పోలీస్టేషన్‌పై ఉగ్రదాడి.. 10 మంది పోలీసులు మృతి | 10 Killed In Attack On Police Station In Pakistan | Sakshi
Sakshi News home page

పోలీస్టేషన్‌పై ఉగ్రదాడి.. 10 మంది పోలీసులు మృతి

Published Mon, Feb 5 2024 11:20 AM | Last Updated on Mon, Feb 5 2024 11:56 AM

Attack On Police Station In Pakistan - Sakshi

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. డేరా ఇస్మాయిల్‌ఖాన్‌లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రమూకలు దాడిచేశారు. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.

"ఉదయం 3 గంటలకు, ఉగ్రవాదులు పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసు భవనంలోకి ప్రవేశించి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు." అని పాకిస్తాన్ పోలీసు అధికారులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లో గత కొద్ది రోజులుగా ఉగ్రదాడుల ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: Denver: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement