ గణాంకాల లెక్కలు తీస్తే తీవ్రవాదులు రూటు మార్చి, భద్రతాదళాల బదులు ఇప్పుడు పౌర సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు అర్థమవుతోంది. పేరున్న వ్యక్తులు, కశ్మీర్ లోయలోని స్థానికేతరులను తీవ్రవాదులు పొట్టనబెట్టుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కశ్మీరీ పండిట్ అయిన ప్రసిద్ధ కెమిస్ట్ సహా ముగ్గురు పౌరులను మంగళవారం కొద్ది గంటల వ్యవధిలో తీవ్రవాదులు కాల్చి చంపడం అందుకు ఉదాహరణ. వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ సహా పార్టీలన్నీ దీన్ని ఖండించాయి. ఆ రక్తపుమరకలు ఆరక ముందే గురువారం శ్రీనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోకి తుపాకీలు ధరించిన ఆగంతుకులు చొచ్చుకు వచ్చి, టీ తాగుతున్న ప్రిన్సిపాల్‌పై, మరో కశ్మీరీ పండిట్ టీచర్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి, ప్రాణాలు తీయడం మరో తీరని విషాదం. జనంతో మమేకమయ్యేందుకు కేంద్ర మంత్రులు పలువురు తొమ్మిది వారాల కార్యక్రమం చేస్తున్న సమయంలో గత పది రోజుల్లో ఇలా ఏడుగురు పౌరులు బలి కావడం గమనార్హం. బీజేపీ తెచ్చిన పునర్వ్యవస్థీకరణ చట్టంతో కొత్తగా ఏర్పడ్డ ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఈ నెలలోనే హోమ్ మంత్రి అమిత్ షా కూడా పర్యటించాల్సి ఉంది. ఆ సమయంలో ఈ వరుస దాడులు, హత్యలు కలవరపరిచే విషయాలు. కాశ్మీరం కళకళలాడుతోందంటున్న పాలకుల మాటల్లోని డొల్లతనానికి నిదర్శనాలు. మతపరంగా అస్థిరతను సృష్టించి, అల్పసంఖ్యాకుల్లో భయాన్ని పెచ్చరిల్ల జేయడం కోసమే ఈ దాడులని సాక్షాత్తూ డీజీపీయే చెప్పారు. 2016 నుంచి గత ఆరేళ్ళలో కశ్మీర్లో ఇదే ధోరణి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఉత్తిపుణ్యానికి 27 మంది పౌరుల ప్రాణాలు తీవ్రవాదపు కోరలకు చిక్కాయి. తాజాగా ఆరెస్సెస్‌కు పని చేస్తున్నారంటూ సుప్రసిద్ధ ఫార్మసిస్టునూ, పోలీసు ఇన్ఫార్మర్ అంటూ బీహారీ వీధి వర్తకుణ్ణీ – ఇలా రకరకాల నెపాలతో తీవ్రవాదులు దారుణకాండకు దిగుతున్నారు. పాకిస్తాన్‌లోని లష్కరే తాయిబాకు ఇక్కడి మరోరూపమైన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’, మరోపక్క ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూ– కశ్మీర్’ లాంటి వేర్వేరు సంస్థలు ఈ దారుణాలకు పాల్పడింది తామేనని ప్రకటించుకోవడం నివ్వెరపరుస్తోంది. నిఘా వర్గాల వైఫల్యాన్ని పట్టి చూపిస్తోంది. కశ్మీర్‌లోని ప్రముఖ వ్యాపారులే లక్ష్యంగా కొన్నాళ్ళుగా దాడులు జరుగుతున్నాయి. ఏ వర్గంతోనూ సంబంధం లేని అమాయకులను చంపడం ద్వారా దశాబ్దాలుగా అక్కడ శాంతియుతంగా జీవిస్తున్న అల్పసంఖ్యాకులను భయపెట్టడమే పరమార్థం. పండిట్లు కశ్మీర్‌కు సత్వరమే తిరిగొచ్చేందుకు వీలు కల్పిస్తూ, ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించడమే తీవ్రవాదుల దృష్టిలో ఆ ఫార్మసిస్టు చేసిన తప్పు. కశ్మీర్‌కు తిరిగిరావాలనుకొనే వారిని హెచ్చరించడమే వారి ఉద్దేశం. ‘స్థానికులు కానివారెవరూ ఇక్కడకు రాకూడదు, జీవనం గడపకూడద’న్న అవాంఛనీయ ధోరణికీ, అసహనానికీ ఈ ఘటనలు సూచిక. ఈ నీచప్రయత్నాలకు ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. రోజువారీ వ్యవహారంగా మారిన హింసకు ముగింపు పడేలా చూడాలి. ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వానికి తావివ్వకుండా పగ్గాలను తమ చేతిలోనే ఉంచుకోవాలనే ధోరణినీ సత్వరమే వదిలించుకోవాలి. ఏళ్ళూపూళ్ళ కశ్మీర్ సమస్యకు పైపూతలు పనికిరావు. లోతైన పరిష్కారమే శరణ్యం. జరుగుతున్న ప్రతి దాడీ, పోతున్న ప్రతి ప్రాణం గుర్తుచేస్తున్నది అదే! ఇలాంటి పరిస్థితుల్లోనూ ముష్కరుల చేతిలో ఫార్మసిస్టు మఖన్‌లాల్ బింద్రూ అసువులు బాసినప్పుడు, ఆ కుటుంబ సభ్యులు గుండె దిటవుతో మాట్లాడిన తీరు జాతికి స్ఫూర్తిదాయకం. ‘ఆ దుండగులు తుపాకులతో ఈ దేహాన్ని కాల్చవచ్చు. కానీ, మా ఆత్మనూ, మా ఈ స్ఫూర్తినీ చంపలేరు’ అన్న ఉద్వేగభరితమైన మాటలు చాలాకాలం చెవులలో రింగుమంటాయి. తీవ్రవాదం పంజా విసిరిన 1990లలో ఎందరో పురిటిగడ్డను వీడిపోయినా, హిమసీమలనే అంటిపెట్టుకొని బతుకుతున్న ఇలాంటి కొద్ది కశ్మీరీ పండిట్ల కుటుంబాల నైతిక స్థైర్యం అనుసరణీయం. అక్కడ ఇప్పుడు అందరికీ కావాల్సిన పరమౌషధం అదే. మరి, అంతటా భయం, అందరిపైనా అనుమానం నెలకొన్న కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి పాలకులు ఏం చేస్తున్నారు? జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికో, ఎన్నికల ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికో ‘నయా కశ్మీర్ నిర్మాణం’ నినాదాలను కేంద్ర పాలకులు ఎత్తుకుంటే సరిపోతుందా? కశ్మీర్‌పై పాకిస్తాన్ కుయుక్తులు, ఈ దాడులతో ప్రజలకు చేరవేయదలుచుకున్న భావం ఏమిటో తెలుస్తూనే ఉంది. కానీ, అదే సమయంలో కశ్మీర్లో నిద్రాణంగా ఆగ్రహం, బాధ, ఆవేదన గూడుకట్టుకున్నాయన్నది వాస్తవం. ఆ సంగతి గుర్తించాలి. భారత అనుకూల భావాలు తగ్గుతూ, వేర్పాటువాదానికి ఊతం అందుతున్న తీరును ఇప్పటికైనా పాలకులు గ్రహించాలి. ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాలను కలుపుకొని, తగిన చర్యలు చేపట్టాలి. జూన్‌లో ప్రధాని జరిపిన అఖిలపక్షం తదుపరి కర్తవ్యాన్ని చేపట్టాలి. అలా కాకుండా, పెట్టుబడులు, పర్యాటకులు, రోడ్ల నిర్మాణం, విద్యుదుత్పత్తి లాంటి మాటలు చెప్పి, గణాంకాల లెక్కలతో కశ్మీర్ శాంతిసౌభాగ్యాల సీమ అని నమ్మబలికితే అది ఆత్మవంచనే. కశ్మీరే కాదు... దేశం దాన్ని ఎంతోకాలం భరించలేదు. -
పాక్ ప్రేరేపిత ఉగ్ర కుట్ర భగ్నం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద కుట్రను ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ భగ్నం చేసింది. పాక్– ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఇద్దరు టెర్రరిస్టులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలను లక్ష్యంగా చేసుకొని దేశవ్యాప్తంగా పలు పేలుళ్లకు వీరు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో జాన్ మహ్మద్ షేక్ అలియాస్ సమీర్, ఒసామా, మూల్‌చంద్, జేషన్ ఖమర్, మహ్మద్ అబూ బకర్, మొహ్మద్ అమీర్ జావెద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒసామా, ఖమర్‌లు ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, యూపీల్లో ఐఈడీ(పేలుడు పదార్థం) ఉంచేందుకు సరైన ప్రదేశాలను వెతకడానికి వీరిని నియమించినట్లు తెలిపారు. వీరి అరెస్టుతో పాక్– ఐఎస్ఐ– ఉగ్రవాదుల సంబంధం బయటపడిందని, అండర్‌వరల్డ్ సహకారంతో ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో పలు పేలుళ్లు జరిగే ప్రమాదాన్ని నివారించినట్లయిందని స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ సింగ్ చెప్పారు. అలహాబాద్‌లో జరిపిన సోదాల్లో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉగ్రకుట్రలో వివిధ పనులు చేసేందుకు వీరంతా నియమితులయ్యారన్నారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంకు సమీర్ దగ్గరి వాడన్నారు. పాక్‌లో ఉంటున్న అనీస్ ఆదేశాల మేరకు పేలుడు పదార్థాలను, ఆధునిక ఆయుధాలను, గ్రెనేడ్లను భారత్‌లోని వివిధ ప్రాంతాల్లోని టెర్రరిస్టులకు అందించేందుకు సమీర్ తయారయ్యాడన్నారు. మూల్‌చంద్, ఆమిర్ జావెద్ రాజకీయ ర్యాలీలే లక్ష్యం? వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల వేళ జరిగే రాజకీయ ర్యాలీలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొనే అవకాశాలను కొట్టిపారేయలేమని పోలీసులు తెలిపారు. తమ గ్రూపులో 14–15 మంది బెంగాలీ మాట్లాడే వాళ్లున్నారని అరెస్టయిన ఉగ్రవాదులు వెల్లడించినట్లు చెప్పారు. వీరంతా కూడా ఉగ్రట్రైనింగ్ తీసుకొని ఉండొచ్చని, వీరికి పాక్ నుంచి సహకారం అందుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడిని నిర్వహించేందుకు టెర్రరిస్టులు రెండు బృందాలుగా ఏర్పడ్డారని, ఒక బృందాన్ని అనీస్ సమీక్షిస్తుంటాడని చెప్పారు. రెండో బృందం హవాలా మార్గాల్లో నిధులు సమీకరించడానికి సన్నాహాలు చేస్తుందని తెలిపారు. కేంద్ర ఏజెన్సీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పలు రాష్ట్రాల్లో ఈ సోదాలు నిర్వహించామని, రాజస్తాన్‌లోని కోట వద్ద ఒకరిని, ఢిల్లీలో ఇద్దరిని, యూపీలో ముగ్గురిని అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన ఓఖ్లా అనే వ్యక్తి ఈ కుట్రలో కీలకమని, ఇతనికి దేశవ్యాప్తంగా సంబంధాలున్నాయని చెప్పారు. ఒసామా, ఖమర్‌లు మస్కట్ మీదుగా పాక్ వెళ్లి 15 రోజుల పాటు థట్టా వద్ద ఉన్న ఒక క్యాంపులో ఉగ్రవాద శిక్షణ పొందారని చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌లో ఒక లైవ్ ఎల్ఈడీని బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. టెర్రరిస్టు కుట్రను సమూలంగా ఛేదించేందుకు సమగ్ర దర్యాప్తు ఆరంభించామని పోలీసులు తెలిపారు. మహ్మద్‌షేక్ కుటుంబసభ్యులను ప్రశ్నించిన ఏటీఎస్ ఢిల్లీలో అరెస్టయిన ఉగ్రవాది జాన్ మహ్మద్ షేక్ కుటుంబ సభ్యులను ముంబై పోలీసులు, ఏటీఎస్ అధికారులు విచారించారు. షేక్ ఇంట్లో సోదాలు సైతం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ ముంబైలో షేక్ కుటుంబం ఉంటోంది. కొన్నేళ్లుగా ఇక్కడే షేక్ నివాసముంటున్నాడని, అతనికి ఇద్దరు కూతుర్లున్నారని పోలీసులు చెప్పారు. జాన్ గురించి ఇరుగుపొరుగును కూడా పోలీసులు విచారించారు. జాన్‌కు ఉగ్రవాదులతో ఏలా సంబంధం ఏర్పడిందన్న విషయమై ఆరాతీశారు. -
జమ్మూకశ్మీర్: బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని భద్రత సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా- శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. జమ్ముకశ్మీర్ పరిధిలోని బారాముల్లాలో బిఎస్ఎఫ్ భద్రత దళాలపై.. ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాగా, ఉగ్రవాదులు.. గ్రనైడ్లు, రాకేట్ లాంచర్లతో దాడిచేశారు. దీన్ని భద్రత సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ కాల్పులలో ఒక ఉగ్రవాదిని భద్రత సిబ్బంది హతమార్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న(గురువారం) అర్ధరాత్రి భద్రత సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు కాల్పులలో మరణించిన ఉగ్రవాది.. పాకిస్థాన్ కు చెందిన ఉస్మాన్‌గా అధికారులు తెలిపారు. బారాముల్లాలో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఎకె-47 రైఫిల్స్, గ్రనైడ్లు, రాకెట్ లాంఛర్లను స్వాధీనం చేసుకున్నట్టు భద్రత సిబ్బంది ప్రకటించారు. కాగా, వరుస ఉగ్రదాడులతో ప్రస్తుతం బారాముల్లాలో అధికారులు హైఅలర్ట్‌ను ప్రకటించారు. -
శెబ్బాష్ తాశి: పాక్ ఖేల్ ఖతం
దాయాది దేశం పాకిస్తాన్ కన్ను ఎప్పుడూ కశ్మీర్ మీదే. ఏదో వంకతో స్థానిక యువతను రెచ్చగొడుతూ దేశంలో అలజడి సృష్టిస్తూనే ఉంది. అలాంటి ప్రయత్నమే 1999లో కూడా చేసింది. అయితే ఈ సారి ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ చేతులు కలిపింది. సహాజ నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చి మన ఆర్మీపై దాడికి తెగబడింది. ఇండియన్ ఆర్మీ ధీటుగా స్పందించింది. ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్‌కు బుద్ధి చెప్పింది. పశువులు తినేందుకు పచ్చిక కూడా కనిపించనంతగా హియలయాలపై మంచు దుప్పటి పేరుకుపోయింది. తన గొర్రెలను మేపేందుకు పర్వత లోయల్లోకి వెళ్లాడు తాశి నామ్‌గ్యాల్. జనసంచారం ఉండని ఆ ప్రాంతంలో పఠాన్ దుస్తుల్లో కొందరు వ్యక్తులు రాళ్లతో మంచులో ఏదో పని చేస్తుండటం కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే వారి దుస్తుల్లో ఆయుధాలు కనిపించాయి. క్షణం ఆలస్యం చేయలేదు తాశి నామ్‌గ్యాల్. వెంటనే భారత ఆర్మీకి విషయం చేరవేశాడు. ఆ రోజు 1999 మే 2. తీవ్రమైన దాడులు నామ్‌గ్యాల్ ఇచ్చిన సమాచారంతో పర్వతాల్లోకి వెళ్లిన ఇండియన్ ఆర్మీ ట్రూప్‌పై అనుమానిత వ్యక్తులు దాడి చేశారు. ఐదుగురు భారత సైనికులను పట్టుకుని చంపేశారు. ఊహించని విధంగా జరిగిన దాడితో భారత ఆర్మీ మొదటి తీవ్రంగా నష్టపోయింది. పాక్ దళాల సాయంతో టెర్రరిస్టులు చేసిన దాడిలో కార్గిల్ ఆయుధగారం ధ్వంసమైంది. మన ఆర్మీ తేరుకునే లోపే ద్రాస్, కక్సర్, ముస్తో సెక్టార్లలో శత్రువులు తిష్ట వేశారనే సమాచారం అందింది. తూటాలు కాచుకుంటూ దొంగచాటుగా పాక్ ఆర్మీ కొండల పైకి చేరుకుని బంకర్లు నిర్మించుకోవడంతో ఈ పోరాటంలో తొలుత భారత సైనికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పై నుంచి పాక్ సైనికులు, టెర్రరిస్టులు తేలికగా దాడి చేస్తూ తూటాలు, బాంబుల వర్షం కురిసిస్తుండగా.. వాటిని కాచుకుంటూ మన సైనికులు వీరోచితంగా పోరాటం చేయాల్సి వచ్చింది. దీంతో 26న వాయుసేన రంగంలోకి దించింది ఇండియా ప్రభుత్వం. మొదటి వారంలోనే రెండు మిగ్ విమానాలు, ఒక ఆర్మీ హెలికాప్టర్లను మన ఆర్మీ నష్టపోయింది. రోజులు గడుస్తున్నా... రణ క్షేత్రంలో భారత దళాలలకు పట్టు దొరకడం లేదు. దాడి చేస్తున్నది పాకిస్తానే అని తెలిసినా సరైన ఆధారాలు లభించడం లేదు. పాక్ హస్తం జూన్ 5వ తేదిన ముగ్గురు పాక్ సైనికులు భారత భద్రతా దళాలకు చిక్కారు. దీంతో ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని స్పష్టంగా తేలిపోయింది. అప్పటి వరకు కార్గిల్‌లో స్థానికులు సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారంటూ చెబుతూ వచ్చిన పాక్ నోటికి తాళం పడింది. పొరుగు దేశం కుట్రలు బయట పడటంతో భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి రెడీ అయ్యింది. పాక్ ఆర్మీ, , టెర్రరిస్టుల ఆధీనంలోకి వెళ్లిన భూభాగాలను తిరిగి చేజిక్కించుకునేందుకు ఆపరేషన్ విజయ్‌ని ప్రకటించింది. టైగర్ హిల్స్ కార్గిల్ చొరబాటులో కీలకమైన ప్రాంతం టైగర్ హిల్స్. వాటిపై తిష్ట వేసిన పాక్ దళాలు భౌగోళిక పరిస్థితులు ఆసరాగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. భారత దళాలు జూన్ 29న టైగర్ హిల్స్ పర్వత పాదాల వద్దకు చేరుకున్నాయి. యుద్ధంలో కీలక ఘట్టం మొదలైంది. వారం రోజుల పాటు హోరాహోరీ పోరు జరిగింది. జులై 4వ తేదిన కీలకమైన టైగర్ హిల్స్‌ని భారత్ స్వాధీనం చేసుకుంది. దీంతో పాక్ ఆర్మీకి దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. తెలుగు వాడైన మేజర్ పద్మఫణి ఆచార్య ఈ యుద్ధ క్షేత్రంలోనే నేలకొరిగారు. తరిమి కొట్టారు టైగర్ హిల్స్ చేజిక్కిన తర్వాత భారత దళాలకు ఎదురే లేకుండా పోయింది. నియంత్రణ రేఖ దాటి చొరబాటు దారులు ఆక్రమించుకున్న స్థలాలను వేగంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఇటు రణక్షేత్రం, అటు అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకిగా నిలిచింది. ముషారఫ్ కుట్రలు, కుతంత్రాలు పారలేదు. అతని అండతో అతిక్రమణకు పాల్పడిన ఆర్మీ, టెర్రరిస్టులు తోక ముడిచారు. జులై 14 నాటికి అన్ని శత్రు మూకలను తరిమి కొట్టారు. పాక్‌తో చర్చల అనంతరం జులై 26న అధికారికంగా యుద్ధాన్ని ముగిసినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ముషారఫ్ కుయుక్తి పాకిస్తాన్లో ప్రధానులెక్కువగా కీలుబొమ్మలే అయ్యారు. ఆర్మీ అధికారులే నిజమైన అధికారం చెలాయించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి చెప్పకుండా అప్పటీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కశ్మీర్‌పై కుయుక్తి పన్నాడు. దొంగచాటుకా భారత భూభాగంలోకి తన సైన్యాన్ని పంపించాడు. చలికాలంలో హిమాలయాల్లో దట్టంగా మంచు పేరుకుపోయే కాలంలో పర్వత శ్రేణుల నుంచి ఇరు దేశాల భద్రతా దళాలు వెనక్కి వస్తాయి. చాన్నాళ్లుగా ఇదే పద్దతి అమలవుతోంది. అయితే దీన్ని తుంగలో తొక్కి భారత దళాలు గస్తీలో లేని సమయం చూసి ముషారఫ్ ఆదేశాలతో పాక్ ఆర్మీతో కూడిన టెర్రరిస్టు మూకలు పాక్ గుండా భారత భూభాగంలో అడుగుపెట్టి కీలక స్థావరాలను ఆక్రమించుకున్నారు. ఫలితంగా యుద్ధం అనివార్యమైంది. అమరులు దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో భారత్ వైపు 527 మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్ వైపు 453 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. ఈ చొరబాట్లలో పాకిస్తాన్‌కి చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, నార్తర్న్ లైట్‌ఇన్‌ఫాంట్రీ చెందిన సైనికులు పాల్గొన్నట్టు తేలింది. వీరికి కశ్మీరీ తీవ్రవాదులు, ఆఫ్ఘానిస్థాన్‌కి చెందిన కిరాయి ముకలు సహాకరించినట్టు తేలింది. విజయ్ దివాస్ కార్గిల్ విజయ దినోత్సవాన్ని ప్రతీ ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని హోదాలో నరేంద్రమోదీ పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ప్రజలు సైతం సైనికుల త్యాగాలకు గుర్తుగా క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించడం రివాజు. - సాక్షి , వెబ్‌డెస్క్ -
శ్రీనగర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల్లో స్థానికులు!
జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌లోని దాన్మర్ ప్రాంతం శుక్రవారం ఉదయం తుపాకుల మోతతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఇద్దరు సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. పక్కా సమాచారంతో జమ్ము పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు ఆల్మదార్ కాలనీలో కార్డాన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాగా, మృతి చెందిన ఉగ్రవాదులిద్దరూ స్థానికులేనని, వీళ్లు లష్కరే తాయిబా ఉగ్రసంస్థకు చెందిన వాళ్లని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ ధృవీకరించారు. ఎన్కౌంటర్ ముగిసినట్లు ప్రకటించకపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో తనిఖీలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 78 మంది ఉగ్రవాదులని మట్టుబెట్టినట్లు విజయ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే పుల్వామాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా కమాండర్ అయిజాజ్‌తో పాటు గుర్తు తెలియని మరో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరు ఉగ్రవాదుల ఐడెంటిటీ తెలియాల్సి ఉంది. #Srinagar witnessed another encounter in the wee hours of July 16. 2 unidentified militants were neutralised in this process. Visuals show The #encounter house being on fire. pic.twitter.com/Ah5NCvjL3G — Sandeep Dhar (@sandeepdhar10) July 16, 2021 -
మీటింగ్‌పై ఉగ్రదాడి: కాల్పుల్లో ఇద్దరు మృతి
సోపోర్: ప్రజాప్రతినిధులు, అధికారులే టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేశారు. సమావేశం కొనసాగుతున్న సమయంలో కాల్పులు చేయడంతో అందరూ పప్రాణభయంతో పరుగులు ఎత్తారు. ఈ సమయంలో జరిగిన కాల్పుల్లో ఓ కౌన్సిలర్, మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే చైర్పర్సన్ మాత్రం త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. సోపోర్ ప్రాంతంలో బ్లాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (బీడీసీ) ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ ఫరీదా ఖాన్ (బీజేపీ), ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. చర్చిస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు పప్రారంభించారు. కాల్పులు జరగడంతో ఆమె వెంటనే ఆస్పత్రిలోకి వెళ్లారు. కాల్పుల్లో గాయపడిన కౌన్సిలర్ రియాజ్ అహ్మద్, పోలీస్ అధికారి షవకాత్ అహ్మద్ మృతి చెందారు. ఈ దాడుల్లో ఒక పౌరుడు గాయపడ్డాడు. -
ఇరాన్ శాస్త్రవేత్త దారుణహత్య
టెహ్రాన్ : ఇరాన్‌కు చెందిన ప్రసిద్ధ న్యూక్లియర్ శాస్త్రవేత్త మొహ్సేన్ ఫక్రీజాదే(59) శుక్రవారం దారుణహత్యకు గురయ్యారు. టెహ్రాన్‌లో శివారులో తన వాహనంలో వెళ్తున్న ఫక్రిజాదేపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే తీవ్రంగా గాయపడ్డ ఫక్రీజాదే ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. ఇరాన్ రక్షణశాఖకు చెందిన రీసర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అధిపతిగా ఫక్రిజాదే పనిచేశారు.ఈ హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్లు ఇరాన్ ఆరోపించింది. ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. టెహ్రాన్‌లో హత్యకు గురైన మొహసేన్ వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని.. అయితే హత్యకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా ఇరాన్ ప్రయత్నిస్తుందని లేఖలో తెలిపారు. (చదవండి : మాంసం ముద్దలు విసురుతూ నిరసన) 'ఇరాన్ శాస్త్రవేత్త ఫక్రీజాదేను ఉగ్రవాదులు దారుణ హత్య చేశారు. ఈ హత్య వెనుక ఇజ్రాయెల్ నేరస్తుల పిరికితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ హత్య తాము చేయలేదంటూ డబుల్ గేమ్ ఆడుతున్న ఇజ్రాయెల్ ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మా శాస్త్రవేత్త హత్యకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం.' కాగా గతంలోనూ ఫక్రీజాదేపై పలుసార్లు హత్యాయత్నాలు జరిగినా తృటిలో తప్పించుకున్నారు. అయితే ఈ హత్యపై ఇజ్రాయెల్ ఇంతవరకు స్పందించలేదు. -
వీరజవాన్ కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
యాదమరి (చిత్తూరు జిల్లా): ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రకటించిన రూ.50 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. దేశ సరిహద్దులో ఉగ్రవాదుల దాడులో అమరుడైన జవాన్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి పరిహారంగా రూ.50 లక్షలను సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిహారానికి సంబంధించిన చెక్‌ను ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి శనివారం అందజేశారు. వారు మాట్లాడుతూ..వీర జవాన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని చెప్పారు. ఈ సందర్భంగా వీరజవాన్ ప్రవీణ్ చిత్రపటానికి మంత్రులు, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు, శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రవీణ్‌కుమార్ కుటుంబసభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. -
అతని ధీరత్వం మరపురాదు
ఉగ్రవాదుల గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన తెలంగాణ వీర సైనికుడు ర్యాడ మహేష్ ప్రాణాలు కోల్పోయాడు. దేశంలోకి దొంగచాటుగా అడుగుపెడుతున్న ఉగ్రవాదులను నిలువరిస్తూ దేశ రక్షణలో అమరుడయ్యాడు. నిజామాబాద్‌కు చెందిన మహేశ్ కాశ్మీర్‌లోని మచిల్ సెక్టార్లో ఆదివారం నేలకొరుగుతూ చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచాడు. ‘‘పది రోజుల్లో మహేష్ పుట్టిన రోజు ఉంది.. పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకుందామని అనుకున్నాము. ఆదివారం అతను ఉగ్రవాదులతో పోరాడాడు. ఆ ముందు రోజే నాతో ఫోన్లో మాట్లాడారు. తాను సేఫ్‌గా ఉన్నానని, ధైర్యంగా ఉండమని, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఇంతలోనే ఈ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు..’’ అంది ర్యాడ మహేష్ భార్య ర్యాడ సుహాసిని. ఆదివారం కశ్మీర్‌లలో కుప్వారా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో నిజామాబాద్‌కు చెందిన ర్యాడ మహేష్ (26) అమరగతి పొందాడు. అతని సొంత ఊరు వేల్పూరు మండలం కోమన్‌పల్లి. వారిది వ్యవసాయ కుటుంబం. తండ్రి ర్యాడ గంగమల్లు, తల్లి చిన్నరాజు. మహేష్ సొదరుడు భూమేష్ మస్కట్‌లో ఉన్నారు. మహేష్ ప్రాథమిక విద్య కోమన్‌పల్లిలో జరగగా, పదో తరగతి వరకు కుకునూరులో చదువుకున్నారు. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ వరకు చదువుకున్న మహేశ్ ఇంటర్ పూర్తి కాగానే కరీంనగర్లో మిలటరీ శిక్షణ తీసుకున్నారు. మహేష్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే వారని కుకునూరు ఉపాధ్యాయుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. హైస్కూల్లో చదివేటప్పుడే తాను ఆర్మీలో చేరుతానని చెప్పేవారని లక్ష్మణ్ చెప్పారు. మహేష్ మరణవార్త విని కన్నీరు మున్నీరు అవుతున్న భార్య సుహాసిని మహేశ్ గురించి ప్రతి క్షణం తలుచుకుంటోంది.‘‘అసలు ఆయన నవంబర్ 5న వస్తానన్నారు. కానీ సెలవు దొరకక రాలేక పోయారు. మూడునాలుగు రోజుల్లో సెలవు దొరుకుతుంది వస్తానని చెప్పారు. సంక్రాంతి వరకు ఉంటానని అన్నారు. మరో రెండు నెలల్లో పీస్ జోన్లోకి బదిలీ అవుతుంది అప్పుడు నిన్నూ తీసుకెళాతానని చెప్పారు..’’ అంటూ సుహాసిని దుఖఃసాగరంలో మునిగిపోయింది. మహేష్, సుహాసినిలు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు. సుహాసిని పుట్టుకతోనే తల్లిని కోల్పోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. సుహాసిని తన బాబాయ్ జీ.టి.నాయుడు వద్దే పెరిగింది. ఆర్మీలో పనిచేస్తున్న జీటీ నాయుడు హైదరాబాద్ బొల్లారంలో నివాసముంటున్నాడు. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మహేష్, సుహాసినిల మధ్య పరిచయం ఏర్పడింది. రెండేళ్ల ప్రేమ తర్వాత కుటుంబసభ్యుల ఆమోదంతో రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ‘మహేశ్ ఉన్న ఈ రెండు నెలలు ఎలా సంతోషంగా గడపాలనే ప్లాన్ చేసుకున్నాం. ఈసారి తనతో పాటు నేనూ వెళతానని ఆనందంగా ఉన్నాను. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేద’ని సుహాసిని దుఃఖంతో అన్నారు. తండ్రి గంగమల్లు కొడుకును తలుచుకుని భోరున ఏడ్చారు. ‘‘శనివారం ఫోన్ చేశాడు. మా బాగోగులు అడిగారు. అమ్మ ఎట్లుంది అని అడిగిండు. ఇక్కడ గుట్టల మీద ఫైరింగ్ జరుగుతోంది. కానీ డ్యూటీ అయిపోయింది.. ప్రాబ్లమేమీ లేదు. గుట్టలు దిగి వస్తున్నాం. ఇంకో మూడు రోజుల్లో ఇంటికి వచ్చేస్తా అన్నడు. ఇంతలోనే ఇలాంటి వార్త వచ్చింది’ అంటూ భోరున ఏడ్చాడు. -
ఇరాక్ ఆర్మీ స్థావరంపై ముష్కర దాడి
బాగ్దాద్ : ఇరాక్‌పై ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమ బాగ్దాద్‌లోని ఇరాక్ ఆర్మీ స్థావరంపై సాయుధులైన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో11 మంది పౌరులు మరణించారు. సైన్యం సహా మొత్తం 8మంది గాయాలపాలయ్యారని పోలీసు, వైద్య వర్గాల నుంచి సమాచారం. అల్-రద్వానియా ప్రాంతంలోని ఆర్మీ స్థావరంపై జరిగిన దాడిలో దుండగులు గ్రేనెడ్, అధునాతన ఆయుధాలను వాడినట్టు తెలుస్తోంది. ఈ దాడి పాల్పడిన ఉగ్రవాదులు నాలుగు వాహనాల్లో వచ్చారని తెలుస్తోంది. ఉగ్రదాడిపై స్పందించిన ‘ఇరాక్ మిలిటరీ దాడి జరిగింది. ప్రభుత్వ మద్దతు ఉన్న సున్నీ మిలిషియా ఆర్మీపైనా అని ఇందులో నలుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డార’ని అధికార వర్గాలు తెలిపాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ, పోలీసు బృందాలు అపరేషన్ మొదలెట్టినట్టు పోలీసు వర్గాల సమాచారం. -
జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
-
బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు
కశ్మీర్: జమ్ము కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు బీజేపీ నేతను కాల్చి చంపుతూ దారుణానికి తెగబడ్డారు. బుధవారం రాత్రి బీజేపీ నేత షేక్ వసీమ్‌తోపాటు అతని తండ్రిని, సోదరుడిని ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బందీపోర్లో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వసీమ్ బరి కుటుంబం పోలీస్ స్టేషన్‌కు దగ్గరలోని ఓ దుకాణం దగ్గర కూర్చుంది. సరిగ్గా అదే సమయంలో అదును చూసి అక్కడకు చొరబడ్డ ఉగ్రవాదులు బీజేపీ నేతతో సహా అతని తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ బషీర్‌పై కాల్పులు జరిపారు. (తెలంగాణ సైనికుడి వీరమరణం) వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వీరిని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిజానికి వసీమ్‌కు భద్రత సౌకర్యం ఉంది. కానీ ప్రమాదం జరిగే సమయంలో అతనికి భద్రతగా ఉండే ఎనిమిదిమంది గార్డుల్లో ఏ ఒక్కరూ సంఘటనా స్థలంలో లేరు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గార్డులపై కఠిన చర్యలను తీసుకోనున్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బాధితుడి కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. వసీమ్ మరణం పార్టీకి తీరని లోటని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు. (హిజ్బుల్ కమాండర్ హతం) -
ఎన్కౌంటర్స్ @ సిటీ
నగర శివార్లలో దిశ నిందితులు హతమైన నేపథ్యంలో సిటీ పరిధిలో గతంలోజరిగిన ఎన్కౌంటర్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలో తుపాకీ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. టెర్రరిస్టులు, దోపిడీ దొంగలు పోలీసుల చేతిలో హతమయ్యారు. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర శివార్లలో శుక్రవారం జరిగిన ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ సంచలనం సృష్టించింది. ఇదొక్కటే కాదు.. గత కొన్ని దశాబ్ధాలుగా రాజధానిలో తుపాకీ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదులు, అసాంఘికశక్తులు పోలీసుల చేతిలో హతమౌతున్నారు. నగరానికి చెందిన ముష్కరులు కొందరు ఇతర ప్రాంతాలు, దేశాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో హతమయ్యారు. నగరంలో జరిగిన ఎన్కౌంటర్లు ఇవీ.. ♦ ఇంటెలిజెన్స్ విభాగం అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్, ఆయన గన్‌మ్యాన్ వెంకటేశ్వర్లును హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు 1992 నవంబర్ 29న హత్య చేశారు. టోలిచౌకి పరిధిలోని బృందావన్ కాలనీలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న లయాఖ్ అలీని సిట్ పోలీసులు అదే ఏడాది డిసెంబర్ 11న నగర శివార్లలో జరిగిన ఎదురు కాల్పుల్లో మట్టుబెట్టారు. ♦ నల్లగొండ జిల్లాకు చెందిన మీర్ మహ్మద్ అలీ, మహ్మద్ ఫసీయుద్దీన్ కరసేవకులైన నందరాజ్‌గౌడ్, పాపయ్య గౌడ్లను హతమార్చిన కేసులో నిందితులుగా ఉన్నారు. ఫసీ మాడ్యుల్‌కు చెందిన ఈ ఉగ్రవాదులు 1993 జూన్ 21న కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. ♦ దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా దేవాలయం వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ బారీ మాడ్యుల్‌కు చెందిన ఉగ్రవాది మహ్మద్ ఆజం ఆదే ఏడాది ఉప్పల్‌లో, మరో నిందితుడు సయ్యద్ అబ్దుల్ అజీజ్ సరూర్‌నగర్‌లో ఎన్కౌంటర్ అయ్యారు. ♦ నేరేడ్మెట్ రౌడీషీటర్ వేణు, బస్ డెకాయిటీ గ్యాంగ్ లీడర్ కొక్కుల రాజు, గుంటూరుకు చెందిన కిడ్నాపర్ కామేశ్వరావు, గ్యాంగ్ స్టర్ అజీజ్‌రెడ్డి, కిడ్నాపర్ గౌరు సురేష్.. ఇలా పలువురు అసాంఘిక శక్తులు నగరంలో ఎన్కౌంటర్ అయ్యారు. ♦ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ ప్రాంతంలో 2016లో జరిగిన ఎదురు కాల్పుల్లో చైన్ స్నాచర్ శివ చనిపోయాడు. శుక్రవారం షాద్‌నగర్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో ‘దిశ’ నిందితులు హతమయ్యారు. ‘బయట’ హతమైన నగర ముష్కరులు... ♦ కరసేవకులైన నందరాజ్‌గౌడ్, పాపయ్య గౌడ్లను ఫసీ మాడ్యుల్ 1993లో హత్య చేసింది. ఈ మాడ్యుల్ దీంతో పాటు మరికొన్ని ఘోరాలకు పాల్పడింది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మీర్జా ఫయాజ్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఇతడు నగరంలోని మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన వ్యక్తి. ♦ వరంగల్‌కు చెందిన ఆజం ఘోరీ కూడా ఉగ్రవాద బాటపట్టాడు. హైదరాబాద్‌లో ఉంటూ తన కార్యకలాపాలు సాగించడంతో పాటు సొంతంగా ఓ గ్యాంగ్ (మాడ్యుల్) తయారు చేసుకున్నాడు. అనేక కేసుల్లో వాటెండ్‌గా మారడంతో ఇక్కడి పోలీసుల నిఘా, గాలింపు పెరగడంతో జగిత్యాలకు మకాం మార్చాడు. 2000 ఏప్రిల్ 6న అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ♦ నల్లగొండ జిల్లా అభియ కాలనీకి చెందిన గులాం యజ్దానీ ఆజం ఘోరీ మాడ్యుల్లో కీలకంగా వ్యవహరిస్తూ నగరం కేంద్రంగానే తన కార్యకలాపాలు సాగించాడు. ఇతడి గ్యాంగ్ హైదరాబాద్‌తో పాటు విజయవాడ, బోధన్, నిజామాబాద్, మెట్పల్లి తదితర ప్రాంతాల్లో పంజా విసిరింది. ఇతను 2006లో ఢిల్లీలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ♦ నగరంలో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనలకు సూత్రధారిగా ఉండి సుదీర్ఘకాలం పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాది బిలాల్, అతడి సోదరుడు సమద్‌లు 2008లో లాహోర్‌లో జరిగిన ఎన్కౌంటర్ లో హతమయ్యారు. ♦ తెహరీఖ్ గల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అనేక దోపిడీలకు, బందిపోటు దొంగతనాలు, హత్యలకు పాల్పడిన వికారుద్దీన్ గ్యాంగ్ 2015లో ఆలేరు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హతమైంది. ఈ ముఠా సభ్యులందరూ సిటీకి చెందిన వారే కావడం గమనార్హం. ♦ నల్లగొండ జిల్లా నుంచి నగరం మీదుగా రాష్ట్రం మొత్తం నెట్వర్క్ విస్తరించుకుని, దేశంలోని అనేక చోట్ల డెన్లు ఏర్పాటు చేసుకున్న గ్యాంగ్‌స్టర్ నయీం 2016లో షాద్‌నగర్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. -
కశ్మీర్లో అలజడికి ఉగ్రవాదుల కొత్త వ్యూహం!
సాక్షి, ఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా నిఘాను పటిష్టం చేసింది. దీంతో ఉక్కిరిబిక్కిరికి గురవుతోన్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎలాగైనా కశ్మీర్లో అశాంతిని రేపాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు సాధారణ పౌరులను టార్గెట్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా సోమవారం షోపియాన్ జిల్లాలో రాజస్థాన్‌కు చెందిన ట్రక్ డ్రైవర్‌ను కాల్చి చంపడాన్ని చెప్పుకోవచ్చు. ఈ దాడిలో ఇద్దరు పాల్గొన్నారని, అందులో ఒకరు పాకిస్థాన్ జాతీయుడని నిఘావర్గాలు గట్టిగా అనుమానిస్తున్నాయి. తాజాగా పుల్వామా జిల్లాలోని కాక్పురా ప్రాంతంలో ఓ సాధారణ వ్యక్తిని ఉగ్రవాదులు బుధవారం కాల్చిచంపారు. ఈ విషయం తెలిసి రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. అయితే సాధారణ పౌరులే లక్ష్యంగా వరుస సంఘటనలు చోటుచేసుకోవడం వెనుక కశ్మీర్లో ప్రశాంత పరిస్థితులను భంగపరిచే ఉద్దేశ్యం ఉన్నట్టు భద్రతా నిపుణులు అంచనా వేస్తున్నారు. 370 రద్దు తర్వాత కశ్మీరీలను ఎంత రెచ్చగొట్టినా ఎలాంటి ప్రతిస్పందనా లేకపోవడంతో వారు ఈ వ్యూహానికి తెరలేపారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికల మీద పాకిస్థాన్ తేలిపోతుండడంతో సామాన్య పౌరులను హతమార్చడం ద్వారా వారిలో అభద్రత, భయాందోళనలు రేపి తద్వారా కశ్మీర్లో పరిస్థితులు క్షీణించాయని ప్రపంచ దేశాలకు చూపే ప్రయత్నం కూడా అయి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. -
దసరాపై ఉగ్రనీడ
సాక్షి, బెంగళూరు: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందింది. మైసూరు దసరా ఉత్సవాలపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కన్నేసినట్లు సమాచారం. మైసూరు పక్కనే ఉన్న శ్రీరంగపట్టణ సమీపంలో శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదివారం కిక్కేరి సమీపంలో శాటిలైట్ ఫోన్ ఉపయోగించినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అలాగే హొళెనరసీపుర తాలుకా నుంచి తూర్పు ముఖంగా 15 కిలోమీటర్ల పరిధిలో శ్యాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం నుంచి పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీ చేసి శ్రీరంగపట్టణ సమీపంలో నలుగురిని అదుపులోకి ప్రశ్నిస్తున్నారు. శాటిలైట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారంరోజులుగా వదంతులు భద్రతా బలగాలు, పోలీసులు తప్ప ఇతరులు శాటిలైట్ ఫోన్‌ను ఉపయోగించడానికి అనుమతి లేదు. విదేశాల్లో ఉన్నవారితో రహస్యంగా సం భాషించడానికి ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్లనే ఉపయోగిస్తుంటారు. మైసూరుతో పాటు మండ్య, హాసన్, చామరాజనగర జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్నట్లు గత వారం రోజులుగా ప్రచారం సాగుతోంది. వారు ఉగ్రవాదులా, కాదా అనేది తేలాల్సి ఉంది. విదేశాల్లో శాటిలైట్ ఫోన్లకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో విదేశీయులు ఇక్కడికి వచ్చి వినియోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే కరావళి ప్రాంతంలో భద్రతను పెంచినట్లు హోంమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. ఉగ్రవాద భయాల నేపథ్యంలో మైసూరు నగరంలోను, ప్యాలెస్ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్యాలెస్ ఆవరణలోకి పాస్‌లు ఉన్నవారినే అనుమతిస్తారు. బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అనుమానితులను విచారిస్తున్నారు. -
తీరంపై డేగకన్ను
తీరం అప్రమత్తమైంది. ఉగ్రమూకల చొరబాట్లను అడ్డుకునేందుకు.. ఎగిసి పడుతున్న అలల మధ్య డేగ కళ్లతో పహారా కొనసాగుతోంది. కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులను అలర్ట్ చేసింది. ఈ క్రమంలో పోర్టులు, హార్బర్లకు పడవల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. నిర్జన ప్రదేశాల్లో సైతం పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. మెరైన్ పోలీసులు సముద్ర వేటకు వెళ్లే జాలర్లకు అవగాహన కల్పిస్తూ నిరంతరం గస్తీ కాస్తున్నారు. సాక్షి, గుంటూరు : రాష్ట్రంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాల కోస్ట్‌గార్డ్, పోలీస్ ఉన్నతాధికారులను నిఘా వర్గాల సూచనల మేరకు తీర ప్రాంతంపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు రేంజ్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సముద్రతీర ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న మెరైన్ పోలీసులను ఎప్పటికప్పుడు సమాచారం పంపించాలని రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ ఆదేశించారు. ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతర పహారా.. తీర ప్రాంతలో నిరంతరం గస్తీ కొనసాగించడంతో పాటు చొరబాట్లుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మరింత నిఘా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. నిర్జీవన ప్రదేశాలపై కూడా నిఘా ఉంచారు. ఆధునిక మరబోట్లపై సముద్రంలో గస్తీ నిర్వహిస్తూ జాలర్లను అప్రమత్తం చేసి వారికి అవగాహన కల్పించే మెరైన్ పోలీసులు నిమగ్నమయ్యారు. రాకపోకలపై ప్రత్యేక దృష్టి.. పోర్టులు, హార్బర్లకు రాకపోకలు కొనసాగించే పడవలు, బోట్లు, సముద్రంలో లంగరు వేసి ఉంచిన నౌకలపై కూడా దృష్టి సారించారు. ప్రసుత్తం ఉన్న బలగాలతో పాటుగా ఉగ్రవాదుల సమాచారం సేకరించే కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకిదిగింది. మెరైన్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది విధిగా వారికి కేటాయించిన పరిధిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా సమాచారం సేకరించుకోవాలని నిఘా వర్గాలు సూచనల మేరకు ఆయా జిల్లాల ఎస్పీలు ముందస్తు చర్యల గురించి ఆరా తీశారు. జాలర్లకు అవగాహన.. గతంలో మన జాలర్ల ఇచ్చిన సమాచారం మేరకు ఇతర రాష్ట్రాలకు చెందిన జాలర్లు అక్రమంగా దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించినట్లు గుర్తించిన కోస్ట్‌గార్డ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లోని జాలర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎలాంటి ఆనవాళ్లు గుర్తించినా వెంటనే తమకు సమాచారం అదించాలని సూచిస్తున్నారు. గుంటూరు రేంజ్ పరిధిలో సుమార్ 190 కిలో మీటర్ల మేర తీర ప్రాంతం ఉండగా జిల్లాలో 43 కిలోమీటర్లు ఉంది. సూర్యలకం, నిజాంపట్నంలో మెరైన్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఒక్క నిజాంపట్నం హార్బర్లో 218 బోట్లు ఉంటే దాదాపు 200 బోట్లు నిత్యం చేపల వేటలో ఉంటాయి. ఇందులో 20 నుంచి 25 బోట్లు డైలీ సముద్రంలో వేట ముగించుకుని హార్బర్‌కు వస్తుంటాయి. -
కశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు; నలుగురికి గాయాలు
శ్రీనగర్ : కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు అనంతరం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. లోయలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు ఉగ్రవాదులు శనివారం దాడులకు పాల్పడ్డారు. కశ్మీర్, సోపోర్ జిల్లాలో ఓ పండ్ల వ్యాపారి ఇంటి వద్ద ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో రెండేళ్ల చిన్నారితో సహా నలుగురు గాయపడ్డారని.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉగ్రవాదులు అక్కడ దుకాణాన్ని మూసివేయాలని సదరు దుకాణదారును హెచ్చరించారని అధికారులు తెలిపారు. అయితే వారి హెచ్చరికలను ఖాతరు చేయకుండా దుకాణాన్ని నడిపినందుకు ఉగ్రవాదులు ఈ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడ్డ రెండేళ్ల చిన్నారిని ఆధునిక వైద్య నిమిత్తం ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీకి పంపుతున్నట్లు శ్రీనగర్ జిల్లా అధికారి పేర్కొన్నారు. ప్రజల్లో భయందోళనలను సృష్టించడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నంగా ఈ సంఘటన కనిపిస్తుందని పేర్కొన్నారు. గత నెలలో బారాముల్లా జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడినట్లు వెల్లడించారు. కశ్మీర్ అంతా భద్రతా దళాలు మోహరించి ఉన్నాయని, ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని పోలీసులు స్పష్టం చేశారు.. -
తమిళనాడులో పేలుళ్లకు కుట్ర?
సాక్షి ప్రతినిధి, చెన్నై: శ్రీలంకలో ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లకు పాల్ప డిన ముష్కరులు తమిళనాడులో సైతం విధ్వంసానికి కుట్రపన్నుతున్నట్లు తెలుస్తోంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) అధికారుల బృందానికి రాష్ట్రంలో పట్టుబడిన తీవ్రవాదుల వల్ల ఈ విషయం బహిర్గతమైనట్లు సమాచారం. శ్రీలంక దుర్ఘటన తరువాత భారత్ అప్రమత్తమై తీవ్రవాదుల కోసం ముమ్మురంగా గాలింపు ప్రారంభించింది. ఇందులో భాగంగా తమిళనాడులో సైతం గత నాలుగునెలలుగా తీవ్రస్థాయిలోఎన్ఐఏ అధ్వర్యంలో తనిఖీలు సాగుతున్నాయి. చెన్నై పూందమల్లిలోని ఒక అపార్టుమెంటులో దాక్కుని ఉన్న శ్రీలంక యువకుడు కొన్నినెలల కిత్రం పట్టుబడ్డాడు. ఇతనికి శ్రీలంక పేలుళ్ల సూత్రధారితో సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. ఇతనితోపాటూ పలువురు స్నేహితులు అదే అపార్టుమెంటులో ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే వారెవరో ఆచూకీ తేలలేదు. ఇదిలా ఉండగా, శనివారం నాడు చెన్నై, నాగపట్టణంలో తనిఖీలు చేపట్టారు. చెన్నై మన్నడి లింగుచెట్టి వీధిలో ‘వాగాద్–ఇ–ఇస్లామీ హింద్’ అనే కార్యాలయం పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ సంస్థ చెన్నై కేంద్రంగా చేసుకుని తీవ్రస్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు శనివారం ఉదయం 6 నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జరిపిన సోదాల్లో అధికారులు గుర్తించారు. ప్రత్యేకంగా తమిళనాడులో పేలుళ్లకు పాల్పడేందుకు ఇది కొత్తగా వెలసిన తీవ్రవాద సంస్థగా భావిస్తున్నారు. ఈ సంస్థ అధినేత సయ్యద్ బుఖారీ చెన్నై వేప్పేరీ–పూందమల్లి రహదారిలోని ఒక అపార్టుమెంటులో నివసిస్తున్నట్లు కనుగొన్న అధికారులు మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. ఆ అపార్టుమెంటు నుంచి సెల్ఫోన్లు, లాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు మాత్రమే చిక్కాయి. అలాగే నాగపట్టణంలో కూడా మెరుపుదాడులు నిర్వహించి తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.చెన్నైలో ఉన్న సయ్యద్ బుహారీ, నాగపట్టణంలో తలదాచుకుని ఉన్న అసన్ అలి, ఆరిష్ మహమ్మద్ అలి, తవ్హీద్ అహ్మద్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరి నుంచి 9 మొబైల్ఫోన్లు, 15 సిమ్‌కార్డులు, 7 మెమొరీకార్డులు, 3 లాబ్ట్యాబ్లు, ఐదు హార్డ్ డిస్క్‌లు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురిలో అసన్ అలి, ఆరిష్ మహమ్మద్ అలి అనే ఇద్దరిని చెన్నై పూందమల్లిలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా ఈనెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించింది. మిగిలిన ఇద్దరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తుండగా త్వరలో అరెస్ట్ చూపే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా, తేనీలోని ఒక విద్యాసంస్థలో కూడా ఎన్ఐఏ అధికారులు ఆదివారం తనిఖీలు చేశారు. కుంభకోణంలో ఇటీవల జరిగిన పీఎంకే నేత రామలింగం హత్యకేసుకు సంబంధించే ఈ తనిఖీలు సాగినట్లు సమాచారం. హత్య జరిగిన తరువాత 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినా, వీరికి తీవ్రవాద ముఠాతో సంబంధాలపై అనుమానం రావడంతో ఎన్ఐఏ అధికారులు రంగప్రవేశం చేశారు. -
కారు బాంబు దాడి; 34 మంది మృతి
కాబూల్ : ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం ఒక్కసారిగా బాంబులతో దద్దరిల్లింది. అమెరికా ఎంబసీకి దగ్గర్లో కారు బాంబుతో ఉగ్రవాదులు పేలుళ్లకు తెగబడ్డారు. ఆ తర్వాత రద్దీగా ఉన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు ప్రారంభించారు.ఈ ఘటనలో 34 మంది మృతి చెందగా, 65 మందికి పైగా గాయపడ్డారు. రక్షణ మంత్రిత్వ శాఖ భవన సముదాయాలకు దగ్గరలోనే ఈ బాంబులు అమర్చడం గమనార్హం. దీంతో అక్కడ భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా ఉగ్రవాదుల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
శ్రీలంకలో ఇంకా బాంబుల మోత
కొలంబో: శ్రీలంకలో ఇంకా బాంబుల మోత మోగుతోంది. ఈస్టర్ సండే రోజు జరిగిన మారణహోమం నుంచి తేరుకోకముందే.. శుక్రవారం రాత్రి మరోసారి మానవ బాంబులు పేలాయి. ఉగ్రవాదులపై భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా కాల్పులకు పాల్పడగా.. ముష్కరులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో 15మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈస్టర్ పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇందులో భాగంగా సమ్మంతురై ప్రాంతంలో ఉగ్రస్థావరంపై సైన్యం దాడులు నిర్వహించింది. భద్రతాబలగాల రాకను పసిగట్టిన దుండగులు కాల్పులకు దిగడంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు తమని తాము పేల్చుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 15 మంది మృతిచెందారు. ఈ స్థావరం నుంచి భద్రతాబలగాలు భారీగా పేలుడు పదార్థాలు, ఐసిస్ యూనిఫారాలను స్వాధీనం చేసుకున్నాయి. శ్రీలంకలో ఈస్టర్ పర్వదినాన జరిగిన వరుస పేలుళ్లలో 253 మంది మరణించారు. 500మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఈ దాడులకు ఐసిస్ ఉగ్రసంస్థ బాధ్యత ప్రకటించుకుంది. -
పుల్వామాలో ఎన్కౌంటర్
శ్రీనగర్ : భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సమసిపోయినా ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనతో పాక్ దళాలు కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటిపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. గంటకు పైగా కాల్పులు జరిగాయని, ఉగ్రవాది తలదాచుకున్న గృహాన్ని భద్రతాదళాలు పేల్చివేశాయని అధికారులు వెల్లడించారు. పుల్వామా జిల్లాలోని త్రాల్లో ఓ ఇంటిలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారని అందిన సమాచారంతో భద్రతా దళాలు మంగళవారం తెల్లవారుజామున ఇంటిని చుట్టుముట్టాయి. భద్రతా దళాల దాడిలో ఓ ఉగ్రవాది మరణించగా మరో టెర్రరిస్ట్ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం కాల్పులు నిలిచిపోయాయని, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారని అధికారులు తెలిపారు. -
పాకిస్తాన్ టెర్రరిస్టుల ఇండస్ట్రీ..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రదాడి జరిగిందంటే దానికి పాకిస్తాన్‌తో సంబంధం ఉంటుందని, పాక్ టెర్రరిస్టుల ఇండస్ట్రీగా మారిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. పుల్వామా దాడితో పాక్‌కు సంబంధం లేదని ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడటం గురివింద గింజ సామెతను గుర్తుచేస్తోందన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనను ముక్తకంఠంతో ప్రజ లంతా ఖండిస్తుంటే మమతా బెనర్జీ, చంద్రబాబు లాంటి వారు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పుల్వామా ఘటన విషయంలో మోదీపై చంద్రబాబు మాట్లాడిన తీరు సిగ్గుచేటన్నా రు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేలా బాబు, మమత మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇద్దరూ తోడు దొంగలు.. ఎన్నికలకు ముందు ఉగ్రదాడి జరగడంపై అనుమానాలు ఉన్నాయంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమెకు మద్దతుగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. వీరిద్ద రూ తోడు దొంగల్లా ఉన్నారని ఆయన మండిపడ్డారు. ‘దేశంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా పుల్వామా ఘటనను అందరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ రాష్ట్రాలను పాలి స్తున్న సీఎంలు, బాధ్యత కలిగిన వ్యక్తు లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రపంచానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. మమత బాధ్యత మరిచి ఎన్నికల్లో ప్రజల మద్దతు కోసం మోదీనే ఇలా చేయించారంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మమత మాటలపై ప్రజలు ఆలోచించండి అని చంద్రబాబు ఇష్టారీతిన వ్యాఖ్యానిస్తున్నారు. గోద్రాలో నరమేధా న్ని మరవలేం అని పుల్వామా ఘటనకు ఆయన ముడి వేస్తున్నారన్నారు. దేశ గౌరవానికి భంగం కలిగే విధంగా వీరిరువురి మాటలున్నాయి. వారి మనస్సులోని అభద్రతా భావాన్ని ఈశాన్య రాష్ట్రాలపై రుద్దుతున్నారు. దేశ భద్రత ప్రమాదకరంగా ఉందని బాబు అనడం శోచనీయం’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై షీ టీమ్ కేసుపెట్టాలి.. మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్ కీలక శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారని, మహిళలు, గిరిజనులు లేకుండా కేబినెట్‌ను విస్తరించారని కిషన్‌రెడ్డి విమర్శించారు. మహిళల పట్ల వివక్ష చూపుతున్నందుకు సీఎం కేసీఆర్‌పై షీ టీం కేసు పెట్టాలన్నారు. -
అప్పుడే కబడ్డీ ఆడుంటే..
జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత ఆర్మీ రూపొందించిన పథకం పేరే ఆపరేషన్ కబడ్డీ. అయితే..2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌పై ఉగ్రదాడితో ఈ పథకం అమలుకు నోచుకోలేదని జేఎన్‌యూ అధ్యాపకుడు హ్యాపీమన్ జాకబ్ ‘లైన్ ఆన్ ఫైర్’అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఆపరేషన్ కబడ్డీ పేరుతో అత్యంత రహస్యంగా రూపొందించిన ఈ ప్రణాళికను ఆచరణలో పెట్టి ఉంటే 1972 భారత–పాక్ యుద్ధం తర్వాత ఉనికిలోకి వచ్చిన నియంత్రణరేఖ స్వరూపం మారిపోయేది. పాక్ ప్రేరేపిత ఉగ్రస్థావరాలుండేవి కావు. ఉగ్రదాడులకు తెరపడి ఉండేది. బటాలిక్ సెక్టార్ నుంచి.. కశ్మీర్ లద్దాఖ్ ప్రాంతంలో బటాలిక్ సెక్టార్‌లోని దాదాపు 25–30 పాక్ ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకోవడానికి భారత ఆర్మీ ఉత్తర కమాండ్ పథకం రూపొందించింది. మెరుపుదాడులతో మొదలై అనేక దశల్లో పాక్ దళాలను దాటి ముందుకు సాగుతూనే... పూర్తిస్థాయి యుద్ధంగా మారకుండా చూడడం ఈ ఆపరేషన్ ఉద్దేశం. 2001 జూన్‌లో న్యూఢిల్లీలోని ఆర్మీ చీఫ్ జనరల్ సుందరరాజన్ పద్మనాభన్ కార్యాలయంలో.. ఆర్మీ ఉత్తర కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ రుస్తుం కే నానావతీ, సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ), లెఫ్టినెంట్ జనరల్ గురుబ„Š సింగ్ సమావేశమై.. ఈ మెరుపుదాడి ముసాయిదా రూపొందించారు. ఒక్కో భారత బ్రిగేడ్ కనీసం.. ఒకట్రెండు పాక్ పోస్టులు స్వాధీనం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళిక విజయవంతంగా అమలుచేస్తే పాక్ సరిహద్దుల్లో నెలకొన్న వాతావరణాన్ని పూర్తిగా మార్చవచ్చని జనరల్ నానావతీ తన ఆలోచన పంచుకున్నారు. అనంతరం.. ఆపరేషన్ కబడ్డీకి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడానికి జనరల్ పద్మనాభన్ అనుమతి ఇచ్చారు. 3 నెలల్లో ఏర్పాట్లు పూర్తి ఉధంపూర్‌లోని తన ప్రధాన కార్యాలయానికి చేరుకున్న జనరల్ నానావతీ.. ఆర్మీ చీఫ్‌కు చెప్పినట్టే ఈ ఆపరేషన్‌కు మూడు నెలల్లో అంతా సిద్ధం చేశారు. ఏర్పాట్లు పూర్తయ్యాక ఏ రోజైనా దాడులు ప్రారంభించడానికి ఆదేశాలిస్తామని పద్మనాభన్ చెప్పారు. అణ్వాయుధాలున్న రెండు దేశాల మధ్య ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారకుండా చూడడానికి దాడులను బ్రిగేడ్, ఇంకా కింద స్థాయిలోనే నిర్వహించాలని కూడా నిర్ణయించారు. అధీనరేఖ అవతలి పాక్ భూభాగంలోని సైనిక, ఉగ్రవాద శిబిరాలను, ప్రాంతాలను లక్ష్యాలుగా చేసుకుని మెరుపుదాడులు జరపడం ‘ఆపరేషన్ కబడ్డీ’లక్ష్యం. ఇది విజయవంతంగా అమలు చేస్తే అధీనరేఖపై భారత సేనకు పూర్తి పట్టుతోపాటు సీమాంతర ఉగ్రవాదుల నిర్మూలనకు మంచి అవకాశం లభించేది. ఈ మెరుపు దాడుల అనంతరం.. పాక్ స్పందనకు ఎలా జవాబివ్వాలో కూడా పథకాలు సిద్ధం చేశారు. ఆర్మీ ఒక్కటే ఈ పని పూర్తి చేయాలని, భారత వైమానికదళానికి విషయం చెప్పడం గానీ, దాని సాయం తీసుకోవడంగాని జరగకూడదని మొదట అనుకున్నారు. కానీ, దాడులు పకడ్బందీగా జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో వాయుసేనను కూడా దింపాలని జనరల్ సిహోటాకు నానావతీ సూచించారు. 1990ల్లో కశ్మీర్లో పాక్ మద్దతుతో సాగిన ఉగ్రవాదంపై అనేక సైనిక విజయాలతో ఉగ్రదాడులు కొంతమేర తగ్గుముఖం పట్టినా 2000 తర్వాత పాక్ వైపు నుంచి చొరబాట్లు పెరిగాయి. ఆపరేషన్ కబడ్డీకి ఇదో ప్రధాన కారణం. సెప్టెంబర్ 1 2001 అంతా సిద్ధం ‘ఆపరేషన్ కబడ్డీ’ప్రణాళికను సెప్టెంబర్ ఒకటిన గానీ.. తర్వాత గానీ అమలు చేయాలనుకున్నారు. అయితే, పని ప్రారంభించడానికి, ముగించడానికి తేదీలు నిర్ణయించలేదు. ఈ సైనిక పథకానికి వాజ్‌పేయి నేతృత్వంలోని నాటి కేంద్ర సర్కారు నుంచి అనుమతిపై స్పష్టత లేదు. రక్షణ మంత్రులుగా పనిచేసిన జార్జి ఫెర్నాండెజ్, జశ్వంత్‌సింగ్‌ల అనుమతి పొందిన విషయాన్ని కూడా ఉన్నత సైనికాధికారులు ధ్రువీకరించలేదు. సెప్టెంబర్ మొదట్లో జనరల్ నానావతీకి ఢిల్లీ డీజీఎంఓ నుంచి జనరల్ సిహోటా ఫోన్‌చేసి.. ‘మీరు సిద్ధమేనా? మీ పథకాలు రెడీయేనా?’అని అడిగారు. తాము సెప్టెంబర్ ఒకటి నుంచి సిద్ధంగా ఉన్నామని నానావతీ జవాబిచ్చారు. సైనిక సిబ్బంది మెరుపు దాడులకు తయారుగా ఉందనీ, ఆర్మీ చీఫ్ నుంచి ఆదేశాలు రావడమే తరువాయని ఆయన తెలిపారు. ఈ సమయంలో సెప్టెంబర్ 9న న్యూయార్క్‌లోని డబ్ల్యూటీవో టవర్స్.. ఉగ్రవాదుల వైమానిక దాడులతో కూలిపోయాయి. ఫలితంగా ఉగ్రవాదంపై జరిపే పోరులో అమెరికాకు పాకిస్తాన్ కీలక భాగస్వామిగా మారింది. న్యూయర్క్‌పై దాడి జరిగిన వెంటనే ఆపరేషన్ కబడ్డీని అమలు చేసినా బావుండేది. కానీ, కొన్ని రోజులు గడిచాక ఒసామాబిన్ లాడెన్‌ను పట్టుకునే ప్రయత్నంలో పాక్‌కు అమెరికా ప్రాధాన్యం ఇవ్వడంతో అధీనరేఖ మీదుగా భారత ఆర్మీ దాడులకు అవకాశం లేకుండాపోయింది. గొప్ప అవకాశం భారత్ చేజారింది. -
పాకిస్థాన్‌తో టీవీ యాంకర్ల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన టెర్రరిస్ట్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్‌పై యుద్ధం చేయాల్సిందేనంటూ పలు ప్రాంతీయ టీవీలతోపాటు పలు జాతీయ టీవీ ఛానళ్ల యాంకర్లు తీర్మానించడమే కాదు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు భారత సైన్యానికి వెంటనే కదన రంగంలోకి దూకాల్సిందిగా శనివారం పదే పదే పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరు కూడా ఇదే కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. తెలుగు టీవీ యాంకర్ రష్మీ అవేశంతో ఊగిపోతూ పాకిస్థాన్‌పై రెండో సర్జికల్ స్ట్రైక్స్ చేయాలంటూ ‘తెర మాకీ....’ అంటూ రెచ్చిపోయారు. పాకిస్థాన్‌పై ఎలా బదులు తీర్చుకోవాలో తేల్చుకోవడానికి అఖిల పక్ష సమావేశాలతో ప్రధాని నరేంద్ర మోదీ తర్జనభర్జనలు పడుతుండగానే ‘పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలకు మోదీ సిద్ధంగా ఉన్నారు’ అంటూ ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తూ వస్తున్నారు. ‘ప్రతీకారం కోరుకుంటున్న భారత్’ అన్న నినాదంతోనే ‘రిపబ్లిక్ టీవీ’ వార్తలను ప్రసారం చేసింది. సీనియర్ జర్నలిస్ట్, యాంకర్ అర్నాబ్ గోసామి మాట్లాడుతూ ‘పాక్‌తో యుద్ధం చేయడం మినహా మరో మార్గం ఉందా ? లేదు!’ అంటూ సెలవిచ్చారు. ‘పాకిస్థాన్ విషయంలో ఇక వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి లేదు’ అంటూ టైమ్స్ నౌ యాంకర్ నావికా కుమార్ వ్యాఖ్యానించారు. ‘ ఓ భారత ప్రధాని ప్రజలనుద్దేశించి ఇంత స్పష్టంగా మాట్లాడడం ఇదే మొదటి సారి. పాకిస్థాన్‌తో పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు’ అని ఇండియా టుడే టీవీ యాంకర్ రాహుల్ కన్వల్ వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్‌లోని అన్ని టెర్రరిస్టు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపాలి’ అంటూ న్యూస్ 18 యాంకర్ భూపేంద్ర చౌబే పిలుపునిచ్చారు. యుద్ధానికి సమయం ఆసన్నమైందంటూ 2016లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులను ప్రస్తావిస్తూ ఏబీపీ న్యూస్ ఛానల్ అయితే ఇటీవల విడుదలైన ‘యురి’ బాలివుడ్ సినిమాలోని క్లిప్స్‌ను చూపించారు. యాంకర్ల పిలుపులపై ‘ఎన్డీటీవీ ఇండియా’ రవిష్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ‘మన సైనికులు మరణించినందుకు మనకు బాధగా ఉంటుంది. మనసు ప్రతీకారం కోరుకుంటుంది. ఇక్కడే కాస్త సంయమనం అవసరం. అరుపులు, కేకలు వినిపించడానికి ప్రతి సంఘటన ఓ సినిమా ప్లాట్ కాదు. రెచ్చగొట్టే భాష రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తుంది. సమస్యను పరిష్కరించదు. ఈ సమయంలో మనం మౌనం పాటించడమే అమర వీరులకు నిజమైన నివాళి. మృధువుగా మాట్లాడుతాం. బాధిత కుటుంబాల మెదళ్లును తొలుస్తున్న విషయం గురించి ఆలోచిద్దాం. కశ్మీరు పరిస్థితి కంటే మీడియా పరిస్థితి దిగజారినందుకు బాధగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. కార్గిల్ వీరుడి అమూల్య సందేశం ‘జీ న్యూస్’ చర్చాగోష్టిలో పాల్గొన్న 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొని కుడి కాలును కోల్పోయిన యోధుడు మేజర్ నవదీప్ సింగ్ చాలా బాధ్యుతాయుతంగా స్పందించారు. ‘దేశ త్రివర్ణ పతాకానికి అండగా ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధంగానే ఉన్నారు. ఒకప్పుడు టెర్రరిస్టయిన నజీర్ వానిలాగా ఓ కశ్మీర్ యువకుడు ఎందుకు కావాలనుకుంటున్నాడో కూడా ఆలోచించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. యుద్ధం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రాణాలే కాదు, అవయవాలు కూడా పోతాయి. ఆ తర్వాత నష్ట పరిహారం కోసం కోర్టుల తలుపులు తట్టాలి. యుద్ధంలో సైనికుడు చనిపోవాలని మనం కోరుకుంటాం. ఆ తర్వాత ఆ సైనికుడి వితంతు భార్య పింఛను కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. యుద్ధంలో కొన్నిసార్లు మృతదేహం ఆనవాళ్లు కూడా దొరకవు. పింఛను కావాలంటే భర్త మతదేహాన్ని తీసుకరావాలని అధికార యంత్రాంగం ఆదేశిస్తుంది. యుద్ధంలో గాయపడితే అంగవైకల్య నష్టపరిహార పింఛను కోసం ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరగాలి. యుద్ధంలో కాలు కోల్పోయిన నేను పింఛను కోసం ఏడేళ్లు కోర్టుల చుట్టూ తిరిగాను. సైనిక పింఛను విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్పీళ్లను ఉపసంహరించుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు స్వయంగా ఆదేశించినప్పటికీ ఇప్పటికీ వెయ్యి కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రాణాలతో పరాచకాలొద్దు. అన్యాయంగా సైనికుల ప్రాణాలను బలిపెట్టవద్దు. భారత సైన్యానికి ఎప్పుడు ఎలా స్పందించాలో తెలుసు. ఎం చేయాలో వారికి మనం సూచించాల్సిన అవసరం లేదు. సముచిత సమయంలో సముచిత చర్య తీసుకోవడం వారికి తెలుసు. ముందుగా పాకిస్థాన్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రపంచం ప్రకంటించేలా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకరావాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందిగదా అంటూ ఆవేశంతో మాట్లాడడం సముచితం కాదు’ అని ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అయినా ‘సార్! మీరు పుల్వామా దాడి చిత్రాలను చూసినట్లు లేదు. ప్రతీకారం ఒక్కటే పరిష్కారమని మీరు భావించకపోవడానికి అదే కారణం అనుకుంటా’ అని జీన్యూస్ యాంకర్ వ్యాఖ్యానించడం కొసమెరపు. -
కొత్త ఉగ్రవాదులకు వల పన్నడం కుదరకే..
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమాన్ని కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ చెప్పడం దారుణమని మండిపడ్డారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పాకిస్తాన్ నిరాశలో మునిగిపోయిందని, కొత్త ఉగ్రవాదులకు వల పన్నడం వీలు కాకపోవడం వల్లే తమ ఉనికిని చాటుకునేందుకు ఈ దారుణానికి తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ చెత్తగా వాగుతోంది. ఉగ్రవాదులు నిర్భయంగా ర్యాలీలు చేసుకునేందుకు అనుమతినిస్తూ, మేమైనా చేయగలమనే అహంకారంతో భారత్‌ను బహిరంగంగానే హెచ్చరించాలని చూస్తోంది’ అని వ్యాఖ్యానించారు. తాను ఈరోజు అమర జవానుల సంస్మరణ సభకు హాజరవుతున్నానని తెలిపారు. తనతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌రాథ్ సింగ్ కూడా కశ్మీర్ వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రతా, ఇంటలెజిన్స్ వర్గాలతో భేటీ అయి, ఘటనకు గల కారణాల గురించి చర్చిస్తామని పేర్కొన్నారు. కాగా గురువారం పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. J&K Governor Satya Pal Malik to ANI: I will be leaving for the wreath laying ceremony of the martyrs in Kashmir. HM Rajnath Singh is also coming. We will hold a review meeting with top security and intelligence officials. We will find out where the lapses occurred. (File pic) pic.twitter.com/aUMOiYoq6K — ANI (@ANI) February 15, 2019 J&K Governor Satya Pal Malik to ANI: Pakistan is frustrated, after successful elections they could not recruit new terrorists, stone pelting has stopped, so it wanted to do something. We have alerted all installations and cantonments as Pakistan may do something else. (File pic) pic.twitter.com/gBEQCyB8sv — ANI (@ANI) February 15, 2019 -
ఆ హిట్ లిస్ట్‌లో ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్ : మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ- ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు ప్రముఖులపై జులై 25న జరగనున్న పాక్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ (నాక్టా) హెచ్చరించింది. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న జాబితాలో ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అవామీ నేషనల్ పార్టీ అధ్యక్షుడు అఫ్సన్‌దర్ వలి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు, పాక్ సార్వత్రిక ఎన్నికల్లో తలపడుతున్న తల్హా సయీద్ తదితరలున్నారని నాక్టా వెల్లడించింది. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్‌కు చెందిన పలువురు నేతలు సైతం ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు నాక్టా పాక్ దేశీయాంగ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్న నేతలందరికీ కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని మంత్రిత్వ శాఖకు నాక్టా చీఫ్ రెహమాన్ మాలిక్ సూచించినట్టు పాక్ పత్రిక డాన్ న్యూస్ వెల్లడించింది. -
ఉగ్ర కోరల్లో పశ్చిమ తీరం
పనాజి, గోవా : దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో గోవా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లోని పోర్టులను కూడా ఈ మేరకు అప్రమత్తం చేసినట్లు ఓడరేవుల శాఖ మంత్రి జయేష్ సల్గాంకర్ తెలిపారు. గతంలో స్వాధీనం చేసుకున్న ఓ భారతీయ బోటును పాకిస్తాన్ విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా ఉగ్రదాడి జరగొచ్చని ఇంటిలిజెన్స్ ప్రభుత్వాలను హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు తీర ప్రాంతాల్లో గస్తీని పెంచాయి. గోవాతో పాటు, గుజరాత్, ముంబై తీరాలకు కూడా దేశ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు అందాయి. తీరప్రాంతంలోని స్పోర్ట్స్ ఆపరేటర్స్, కాసినో నిర్వాహకులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఓడరేవుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కరాచీ నుంచి బయల్దేరిన ఓ ఫిషింగ్ బోటులో ఉగ్రవాదులు భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని నేవీ అధికారి జేమ్స్ బ్రగాంజా ధ్రువీకరించారు. -
ప్లాన్ చేసి పాక్ నుంచి జూన్‌లోనే చొరబడ్డారు..
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని మిలిటరీ క్యాంపుపై దాడికి పాల్పడిన ముగ్గురు తీవ్రవాదుల గురించి భారత ఆర్మీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. వారు గత జూన్ (2017) నెలలోనే పాక్ భూభాగం నుంచి భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లోకి చొరబడినట్లు గుర్తించారు. ప్రత్యేకంగా దాడి చేయడంకోసం జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో గడిచిన ఏడు నెలల్లో తల దాచుకుంటూ గడిపారని వివరాలు సేకరించారు. ఈ నెల (ఫిబ్రవరి) 10న జైషే ఈ మహ్మద్(జేఈఎం) ఉగ్రవాదులు ముగ్గురు భారీ మొత్తంలో ఆయుధాలతో వచ్చి సుంజువాన్ మిలిటరీ క్యాంపుపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆరుగురు జవాన్లు, ఒక పౌరుడు చనిపోగా బలగాలు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో దాడులకు సంబంధించి విచారణ చేపట్టిన అధికారులకు దాడి కుట్ర పాక్ నుంచే జరిగిందని మరోసారి స్పష్టమైంది. -
ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట..!
-
న్యూయార్క్‌లో ‘ఉగ్ర’ పేలుడు
న్యూయార్క్: అమెరికా నగరం న్యూయార్క్‌లోని రద్దీగా ఉండే ఓ మెట్రో స్టేషన్లో ఐసిస్ ఉగ్రవాది సోమవారం పేలుడుకు పాల్పడ్డాడు. అదృష్టవ శాత్తూ బాంబు పాక్షికంగానే పేలడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడగా వారి ప్రాణాలకేమీ అపాయం లేదని పోలీసులు తెలిపారు. న్యూయా ర్క్‌లోని మన్హటన్ ప్రాంతంలో ఉండే ‘పోర్ట్ అథారిటీ’ బస్ టర్మినల్ ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడే మెట్రో స్టేషన్ కూడా ఉంది. బంగ్లాదేశ్‌కు చెందిన అకాయెద్ ఉల్లా (27) అనే ఐసిస్ ఉగ్రవాది ఇంట్లోనే పైప్ బాంబు తయారుచేసుకుని వచ్చి ఉదయం 7.15 గంటల ప్రాంతంలో పోర్ట్ అథారిటీలో పేలుడుకు పాల్పడ్డాడు. బాంబు పాక్షికంగా పేలడంతో ఉగ్రవాదికి కూడా గాయాలయ్యాయి. అతణ్ని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ ఘటన గురించి సమాచారం అందించారు. పేలుడు వల్ల మెట్రో స్టేషన్లో గందరగోళం నెలకొంది. అమెరికాలోని వివిధ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
పాక్‌లో సూఫీ దర్గాపై ఆత్మాహుతి దాడి
కరాచీ: పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రావిన్సులోని ఫతేపూర్‌లో పీర్ రఖేల్ షా సూఫీ దర్గాపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ ఏఎస్సై, కానిస్టేబుల్ సహా 18 మంది దుర్మరణం చెందగా, 25 మంది గాయపడ్డారు. దర్గా ప్రధాన ప్రవేశద్వారం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. దర్గాలను పూజించడం ఇస్లామ్‌కు వ్యతిరేకమంటున్న తాలిబాన్లు ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. -
'అల్లాహో అక్బర్' అంటూ ఇద్దరి గొంతు కోసేశాడు!
మర్సీల్లె: ఫ్రాన్స్‌లోని మర్సీల్లె నగరంలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఆదివారం సెయింట్ చార్లెస్ రైల్వే స్టేషన్ వద్ద 'అల్లాహో అక్బర్' అని అరుస్తూ.. ఇద్దరు మహిళలను కత్తితో పొడిచి హతమార్చాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే నిందితుడిని సంఘటనా స్థలంలోనే కాల్చి చంపాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా పోలీసులు భావిస్తుండగా.. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. తమ సైనికుడే ఈ దాడి చేశాడని ఐసిస్ మీడియా వింగ్ అమాక్ వెల్లడించింది. ఈ కిరాతక ఘటనలో 17, 20 ఏళ్ల వయస్సున్న ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. నల్లదుస్తులు ధరించిన దుండగుడు ఒక యువతిని గొంతు కోసి హతమార్చగా.. మరో యువతి ఛాతిపై, కడుపులో కత్తితో పొడవడంతో అక్కడే ప్రాణాలు విడిచారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడికి పాల్పడిన నిందితుడి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని, అతనికి ఉగ్రవాద సంస్థలతో లింక్స్ ఉండవచ్చునని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. నిందితుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, అతను సాధారణ నేరస్తుడేనని, అతని గురించి స్థానిక అధికారులకు తెలిసి ఉండే అవకాశముందని కథనాలు వెలువడుతున్నాయి. పారిస్‌లోని స్పెషల్ ప్రాసిక్యూటర్ ఈ ఉగ్రవాద ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నారు. -
ఉగ్రవాదుల చేతిలో జవాన్ దుర్మరణం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బందిపొరా జిల్లాలోని హజ్జాన్‌లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ రమీజ్ అహ్మద్ పర్రే ఇంట్లోకి బుధవారం చొరబడ్డ ఉగ్రవాదులు.. అయన్ను సమీపం నుంచి కాల్చిచంపారు. ఈ దాడిలో రమీజ్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన కుటుంబ సభ్యులు నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. రమీజ్ అహ్మద్ పర్రే ఇంట్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచాక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. రమీజ్ కొద్ది రోజుల క్రితమే సెలవులపై ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మే 10వ తేదీన ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఆర్మీ లెఫ్టినెంట్ మేజర్ ఉమర్ ఫయాజ్ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. -
ఖలీద్ మసూద్ అలియాస్ అడ్రియన్ రస్సెల్
లండన్: బ్రిటన్ పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన 52 ఏళ్ల వ్యక్తి అసలు పేరు అడ్రియన్ రస్సెల్ అజావ్ అని ఇస్లాం మతం స్వీకరించి తన పేరును ఖలీద్ మసూద్‌గా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడికి మసూద్ సన్నద్ధత, ప్రేరణ, సహచరుల గురించి తెల్సుకునేందుకు ‘ఆపరేషన్ క్లాసిఫిక్’ పేరిట వందల మంది అధికారులతో కౌంటర్ టెర్రరిజం కమాండ్ విచారణను ముమ్మరం చేశారు. మసూద్‌కు ఎన్నోమారు పేర్లున్నా చిన్నతనంలో అతన్ని అడ్రియన్ రస్సెల్ అని పిలిచేవారు. గతంలోనూ నేరచరిత్ర ఉన్న అతను 2000లో ఓ మహిళ ముఖంపై కత్తితో దాడిచేయడంతో అతని కుటుంబాన్ని స్థానిక కోర్టు బహిష్కరిస్తూ అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, బ్రిటన్ పార్లమెంట్‌పై జరిగిన దాడిలో గాయపడిన మరో వ్యక్తి గురువారం చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది. మరోవైపు, ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో మాట్లాడారని, ఉగ్రదాడులపై సంఘీభావాన్ని వ్యక్తం చేశారని ప్రధాని కార్యాలయం శుక్రవారం ట్వీటర్లో తెలిపింది. -
బ్రిటన్‌లో మోదీ బిజీ బిజీ
♦ బ్రిటన్‌లో ముగిసిన ప్రధాని పర్యటన ♦ లండన్‌లో అంబేడ్కర్, బసవేశ్వర స్మారకాల ఆవిష్కరణ ♦ టాటా మోటార్స్ జాగ్వార్ కార్ల ఫ్యాక్టరీ సందర్శన ♦ జీ 20 కోసం టర్కీకి పయనం లండన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్‌లో చేపట్టిన మూడు రోజుల పర్యటన ముగిసింది. టర్కీలో ఆదివారం నుంచి రెండు రోజులపాటు జరగనున్న జీ20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు శనివారం రాత్రి ఆయన టర్కీకి బయలుదేరారు. ఫ్రాన్స్‌లో ఉగ్ర దాడి నేపథ్యంలో ఉగ్ర పోరు ప్రధాన ఎజెండాగానే జీ20 సదస్సు జరిగే అవకాశం ఉంది. అంతకుముందు బ్రిటన్ పర్యటనలో చివరిరోజైన శనివారం కూడా మోదీ బిజీబిజీగా గడిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, 12వ శతాబ్ది భారత తత్వవేత్త, సంఘ సంస్కర్త బసవేశ్వర స్మారకాలను లండన్‌లో ఆవిష్కరించారు. అలాగే ఇంగ్లాండ్‌లోని పశ్చిమ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలో టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల ఫ్యాక్టరీని సందర్శించారు. టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ తదితరులు మోదీ వెంట ఉన్నారు. అంబేడ్కర్‌కు నివాళి... బసవేశ్వర ఆదర్శాలకు కితాబు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1920-21లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకునే రోజుల్లో నివసించిన మూడంతస్తుల ఇంటిని మోదీ సందర్శించారు. ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ స్మారకాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆ రాష్ట్ర సామాజికశాఖ మంత్రి రాజ్‌కుమార్ బడోలేలతో కలసి ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆ ఇంటిని భారత ప్రభుత్వం రెండు నెలల కిందట సుమారు రూ. 26 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసి మ్యూజియంగా మార్చింది. అలాగే లండన్‌లోని వాక్స్హాల్ ప్లెషర్ గార్డెన్లో బసవేశ్వర స్మారకాన్ని ఆవిష్కరించారు. 12వ శతాబ్ది నాటి ఇంగ్లండ్ రాజు వద్ద పనిచేసిన మాగ్నా కార్టాకన్నా ముందు ప్రపంచానికి ప్రజాస్వామ్య ఆదర్శాలను బసవేశ్వర అందించారని కొనియాడారు. కాగా, బ్రిటన్ లేబర్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు జెరెమి కార్బిన్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై మోదీని నిలదీయాలంటూ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కు వినతిపత్రం సమర్పించిన 46 మంది బ్రిటిష్ ఎంపీల్లో కార్బిన్ కూడా ఒకరు కావడం గమనార్హం. బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగించినప్పుడు కార్బిన్ గైర్హాజర య్యారు. మోదీకి రంగుల దుప్పటి బహుమతి బ్రిటన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయ మహిళలు వినూత్న బహుమతిని అందించారు. మోదీ బస చేసిన హోటల్లో ఆయన్ను కలుసుకున్న ఇండియన్ లేడిస్ ఇన్ యూకేకు చెందిన ప్రతినిధులు 2,500 చదరపు అల్లికలతో చేసిన రంగురంగుల దుప్పటిని ఆయనకు బహూకరించారు. భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేందుకు 4 వేల మందికిపైగా మహిళలు దీన్ని రూపొందించారు. తనకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన బ్రిటన్‌కు, తన పర్యటనలో వెన్నంటి ఉన్న కామెరాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 126వ జయంతి సందర్భంగా ఆయనకు ట్విటర్లో నివాళి అర్పించారు. రాజస్థాన్ టీచర్‌ను కొనియాడిన మోదీ జైపూర్: రాజస్థాన్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడిని ప్రధాని నరేంద్ర మోదీ లండన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రవాస భారతీయుల సభలో పొగి డారు. విద్యార్థుల కోసం ఎలాంటి ఖర్చు లేని 52 యాప్స్ రూపొందించారని, అలాంటి వారిలోనే ఇండియా ఉందని తన ప్రసంగంలో కొనియాడారు. ఈ నేపథ్యంలో కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం ఇమ్రాన్‌ఖాన్‌కు ఫోన్ చేసి అభినందించారు. ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు. మంత్రి ఆదేశాల మేరకు బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ్ రాజస్థాన్‌లోని అల్వార్ బీఎస్ఎన్ఎల్ జీఎంను ఇమ్రాన్‌ఖాన్ వద్దకు పంపారు. ఈ మేరకు అభినందనలు తెలిపి జీవితకాలం ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. తాను ఇంగ్లిష్, హిందీ, జీకే, మాథ్స్ సబ్జెక్టులపై యాప్స్ రూపొందించానని తెలిపారు. తాను సంస్కృతి టీచర్‌నని, హిందీ మీడియం విద్యార్థుల కోసం జీకే టాక్ అనే వెబ్‌పోర్టల్‌ను నడుపుతున్నానని ఇమ్రాన్‌ఖాన్ తన వెబ్సైట్లో పేర్కొన్నారు. ‘లండన్‌లో ప్రధాని మోదీ నా గురించి గొప్పగా చెప్పిన విషయాన్ని మిత్రుల ద్వారా తెలుసుకున్నాను. నేను చేసిన చిన్న ప్రయత్నం గురించి లండన్‌లో మాట్లాడడం గర్వంగా ఉంది. నేను 2012 నుంచి యాప్స్ రూపొందిస్తున్నాను. నాకు కంప్యూటర్ పరిజ్ఞానం లేదు. కాని కంప్యూటర్‌పై ఎక్కువ సమయాన్ని వెచ్చించి వెబ్‌సైట్స్ రూపొందించడంపై కసరత్తు చేశాను.’ అని ఇమ్రాన్‌ఖాన్ వివరించారు. -
విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన లోక్ సభ
న్యూఢిల్లీ: లోక్‌సభలో సోమవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనలు, ఆందోళనలతో అట్టుడికింది. పంజాబ్‌లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై ఇవాళ లోక్‌సభ దద్దరిల్లింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే గురుదాస్‌పూర్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదుల దాడిపై సభలో ప్రకటన విడుదల చేయాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబడ్డారు. మరోవైపు వ్యాపం, లలిత్ గేట్ వివాదం విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ ఎంపీలు పోడియం దగ్గరికి ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ సమావేశం కాగానే గురుదాస్ పూర్ ఘటనపై సభ్యులు ఆందోళనకు దిగారు. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని... పంజాబ్ ఉగ్రదాడిపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సభలో స్పష్టం చేశారు.ఎన్కౌంటర్ కొనసాగుతోందని వివరాలు అందిన తరువాత పూర్తి సమాచారాన్ని సభకు తెలియజేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి హోం మంత్రి వివరణ ఇస్తారన్నారు. దేశ సమగ్రత, భద్రతకోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇక ఉగ్రదాడిని పసిగట్టడంలో ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు విఫలమయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. "వి వాంట్ జస్టిస్", "మోదీ జవాబ్ దో " అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళను కొనసాగించారు. పోడియం ముందుకు దూసుకు వచ్చారు. సభలో ఫ్లకార్డులు ప్రదర్శించడాన్ని అంగీకరించేది లేదని స్పీకర్ సుమిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాల్పుల ఘటనను రాజకీయం చేయొద్దని, టెర్రరిజానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని మరికొంత మంది సభ్యులు వాదించారు. గురుదాస్ పూర్ చాలా దురదృష్టకరమైన ఘటన, టెర్రరిజాన్ని మట్టుబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. విపక్షాల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతుండటంతో కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సమావేశాలను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. అటు రాజ్యసభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే మంగళవారానికి వాయిదా పడింది. సిట్టింగ్ సభ్యుడు కల్పతరు దాస్ మృతికి సంతాపంగా సభ రేపటికి వాయిదా వేశారు.