లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడో దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హర్దోయ్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాల పై విరుచుకుపడ్డారు. "సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ నాయకుల వైఖరి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ వ్యక్తులు ఒసామా వంటి ఉగ్రవాదులను 'జీ' అని సంబోధిస్తున్నారు. బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల నిర్మూలనపై ఈ వ్యక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు" అంటూ విమర్శలు గుప్పించారు.
అంతేకాదు 2008లో అహ్మదాబాద్ వరుస పేలుళ్ల గురించి ప్రస్తావిస్తూ...కొన్ని పార్టీలు ఉగ్రవాదంపై మెతకగా వ్యవహరించడమే కాక సానుభూతి వ్యక్తం చేస్తున్నాయని ఆరోపించారు. అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 14 ఉగ్రవాద దాడుల కేసులలో అప్పటి సమాజ్‌వాదీ ప్రభుత్వం చాలా మంది ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు ఇచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నాయకులు పాకిస్తాన్ వ్యవస్థాపకుడు అలీ జిన్నాకు మద్దతుదారులని ఎద్దేవా చేశారు.
శాంతిభద్రతలపై అలక్ష్య పెట్టి 'కట్టా' (దేశంలో తయారు చేసిన పిస్టల్స్)ని వినియోగించే స్వేచ్ఛనిచ్చిని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వాన్ని, వారి కార్యకర్తలని హర్దోయి ప్రజలు తప్పక గుర్తుంచుకుంటారని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాదు బుజ్జగింపు రాజకీయాలతో పండుగలను ఆపేసే వారికి మార్చి 10న ఉత్తరప్రదేశ్ ప్రజల నుంచి సరైన సమాధానం వస్తుందని నొక్కి చెప్పారు.
(చదవండి: కాంగ్రెస్‌కే ఓటు వేయండి అని బీజేపీ ప్రచారం ! తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ)
Comments
Please login to add a commentAdd a comment