న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి చెక్కుచెదరలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉంటున్నప్పటికీ తమ కూటమికి స్థిరంగా, బలంగా ఉందని అన్నారు. అవినీతిని వ్యతిరేకిస్తున్నాం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రకటనలన్నీ ఉత్తడొల్లేనని కొట్టిపారేశారు.
జైరామ్ రమేశ్ ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని తేల్చిచెప్పారు. విపక్షాలు 272కి పైగా సీట్లు సాధిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందినవారు పెద్ద ఎత్తున ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి, బీజేపీకి సమర్పించుకున్నారని తెలిపారు. రూ.4,000 కోట్ల విలువైన బాండ్లకు రూ.4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులతో ప్రత్యక్షంగా సంబంధం ఉందన్నారు.
ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నవారు కూడా ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీజేపీకి అందజేశారని వెల్లడించారు. ఇది ముమ్మాటికీ క్విడ్ ప్రో కో అని తేలి్చచెప్పారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన కాంట్రాక్టులను దక్కించుకున్న ఓ బీజేపీ ఎంపీ కూడా ఎలక్టోరల్ బాండ్లు కొన్నాడని వెల్లడించారు అవినీతిపై పోరాటం అంటూ ప్రధాని మోదీ చెబుతున్న మాటల్లో ఏమాత్రం పస లేదని జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment