లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామి పారీ్టగా భావిస్తూ 11 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు ఇస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ శనివారం ప్రకటించింది. ఈ కేటాయింపుతో విపక్షాల కూటమిలో సీట్ల సర్దుబాటు పర్వానికి చక్కటి శుభారంభం లభించిందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ ఈ పంథా గెలుపు సమీకరణాలతో మరింత ముందుకెళ్తుంది. వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాల వర్గాల ఫార్ములాతో ఇండియా కూటమి చరిత్ర సృష్టించనుంది’’ అని అఖిలేశ్ అభిలíÙంచారు.
‘‘ కాంగ్రెస్‌కు ఇస్తామన్న సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోదు’’ అని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి స్పష్టంచేశారు. ‘‘ యూపీలో సీట్ల సర్దుబాటులో భాగంగా మేం కాంగ్రెస్‌కు 11, రా్రïÙ్టయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ)కి ఏడు సీట్లు ఇస్తాం. మిగతా మొత్తం 62 స్థానాల్లో మేమే పోటీచేస్తాం’’ అని వివరించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ స్పందించారు. ‘‘ మిత్ర పక్షం ఎస్పీ చేసిన ప్రతిపాదనపై తుది నిర్ణయం కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని కమిటీ తీసుకోనుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment