opposition partys
-
స్నానం, ఆచమనం నిరభ్యంతరంగా ఆచరించవచ్చు
లక్నో: మహా కుంభమేళాపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, పవిత్రమైన కార్యక్రమాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా కుట్రలకు పాల్పడుతున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. మహాకుంభమేళాను, సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కుంభమేళా కేవలం ఒక మతపరమైన కార్యక్రమం కాదని చెప్పారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని స్పష్టంచేశారు. మన ప్రాచీన గ్రంథాల్లో కూడా కుంభమేళా ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. మహా కుంభమేళాలో ఇప్పటిదాకా 56 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని వివరించారు. కుంభమేళా ప్రాధాన్యతను తగ్గించడానికి విపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. భారతీయ ఆత్మ అయిన సనాతన ధర్మం గౌరవాన్ని మరింత పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలోని నీళ్లు స్నానానికి పనికిరావంటూ కొన్ని సంస్థలు, వ్యక్తులు చేస్తున్న వాదనను యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. త్రివేణి సంగమంలో నీళ్లు కలుషితమయ్యాయంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కుంభమేళా గురించి అసలేమీ తెలియని వాళ్లే ఇలాంటి దుష్ప్రచారానికి తెరతీశారని ధ్వజమెత్తారు. అక్కడి నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని స్పష్టంచేశారు. కేవలం స్నానాలకే కాదు, తాగడానికి సైతం ఆ నీళ్లు పనికొస్తాయని తేల్చిచెప్పారు. కుంభమేళాలో స్నానం, ఆచమనం నిరభ్యంతరంగా ఆచరించవచ్చని ఉద్ఘాటించారు. ఇటీవల కొన్ని అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని నిర్ధారించాయని గుర్తుచేశారు. గంగ, యమున నదుల్లో వ్యర్థాలు చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. మృత్యుకుంభ్ అనడం దారుణం దేశం యావత్తూ ఘనంగా నిర్వహించుకుంటున్న పవిత్రమైన వేడుకపై ప్రతిపక్షాలు బురదజల్లడం హిందువుల మనోభావాలను గాయపరుస్తోందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. మహాకుంభ్‌ను వ్యతిరేకిస్తున్న వాళ్లే రహస్యంగా త్రివేణి సంగమానికి వెళ్లి పవిత్ర స్నానాలు చేస్తున్నారని విపక్ష నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహాకుంభ్ కాదు...మృత్యుకుంభ్ అనడం దారుణమని విపక్ష నేతలపై మండిపడ్డారు. కుంభమేళాలో తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని వెల్లడించారు. బాధ్యతల నుంచి తాము తప్పించుకోవడం లేదన్నారు. తొక్కిసలాట ఘటనలో 30 మంది మరణించగా, 36 మంది గాయపడినట్టు తెలియజేశారు. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి వస్తూ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన భక్తుల కుటుంబాలను కూడా ఆదుకుంటామని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. -
బంధుప్రీతి, బుజ్జగింపు విపక్షాలపై మోదీ ధ్వజం
వారణాసి/కోల్‌కతా: బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే ప్రతిపక్షాల విధానమని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన సొంత లోక్‌సభ నియోజవర్గమైన వారణాసిలో ఆదివారం రూ.6,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారణాసి శివారులోని సీగ్రాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో పదేళ్ల క్రితం వరకు వందల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి పత్రికల్లో నిత్యం వార్తలు వస్తుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో వారణాసిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచి్చన తర్వాత అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టలకు బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. వారణాసి అభివృద్ధిని అవి పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. ‘సబ్కా వికాస్’ సిద్ధాంతంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక గత 125 రోజులవ్యవధిలోనే దేశవ్యాప్తంగా రూ.15 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభించామని చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పంచడం తమ లక్ష్యమని ప్రకటించారు. ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు శంకుస్థాపన పశి్చమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.1,550 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది. శంకర కంటి ఆసుపత్రి ప్రారంభం వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్జే శంకర కంటి ఆసుపత్రిని మోదీ ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో ఏటా 30 వేల కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మఠం వర్గాలు తెలిపాయి. వారణాసికి రావడం ఆశీర్వచనంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ అన్నారు. మత విశ్వాసాలకు, ఆధ్యాతి్మకతకు కేంద్రమైన వారణాసి నగరం ఆరోగ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందుతుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మోదీపై కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నరేంద్ర దామోదర్ దాస్ కా అనుశాసన్’ అని అభివర్ణించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఇది ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వమని కొనియాడారు. -
ఇండియా కూటమి చెదరలేదు: జైరామ్ రమేశ్
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి చెక్కుచెదరలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉంటున్నప్పటికీ తమ కూటమికి స్థిరంగా, బలంగా ఉందని అన్నారు. అవినీతిని వ్యతిరేకిస్తున్నాం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రకటనలన్నీ ఉత్తడొల్లేనని కొట్టిపారేశారు. జైరామ్ రమేశ్ ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని తేల్చిచెప్పారు. విపక్షాలు 272కి పైగా సీట్లు సాధిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందినవారు పెద్ద ఎత్తున ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి, బీజేపీకి సమర్పించుకున్నారని తెలిపారు. రూ.4,000 కోట్ల విలువైన బాండ్లకు రూ.4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులతో ప్రత్యక్షంగా సంబంధం ఉందన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నవారు కూడా ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీజేపీకి అందజేశారని వెల్లడించారు. ఇది ముమ్మాటికీ క్విడ్ ప్రో కో అని తేలి్చచెప్పారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన కాంట్రాక్టులను దక్కించుకున్న ఓ బీజేపీ ఎంపీ కూడా ఎలక్టోరల్ బాండ్లు కొన్నాడని వెల్లడించారు అవినీతిపై పోరాటం అంటూ ప్రధాని మోదీ చెబుతున్న మాటల్లో ఏమాత్రం పస లేదని జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు. -
Parliament Budget Session 2024: ఆత్మపరిశీలన చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలిగించే విపక్ష ఎంపీలు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రామ్ రామ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ప్రజాస్వామ్యంలో విమర్శ, ప్రతిపక్షం అనేవి చాలా అవసరం. అయితే నిర్మాణాత్మక ఆలోచనలతో సభను సుసంపన్నం చేసిన వారినే ప్రజలు గుర్తుంచుకుంటారు. అంతరాయం సృష్టించిన వారిని ఎవరూ గుర్తుంచుకోరు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగకుండా అనుక్షణం నిరసనలు, నినాదాలను సభా కార్యకలాపాలను స్తంభింపజేసిన ఆ విపక్ష పార్టీల సభ్యులు తమ ప్రవర్తనను ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు తమ పాత పంథాను విడనాడాలి. వాళ్లు తమ సొంత పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరిగినా పాత సెషన్లో వీరు చేసిన వీరంగాన్ని ఎవ్వరూ గుర్తుంచుకోరు‘ అని విపక్ష ఎంపీలను ప్రధాని తప్పుబట్టారు. ‘‘సాధారణంగా ఎన్నికల సమయంలో పూర్తి బడ్జెట్‌ను సమర్పించరు. మేము అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఈసారి మళ్లీ మేమే వస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసి పూర్తి బడ్జెట్‌ను మీ ముందుకు తెస్తాం. ఈసారి ఆర్థిక మంత్రి కొన్ని మార్గదర్శక అంశాలతో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు’ అని మోదీ ప్రకటించారు. ‘అభివృద్ధిలో దేశం అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తోంది. సమ్మిళిత, దేశ సర్వోతోముఖాభివృద్ధి ప్రయాణం ఆగదు’’ అని వ్యాఖ్యానించారు. -
India alliance: సీట్ల సర్దుబాటు కింద 11 స్థానాలిస్తాం
లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామి పారీ్టగా భావిస్తూ 11 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు ఇస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ శనివారం ప్రకటించింది. ఈ కేటాయింపుతో విపక్షాల కూటమిలో సీట్ల సర్దుబాటు పర్వానికి చక్కటి శుభారంభం లభించిందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ ఈ పంథా గెలుపు సమీకరణాలతో మరింత ముందుకెళ్తుంది. వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాల వర్గాల ఫార్ములాతో ఇండియా కూటమి చరిత్ర సృష్టించనుంది’’ అని అఖిలేశ్ అభిలíÙంచారు. ‘‘ కాంగ్రెస్‌కు ఇస్తామన్న సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోదు’’ అని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి స్పష్టంచేశారు. ‘‘ యూపీలో సీట్ల సర్దుబాటులో భాగంగా మేం కాంగ్రెస్‌కు 11, రా్రïÙ్టయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)కి ఏడు సీట్లు ఇస్తాం. మిగతా మొత్తం 62 స్థానాల్లో మేమే పోటీచేస్తాం’’ అని వివరించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ స్పందించారు. ‘‘ మిత్ర పక్షం ఎస్పీ చేసిన ప్రతిపాదనపై తుది నిర్ణయం కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని కమిటీ తీసుకోనుంది’ అని అన్నారు. -
Lok Sabha polls 2024: ఇండియా కూటమికి బీటలు
కోల్‌కతా/చండీగఢ్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని అధికార బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న విపక్షాల ప్రయత్నాలకు ఆదిలోని హంసపాదు! కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ‘ఇండియా’ కూటమికి భాగస్వామ్య పారీ్టలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం రెండు భారీ షాకులిచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. పంజాబ్‌లోనూ తమది ఒంటరి పోరేనని ఆప్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామంతో ఆ పార్టీ ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగింది. మమత లేని విపక్ష కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. తృణమూల్‌తో పొత్తు చర్చలింకా సాగుతున్నాయని, బెంగాల్లో కలిసే పోటీ చేస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ ఆ వ్యాఖ్యలను మమత నిర్ద్వంద్వంగా ఖండించారు. పొత్తుపై కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలూ జరగడం లేదని స్పష్టం చేశారు. ఈలోపే, సీట్ల కోసం తృణమూల్‌ను వేడుకోబోమంటూ కాంగ్రెస్ అగ్ర నేత, బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలు మరింతగా మంటలు రేపాయి. 28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీసే పరిణామమేనని అంటున్నారు. బెంగాల్లో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తూ ఉండబోదని మీడియాతో మమత కుండబద్దలు కొట్టారు. ఆ పార్టీ మొండి వైఖరి వల్లే ఒంటరి పోరు నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని స్పష్టం చేశారు. సీట్లు సర్దుబాటుపై తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలించను కూడా లేదని ఆమె ఆరోపించారు. అంతేగాక బెంగాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగనణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఆచరణసాధ్యం కాని డిమాండ్లు తమ ముందుంచినట్టు తృణమూల్ వర్గాలు మండిపడ్డాయి. ఆది నుంచీ అంతంతే... విపక్ష ఇండియా కూటమికి మమత దూరంగానే మెలుగుతూ వస్తున్నారు. ఇటీవలి వర్చువల్ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. బెంగాల్లో ఆగర్భ శత్రువులైన తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్ రెండూ ఇండియా కూటమి భాగస్వాములే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 42 స్థానాలకు గాను తృణమూల్ 22 సీట్లు నెగ్గగా బీజేపీ ఏకంగా 18 స్థానాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి పొత్తులో భాగంగా అవే రెండు సీట్లు కాంగ్రెస్‌కు ఇస్తామని మమత ప్రతిపాదించడంతో కాంగ్రెస్ అవాక్కైనట్టు చెబుతున్నారు. అన్ని తక్కువ స్థానాలతో సరిపెట్టుకునేందుకు ససేమిరా అనడంతో చిర్రెత్తుకొచి్చన దీదీ మొత్తానికే అడ్డం తిరిగారని సమాచారం. పొత్తులో భాగంగా లెఫ్ట్ ఫ్రంట్‌కు కూడా కొన్ని సీట్లు వదులుకోవాల్సి రావడం కూడా ఆమెకు రుచించలేదని తృణమూల్ వర్గాలు వివరించాయి. బెంగాల్లో 2001, 2011 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా తృణమూల్, కాంగ్రెస్ జట్టుగా పోటీ చేశాయి. పంజాబ్‌లో ఒంటరి పోరే సీఎం భగవంత్ మాన్ వెల్లడి పంజాబ్‌లో మొత్తం 13 సీట్లలోనూ ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని స్పష్టం చేశారు. నిజానికి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గోవా, గుజరాత్‌ల్లో పొత్తు దిశగా కాంగ్రెస్, ఆప్ మధ్య చర్చలింకా జరుగుతూనే ఉన్నాయి. పైగా త్వరలో జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాన్ ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఆ పార్టీతో పొత్తు ప్రతిపాదనను పంజాబ్ ఆప్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారని మాన్ మీడియకు స్పష్టం చేశారు. మొత్తం 13 లోక్‌సభ స్థానాలకూ ఆప్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే చురుగ్గా సాగుతోందని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 13 స్థానాలకు గాను కాంగ్రెస్ 8 నెగ్గింది. అకాలీదళ్, బీజేపీ చెరో రెండు, ఆప్ ఒక స్థానంలో గెలిచాయి. కూటమిపై ఎవరికీ పెత్తనముండదు మమత నర్మగర్భ వ్యాఖ్యలు బెంగాల్లో పొత్తు లేకపోయినా జాతీయ స్థాయిలో మాత్రం విపక్ష ఇండియా కూటమికి తృణమూల్ కట్టుబడి ఉంటుందని మమత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘కావాలంటే కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా 300 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయమనండి. మిగతా 243 స్థానాల్లో ప్రాంతీయ పారీ్టలు బరిలో దిగుతాయి. కానీ బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ వేలు పెడతానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు’’ అంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. జాతీయ స్థాయిలో విపక్షాల వ్యూహం ఎలా ఉండాలో కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామని చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీని సమష్టిగా ఎదుర్కొనే విషయంలో ప్రాంతీయ పారీ్టలన్నీ ఒక్కతాటిపై ఉంటాయి. దాన్ని ఓడించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాం’’ అని స్పష్టం చేశారు. అయితే, విపక్ష కూటమి ఏ ఒక్క పారీ్టకో చెందబోదంటూ కాంగ్రెస్‌పై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్ర శుక్రవారం బెంగాల్లోకి ప్రవేశించనున్నా కనీసం మర్యాద కోసమన్నా దానిపై కాంగ్రెస్ తనకు సమాచారం కూడా ఇవ్వలేదని దీదీ ఆరోపించారు. మమత ప్రకటన బహుశా ఇండియా కూటమి వ్యూహంలో భాగమై ఉండొచ్చని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ (శరద్ పవార్) అభిప్రాయపడింది! -
సీఎం మీద గెలిస్తే జెయింట్ కిల్లరే!
సీఎం కేసీఆర్.. ఈ సార్‌తో ఎన్నికల్లో పోటీ అంటే.. అస్స లు మామూలు విషయం కాదు.. ఎప్పుడో నలభై ఏళ్ల కిందట ఒకే ఒక్కసారి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన ఈయన ఆ తర్వాత.. ఇన్ని దశాబ్దాలుగా ఎంపీగా పోటీ చేసినా.. ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలుపు గుర్రంపై స్వారీ చేస్తూనే ఉన్నారు. రికార్డు మెజారిటీలు సాధిస్తూనే ఉన్నారు. అలాంటి కేసీఆర్‌పై తొలిసారి ఈ దఫా సీరియస్‌గా పోటీకి దిగుతున్నాయి ప్రతిపక్షాలు. ఓ రకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ క్రమంలోనే గజ్వేల్‌లో కేసీఆర్‌పై బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తుంటే... కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బరిలో నిలిచారు. ఇద్దరికిద్దరూ కేసీఆర్‌ను ఓడిస్తామనే చెబుతున్నారు. ఒకవేళ ఓడిపోయినా.. పోయేదేం లేదు... సీఎం మీద పోటీ చేశాడు అనే పేరొస్తది. కానీ ఏమో గుర్రం ఎగరావచ్చు తరహాలో గెలిస్తే... జెయింట్ కిల్లర్ అనే ట్యాగ్‌లైన్ ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల్లో ఇదే అంశం చర్చనీయాంశమైంది. గజ్వేల్, కామారెడ్డిల్లో సీఎంపై గెలిచి.. ఒకవేళ ఆ గెలిచిన వాళ్ల పార్టీనే అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా కూడా ముందు వరుసలో ఉండొచ్చనే దూరాలోచన కూడా పోటీకి కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ సారి చరిత్ర చూస్తే తెలంగాణలో ముఖ్యమంత్రిపై పోటీ చేసి గెలిచి జెయింట్ కిల్లర్‌గా పేరు పొందిన చరిత్ర మహబూబ్‌నగర్‌కు చెందిన చిత్తరంజన్ దాస్‌కు ఉంది. 1989 సాధారణ ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గుడివాడ, హిందూపురంతో పాటు తెలంగాణలోని కల్వకుర్తి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాగా ఎన్టీ రామారావుపై గెలిచిన చిత్త రంజన్‌దాస్ ముఖ్యమంత్రి కాకపోయినా... కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈటల రాజేందర్, రేవంత్‌రెడ్డిల పరిస్థితి ఏంటో డిసెంబర్ 3న తేలుతుంది. -
‘ఇండియా’ కూటమిలోనే ఉంటాం: కేజ్రివాల్
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి తాము బయటకు వచ్చే ప్రసక్తే లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రివాల్ తేలి్చచెప్పారు. ఇండియా కూటమిలోనే భాగస్వామిగా ఉంటామని చెప్పారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. విపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యరి్థగా మీ పేరును ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించగా... తామే ప్రధానమంత్రి అని దేశంలోని 140 మంది భారతీయులు భావించేలా ఒక వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరం ఉందని కేజ్రివాల్ బదులిచ్చారు. కేవలం ఒక వ్యక్తిని కాదని, పౌరులందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పారు. -
భోపాల్‌లో ‘ఇండియా’ మొట్టమొదటి ర్యాలీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి తమ మొట్టమొదటి బహిరంగసభను వచ్చే నెలలో భోపాల్‌లో నిర్వహించనుంది. అదేవిధంగా, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీకి సంబంధించిన చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించనుంది. ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం బుధవారం ఢిల్లీలో జరిగింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కమిటీలోని 14 మంది సభ్యులకు గాను 12 మంది హాజరయ్యారు. సనాతనధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అనంతరం మాట్లాడుతూ, విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంతో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భేటీకి రాలేదని చెప్పారు. హాజరైన వారిలో..ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, సీపీఐ నేత డి.రాజా, ఎస్పీ నుంచి జావెద్ అలీ ఖాన్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, జేడీయూకు చెందిన సంజయ్ ఝా, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ ఉన్నారు. ‘సీట్ల పంపకాల ప్రక్రియను ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. భాగస్వామ్య పక్షాలు చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా సీట్ల పంపణీని ఖరారు చేయాలి.. కూటమి ఉమ్మడి సమావేశాలను దేశవ్యాప్తంగా చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటి సభను అక్టోబర్ మొదటి వారంలో భోపాల్‌లో చేపట్టాలని అంగీకారానికి వచ్చారు. బీజేపీ పాలనలో పెరిగిన అవినీతి, నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం ప్రధాన ఎజెండాగా ఈ సభలు జరుగుతాయి’అని కమిటీ ఉమ్మడి ప్రకటనను వేణుగోపాల్ చదివి వినిపించారు. మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్‌ల్లో సీట్ల పంపకం సులువుగా కనిపిస్తుండగా, పంజాబ్, ఢిల్లీ, పశి్చమబెంగాల్ల్లో మాత్రం భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా’ బీజేపీని ఓడిస్తుంది: అఖిలేశ్
లక్నో: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’అధికార బీజేపీని ఓడిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ పార్టీతోపాటు మిత్ర పక్షాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘దేశం మార్పును కోరుకుంటోంది. 2024లో బీజేపీని ఇండియా ఓడించనుంది. సమాజ్‌వాదీ పార్టీ, మిత్రపక్షాలు ఎన్నికలు ముందొచ్చినా, తర్వాత వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి’అని మీడియాతో అన్నారు. -
నేటి నుంచే... ‘ఇండియా’ మూడో భేటీ
ముంబై: జాతీయ స్థాయిలో అధికార బీజేపీకి ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకున్న విపక్ష ‘ఇండియా’ కూటమి రెండు రోజుల కీలక సమావేశం మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం ప్రారంభం కానుంది. గ్రాండ్ హయత్ హోటల్లో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు 27 పార్టీలకు పైగా హాజరు కానున్నట్టు చెబుతున్నారు. కూటమి లోగోను, సమన్వయ కమిటీని ప్రకటించనున్నారు. కూటమి పక్షాలు అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడంతోపాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదా తయారీకి కొన్ని కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉమ్మడి కార్యక్రమాలు, సీట్ల పంపకం కోసం కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించనున్నారు. భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయం కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఒక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసుకోనున్నారు. దీనిపై ముంబై భేటీలో ప్రకటన చేసే అవకాశం ఉంది. కూటమి సమన్వయకర్త, లేదా చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవడం గురించి కూడా చర్చ జరగనుంది. తిరోగమన విధానాలు అమలు చేస్తున్న అధికార ఎన్డీయేకు ప్రగతిశీల ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తీసుకొస్తూ స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ముంబై భేటీలో ఖరారు చేయనున్నట్లు ఆర్జేడీ నేత మనోజ్ ఝా చెప్పారు. ’బీజేపీ వెళ్లిపో’ నినాదం ఇండియా కూటమిలో ప్రస్తుతం 26 పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ముంబై భేటీ సందర్భంగా మరిన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చి చేరనున్నట్లు కూటమి నాయకులు చెబుతున్నారు. ఇండియా తొలి రెండు సమావేశాలు పాట్నా, బెంగళూరుల్లో జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో గురువారం నుంచి జరుగనున్న మూడో భేటీకి హాజరయ్యేందుకు ఇప్పటికే వివిధ పార్టీల నాయకులు నగరానికి చేరుకున్నారు. ఈ భేటీ వేదిక నుంచి ’బీజేపీ చలే జావ్’ (బీజేపీ వెళ్లిపో) అనే నినాదం ఇవ్వబోతున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే చెప్పారు. ప్రధానమంత్రికి పదవికి అర్హులైన నాయకులు తమ కూటమిలో చాలామంది ఉన్నారని తెలిపారు. వారిలో శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని అన్నారు. ఇండియా పక్షాల నడుమ ‘కెమిస్ట్రీ’ మెరుగుపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మిలింద్ దేవ్రా వ్యాఖ్యానించారు. తమ కూటమిలో సీట్ల పంపకం రాష్ట్రాల స్థాయిలోనే జరుగుతుందని వివరించారు. కన్వీనర్‌గా నితీశ్! ఇండియా కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇండియా కన్వీనర్‌గా బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నాయకుడు నితీశ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కూటమి ఏర్పాటు వెనుక తనకు వ్యక్తిగత అ జెండా గానీ, ఆకాంక్షలు గానీ లేవని, కన్వీనర్ పోస్టుపై తనకు ఆసక్తి లేదని ఆయన ప్రకటించినప్పటికీ ఊహాగానాలు ఆగడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టే నేత నితీశ్‌కుమార్ మాత్రమేనని అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ పేరును మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. ఆ పదవి పట్ల ఆమె విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కన్వీనర్‌గా ఎవరుండాలో గురువారమే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. -
‘మణిపూర్’పై పార్లమెంట్లో అలజడి
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ బుధవారం పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. లోక్‌సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. వెంటనే విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని మణిపూర్ అంశంపై నినాదాలు ప్రారంభించారు. ప్రధాని సభకు రావాలని డిమాండ్ చేశారు. ఇంతలో స్పీకర్ ‘క్విట్ ఇండియా’ ఉద్యమకారులకు సభలో నివాళులరి్పంచారు. 1942 ఆగస్టు 9న జరిగిన ఈ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఆ త్యాగమూర్తులను ప్రజలంతా స్మరించుకోవాలని అన్నారు. అనంతరం విపక్ష ఎంపీలు మళ్లీ నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు కోరినా వారు లెక్కచేయలేదు. విపక్ష ఎంపీల ఆందోళన మధ్యే స్పీకర్ 45 నిమిషాలపాటు ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. సభలో గందరగోళం ఆగకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది. రాజ్యసభలో రెండు బిల్లులకు ఆమోదం మణిపూర్ హింసాకాండ వ్యవహారం రాజ్యసభలోనూ అలజడి సృష్టించింది. 267 నిబంధన కింద వెంటనే చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల కారణంగా సభను తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు, తర్వాత 2.45 గంటల దాకా, అనంతరం 3.15 గంటల దాకా వాయిదా వేయాల్సి వచి్చంది. బుధవారం సభలో రాజ్యాంగం(òÙడ్యూల్డ్ కులాలు) ఆర్డర్(సవరణ) బిల్లు–2023పై చర్చ జరిగింది. బిల్లును సభలో ఆమోదించారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనల కోసం నిధులు సమకూర్చడానికి ఉద్దేశించిన ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు–2023’ని సైతం రాజ్యసభలో ఆమోదించారు. ఈ బిల్లు వర్సిటీల్లో సానుకూల మార్పు తీసుకొస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసినవారికి రాజ్యసభలో నివాళులరి్పంచారు. వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. -
నిండు సభలో.. మహిళా మంత్రికి ముద్దులా?
న్యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్ల్లయింగ్ కిస్‌లు బుధవారం పెను వివాదానికి దారి తీశాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతుండగా అధికార సభ్యుల కేసి ఆయన ముద్దులు విసిరారు. రాహుల్‌కి ఉన్న మహిళా విద్వేషానికి ఇది నిదర్శనమని బీజేపీ దుమ్మెత్తిపోయగా, అధికార పార్టీ రాహుల్ ఫోబియాతో బాధ పడుతోందంటూ కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది. రాహుల్‌పై అత్యంత కఠిన చర్య తీసుకోవాలంటూ బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ బిర్లాకు ఫిర్యాదుచేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాహుల్ తీరును తూర్పారబట్టారు. మొత్తంమ్మీద అనర్హత వేటు తర్వాత సభలో అడుగుపెట్టిన తర్వాత రాహుల్‌గాంధీ చేసిన సైగలతో రేగిన దుమారం కొద్దిరోజులపాటు పార్లమెంట్‌ను కుదిపేసేలా కనిపిస్తోంది. సభలోనే కన్ను కొట్టిన చరిత్ర రాహుల్‌ది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి లోక్‌సభలో రాహుల్ అసభ్యకర సైగలు చేశారంటూ స్పీకర్‌కు బీజేపీ లిఖితపూర్వక ఫిర్యాదుచేసింది. మంత్రులు శోభా కరంద్లాజే, దర్శన జర్దో‹Ùతోపాటు 20 మందికిపైగా బీజేపీ మహిళా ఎంపీలు దానిపై సంతకం చేశారు. ‘ రాహుల్ చేసిన దిగజారుడు పని సభలోని మహిళా సభ్యులను తీవ్రంగా అవమానించింది. అంతేకాదు, లోక్‌సభలో గౌరవానికి కూడా భంగం కలిగింది. అందుకే ఆయనపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుమ్మెత్తిపోశారు. ఒక సభ్యుడు నిండు సభలో ఇంత బాహాటంగా స్త్రీ విద్వేషం ప్రదర్శించిన ఉదంతం పార్లమెంట్ చరిత్రలోనే ఎన్నడూ లేదని మహిళా బీజేపీ ఎంపీ అన్నారు. గాంధీ కుటుంబీకులు పాటించే విలువలకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇలాంటి దిగజారుడు ప్రవర్తనకుగాను రాహుల్‌కు తగిన శిక్ష పడి తీరాలని డిమాండ్ చేశారు. ఇరానీ ప్రసంగం వినాల్సిందిగా బీజేపీ సభ్యులు కోరినందుకు రాహుల్ వారివైపు రెండు మూడు అడుగులు వేసి మరీ ఫ్లైయింగ్ కిస్సులు విసిరారని శోభా కరంద్లాజే ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీలు చూసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనూ లోక్‌సభలో కన్ను కొట్టిన చరిత్ర రాహుల్‌కు ఉందని ఎంపీలు గుర్తుచేశారు. ఆయన ప్రవర్తనలోనే ఏదో లోపముందని అభిప్రాయపడ్డారు. మణిపూర్‌పై చర్చ తప్పించుకునేందుకే: కాంగ్రెస్ లోక్‌సభలో రాహుల్ ఫ్ల్లయింగ్ కిస్సులను కాంగ్రెస్ గట్టిగా సమరి్థంచుకుంది. ఆయన మహిళలను ఎప్పటికీ అగౌరవపరచజాలరని పార్టీ స్పష్టంచేసింది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో చర్చ జరగడం అధికార పారీ్టకి అస్సలు ఇష్టం లేదంటూ ఎదురుదాడికి దిగింది. అందుకే రాహుల్‌పై ఇలా తప్పుడు ఆరోపణలకు బరితెగించిందని ఆరోపించింది. బీజేపీకి, స్మృతి ఇరానీకి రాహుల్ ఫోబియా పట్టుకుందని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ముద్దులు.. ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనమని ఆయన చేసిన భారత్ జోడో యాత్రను చూసిన వారందరికీ తెలుసు అని కాంగ్రెస్ పారీ్టప్ర«దాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గుర్తుచేశారు. రాహుల్ చర్య ఆప్యాయత చిహ్నమేనని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది వ్యాఖ్యానించారు. ‘అప్పట్లో రాహుల్ ప్రేమ దుకాణం అన్నారు. ఇదీ అలాంటి సదుద్దేశంతో కూడిన సైగ మాత్రమే’ అని స్పష్టంచేశారు. -
‘ఇండియా’ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ!
పట్నా: 26 పార్టీలతో కూడిన విపక్ష ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ నేత సోనియా గాందీ, కన్వినర్‌గా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరుగనుంది. కూటమికి చెందిన 11 మంది సభ్యుల సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా సోనియా గాం«దీని, కన్వినర్‌గా నితీశ్ కుమార్‌ను ఈ సమావేశాల్లో ఎన్నుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
కుటుంబ పాలన.. ‘క్విట్ ఇండియా’
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టేందుకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమ స్ఫూర్తితో భారత్ యావత్తూ ముందుకొస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్షంలోని ఓ వర్గం తాము పనిచెయ్యం, ఇతరులను పనిచెయ్యనివ్వబోమన్న ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇది నిజంగా దురదృష్టకరమైన పరిస్థితి అని వాపోయారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధునాతన పార్లమెంట్ భవనం నిర్మించామని, ప్రజాస్వామ్యానికి అదొక చిహ్నమని, ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి అది ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. అలాంటి పార్లమెంట్‌ను సైతం విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, అందులోకి అడుగుపెట్టేందుకు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు. కర్తవ్యపథ్‌ను అభివృద్ధి చేయడాన్ని కూడా వ్యతిరేకించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పారీ్టలు కేవలం ఎన్నికల సమయంలోనే సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్‌ను స్మరిస్తాయని, తాము గుజరాత్లో అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. గత 70 ఏళ్లలో మన అమర జవాన్ల కోసం కనీసం యుద్ధ స్మారకాన్ని కూడా నిర్మించలేదని కాంగ్రెస్ పారీ్టపై పరోక్షంగా ధ్వజమెత్తారు. తాము నిర్మిస్తే నిస్సిగ్గుగా బహిరంగంగా విమర్శలు చేశాయని దుయ్యబట్టారు. దేశ ప్రగతికి రెక్కలు తొడుగుతున్న యువత ప్రతికూల రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దేశ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని, ఓటు బ్యాంకు రాజకీయాలను, పార్టీ రాజకీయాలను లెక్కచేయకుండా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రస్తుతం రోజ్‌గార్ మేళా కొనసాగుతోందన్నారు. దేశంలో మార్పు మొదలైందని, దేశ అభివృద్ధితో యువతకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. దేశ ప్రగతికి మన యువత కొత్త రెక్కలు తొడుగుతున్నారని ప్రశంసించారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఈ నెల 9న జరిగే ‘క్విట్ ఇండియా’ వార్షికోత్సవాన్ని మోదీ ప్రస్తావించారు. ఇదొక చరిత్రాత్మక దినం అని చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇచి్చన రోజు అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశమంతా క్విట్ ఇండియా అంటూ బిగ్గరగా నినదిస్తోందని వివరించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు వంటివి దేశం వదిలి వెళ్లిపోవాలని ఆకాంక్షిస్తోందని వ్యాఖ్యానించారు. గత ఏడాది లాగే ఈసారి కూడా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సదుపాయాలు పెరగడం, జీవనం సులభతరం కావడంతో దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య మరింత పెరిగిందని వివరించారు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసినవారి సంఖ్య ఈ ఏడాది 16 శాతం పెరిగిందన్నారు. ‘అమృత్‌భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ది కోసం మోదీ శంకుస్థాపన చేయగా, వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 55, తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 18 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. -
Parliament Monsoon Session: అదే ప్రతిష్ఠంభన!
న్యూఢిల్లీ: పార్లమెంటులో మణిపూర్ ప్రతిష్టంభన వీడకపోగా గురువారం పీటముడి మరింతగా బిగుసుకుంది. ఈ విషయమై విపక్షాలను అనునయించేందుకు గురువారం అధికార బీజేపీ ఒక మెట్టు దిగినా లాభం లేకపోయింది. లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రతిపక్ష నేతలతో కేంద్రం తరఫున రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్, మరో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అరగంటకు పైగా చర్చలు జరిపారు. కానీ తమ డిమాండ్లపై పట్టు వీడేందుకు విపక్షాలు ససేమిరా అన్నాయి. మణిపూర్ హింసాకాండపై ప్రధాని ఉభయ సభల్లోనూ ప్రకటన చేయడంతో పాటు పార్లమెంటులో లోతైన చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. దాంతో చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. 267 నిబంధన కింద ఈ అంశంపై చర్చకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినా, ప్రధాని ప్రకటన డిమాండ్‌కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదని పట్టుదలగా ఉంది. అంతగా అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని చెబుతోంది. చివరికి కేంద్రం మరింత దిగొచ్చి మణిపూర్‌పై 176 నిబంధన కింద ఆగస్టు 11న రాజ్యసభలో స్వల్ప వ్యవధి చర్చకు సిద్ధమని ప్రతిపాదించింది. విపక్ష ఇండియా కూటమి మాత్రం 267, 176 నిబంధనల్లో దేని కిందా చర్చకు ఒప్పుకునేది లేదంటోంది. ‘‘నిబంధనతో మాకు నిమిత్తం లేదు. ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యమైన నిబంధన కింద పూర్తిస్థాయి చర్చ మాత్రం జరిగి తీరాల్సిందే’’ అని డిమాండ్ చేస్తోంది. మణిపూర్‌పై ఏదోలా పార్లమెంటులో చర్చ జరిగి ప్రతిష్టంభనకు తెరపడవచ్చంటున్నారు. తాము ప్రతిపాదించిన మధ్యేమార్గానికి మోదీ సర్కారు అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్టు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చెప్పారు. -
Manipur violence: మోదీ నోరు విప్పాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు తమ డిమాండ్‌పై మెట్టు దిగడం లేదు. ఫలితంగా లోక్‌సభ, రాజ్యసభలో ఆందోళనలు, నినాదాలు, నిరసనలు, వాయిదాలు నిత్యకృత్యంగా మారాయి. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు తొమ్మిదో రోజు బుధవారం సైతం ఉభయ సభలను స్తంభింపజేశారు. సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలుగుతుండడంతోపాటు విపక్ష, అధికారపక్ష సభ్యుల తీరుతో కలత చెందిన స్పీకర్ ఓం బిర్లా బుధవారం లోక్‌సభకు రాలేదు. సభా గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ ఆరాటపడుతున్నారని, సభ్యుల నుంచి సహకారం లభించక కలతతో సభకు హాజరు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సమాధానం చెబుతా: అమిత్ షా లోక్‌సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. స్పీకర్ ఓం బిర్లా రాకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, ప్యానెల్ స్పీకర్ మిథున్‌రెడ్డి సభాపతి స్థానంలో కూర్చొని ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెంటనే విపక్ష ఎంపీలు మణిపూర్ అంశాన్ని లేవనెత్తారు. నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో గందరగోళం నెలకొనడంతో ప్యానల్ స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు ప్రారంభించారు. మణిపూర్ అంశంపై చర్చ ప్రారంభిద్దామని, తాము సమాధానం చెబుతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదించగా, విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానమంత్రి రావాల్సిందేనని పట్టుబట్టారు. ఈసారి సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకీ సభకు సహకరించాలంటూ పదేపదే కోరినా వారు వినిపించుకోలేదు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు కిరీట్ సోలంకీ ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సులే స్పీకర్‌తో సమావేశమైనట్లు తెలిసింది. మోదీని ఆదేశించలేను: ధన్‌ఖఢ్ మణిపూర్ హింసపై రూల్ 267 కింద సభలో చర్చ చేపట్టాలంటూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. వాటిని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చెప్పడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. మణిపూర్‌లో కనీవినీ ఎరుగని హింస జరుగుతోందని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ౖవిపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం చెప్పారు. ఈ దీనిపై మోదీ ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీశారు. ప్రధాని రావాలనుకుంటే రావొచ్చని, రావాలంటూ ఆదేశించలేనని తేలి్చచెప్పారు. మణిపూర్ వ్యవహారంపై రూల్ 176 కింద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయినా ప్రతిపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. సభనుంచి వాకౌట్ చేశారు. ఖర్గే, శరద్ పవార్‌తో ధన్‌ఖడ్ భేటీ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో పార్లమెంట్‌లోని తన చాంబర్లో సమావేశమయ్యారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో జరుగుతున్న విపక్షాల రగడపై చర్చించారు. సభా సజావుగా సాగేలా సహకారం అందించాలని కోరారు. ‘మణిపూర్’పై ప్రకటన చేసేలా మోదీని ఆదేశించండి 31 మంది ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు బుధవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. మణిపూర్ హింసపై పార్లమెంట్లో ప్రకటన చేసేలా ప్రధాని మోదీని ఆదేశింంచాలని కోరుతూ వినతి పత్రం సమరి్పంచారు. హింసకు స్వస్తి పలికి, సోదరభావాన్ని పెంచుకోవాలని ప్రధానే స్వయంగా ప్రజలకు పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. హరియాణా ఘర్షణలను కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. మణిపూర్‌పై చర్చ విపక్షాలకు ఇష్టం లేదని, అందుకే సభ జరగకుండా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆరోపించారు. -
Parliament sessions 2023: పార్లమెంట్లో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో తక్షణమే చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు పునరుద్ఘాటించాయి. సోమవారం ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి. సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు ఆమోదం లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తర్వాత స్పీకర్ బిర్లా మాట్లాడారు. వెంటనే విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. విద్యా, ఆర్థిక శాఖలకు చెందిన ప్రశ్నలపై చర్చ మొదలైంది. ‘మీ స్థానాల్లోకి తిరిగి వెళ్లండి, సభకు సహకరించండి’ అని స్పీకర్ పదేపదే కోరినా విపక్ష సభ్యులు లెక్కచేయలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. లోక్‌సభ పునఃప్రారంభమైన తర్వాత సినిమాటోగ్రఫీ (సవరణ) బల్లు–2023ను ఆమోదించారు. ఈ బిల్లు రాజ్యసభలో గతంలోనే ఆమోదం పొందింది. పైరసీని అరికట్టడానికి ఈ బిల్లును తీసుకొచ్చినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రతిపక్ష ఎంపీల ఆందోళన, నినాదాలు కొనసాగుతుండడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలో వాయిదాల పర్వం మణిపూర్ అంశంపై ‘267 నిబంధన’ కింద వెంటనే చర్చ చేపట్టాలని ఎగువసభలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జోషి చెప్పారు. విపక్ష ఎంపీలు ప్రధాని సమాధానం చెప్పాలని పునరుద్ఘాటించారు. దీంతో సభను చైర్మన్ ధన్‌ఖడ్ పలుమార్లు వాయిదా వేశారు. తొలుత ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం 2 గంటల దాకా, తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల దాకా, అనంతరం 3.30 గంటల వరకూ వాయిదా వేశారు. విపక్షాలు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. మూడింట రెండొంతుల మెజార్టీ: పీయూష్ గోయల్ కేంద్రానికి లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఉందని, ఈ విషయం అందరికీ తెలుసని కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ చెప్పారు. సంఖ్యలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్నారు. మెజార్టీని నిరూపించుకున్న తర్వాతే బిల్లులను ఆమోదించాలన్న నిబంధన ఏదీ లేదని పేర్కొన్నారు. అవిశ్వాసం తీర్మానంపై ఎప్పుడు చర్చ చేపట్టాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారని వివరించారు. చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తేలి్చచెప్పారు. అలాగే మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగే యూపీఏ ప్రభుత్వ హయాంనాటి నిర్వాకాలు బయటపడతాయన్న భయంతో కాంగ్రెస్ పార్టీ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని పీయూష్ గోయల్ మండిపడ్డారు. -
పట్టువీడని విపక్షాలు
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే పార్లమెంట్లో సమాధానం చెప్పాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మణిపూర్‌లో అమాయకులు బలైపోతున్నా ప్రధానమంత్రి ఎందుకు నోరువిప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విపక్ష ఎంపీలు శుక్రవారం సైతం పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనకు దిగారు. అలాగే మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో తక్షణమే చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉభయసభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. కార్యకలాపాలేవీ జరగకుండానే లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో 3 బిల్లులకు ఆమోదం లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పదేపదే విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. 1978 మే 10న కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వెంటనే చర్చ జరిగిందని కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి గుర్తుచేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందిస్తూ.. ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నడుచుకుంటుందని, అవిశ్వాస తీర్మానంపై 10 రోజుల్లోగా చర్చ చేపట్టవచ్చని తేలి్చచెప్పారు. సంఖ్యా బలం ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గందరగోళం మధ్యే పలు బిల్లులను సభ ఆమోదించింది. ఇదేమన్నా స్టేజీయా: చైర్మన్ ఆగ్రహం మణిపూర్ తదితర అంశాలపై చర్చకు రాజ్యసభలోనూ విపక్షాలు పట్టుబట్టాయి. 47 మంది ఎంపీలు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నోత్తరాల ప్రాధాన్యతను వివరిస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ జోక్యం చేసుకున్నారు. అది తమకు తెలుసని, మణిపూర్ హింసపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. దాంతో, ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి ఇది నాటక రంగం కాదని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఓబ్రెయిన్ బల్లపై చేతితో గట్టిగా కొడుతూ అరిచారు. ఆయన తీరును తప్పుబడుతూ సభను చైర్మన్ సోమవారానికి వాయిదా వేశారు. -
Manipur violence: ఆరని మంటలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో మణిపూర్ హింసాకాండ మంటలు కొనసాగుతున్నాయి. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే సమాధానం ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా మూడో రోజూ సోమవారం సైతం ఇదే అంశంపై విపక్షాలు ఉభయ సభలను అడ్డుకున్నాయి. దీంతో పలుమార్లు సభలను వాయిదా వేయాల్సి వచి్చంది. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్ వ్యవహారం రాజ్యసభను మరింత వేడెక్కించింది. డిమాండ్‌పై వెనక్కి తగ్గని విపక్షాలు మణిపూర్ ఘటనలపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు లోక్‌సభలో సోమవారం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా విపక్ష ఎంపీలు తమ స్థానాల్లోంచి లేచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ ఓంబిర్లా స్పందిస్తూ.. దీనిపై సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే కేంద్రం తరఫున ఎవరూ సమాధానమివ్వాలో మీరు ఆదేశించలేరని అన్నారు. ఇదే సమయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నా«థ్ సింగ్ మాట్లాడుతూ.. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోగా మరింత తీవ్రస్వరంతో నినాదాలు చేశారు. ‘ఇండియా ఫర్ మణిపూర్’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీలు కూడా ఎదురుదాడికి దిగారు. పశి్చమ బెంగాల్, రాజస్తాన్‌లో మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నినాదాల హోరు ఆగకపోవడంతో కొద్దిసేపటికే సభను మధ్యాహ్నం 12 గంటల దాకా, ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల దాకా.. అనంతరం మంగళవారానికి వాయిదా వేశారు. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు–2023, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కమిషన్ బిల్లు–2023, కానిస్టిట్యూషన్(ఎస్సీలు) ఆర్డర్(సవరణ) బిల్లు–2023ని కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. సంజయ్ సింగ్ సస్పెన్షన్ మణిపూర్ హింసపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకూ సభ వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా ఆందోళన కొనసాగించారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న ‘ఆప్’ ఎంపీ సంజయ్ సింగ్ తీరుపై చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీంతో సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. దీనిని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో వర్షాకాల సమావేశాల్లో సభ జరిగే మిగిలిన దినాలకు సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ‘ఆప్’ ఎంపీని సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో సభను చైర్మన్ వాయిదా వేశారు. ఆ తర్వాత అన్ని పారీ్టల సభాపక్ష నేతలతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభ సక్రమంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో సజావుగా చర్చ జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని హోంమంత్రి అమిత్ అన్నారు. ఆయన సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. మణిపూర్ అంశంలో నిజాలు బయటకు రావాల్సిందేనని, వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. పార్లమెంట్ వెలుపల నిరసన మణిపూర్‌లో మహిళలపై అకృత్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ సమగ్ర ప్రకటన చేయాలని ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ పార్లమెంట్ ఆవరణలో సోమవారం ఆందోళన చేపట్టింది. ‘మణిపూర్ కోసం భారత్’, ‘భారత్ డిమాండ్ మణిపూర్’ అని రాసి ఉన్న ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకుని ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేశారు. -
Manipur Violence: పార్లమెంటు ఆవరణలో రేపు విపక్షాల నిరసన
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రతిష్టంభన నెలకొనడంతో సభ వెలుపల నిరసనల ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించాయి. సోమవారం పార్లమెంటు ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగనున్నాయి. ఈ మేరకు ఇండియా కూటమికి చెందిన పార్టీల ఎంపీలు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో సభలో అనుసరించే వ్యూహాలపై చర్చిస్తారు. సభ లోపలికి వెళ్లడానికి ముందు ప్రధాని ప్రకటనపై డిమాండ్ చేస్తూ మహాత్మగాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగనున్నారు. మరోవైపు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే మణిపూర్ అంశంలో చర్చ లేవెనెత్తాలని టీఎంసీ డిమాండ్ చేసింది. బీజేపీ సభ్యులే సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్నారని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒ బ్రియన్ మండిపడ్డారు. ఆ రాష్ట్రాలపై పెదవి విప్పరెందుకు: బీజేపీ ప్రతిపక్ష పారీ్టలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలపై అకృత్యాలు జరుగుతున్నా ఎవరూ నోరు ఎందుకు మెదపడం లేదని బీజేపీ ప్రశ్నించింది. రాజస్తాన్, పశి్చమ బెంగాల్, బిహార్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై నేరాలు, ఘోరాలు జరుగుతూ ఉంటే, మణిపూర్ చుట్టూ ప్రతిపక్ష పారీ్టలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. -
మిషన్ 2024.. పట్నాలో నేడే విపక్షాల సమావేశం
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 20 ప్రతిపక్ష పార్టీలతో పట్నాలో శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరు వంటి అంశాల జోలికి పోకుండా ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేలా వ్యూహరచన చేయనున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, హేమంత్ సోరెన్‌లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి అగ్ర నాయకులు హాజరుకానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తారు. ఈ సమావేశం మొట్టమొదటిది కావడంతో అత్యంత సంక్లిష్టమైన ప్రధాని అభ్యర్థి, సీట్ల సర్దుబాటు వంటి అంశాల జోలికి పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చి మోదీపై పోరుబాట పట్టే వ్యూహాలు రచించనున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారమే పట్నాకి చేరుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ని కలుసుకున్న ఆమె బీజేపీని తాము ఉమ్మడిగా ఒక కుటుంబంలా ఎదుర్కొంటామన్నారు. ఇలా విపక్ష పార్టీలన్నీ ఏకం కావడం శుభారంభమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటమ్ విపక్ష పార్టీల సమావేశానికి ఒక్క రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల్నిపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాటంలో తమకు మద్దతుగా నిలవకపోతే విపక్ష పార్టీల సమావేశాన్ని బహిష్కరిస్తామని అల్టిమేటమ్ ఇచ్చింది. -
India new parliament building: ప్రారంభ ‘గౌరవం’పై.. పెను దుమారం
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ తీవ్ర రూపు దాలుస్తోంది. కొత్త భవన ప్రారంభోత్సవం ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుండటం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగాధిపతి, దేశాధిపతి, ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని కాదని ప్రధాని ఎలా ప్రారంభిస్తారంటూ ముక్త కంఠంతో ఆక్షేపిస్తున్నాయి. భవనాన్ని ప్రారంభించాల్సిందిగా మోదీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆహ్వానించడంపై మండిపడుతున్నాయి. అంతేగాక వి.డి.సావర్కర్ వంటి హిందూత్వవాది జయంతి రోజునే ప్రారంభోత్సవం జరపనుండటాన్ని కూడా విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని ఒకే వర్గానికి పరిమితయ్యే రోజున చేయనుండటం తప్పేనని వాదిస్తున్నాయి. దాంతో ఈ వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. చివరికి పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్‌తో సహా ఏకంగా 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించే దాకా వెళ్లింది. 2024 లోక్‌సభ ఎన్నికలు అంతకంతకూ సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీపై నిర్ణాయకమైన సమైక్య పోరుకు పార్లమెంటు భవనం అంశంతోనే శ్రీకారం చుట్టే యోచనలో విపక్షాలున్నట్టు కనిపిస్తోంది. మొత్తమ్మీద జాతీయ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకునే వాతావరణం కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది ముందే ఎన్నికల వేడి రాజుకుంటోందనేందుకు దీన్ని స్పష్టమైన సూచికగా భావిస్తున్నారు. ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి..? పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. అవేమంటున్నాయంటే... ► ఆర్టికల్ 79 ప్రకారం ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి కలిస్తేనే పార్లమెంటు. ► సాధారణంగా అంతా రబ్బరు స్టాంపుగా పరిగణించే భారత రాష్ట్రపతి పదవికి రాజ్యాంగం అంతటి ప్రాధాన్యం కట్టబెట్టింది. ► ఉభయ సభలకు అధిపతి గనుక దేశ ప్రథమ పౌరుని హోదాలో కొత్త భవనాన్ని ప్రారంభించే హక్కు కచ్చితంగా రాష్ట్రపతిదే. ► ఎందుకంటే ప్రధాని పార్లమెంటు లోని ఒక అంగమైన లోక్‌సభకు మాత్రమే నేతృత్వం వహిస్తారు. ► ఆ కోణం నుంచి చూస్తే రాజ్యాంగపరంగా కూడా పార్లమెంటు భవనాన్ని ప్రధాని ఆవిష్కరించడానికి వీల్లేదు. ► ఏటా పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించే అధికారం, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ఆర్టికల్ 87 ప్రకారం రాష్ట్రపతిదే. ► పార్లమెంటు ఆమోదించే బిల్లులన్నీ ఆర్టికల్ 111 మేరకు రాష్ట్రపతి సంతకంతో మాత్రమే చట్ట రూపం దాలుస్తాయి. ► అలాంటప్పుడు రాష్ట్రపతిని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం అధికార బీజేపీ అహంకారానికి, లెక్కలేనితనానికి తాజా నిదర్శనం. గతానుభవాలు ఏం చెబుతున్నాయి? ఇలాంటి విషయాల్లో నిర్దిష్టంగా ఇలా వ్యవహరించాలంటూ నియమ నిబంధనలేవీ లేవు. కాకపోతే గత ప్రధానులు తమ వ్యవహార శైలి ద్వారా వీటి విషయమై చక్కని సంప్రదాయాలను నెలకొల్పి ఉంచారన్నది విపక్షాలు చెబుతున్న మాట. వారిలో కేంద్రం బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన వాజ్‌పేయి కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నాయి. ఆ సంప్రదాయాలను పాటించడం విజ్ఞత అనిపించుకుంటుందని అవి అభిప్రాయపడుతున్నాయి. విపక్షాలు ఏమంటున్నాయంటే... నాడు ‘గాంధీ’ గిరి.. లోక్‌సభ సచివాలయమైన ‘పార్లమెంట్ హౌస్ ఎస్టేట్’ ప్రచురణల రికార్డుల ప్రకారం పార్లమెంటు అనుబంధ భవన నిర్మాణానికి 1970 ఆగస్టు 3న నాటి రాష్ట్రపతి వి.వి.గిరి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయ్యాక భవనాన్ని 1975 అక్టోబర్ 24న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. అంటే రెండు కార్యక్రమాలుగా ఇద్దరూ పంచుకున్నారు. అలా చూసినా పార్లమెంటు కొత్త భవన నిర్మాణానికి 2020 డిసెంబర్ 10న మోదీ భూమి పూజ చేశారు. కనుక ప్రారంభోత్సవం రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా జరగాలన్నది విపక్షాల వాదన. వాజ్‌పేయిదీ అదే బాట... 2002లో వాజ్‌పేయి హయాంలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు లైబ్రరీ భవనాన్ని నాటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ ప్రారంభించారు. లోక్‌సభ సచివాలయం సంప్రదాయాల ప్రకారం భవనాన్ని ప్రారంభించాల్సిందిగా రాష్ట్రపతినే స్పీకర్ ఆహ్వానించారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ పార్లమెంటు కొత్త భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలన్నది విపక్షాల డిమాండ్. ‘‘2002లో కేంద్రంలో ఉన్నది మీ బీజేపీ ప్రభుత్వమే. వాజపేయి ప్రధాని హోదాలో రాష్ట్రపతి పదవికి అలాంటి గౌరవమిచ్చారు. కనీసం దీన్నుంచైనా మోదీ నేర్చుకోవాలి’’ అని మోదీకి విపక్ష నేతలు హితవు పలుకుతున్నారు. అలాంటి అవమానాలు వద్దు రాష్ట్రపతి కేవలం దేశ ప్రథమ పౌరుడు మాత్రమే కాదు. ఆర్టికల్ 53 ప్రకారం త్రివిధ బలగాలకు సుప్రీం కమాండర్. మోదీ చేయ బోతున్న పని అక్షరాలా అలాంటి దేశ అత్యున్నత పదవిని విస్మరించించడం, కించపరచడమేనని విపక్షాలంటున్నాయి. రాష్ట్రపతిని ఇలా అవమాని స్తుంటే సహించేది లేదంటూ గట్టిగా హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రపతినిలా న్యూనత పరచడం మోదీకి కొత్తేమీ కాదంటూ గత ఉదంతాలను గుర్తు చేస్తు న్నాయి. ‘‘2019 ఫిబ్రవరి 25న ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్‌ను ప్రధాని హోదాలో మోదీయే ప్రారంభించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కార్యక్రమానికి దూరం పెట్టి ఘోరంగా అవమానించారు. గణతంత్ర పరేడ్‌లో త్రివిధ బలగాల నుంచి రాష్ట్రపతే గౌరవ వందనం స్వీకరిస్తారు. యుద్ధంలో వీరమరణం పొందే సైనిక యోధులకు వీర చక్ర, అశోక చక్ర వంటి గౌరవ పురస్కారాలనూ ఆయనే ప్రదానం చేస్తారు. అలాంటిది యుద్ధ వీరుల జ్ఞాపకార్థం నిర్మించిన వార్ మెమోరియల్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతికి భాగస్వామ్య మే లేకుండా చేయడం అతి పెద్ద తప్పిదం. మోదీ లెక్కలేనితనానికి ఇది రుజువు’’ అంటూ మండిపడుతున్నాయి. కనీసం ఇప్పుడైనా అలాంటి తప్పిదాన్ని పునరావృతం చేయొద్దని సూచిస్తున్నాయి. కేంద్రం ఏమంటోంది.? ఎటుపోయి ఎటొస్తుందోనని పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ రగడపై ఇప్పటిదాకా నోరు మెదపని బీజేపీ నేతలు ఇప్పుడిక తప్పనిసరై ఒక్కోలా స్పందిస్తున్నారు. బహిష్కరణ నిర్ణయంపై విపక్షాలు పునరాలోచించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అనునయించే ధోరణిలో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం, ‘కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించాం. రావడం, రాకపోవడమన్నది వారి విజ్ఞతకే వదిలేస్తాం’ అంటూ కుండబద్దలు కొట్టడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
త్వరలో విపక్షాల కీలక భేటీ!
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగుకు రంగం సిద్ధమవుతోంది. విపక్షాల ఉమ్మడి భేటీకి మూహూర్తాన్ని, వేదికను ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించనున్నారు. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీలతో బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్ జరిపిన భేటీలో ఈ అంశం చర్చకు వచ్చింది. విపక్షాల భేటీ పట్నాలోనే ఉండొచ్చని నెల క్రితం ఖర్గేతో భేటీ అనంతరం నితీశ్ పేర్కొనడం తెలిసిందే. కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసిన నేపథ్యంలో ఐక్యతా యత్నాలను మరింత ముమ్మరం చేయాలని తాజా సమావేశంలో నేతలు నిర్ణయించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఉమ్మడి వ్యూహరచన విపక్షాల భేటీలో ఏయే అంశాలను చర్చించాలనే దానిపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఖర్గే, రాహుల్, నితీశ్ సమావేశమవడం గత నెలన్నరలో ఇది రెండోసారి కావడం విశేషం. జేడీ(యూ) అధినేత లాలన్‌సింగ్‌తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఇందులో పాల్గొన్నారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అనారోగ్యంతో రాలేకపోయారని సమాచారం. ఇప్పుడిక దేశమంతా ఒక్కటవుతుందంటూ భేటీ అనంతరం ఖర్గే ట్వీట్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే మా సందేశం. దేశానికి నూతన దిశానిర్దేశం చేసే ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలని నితీశ్‌తో భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చాం’’ అని పేర్కొన్నారు. అతి త్వరలో విపక్షాలన్నీ భేటీ కావాలని నిర్ణయించినట్టు వేణుగోపాల్, లాలన్‌సింగ్ మీడియాకు తెలిపారు. విపక్షాల అధినేతలంతా అందులో పాల్గొటారని చెప్పారు. కొన్నాళ్లుగా వరుస భేటీలు నితీశ్ కొద్ది రోజులుగా విపక్ష నేతలందరినీ వరుసబెట్టి కలుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం కూడా ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో నితీశ్ మరోసారి సమావేశమై పలు అంశాలపై లోతుగా చర్చించారు. ఢిల్లీ ప్రభుత్వాధికారులపై అజమాయిషీ విషయమై కేంద్రంతో జరుపుతున్న పోరాటంలో ఆప్ సర్కారుకు తమ సంపూర్ణ మద్దతుంటుందని హామీ ఇచ్చారు. శనివారం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో కూడా జాతీయ స్థాయిలో విపక్ష నేతలంతా వేదికపైకి వచ్చి సమైక్యతా సందేశమివ్వడం తెలిసిందే. నితీశ్‌తో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు వీరిలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను కూడా విపక్ష కూటమిలోకి తీసుకొచ్చేందుకు నితీశ్ ప్రయత్నిస్తున్నారు. ఇవే కీలకం! ప్రధాని మోదీకి దీటుగా విపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని తమ సారథిగా నిలబెట్టాలని భావిస్తున్నాయి. అయితే పోటీదారులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనిపై ఏకాభిప్రాయం ఎలా కుదుదరుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అంతేగాక లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తమకు వీలైనన్ని ఎక్కువ స్థానాలు కేటాయించాలని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నాయి. అవి కోరినట్టుగా తాను 200 సీట్లలోనే పోటీకి పరిమితమయ్యేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. బలమైన విపక్ష కూటమి ఏర్పాటై లోక్‌సభ ఎన్నికల బరిలో బీజేపీని దీటుగా ఎదుర్కోవాలంటే దీనిపైనా వీలైనంత త్వరగా స్పష్టత రావాల్సి ఉంది. -
విపక్ష కూటమి తథ్యం: అఖిలేశ్
ఇండోర్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు విపక్షాల కూటమి సాకారమవుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆశాభావం వెలిబుచ్చారు. ఇప్పటికే కేసీఆర్, మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్ వంటి ముఖ్యమంత్రులు ఇందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ‘‘విపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో వాటికి దన్నుగా నిలిచేందుకు కాంగ్రెస్ ముందుకు రావాలని శుక్రవారం పిలుపునిచ్చారు. తద్వారా విపక్ష కూటమి బలోపేతానికి ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. తప్పుడు ఎన్కౌంటర్లపై కోర్టులు తమంత తాము విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమవారిని బూటకపు ఎన్కౌంటర్లలో హతమార్చారని భావిస్తున్న వాళ్లు ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఉమ్మడి గళం వినిపిద్దాం
చెన్నై/న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ఉమ్మడిగా పోరాడాల్సిందేనని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. విపక్ష పార్టీలు కూటమి కట్టకుండా విడిగా పోటీ చేస్తే ఎలాంటి లాభం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో మళ్లీ సామాజిక న్యాయం, సమైక్యత, సోదరభావం, సమానత్వం సాధించాలంటే విపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు. డీఎంకే ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా హైబ్రిడ్మోడ్లో సోమవారం తొలి ‘సామాజిక న్యాయ సదస్సు’ జరిగింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డిరెక్ ఒబ్రియన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ, ఐయూఎంఎల్, బీఆర్ఎస్, ఎండీఎంకే, ఆర్ఎస్పీ, ఎల్ఎస్పీ, వీసీకే తదితర పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించారు. అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తేవడం అత్యంత ప్రధానమైన విషయమని స్టాలిన్ అన్నారు. ‘‘ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాకూడదు. దేశవ్యాప్తంగా సాకారం కావాలి. అందరం కలసి పోరాడదాం’’ అని పిలుపునిచ్చారు. ‘‘కేంద్రం ఏ హేతుబద్ద ప్రమాణాల ఆధారంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలుచేస్తోంది? ఇది సామాజిక న్యాయం అనిపించుకోదు’’ అన్నారు. దేశవ్యాప్త కులగణన: తేజస్వి వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిందేనని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. ‘‘బిహార్‌లో మహాఘట్బంధన్ సర్కార్ ఈ దిశగా ఇప్పటికే అడుగేసింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఓబీసీలకు అదనపు రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ గవర్నర్లు మోకాలడ్డుతున్నారు’ అని ఆరోపించారు. సామాజిక న్యాయ రాజకీయాలతో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొందామని అన్నారు. దేశవ్యాప్త కులగణన డిమాండ్‌కు విపక్ష నేతలంతా మద్దతు పలికారు. విడివిడిగా ఎలాంటి లాభం ఉండదు: డీఎంకే చీఫ్ స్టాలిన్ ‘సామాజిక న్యాయ’ తొలి సదస్సులో పాల్గొన్న విపక్ష నేతలు -
నాకు సమాధి తవ్వే పనిలో... విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు
మండ్య/ధార్వాడ/హుబ్లీ: పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం తాను అవిశ్రాంతంగా శ్రమిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తనకు సమాధి తవ్వే పనిలో తీరిక లేకుండా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కర్ణాటకలో మండ్య వద్ద 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు–మైసూరు 10 లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారిని ఆయన ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. మైసూరు–కుశాలనగర 4 లేన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. తనను సమాధి చేయాలని కాంగ్రెస్ కలలు కంటోందని ఆక్షేపించారు. తనకు ఈ దేశ మాతృమూర్తులు, ఆడపిల్లలు, ప్రజలు రక్షణ కవచంగా ఉన్నారనే సంగతిని విపక్షాలు మరచిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. పేదల బతుకుల్లో మార్పు దేశంలో గడిచిన 9 ఏళ్లలో వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది పేదల బతుకుల్లో మార్పు వచ్చిందని మోదీ అన్నారు. పేదల కనీస అవసరాలైన సొంత ఇల్లు, తాగునీరు, విద్యుత్, గ్యాస్ సరఫరా, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఆస్పత్రుల నిర్మాణం వంటి పనులను బీజేపీ ప్రభుత్వం చేపడుతోందన్నారు. 9 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ కింద 40 లక్షల ఇళ్లకు తాగునీటి సదుపాయం కల్పించినట్లు చెప్పారు. 140 కోట్ల మందిని అవమానించారు విద్యార్థులు తమ చదువులు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ధార్వాడలో ఐఐటీ విద్యాసంస్థ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. లండన్‌లో బసవేశ్వరుడి విగ్రహాన్ని జాతికి అంకితం చేసే భాగ్యం తనకు కలిగిందన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా లండన్‌లో మాట్లాడారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. 140 కోట్ల మంది భారతీయులను అవమానించారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తులను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రపంచ దేశాలకు ఆశాకిరణం ప్రపంచ దేశాలకు ప్రస్తుతం భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవి ఆరాటపడుతున్నాయని తెలిపారు. దేశంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ కర్ణాటకలో రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర న్యూఢిల్లీ: చరిత్రాత్మక దండి యాత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం మహాత్మా గాంధీకి, యాత్రలో పాల్గొన్న నేతలకు నివాళులర్పించారు. బ్రిటిష్ వారిపై ప్రజల పోరాటంగా దండి యాత్ర గుర్తుండిపోతుందన్నారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర అని ట్విట్టర్లో తెలిపారు. మన దేశ చరిత్రలో దండి యాత్ర కీలకమైన ఘట్టమని ఉద్ఘాటించారు. దండి యాత్రగా పేరుగాంచిన ఉప్పు సత్యాగ్రహం 1930 మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్ 5న ముగిసింది. పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ జాతికి అంకితం ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన కర్ణాటకలో శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌లోని 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫామ్‌ను ప్రధాని ఆదివారం జాతికి అంకితం ఇచ్చారు. పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుదీకరించిన హోస్పేట–హుబ్బళ్లి–తినాయ్‌ఘాట్ రైల్వే సెక్షన్‌ను జాతికి అంకితమిచ్చారు. హుబ్బళ్లి–ధార్వాడ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా పలు పనులకు శంకుస్థాపన చేశారు. జయదేవ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి, ధార్వాడ మల్టీ విలేజ్ వాటర్ సప్లై స్కీమ్ పనులకు పునాదిరాయి వేశారు. తుప్పరిహళ్లి ఫ్లడ్ డ్యామేజ్ కంట్రోల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మండ్య జిల్లాకేంద్రంలో ప్రధాని రోడ్డు షోలో పాల్గొన్నారు. -
ప్రజలే రక్షణ కవచం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని రక్షణ కవచంగా ధరిస్తున్నానని ఉద్ఘాటించారు. విమర్శకుల దూషణలు, అబద్ధాలు, ఆరోపణలు తననేమీ చేయలేవని తేల్చిచెప్పారు. ప్రజలు తన పట్ల చూపుతున్న విశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. జీవితంలో ప్రతిక్షణం దేశం కోసమే పని చేస్తున్నానని చెప్పారు. స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం వల్ల అంతర్జాతీయ సంస్థలకు భారత్‌పై నమ్మకం పెరిగిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ 85 నిమిషాలపాటు ప్రసంగించారు. కోవిడ్–19 మహమ్మారి, సంఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సంక్షోభం, అస్థిరత కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో భారత్ వైపు చూస్తోందని వివరించారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే.. తిట్లు, ఆరోపణలను జనం అంగీకరిస్తారా? ‘‘140 కోట్ల మంది భారతీయులు సాధించిన విజయాలను కొందరు(విపక్ష నేతలు) చూడలేకపోతున్నారు. భారత్ సాధించిన ప్రగతిని ఒప్పుకోవాలంటే వారికి కష్టంగా ఉంది. సంక్షోభ సమయంలో నేను అందించిన సాయం ఏమిటో ప్రజలకు తెలుసు. మీరు (ప్రతిపక్షాలు) నన్ను తిడుతున్న తిట్లు, నాపై చేస్తున్న ఆరోపణలను జనం అంగీకరిస్తారా? కేవలం పత్రికలు, టీవీల్లోని వార్తలను చూసి జనం నాపై నమ్మకం పెంచుకోలేదు. ప్రజాసేవ పట్ల చాలా ఏళ్లుగా నా అంకితభావాన్ని చూసి నన్ను విశ్వసిస్తున్నారు. నిర్మాణాత్మక విమర్శలు చేయాల్సింది పోయి పనికిమాలిన ఆరోపణలతో ప్రతిపక్షాలు గత తొమ్మిదేళ్ల కాలాన్ని వృథా చేశాయి. కొందరు వ్యక్తులు కేవలం వారి కుటుంబం కోసమే జీవిస్తున్నారు. 25 కోట్ల భారతీయ కుటుంబాల కోసం నేను జీవిస్తున్నా. 2030వ దశాబ్దం ‘భారతదేశ దశాబ్దం’ మీరు ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలను తప్పుపడుతున్నారు. ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు. మీకు అనుకూలమైన తీర్పులు ఇవ్వకపోతే సుప్రీంకోర్టును ఆక్షేపిస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధి సాధిస్తోందన్న మాట వినపడితే చాలు ఆర్బీఐపై నిప్పులు కక్కుతున్నారు. 2014 కంటే ముందున్న దశాబ్దం మనం ‘కోల్పోయిన దశాబ్దం’. కానీ, 2030వ దశాబ్దం ‘భారతదేశ దశాబ్దం’. మొబైల్ ఇంటర్నెట్ డేటా ఖర్చు గతంలో రూ.250 ఉండేది. ఇప్పుడు అది రూ.10కి దిగివచ్చింది. దేశంలో 70 ఏళ్లలో 70 ఎయిర్‌పోర్టులు నిర్మించారు. కానీ, గత తొమ్మిదేళ్లలోనే 70కిపైగా ఎయిర్‌పోర్టులు నిర్మించాం. ‘తయారీ కేంద్రం’గా భారత్ 2008లో దేశంలో జరిగిన ఉగ్రవాద దాడులను ఎవరూ మర్చిపోలేరు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే దమ్ము అప్పటి ప్రభుత్వానికి లేకుండాపోయింది. అందుకే రక్తపాతం జరిగింది, అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. యూపీఏ దుష్పరిపాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ముంబైలో ఉగ్రదాడి జరిగినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. 2జీ, బొగ్గు గనుల కేటాయింపు, కామన్వెల్త్ క్రీడల కుంభకోణాలు యూపీఏలో పాలనలోనే చోటుచేసుకున్నాయి. 2004–2014 దశాబ్దం కుంభకోణాలమయంగా మారింది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల వల్ల ప్రజల్లో అభద్రత నెలకొంది. 2014 నుంచి ఎన్డీయే సర్కారు పాలనలో మన దేశంలో స్టార్టప్‌ల బూమ్ పెరిగింది. ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొంటున్నాం. మౌలిక సదుపాయాల కల్పన వేగంగా సాగుతోంది. మన దేశం ఇప్పుడు ‘తయారీ కేంద్రం’గా ఎదుగుతోంది. ప్రపంచం తన భవిష్యత్తు, సౌభాగ్యాన్ని భారతదేశ అభివృద్ధిలో వెతుక్కుంటోంది. పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం’’ అని ప్రధాని మోదీ వివరించారు. ప్రధాని ప్రసంగం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్, వామపక్షాల సభ్యులతోపాటు కొందరు కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. దృష్టికోణాన్ని బట్టే చూస్తారు హిందీ వ్యంగ్య రచయిత కాకా హత్రాసీ, కవి దుష్యంత్ కుమార్ చెప్పిన ద్విపదలను మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘‘అటూ ఇటూ ఎందుకు చూస్తారు. ఎవరైనా ఏదైనా వారి దృష్టికోణాన్ని బట్టే సన్నివేశాన్ని చూస్తారు’’ అని ప్రతిపక్షాలను ఉద్దేశించి చెప్పారు. అలాగే ‘‘మీ పాదాల కింద భూమి లేదు. ఆశ్చర్యం ఏమిటంటే మీరు ఇప్పటికీ ఆ విషయం నమ్మడం లేదు’’ అని అన్నారు. -
Adani Group issue: ‘అదానీ’పై అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు, తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల పతనం కారణంగా తలెత్తిన పరిస్థితులపై పార్లమెంట్లో వెంటనే చర్చ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఏకతాటిపైకి వచ్చిన విపక్ష సభ్యుల ఆందోళనతో శుక్రవారం లోక్‌సభ, రాజ్యసభ స్తంభించాయి. మిగతా సభా కార్యకలాపాలను పక్కనపెట్టి హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాల్సిందేనంటూ ప్రతిపక్షాలన్నీ పట్టుబట్టడంతో వరుసగా రెండోరోజు కూడా ఎలాంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం సమావేశాలకు ముందే తీసుకున్న సంయుక్త నిర్ణయం 15 పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి. లోక్‌సభ ఆరంభమై ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన వెంటనే విపక్ష ఎంపీలు హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు పట్టుబడుతూ ఆందోళనకు దిగారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకురావడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. విచారణ జరిపించాల్సిందే... అదానీ గ్రూప్ పట్ల వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) లేదా సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్‌తో విచారణ జరిపించాలని విపక్షాలు పునరుద్ఘాటించాయి. అత్యంత కీలకమైన ఈ అంశంపై చర్చకు అంగీకరించకపోవడం ఏమిటని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చర్చించే దాకా పట్టు! పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మోదీ సర్కారుపై దాడిని మరింత తీవ్రతరం చేయాలని విపక్షాలు నిర్ణయించాయి. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో 16 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం ఉదయం సమావేశమయ్యాయి. ఈ భేటీలో కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ, ఆప్, బీఆర్ఎస్, శివసేన, ఆర్జేడీ, జేడీ(యూ), సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోస్ మణి), కేరళ కాంగ్రెస్ (థామస్), ఆరెస్పీ ఇందులో ఉన్నాయి. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ అవకతవకలపై సభలో చర్చ జరిగేదాకా పట్టుబట్టాల్సిందేనని పార్టీలన్నీ ఏకగ్రీవంగా నిర్ణయించాయి. దాంతోపాటు అదానీ గ్రూప్ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తుకు కేంద్రం అంగీకరించేదాకా ఉభయ సభల్లోనూ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి. అదానీ అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందే. అప్పుడు మాత్రమే వాటిలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎస్బీఐ పెట్టుబడులకు భద్రత’’ అని భేటీ అనంతరం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మీడియాతో అన్నారు. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రధాని మోదీయే వాటిపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున ఆర్థిక, అకౌంటింగ్ అవకతవకలకు పాల్పడిందంటూ న్యూయార్క్‌కు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల దెబ్బకు గ్రూప్ విలువ చూస్తుండగానే ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేరకు పడిపోయింది. -
Parliament Monsoon Session: ప్రజల ఇక్కట్లు చూడండి
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై రాజ్యసభలో ఎట్టకేలకు చర్చ మొదలయ్యింది. ధరాఘాతంతో జనం అష్టకష్టాలు పడుతున్నారని ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విన్నవించాయి. నిత్యావసరాల ధరల అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో బీజేపీ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. ధరల పెరుగుదల వల్ల ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని చెప్పారు. ధరలను అదుపుచేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ద్రవ్యోల్బణం ఇప్పుడు 7 శాతంగా ఉందని, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో పెరిగినట్లుగా రెండంకెలకు చేరుకోలేదని అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పంపిణీ వ్యవస్థలు దెబ్బతిన్నాయని, చమురు మంట కొనసాగుతోందని, తద్వారా ధరలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. కేవలం మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇప్పటికిప్పుడు నియంత్రణలోకి తీసుకురావడం ఏ దేశం చేతుల్లోనూ లేదని తేల్చిచెప్పారు. ప్రజలు విసుగెత్తిపోయారు ధరల అంశంపై చర్చను సీపీఎం సభ్యుడు ఎళమారమ్ కరీం ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదని ఆక్షేపించారు. గత ఎనిమిదేళ్లుగా ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం, జీఎస్టీ మోత, రూపాయి విలువ పతనం వంటివి పేదలను కుంగదీస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ వాపోయారు. సమస్యలను ఇప్పటికైనా గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజలు పూర్తిగా విసుగెత్తిపోయారని కాంగ్రెస్ సభ్యుడు శక్తిసింహ్ గోహిల్ అన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా చెప్పారు. ఆహార ఉత్పత్తి వ్యయం గత ఏడాది కాలంలో 21 శాతం పెరిగిందని వివరించారు. రైతుల ఆదాయం పెరగడం లేదన్నారు. గిరిజనుల సమస్యలను జేఎంఎం ఎంపీ మహువా రాజ్యసభలో ప్రస్తావించారు. ధరల మంట కారణంగా మహిళల కష్టాలు రెట్టింపు అయ్యాయని కాంగ్రెస్ ఎంపీ అశోక్‌రావు ఉద్ఘాటించారు. పన్నుల భారం పెరగలేదు: నిర్మల ధరల పెరుగుదలపై జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు చర్యలు ప్రారంభించామని వివరించారు. జీఎస్టీ వల్ల కుటుంబాలపై పన్నుల భారం పెరగలేదన్నారు. బియ్యం, గోధుమ పిండి, పెరుగు వంటి వాటిపై అన్ని రాష్ట్రాల అంగీకారంతోనే జీఎస్టీ విధించినట్లు గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ధరలు అధికంగా ఉండేవని అన్నారు. అప్పట్లో కిలో ఉల్లిపాయల ధర రూ.100 మార్కును దాటిందని వెల్లడించారు. -
పార్లమెంట్లో అదే అలజడి.. కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరల పెరుగుదల, లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు సోమవారం కూడా ఆందోళన కొనసాగించాయి. దీంతో రెండు సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టడంతో ధరల పెరుగుదలపై లోక్‌సభలో చర్చ జరిగింది. దీనిపై మంగళవారం రాజ్యసభ కూడా చర్చించనుంది. సభ గౌరవాన్ని తగ్గించొద్దు: స్పీకర్ లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. తమ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభ గౌరవాన్ని తగ్గించే పని చేయొద్దని స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైనా విపక్షాలు నినాదాలు ఆపలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని మండిపడ్డారు. దాంతో సభ మధ్యాహ్నం రెండింటిదాకా వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత కూడా అవే దృశ్యాలు కనిపించాయి. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దు, ఇది ఈడీ సర్కారు అంటూ కాంగ్రెస్ సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. డీఎంకే, ఎన్సీపీ సభ్యులు వారికి మద్దతుగా నిలిచారు. సభలోకి ఇకపై ప్లకార్డులు తీసుకురాబోమని నలుగురు కాంగ్రెస్ ఎంపీలు హామీ ఇవ్వడంతో వారిపై సస్సెన్షన్‌ను ఎత్తేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సభ్యులను హెచ్చరించారు. సభాపతి స్థానాన్ని అగౌరవపర్చాలన్న ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల వినతిని ప్రభుత్వం వినకపోవడం వల్లే నిరసన తెలపాల్సి వస్తోందన్నారు. రాజ్యసభలోనూ అవే సీన్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టు తదితరాలపై ప్రతిపక్షాలు రాజ్యసభను స్తంభింపజేశాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఆందోళనకు దిగాయి. దాంతో సభ మధ్యాహ్నం 12 దాకా వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ్యులు శాంతించలేదు. వెల్‌లోకి చేరుకొని, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభా సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రతిపక్షాలను కోరారు. ధరల పెరుగుదలపై మంగళవారం సభలో చర్చిస్తామన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, అస్సాంలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సభలో విపక్షాల నిరసనల మధ్యే ఖాదీ, జీడీపీలో వీధి వ్యాపారుల పాత్ర, నదుల స్వచ్ఛీకరణ, అభివృద్ధిపై చర్చను చేపట్టారు. నినాదాల హోరు పెరగడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత కూడా సభ అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. మాంద్యానికి అవకాశం లేదు: నిర్మల భారత్‌లో ఆర్థిక మాంద్యం గానీ, ఆర్థిక మందగమనం గానీ ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో చెప్పారు. ధరల పెరుగుదలపై చర్చలో ఆమె మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా మారుతోంది అని చెప్పడానికి జీఎస్టీ వసూళ్లు, కొనుగోలు సూచికే(పీఎంఐ) సాక్ష్యమని వివరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరేళ్ల బాలిక ప్రధాని మోదీకి రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. మోదీపై నమ్మకం ఉంది కాబట్టే లేఖ రాసిందని అన్నారు. ప్రభుత్వ చర్యలు, విధానాల వల్ల ఇటీవల వంట నూనెల ధరలు తగ్గిపోయాయని ఉద్ఘాటించారు. ఆర్థిక మంత్రి సమాధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోక్‌సభ నుంచి కాంగ్రెస్, డీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ‘నో వన్ కిల్డ్ జెస్సికా తరహాలో దేశంలో ద్రవ్యోల్బణం లేదు’ అని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఎద్దేవా చేశారు. పచ్చి కూరగాయలు తినాల్సిందే ధరల పెరుగుదలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ లోక్‌సభలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ధరల పెరుగుదలపై చర్చ జరుగుతుండగా హఠాత్తుగా లేచి పచ్చి వంకాయను ప్రదర్శించారు. వంట గ్యాస్ ధర విపరీతంగా పెరగడంతో పచ్చి కూరగాయలు తిని కడుపు నింపుకోవాల్సిందేనంటూ వంకాయను కొరికి నిరసన వెలిబుచ్చారు. -
Monsoon session: ఆగని వాయిదాల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో వరుసగా ఐదో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ధరల పెరుగుదల, జీఎస్టీపై విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. శుక్రవారం ఉదయం లోక్‌సభ ఆరంభమైన వెంటనే ధరలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు తదితర అంశాలపై ప్లకార్డులతో విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభను 12 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు, ఆ తర్వాత మళ్లీ సోమవారం మధ్యాహ్నానికి స్పీకర్ వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళనల కారణంగా మొదట 12 గంటలకు, తర్వాత గంట పాటు కొనసాగిన అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు సభ వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ కొనసాగింది. ఇక ఉభయ సభల ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. జీఎస్టీ పెంపును వెనక్కి తీసుకోవాలని, ప్రజా సమస్యలపై పార్లమెంట్లో తక్షణమే చర్చించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు కోరారు. ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకు ఆమోదం లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన, నినాదాల మధ్యే ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు–2022 ఆమోదం పొందింది. అంటార్కిటిక్ ప్రాంతంలో భారత్ నెలకొల్పిన పరిశోధనా కేంద్రాల విషయంలో దేశీయ చట్టాలను అమలు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన మొదటి బిల్లు ఇదే కావడం విశేషం. బిల్లుపై లోక్‌సభలో స్వల్పచర్చ జరిగింది. ‘అగ్నిపథ్’పై మాట్లాడనివ్వడం లేదు డిఫెన్స్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం వాకౌట్ చేశారు. అగ్నిపథ్ పథకంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అగ్నిపథ్‌పై చర్చించాలని కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు కేసీ వేణుగోపాల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దానిష్ అలీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జువాల్ ఓరామ్‌ను కోరగా, ఆయన నిరాకరించారు. కేవలం అజెండాలో ఉన్న అంశాలపై చర్చించాలని తేల్చిచెప్పారు. కావాలంటే పార్లమెంట్లో అగ్నిపథ్ అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నిరసనగా వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
Presidential Election 2022: ద్రౌపది ముర్ము ఘన విజయం
Presidential Election 2022 Result Live: అప్డేట్స్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. 07:50 మూడో రౌండ్లోనూ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లలో కలిపి ఆమె సగానికి పైగా ఓట్లు సాధించారు. ద్రౌపది ముర్ముకు 5,77,777 ఓట్ల విలువ యశ్వంత్ సిన్హాకు 2,61, 062 ఓట్ల విలువ పోలైంది. 05:30 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల 809 ఓట్లు. యశ్వంత్ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి. ద్రౌపది ముర్ముకు పోలైన ఓట్లు చూస్తుంటే అంచనాలకు మించి మెజార్జీతో గెలిచే అవకాశం కనిపిస్తోంది.. 75 శాతానికిపైగా ఓట్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది 03: 00PM రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీ ఓట్ల లెక్కింపు ముగిసింది. కాసేపట్లో ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనున్నారు. ద్రౌపది ముర్ముకు 62 శాతానికి పైగా ఓట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. 02: 50PM రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఎంపీ ఓట్లు రాగా.. సిన్హాకు 208 ఎంపీ ఓట్లు పడ్డాయి. ఓటు విలువ ముర్ముకు 3,78,00 ఉండగా , యశ్వంత్ సిన్హాకు 1,45,600 గా ఉంది. చెల్లని ఎంపీ ఓట్లు 15గా తేలాయి. మొత్తం 4809 ఓటర్లలో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోమవారం జరిగిన ఎన్నికలో దాదాపు 99 శాతం మంది ఓటేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడిన విషయం తెలిసిందే. కాగా ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1:50PM కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు 11:00AM రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం పార్లమెంట్ భవనంలో మొదలైన కౌంటింగ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరవుతారో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో గురువారం ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం అయ్యింది. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను పార్లమెంట్ హౌస్‌లో లెక్కిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యశ్వంత్ సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ముర్ము విజయం సాధించడం లాంఛనమేనని రాజకీయ పండితులు తేల్చిచెబుతున్నారు. -
వ్యాక్సినేషన్ సక్సెస్‌ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు
గాంధీనగర్: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో ఎందుకంటూ ప్రతిపక్షాలు నిలదీయడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారులకు తక్షణమే సర్టిఫికెట్‌ను అందజేసిన భారత్‌ను చూసి ప్రపంచమంతా చర్చించుకుంటుండగా, కొందరు మాత్రం ఆ సర్టిఫికెట్‌పై తన ఫొటో ఉండటంపై రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గాంధీనగర్‌లో సోమవారం ఆయన డిజిటల్ ఇండియా వీక్–2022ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఆన్లైన్ చెల్లింపుల విధానం తీసుకురావద్దంటూ కొందరు పార్లమెంట్లో వాదించారని, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో డిజిటల్ సాంకేతిక ప్రవేశంతో ప్రజల జీవితాలు మారిపోయాయని ప్రధాని చెప్పారు. యూపీఐ ఫలితంగా చిరు వ్యాపారులు కూడా తమ రోజువారీ కార్యకలాపాలను సాగిస్తున్నారన్నారు. బిహార్‌లోని ఓ వ్యక్తి డిజిటల్ విధానంలో కూడా తనకు దానం చేయవచ్చంటూ క్యూఆర్ కోడ్ ప్లకార్డును మెడలో కట్టుకుని బిచ్చమెత్తుకుంటున్న విషయం ప్రస్తావించారు. వివిధ రకాల సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాక ప్రజలు క్యూల్లో నిల్చోవాల్సిన బాధ తప్పిందన్నారు. ఆధునిక సాంకేతికతను భారత్ అందిపుచ్చుకోనట్లయితే ఇప్పటికీ వెనుబడి ఉండేదన్నారు. ‘పదేళ్ల క్రితం ప్రజలు బర్త్ సర్టిఫికెట్లు, బిల్లుల చెల్లింపు, పరీక్షల ఫలితాలు, ప్రవేశాల కోసం క్యూల్లో నిలబడేవారు. ఇప్పుడు అన్ని సేవలను ఆన్లైన్ చేసి క్యూలు లేకుండా చేశాం’ అని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితంగా అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థను అరికట్టగలిగినట్లు చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో 80 కోట్ల మంది పేదలకు సులువుగా ఉచిత రేషన్ అందించామన్నారు. ఇలా ఉండగా, ప్రధాని మోదీ గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సుమారు రూ.1,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పీఎంవో తెలిపింది. -
రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా
-
Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: వచ్చే నెలలో జరిగే భారత 16వ రాష్ట్రపతి ఎన్నికపై ఊగిసలాట ధోరణికి స్వస్తి పలుకుతూ ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వంపై పలు విపక్ష పార్టీల నడుమ దాదాపుగా ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ సోమవారం రాత్రి సీఎం కేసీ ఆర్‌ను ఫోన్లో సంప్రదించారు. సిన్హా అభ్యర్థిత్వంపై అభి ప్రాయం కోరడంతో పాటు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే తమ నిర్ణయాన్ని వెల్లడించేందుకు కొంత గడువు కావాలని కోరిన కేసీఆర్.. యశ్వంత్‌కు టీఆర్ఎస్ మద్దతుపై విభిన్న కోణాల్లో మదింపు చేసినట్లు తెలిసింది. కాగా మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఫోన్ చేసిన పవార్‌కు సీఎం తన అంగీకారాన్ని తెలియజేసినట్లు సమాచారం. తొలుత పావులు కదిపినా.. కొంతకాలంగా జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో నిమ గ్నమైన కేసీఆర్.. తొలుత కాంగ్రెస్, బీజేపీయేతర ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించే దిశగా పావులు కది పారు. అయితే ఈ నెల 9న రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రంగ ప్రవేశం చేయ డంతో, తదనంతర రాజకీయ పరిణామాలను కేసీఆర్ అధినేత నిశితంగా గమనిస్తూ వచ్చారు. ఈ నెల 15న బీజే పీయేతర విపక్ష పార్టీల సమావేశానికి హాజరు కావాల్సిందిగా మమత నుంచి ఆహ్వానం అందినా భేటీకి వెళ్లలేదు. ‘బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం’ అనేది తమ విధానం కాగా.. కాం గ్రెస్‌ను కూడా మమత ఆహ్వానించడం, రాష్ట్రపతి అభ్యర్థిగా అందరికీ ఆమోద యోగ్యమైన వ్యక్తిపై ఏకాభి ప్రాయ సాధన ప్రస్తావన లేకపోవడం, తదితర కారణాలతో ఆ భేటీకి తాము దూరంగా ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. దూరంగా ఉంటే విమర్శలకు తావిచ్చినట్లవుతుందని.. జాతీయ పార్టీ స్థాపన దిశగా కసరత్తు చేస్తూనే, మరోవైపు కాంగ్రెస్ మినహా మిగతా విపక్ష పార్టీల నేతలతో కేసీఆర్ సత్సంబంధాలు నెరుపుతున్నారు. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్ మాన్ (పంజాబ్), ఎంకే స్టాలిన్ (తమిళ నాడు), ఉద్ధవ్ థాక్రే (మహారాష్ట్ర), హేమంత్ సొరేన్ (జార్ఖండ్) తదితరులతో పాటు శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, హెచ్డీ దేవెగౌడ, కుమారస్వామి వంటి నేతలతో భేటీ అవుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నిక విషయంలో పలు విపక్ష పార్టీలు ఏకతాటి పైకి వస్తున్నా, టీఆర్ఎస్ దూరంగా ఉంటే విమర్శలకు తావు ఇచ్చినట్లు అవుతుందనే భావన పార్టీలో వ్యక్తమైంది. మరో వైపు కాంగ్రెస్‌ను సాకుగా చూపుతూ రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటం వల్ల బీజేపీ విషయంలో పార్టీ వైఖరి అనుమానాలకు తావిస్తుందనే అభిప్రాయం కూడా టీఆర్ ఎస్ అంతర్గత చర్చల్లో వ్యక్తమైంది. సిన్హాకు మద్దతు సరైనదే..! ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ముఖ్యంగా విపక్ష పార్టీల ఐక్యతకు టీఆర్ఎస్ అడ్డుపడుతోం దనే భావన నష్టం చేకూరుస్తుందనే అంచనాకు కేసీఆర్ వచ్చి నట్లు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరమనే విధా నంతో జాతీయ రాజకీయాల్లో ఏకాకి అయ్యే అవకాశం ఉం దని కూడా భావించినట్లు సమాచారం. మరోవైపు యశ్వంత్ సిన్హా 2018లో బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రపతి అభ్యర్థిగా బరి లోకి దిగుతున్నారు. ఇలా కాంగ్రెస్ నేపథ్యంలేని యశ్వంత్ సిన్హాకు మద్దతు పలకడం సరైనదేనని భావించి తాజా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ఓటు విలువ 2.28 శాతం రాష్ట్రపతి ఎన్నికకు గాను దేశవ్యాప్త ఎలక్టోరల్ కాలేజీలో 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండగా, టీఆర్ఎస్కు రాష్ట్రంలో 16 మంది ఎం పీలు, 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ 10.86 లక్షలు కాగా, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ 24,796గా ఉంది. దేశ వ్యాప్త ఎలక్టోరల్ కాలేజీలో టీఆర్ఎస్ ఓటు విలువ 2.28 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాల్లో ఆయనకు మద్దతుగా టీఆర్ఎస్ ఎంపీలు కూడా సంతకాలు చేయనున్నట్లు సమాచారం. దీనిపై సీఎం కేసీఆర్ ఒకటి రెండురోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
నైరాశ్యంలో విపక్షాలు
న్యూఢిల్లీ: ప్రజలు తమను ఆదరించడం లేదన్న నిరాశతో విపక్షాలు విభజన రాజకీయాలకు తెర తీశాయని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా మండిపడ్డారు. మోదీ పాలనలో దేశంలో మతోన్మాదం పెరుగుతోందంటూ 13 విపక్ష పార్టీలు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు దేశవాసులనుద్దేశించి సోమవారం ఆయన లేఖ రాశారు. ‘‘ఓటుబ్యాంకు, విభజన రాజకీయాలకు పాల్పడి కూడా వరుస ఎన్నికల్లో విపక్షాలు ఘోర ఓటమినే మూటగట్టుకుంటున్నాయి. మోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు సాధికారత లభిస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. అభివృద్ధిని అడ్డుకోజూస్తున్నాయి. బీజేపీ వ్యతిరేకతే ఏకైక ఎజెండాగా ఒక్కటై విభజన రాజకీయాలకు తెర తీస్తున్నాయి’’ అంటూ మండిపడ్డారు. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన వాళ్లు ఇప్పుడు సోదిలో కూడా లేకుండా పోతుండటంపై ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ కాంగ్రెస్‌కు చురకలు వేశారు. కాంగ్రెస్, ఇతర విపక్షాలు అధికారంలో ఉన్న రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్న మత ఘర్షణలు, రాజకీయ హింసపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మత హింసకు కారకులు మీరే విపక్షాల అసలు రంగు ప్రజల ముందు క్రమంగా బయట పడుతోందని నడ్డా అన్నారు. దాంతో వాటికి ఎటూ పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు. ‘‘1966లో గో వధను నిషేధించాలంటూ పార్లమెంటు బయట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సాధువులపై నాటి ప్రధాని ఇందిరాగాంధీ కాల్పులు జరిపించలేదా? ఆమె హత్యానంతరం సిక్కులపై భారీ హత్యాకాండ జరిగితే, పెద్ద చెట్టు కూలినప్పుడు ఆ మాత్రం ప్రకంపనలుంటాయని కుమారుడు రాజీవ్‌గాంధీ బాధ్యాతారహితంగా మాట్లాడలేదా? 1969లో గుజరాత్లో, 1980లో మొరాదాబాద్, 1984లో భివాండీ, 1989లో భాగల్పూర్ తదితర చోట్ల మత ఘర్షణలకు కారకులెవరు? దారుణమైన మత హింస బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు కాదా?’’ అని నడ్డా ప్రశ్నించారు. ఇప్పటికైనా విభజనవాదం వదిలి అభివృద్ధి రాజకీయాలను అందిపుచ్చుకోవాలని హితవు పలికారు. -
యూపీఏ చైర్మన్‌గిరీపై ఆసక్తి లేదు
పుణె: బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించబోనని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. యూపీఏ కూటమికి చైర్మన్‌గా ఉండాలన్న ఆసక్తి కూడా తనకు లేదని ఆదివారం మీడియాతో అన్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిర్మించే ఏ వేదికలోనైనా కాంగ్రెస్‌ను దూరంగా ఉంచలేమన్నారు. ‘‘బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తా. ఇప్పుడూ అదే ప్రయత్నాల్లో ఉన్నా. కూటమి కట్టాలంటే విపక్షాలు కొన్నింటిని మర్చిపోవాలి. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పశ్చిమబెంగాల్లో బలమైన పార్టీ. ఇతర ప్రాంతీయ పార్టీలూ తమ రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామంలోనూ ఆ పార్టీకి కార్యకర్తలున్నారన్నది వాస్తవం. అందుకే బీజేపీ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటులో కాంగ్రెస్‌ను కలుపుకుని పోవడం తప్పనిసరి. దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం నెలకొనాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఒక్క పార్టీయే ఉంటే రష్యాలో పుతిన్ నాయకత్వంలా ఉంటుంది’’ అన్నారు. హిందువులే గాక ఇతర మతస్తులు కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యేలా కశ్మీరీ ఫైల్స్ సినిమాను చిత్రీకరించారని విమర్శించారు. ‘‘పాక్ అనుకూల వర్గం అప్పట్లో కశ్మీర్ లోయలో హిందువులతోపాటు ముస్లింలపైనా అరాచకాలకు పాల్పడింది. కాపాడాల్సిన నాటి ప్రభుత్వం హిందువులను రాష్ట్రం వదిలి పొమ్మంది’’ అన్నారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం సామాన్యుడిపైనే గాక నిత్యావసరాల ధరలు, రవాణా ఖర్చులపైనా పడుతోందని పవార్ విమర్శించారు. -
‘అవిశ్వాస’ పరీక్షలో ఇమ్రాన్ నెగ్గేనా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ జరుగనుంది. తక్షణ రాజీనామా, అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం, ఎన్నికలకు వెళ్లడమనే మూడు ఆప్షన్లను ప్రత్యర్థులు తనకిచ్చారని ఇమ్రాన్ శనివారం చెప్పారు. వారెవరన్నది బయట పెట్టలేదు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చివరి క్షణం దాకా పోరాడతానని స్పష్టం చేశారు. కొందరు ద్రోహులు తమ కూటమిని వీడి విపక్షాలతో చేతులు కలిపారని మండిపడ్డారు. ఎంపీలను సంతల్లో మేకల్లా కొనేస్తున్నారని ధ్వజమెత్తారు. విదేశీ కుట్రకు స్వదేశీ నేతలు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన లాయర్లతో మాట్లాడానని, ద్రోహులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. యువత నిశ్శబ్దం వీడాలని కోరారు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వీగిపోవాలంటే ఆయనకు అనుకూలంగా 172 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ, తమకు 175 మంది సభ్యుల మద్దతు ఉందని ప్రతిపక్ష కూటమి చెబుతోంది. -
వారి పోరాటం రెండో స్థానం కోసమే
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీతో సహా విపక్షాలన్నీ రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బీజేపీ తిరిగి బంపర్‌మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. తృణమూల్ వంటి పార్టీల మద్దతు, లఖీంపూర్‌ఖేరీ ఉదంతం వంటివి సమాజ్‌వాదీ పార్టీకి ఏ మాత్రమూ లాభించే పరిస్థితి లేదన్నారు. ప్రచార పర్వంలో బిజీగా ఉన్న ఆయన ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు... ► ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ఈసారి ఎన్నికల్లో మాకెవరూ పోటీ లేరు. సమాజ్‌వాదీ పార్టీతో సహా విపక్షాలన్నీ కేవలం రెండో స్థానం కోసం మాత్రమే పోరాడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 80 శాతం ఓటర్ల మద్దతు బీజేపీకే ఉంది. విపక్షాలన్నీ కలిపి మిగతా 20 శాతం ఓట్ల కోసమే పోరాడుతున్నాయి. ► తమదిప్పుడు సరికొత్త (నయా) సమాజ్‌వాదీ అని ఆ పార్టీ అంటోంది? వాళ్లు అణుమాత్రమైనా మారలేదు. మాఫియాలకు, నేర చరితులకు, ఉగ్రవాదులకు సాయపడే వారికి టికెట్లివ్వడం నుంచి మొదలుకుని ఏ ఒక్క విషయంలోనూ సమాజ్‌వాదీ అస్సలు మారలేదు. యూపీలో తాజా గాలి వీస్తోంది తప్పితే ఆ పార్టీ మాత్రం ఎప్పట్లాగే ఉంది. ► చట్ట వ్యతిరేక శక్తులు తనకు ఓటేయాల్సిన అవసరం లేదని అఖిలేశ్ అంటున్నారు? నిజానికి ఆయన ఉద్దేశం అందుకు పూర్తిగా వ్యతిరేకం. చట్ట వ్యతిరేక శక్తులు, విద్రోహులు ఒక్కతాటిపైకి వచ్చి సమాజ్‌వాదీ హయాంలో నడిచిన గూండారాజ్‌ను మళ్లీ తేవాలన్నది అఖిలేశ్ అసలు మాటల అంతరార్థం. ► లఖీంపూర్‌ఖేరీలో రైతుల మరణాన్ని జలియన్‌వాలాబాగ్ దురంతంతో అఖిలేశ్ పోలుస్తుండటం బీజేపీకి చేటు చేస్తుందా? ఈ విషయంలో చట్టం చురుగ్గా పని చేస్తోంది. కేసుపై సిట్ నిష్పాక్షికంగా విచారణ జరుపుతోంది. దాన్ని సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయమేమీ లేదు. ఈ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలన్న అఖిలేశ్ ఆశలు నెరవేరవు. రాష్ట్ర రైతులంతా వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న బీజేపీకే మద్దతుగా నిలుస్తారు. ► తృణమూల్ తదితర పార్టీలు సమాజ్‌వాదీకి మద్దతు ప్రకటించడం మీకేమీ నష్టం చేయదా? తృణమూల్, ఎన్సీపీ, ఆర్జేడీ వంటి పార్టీలకు యూపీలో ప్రజల మద్దతే లేదు. వాటి మద్దతుతో సమాజ్‌వాదీకి ఒరిగేదేమీ ఉండదు. ► యోగి ప్రధాని అభ్యర్థి అవుతారేమోనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి? నేనో సామాన్య బీజేపీ కార్యకర్తను. పార్టీ నాకిచ్చిన ఏ పనినైనా నెరవేర్చడమే నా బాధ్యత. అంతే తప్ప పదవుల కోసం, కుర్చీల కోసం నేనెన్నడూ పాకులాడలేదు. ► మీరు పోటీ చేస్తున్న గోరఖ్‌పూర్ అర్బన్ స్థానంలో పరిస్థితి ఎలా ఉంది? అది సంప్రదాయ బీజేపీ స్థానం. పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో అక్కడి ప్రజలే మరోసారి గెలిపించుకుంటారు. -
దేశాన్ని బిగ్‌బాస్ షోలా మార్చేసింది
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని ఆరోపిస్తూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. మోదీ ప్రభుత్వం దేశద్రోహ నేరానికి పాల్పడిందని విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థల మీదే దాడి జరుగుతోందని, చట్టసభల్ని, న్యాయవ్యవస్థని మోసం చేసిందని, ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసిందని మండిపడ్డాయి. దేశాన్ని ఒక ‘బిగ్ బాస్ షో’లా మార్చేసిందని విరుచుకుపడ్డాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేశాయి. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా తీసుకొని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేసిన మోసంపై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. మరోవైపు న్యూయార్క్ కథనాన్ని కేంద్రం తిప్పి కొట్టింది. న్యూయార్క్ టైమ్స్‌ని సుపారీ మీడియా అంటూ కేంద్రమంత్రి వీకే సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ’’మీరు న్యూయార్క్ టైమ్స్‌ని నమ్ముతున్నారా? వాళ్లు సుపారి మీడియాగా పేరుపడ్డారు’’ అని ట్వీట్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్వీ రవీంద్రన్ బృందం ఇచ్చే నివేదిక కోసం వేచి చూస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎవరినీ వదల్లేదు... ‘‘దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజకీయనాయకులు, సాధారణ ప్రజల మీద నిఘా పెట్టడానికే మోదీ ప్రభుత్వం పెగసస్‌ని కొనుగోలు చేసింది. ప్రభుత్వ అధికారులు, ప్రతిపక్ష నాయకులు, సాయుధ బలగాలు, న్యాయవ్యవస్థ.. ఇలా అందరూ ఫోన్ ట్యాపింగ్‌లకు టార్గెట్ అయ్యారు. ఇది దేశద్రోహం. మోదీ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడింది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు మౌనం అర్ధాంగీకారమే! ‘‘ఆ సైబర్ ఆయుధాన్ని ఎందుకు తీసుకువచ్చారు? దానిని వాడడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? లక్ష్యాలను ఎలా నిర్ణయించారు? వీటన్నింటికీ మోదీ ప్రభుత్వం అఫడివిట్ రూపంలో సమాధానం ఇవ్వాలి. ఇంత కీలకమైన అంశంలో మౌనంగా ఉంటే నేర కార్యకలాపాలకు పాల్పడ్డామని అంగీకరించినట్టు అవుతుంది’’ – సీతారామ్ ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి రియాలిటీ షో చేసేశారు... ‘‘రక్షణ వ్యవహారాలకు ఈ స్పైవేర్‌ని వినియోగించుకుండా ప్రతిపక్షాలు, జర్నలిస్టులపై ప్రయోగించడమేంటి? బీజేపీ ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి. వాళ్లు దేశాన్ని ఒక బిగ్ బాస్ షోలా మార్చేస్తున్నారు’’ – ప్రియాంక చతుర్వేది, ఎంపీ, శివసేన కావాలని కేంద్రం తప్పించుకుంటోంది ‘‘పెగసస్‌పై ఐటీ కమిటీకి ప్రభుత్వం సమాధానమివ్వడం లేదు. ఎప్పుడు ఈ విషయాన్ని చర్చిద్దామన్నా బీజేపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే హాజరుకాకపోవడంతో కోరమ్ ఉండటం లేదు. దీంతో నిజానిజాలను నిర్ధారించడానికి కమిటీకి అవకాశం లేకుండా పోయింది. సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారిస్తోంది. నిజంగా పెగసస్‌ను ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కి వినియోగిస్తే మన ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడినట్టే’’ – శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ, కమ్యూనికేషన్లు, ఐటీపై పార్లమెంటరీ ప్యానెల్ చైర్మన్ అది సుపారీ మీడియా ‘మీరు న్యూయార్క్ టైమ్స్‌ని నమ్ముతున్నారా? వాళ్లు సుపారీ మీడియాగా పేరుపడ్డారు’’ – కేంద్రమంత్రి వీకే సింగ్ ట్వీట్ -
నన్ను దింపాలనుకుంటే మరింత డేంజర్!
ఇస్లామాబాద్: ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని తనపై ఒత్తిడి తెస్తే తాను మరింత ప్రమాదకారిగా మారతానని పాకిస్తాన్ ప్రతిపక్షాలను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. ఇమ్రాన్ దిగిపోవాలని కోరుతూ పాకిస్తాన్ ప్రతిపక్ష కూటమి పీడీఎం మార్చిలో చేపట్టదలిచిన లాంగ్‌మార్చ్‌పై ఆయన స్పందించారు. ఈ యాత్ర విఫలమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ‘‘నేను వీధుల్లోకి వస్తే మీకు (ప్రతిపక్షాలు) దాక్కునేందుకు చోటు దక్కదు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా దాదాపు డజను పార్టీలు పీడీఎంగా కూటమి కట్టాయి. ఆర్మీ చేతిలో ఇమ్రాన్ కీలుబొమ్మని, ఆర్మీ సహకారంతో అక్రమంగా ఇమ్రాన్ గద్దెనెక్కారని పీడీఎం విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత షెబాజ్ షరీఫ్ జాతిద్రోహిగా తనకు కనిపిస్తున్నారని ఇమ్రాన్ నిప్పులు చెరిగారు. షరీఫ్ కుటుంబం మొత్తం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ బాటలో లండన్ పారిపోకతప్పదన్నారు. మాజీ మిలటరీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరాఫ్పై కూడా ఇమ్రాన్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాయని, కానీ తాను అందుకు అవకాశమివ్వనని చెప్పారు. ఇమ్రాన్ బెదిరింపులు తాటాకు చప్పుళ్లని ప్రతిపక్ష నేతలు దుయ్యబట్టారు. ఆయన ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఆయన తాజా వ్యాఖ్యలన్నీ ఆయన ఓటమికి సంకేతంగా అభివర్ణించారు. దేశంలో పెరుగుతున్న ధరలు మాత్రమే తనకు అశాంతిని కలిగిస్తున్నాయని అంతకుముందు ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. అయితే ఇది ప్రపంచవ్యాప్త పరిణామమని, తామొక్కరి సమస్య కాదని వివరించారు. సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా, అఫ్గాన్ యుద్ధం తదితరాలు పాక్ రూపీపై నెగిటివ్ ప్రభావం చూపాయన్నారు. -
ప్రతిపక్షాలది స్వార్థ రాజకీయం
మండి: ప్రతిపక్షాలది స్వార్ధంతో కూడిన రాజకీయమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రభుత్వ నిర్వహణలో ప్రస్తుతం రెండు నమూనాలున్నాయని, అందరితో కలిసి, అందరి నమ్మకం, అందరి కృషితో సాగే నమూనా తమది కాగా, సొంత ప్రయోజనాలు, స్వకుటుంబ స్వార్ధం, సొంతవారి ఎదుగుదల లక్ష్యంగా సాగే నమూనా విపక్షానిదని దుయ్యబట్టారు. అదేవిధంగా రెండు రకాల ఆలోచనాధోరణులుంటాయని, తమది వికాస్(అభివృద్ధి) ఆలోచన కాగా, విపక్షానిది విలంబ్(జాప్యం) ఆలోచన అని విమర్శిఃచారు. హిమాచల్ ప్రదేశ్‌లో జైరామ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లైన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన సోమవారం పాల్గొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం(కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వం) వల్ల అనేక ప్రయోజనాలు అందాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రంలో పలు అభివృద్ది ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయని, వివిధ పథకాల అమలు జోరందుకుందని వివరించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని రూ. 28,197 కోట్ల విలువైన 287 పెట్టుబడి ప్రాజెక్టులను ఆరంభించారు. దీంతో పాటు రూ.11,581 కోట్ల విలువైన పథకాలకు శంకుస్థాపన చేశారు. -
ఒక రోజు ముందే..
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ముగిశాయి. డిసెంబర్ 23 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉండగా, ఒకరోజు ముందే ముగిశాయి. సమావేశాల చివరి రోజు కూడా సభలో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. ప్రస్తుత సమావేశాల్లో రైతు చట్టాల ఉపసంహరణ బిల్లు, ఎన్నికల సంస్కరణల బిల్లు, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల కాలపరిమితి పెంపు బిల్లుకు ఆమోదం లభించింది. బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ ఓంబిర్లా ముగింపు సందేశాన్ని చదివారు. సభను నిరవధిక వాయిదా వేసిన అనంతరం పార్టీల ఫ్లోర్ లీడర్లు స్పీకర్‌తో సమావేశమయ్యారు. అంశాలపై విబేధాలను చర్చల్లో చూపాలి కానీ ఆందోళనల్లో కాదని స్పీకర్ హితవు పలికారు. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ 18 సార్లు సమావేశమైంది. సమావేశాలు 88 గంటల 12 నిమిషాలు కొనసాగాయి. కోవిడ్, శీతోష్ణస్థితి మార్పుపై అత్యధిక సమయం చర్చించారు. డిసెంబర్ 2న జరిగిన కరోనాపై చర్చలో 99 మంది సభ్యులు పాల్గొన్నారు. నిరసనల కారణంగా సభా సమయంలో 18గంటల 48 నిమిషాలు నష్టపోయామని స్పీకర్ చెప్పారు. మొత్తం మీద ఈ దఫా లోక్‌సభ సమావేశాల్లో ఉత్పాదకత 82 శాతమన్నారు. ఈ సెషన్లో ప్రభుత్వం 12 బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆరు బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు సిఫార్సు చేశారు. రాజ్యసభ పనితీరుపై వెంకయ్య ఆవేదన బుధవారం రాజ్యసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా సభలో ఆందోళనలు అధికమై పనితీరు బాగా తగ్గడంపై సభాపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వరకు సమావేశాలు జరగాల్సిఉండగా ఒకరోజు ముందే ముగిశాయి. సామర్ధ్యం కన్నా తక్కువ పనితీరును సభ కనబరిచిందని బుధవారం సభారంభం కాగానే వెంకయ్య సభ్యులకు వివరించారు. సభ్యులు భిన్నంగా ప్రవర్తించి ఉంటే మరింత మెరుగ్గా సమావేశాలు జరిగి ఉండేవన్నారు. అందరూ సభా నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన తప్పులను గుర్తించి ఇకపై జరగకుండా జాగ్రత్తపడాలని హితవు పలికారు. రాబోయే పండుగలకు సంబంధించి సభ్యులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. రాజ్యసభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. 12 మంది సభ్యుల సస్పెన్షన్ జరిగింది. విపక్షాల ఆందోళన నడుమ కీలక బిల్లులకు సభ ఆమోద తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించింది. విపక్షాలు 2019 ప్రజాతీర్పును తట్టుకోలేక ఇలా ప్రవర్తిస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు. వీరి కారణంగా రాజ్యసభ ఉత్పాదకత 48 శాతానికి క్షీణించిందన్నారు. రాజ్యసభలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్నా ప్రభుత్వం 12మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం ద్వారా కృత్తిమ మెజారిటీ సంపాదించి బిల్లులు పాస్ చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. నిరవధిక వాయిదా తర్వాత బయటికొస్తున్న సభ్యులు -
యోగి స్వింగర్లను విపక్షాలు ఆడలేకపోతున్నాయి
ఝాన్సీ (యూపీ): ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేసే ఇన్స్వింగర్లు, ఔట్ స్వింగర్లను విపక్షాలు ఆడలేకపోతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. క్రికెట్ పరిభాషను వాడుతూ... యోగిని ఆల్‌రౌండర్‌గా అభివర్ణించారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్.. ఎవరూ ఆయన ధాటికి నిలువలేకపోతున్నారని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఆదివారం ఏడుచోట్ల నుంచి జనవిశ్వాస్ యాత్రల పేరిట మెగా ర్యాలీలను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజ్‌నాథ్ ఝాన్సీలో ఆదివారం ఒక ర్యా లీని ప్రారంభించి మాట్లాడారు. గతంలో క్రిమినల్స్ రాత్రి కాగానే నాటు తుపాకులు పట్టుకొని వీధుల్లో తిరిగేవారని, ఇప్పుడలా చేసే సాహసం ఎవరూ చేయలేరన్నారు. యోగి అద్భుతాలు చేశారని కొనియాడారు. సమాజ్‌వాది పార్టీ పాలనలో అవినీతి, అన్యాయం, పేదలపై దౌర్జన్యాలు జరిగాయని లక్నోలో జనవిశ్వాస్ యాత్రను ఆరంభించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వారసత్వ రాజకీయాల్లేని పార్టీ బీజేపీయే అన్నారు. -
లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరిలో ముందస్తు కుట్రతోనే రైతులను బలితీసుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో విపక్షాలు బుధవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాకు ఉద్వాసన పలకాలని విపక్షాలు లోక్‌సభలో గట్టిగా డిమాండ్ చేశాయి. నినాదాలతో లోక్‌సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యులు పట్టువీడకుండా నిరసనలు కొనసాగించడంతో సభ గురువారానికి వాయిదా పడింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలు విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసకెళ్లి మిశ్రాపై వేటు వేయాలని బిగ్గరగా నినాదాలు చేశారు. సిట్ తాజాగా వెల్లడించిన సంచలన విషయాల తాలూకు వార్తా కథనాలు కనిపించేలా ప్రతికలను చేతులతో పట్టుకొని గాల్లో ఊపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి సిట్ దర్యాప్తులో వెల్లడైన విషయాలపై చర్చించాలని వాయిదా తీర్మానానికి రాహుల్ గాంధీ నోటీసు ఇచ్చారు. దీన్ని అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ బిర్లా వీరి డిమాండ్‌ను పట్టించుకోకుండా∙విపక్ష ఎంపీల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్నాహ్యం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేమైన తర్వాత ఇవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. ‘ధరల పెరుగుదలపై ముఖ్యమైన చర్చ ఉంది. ఈ అంశాన్ని చర్చకు చేపట్టాలనేది మీ డిమాండే కదా. మీ స్థానాల్లోకి వెళ్లి కూర్చొండి’ అని స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. అయినా లాభం లేకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. పన్నెండు మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించడంతో రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. కుదించే ఆలోచన ప్రస్తుతానికి లేదు పార్లమెంటు శీతాకాల సమావేశాలను కుదించే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ‘ధరల పెరుగుదల, ఒమిక్రాన్ ముప్పు లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాలన్న విపక్షాలు తీరా ఇవి చర్చకు వస్తే పాల్గొనకుండా పారిపోవడం విడ్డూరం. ఈ అంశాల్లో మాట్లాడటానికి వారికి ఏమీ లేనట్లే కనపడుతోంది. సమావేశాల నిడివిని కుదిస్తారని పుకార్లను వ్యాప్తి చేయడంలో ప్రతిపక్షాలు బిజీగా ఉన్నాయి’ అని విలేకరులతో అన్నారు. -
కరోనా నియంత్రణలో ఘోర వైఫల్యం
న్యూఢిల్లీ: కోవిడ్ మేనేజ్మెంట్పై కేంద్ర ప్రభుత్వ తీరును లోక్‌సభలో ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. సెకండ్ వేవ్ సమయంలో పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని మండిపడ్డాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. కరోనా వ్యాక్సినేషన్, బూస్టర్ డోసుపై రోడ్‌మ్యాప్ గురించి సభకు తెలియజేయాలని సూచించాయి. ఈ వైరస్ కారణంగా అసలు ఎంతమంది చనిపోయారో వాస్తవ గణాంకాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరాయి. కరోనా మహమ్మారిపై లోక్‌సభలో గురువారం తొలుత శివసేన సభ్యుడు వినాయక్ రౌత్ చర్చ ప్రారంభించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని, వైరస్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ డోసులు, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ డోసులు ఇస్తోందని దుయ్యబట్టారు. దేశంలోని 130 కోట్ల మంది బాధ్యత ప్రధానమంత్రిపై ఉందని గుర్తుచేశారు. జనాభాను బట్టి రాష్ట్రాలకు టీకా డోసులు కేటాయించాలన్నారు. దేశంలో ఇప్పటివరకు కేవలం 38 శాతం జనాభాకే టీకా రెండు డోసులు ఇచ్చారని అన్నారు. దీంతోనే సంతృప్తి చెందుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ సభ్యుడు జగదాంబికా పాల్ మాట్లాడుతూ.. కరోనాను ఎదుర్కొనే విషయంలో రాష్ట్రాల మధ్య కేంద్రం ఎలాంటి వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. పేదలను ఆదుకోలేరా? కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత తలెత్తే అవకాశం ఉందని ముందుగానే నిపుణులు హెచ్చరించినా కేంద్ర సర్కారు పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ధ్వజమెత్తారు. కరోనా వల్ల నష్టపోయినా ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసి మరిన్ని కష్టాలకు గురిచేస్తోందని అన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి గానీ పేదలను ఆదుకోవడానికి ఉండవా? అని నిలదీశారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం.. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కానీ, రూ.50 వేలు కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని విమర్శించారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు నిర్వాకం వల్లే కరోనా సెకండ్ వేవ్‌లో అధికంగా మరణాలు సంభవించాయని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ బిల్లుకు ఎగువ సభలో ఆమోదం దేశంలో డ్యామ్‌ల భద్రత కోసం సంస్థాగత యంత్రాంగం ఏర్పాటుకు ఉద్దేశించిన డ్యామ్ సేఫ్టీ బిల్లు–2019 గురువారం రాజ్యసభలో ఆమోదం పొందింది. రెండు అధికారిక సవరణతో బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు. ఎగువ సభలో సవరణలు చేయడంతో ఈ బిల్లు మళ్లీ లోక్‌సభకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. డ్యామ్‌ల భద్రత విషయంలో నిబంధనలు పాటించని రాష్ట్రాలు, ప్రజలకు జరిమానా విధించే అధికారం ఈ అథారిటీకి ఉంటుందన్నారు. ఎన్సీడీఎస్ చేసే సిఫార్సుల అమలును సైతం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై చర్చకు అనుమతించకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఆయా అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు కోరగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిరాకరించారు. ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోందని చెప్పారు. దీంతో ముందుగా కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, డీఎంకే, వామపక్షాల సభ్యులు సైతం వాకౌట్ చేశారు. అది అప్రజాస్వామికం కాదు: వెంకయ్య సభలో సభ్యుల హద్దుమీరిన ప్రవర్తనను అంగీకరించకపోవడం అప్రజాస్వామికంగా పరిగణించరాదని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు గురువారం అన్నారు. 12 మంది సభ్యుల సస్సెన్షన్‌పై ప్రతిపక్షాలు రాజ్యసభలో గత నాలుగు రోజలుగా నిరసన కొనసాగిస్తున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వస్తోంది. ఈ పరిణామంపై వెంకయ్య మాట్లాడారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి ప్రతిష్టంభనకు తెరదించాలని సూచించారు. రాజ్యసభ నుంచి సభ్యులను సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. 1962 నుంచి 2010 వరకూ 11 సార్లు సభ్యులను సస్పెండ్ చేసినట్లు గుర్తుచేశారు. అదంతా అప్రజాస్వామికమేనా? అని ప్రశ్నించారు. -
రాజ్యసభలో అదే తీరు
న్యూఢిల్లీ: 12 మంది ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రతిపక్షాలు గొంతెత్తుతూనే ఉన్నాయి. ఈ అంశంపై సభలో చర్చించాలని బుధవారం పట్టుబట్టాయి. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపీ ఖర్గేకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. శాంతించాలని సభాపతి పదేపదే కోరినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఫలితంగా సభ పలుమార్లు వాయిదాపడి చివరకు గురువారానికి వాయిదాపడింది. రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన 12 మంది ప్రతిపక్ష ఎంపీలు బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సస్సెన్షన్‌ను రద్దు చేసే దాకా నిరసన కొనసాగిస్తామన్నారు. కాగా, దేశవ్యాప్తంగా అన్ని క్లినిక్‌లు, వైద్య సిబ్బంది కోసం నేషనల్ రిజిస్ట్రీ, రిజిస్ట్రేషన్ అథారిటీ ఏర్పాటుకు ఉద్దేశించిన అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(రెగ్యులేషన్) బిల్లు–2020ను∙ఆరోగ్య మంత్రి మాండవీయ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సభ వాయిస్ ఓటుతో ఆమోదించింది. కాగా, పార్లమెంట్లో 59వ నంబర్ గదిలో బుధవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంప్యూటర్, కుర్చీ, టేబుల్‌కు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. -
మమత బెనర్జీ వ్యూహమేంటి? ప్రత్యామ్నాయం అవుతారా?
ఈ ఏడాది మార్చి– ఏప్రిల్ నెలల్లో బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ– అమిత్ షా ద్వయం మమతా బెనర్జీని ఓడించడానికి చేయని ప్రయత్నం లేదు. ఈడీ, సీబీఐ దాడులతో సహా అష్టదిగ్భందం చేశారు. ఏకాకిగా మారినా... సువేందు అధికారి, ముకుల్‌రాయ్‌లతో సహా సన్నిహితులందరూ దూరమైనా... మమత మొక్కవోని ధైర్యంతో ఎదురొడ్డి నిలిచారు. 294 సీట్లలో ఏకంగా 213 స్థానాల్లో నెగ్గి ‘హ్యాట్రిక్’ కొట్టారు. మూడోసారి సీఎంగా పదవిని చేపట్టారు. అంతే బెంగాల్ సివంగి పేరు జాతీయ రాజకీయ యవనికపై మార్మోగిపోయింది. బలమైన నాయకుడు మోదీని, బీజేపీ ‘ఢీ’ కొట్టి నిలిచే దమ్మున్న నాయకురాలిగా ఆమెను రాజకీయ పండితులు కీర్తించారు. ఈ విజయం ఇచ్చిన ఊపుతో మమత కూడా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. 2024 సార్వత్రిక ఎన్నికలపై కన్నేసి బీజేపీకి ప్రత్యామ్నాయ వేదికగా మూడో కూటమిని నిర్మించే దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. భావ సారూప్యత కలిగిన వ్యక్తుల భేటీల పేరిట రాజకీయపక్షాలనే కాకుండా, వివిధ రంగాల్లోని మేధావులు, ఉద్యమకారులను కలుస్తూ... తనను తాను ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు. బుధవారం రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశాక... ‘ఇక యూపీఏనే లేదు’ అంటూ ప్రకటించి... బీజేపీ వ్యతిరేక ఐక్యకూటమిని నాయకత్వం వహించాలనే తన ఆకాంక్షను విస్పష్టంగా బయటపెట్టారు. దేశవ్యాప్త రాజకీయ ఉనికిని, వందేళ్లకు పైగా చరిత్ర కలిగి జనసామాన్యంలో గుర్తింపును, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 19.5 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీని... బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే స్థానం నుంచి తప్పించే సామర్థ్యం ‘దీదీ’కి ఉందా? కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కాగలదా? బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయగలదా? దాదాపు 200 స్థానాల్లో బీజేపీని నేరుగా ఎదుర్కొనే స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ను కాదనుకొని మమతా వెనుకనడిచే విపక్ష, ప్రాంతీయ పార్టీలు ఎన్ని? వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఇళ్లు చక్కదిద్దుకోండి... సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీని ఏడాదికి పైగా నడుపుకొస్తున్నారు. ఆమెకు ఆరోగ్య సమస్యలున్నాయి. భావినేతగా భావించిన రాహుల్‌గాంధీ సత్తా ఏంటో తేలిపోయింది. పోరాటపటిమ లోపించిందని, రాజకీయాలను సీరియస్‌గా తీసుకోరనే ముద్ర పడిపోయింది. పైగా కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. సీనియర్లతో కూడిన జి–23 గ్రూపు అధినాయకత్వాన్నే ప్రశ్నిస్తోంది. అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో పంజాబ్‌లో పరువుబజారున పడింది. అమరీందర్ సింగ్‌ను పొమ్మనకుండా పొగపెట్టడంతో ఆయన సొంత పార్టీనే స్థాపించారు. దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎంగా చేసినా... పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ నిత్యం ఏదో ఒక తలనొప్పి తెస్తూనే ఉన్నారు. నాలుగు నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఈ కుమ్ములాటలు ఏంటని కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇక రాజస్తాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలెట్ వర్గాల మ ధ్య ఆధిపత్యపోరు అందరికీ తెలిసిందే. చత్తీస్‌గఢ్‌లోనూ భూపేష్ బఘేల్‌పై అసంతృప్తి చాలాకాలంగా రగులుతోంది. దీదీ ఇప్పుడు సరిగ్గా ఈ పాయింట్‌నే లేవనెత్తుతున్నారు. ఇంటిని చక్కదిద్దుకోలేని వాళ్లు... ఇతరులకు ఏం నాయకత్వం వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరెవరు ఉన్నారు...? మోదీ ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు/ రాహుల్‌కు లేనపుడు మరెవరున్నారు? శరద్ పవార్‌కు 80 ఏళ్లు, రాజకీయ జీవితం చరమాంకంలో ఉన్నారు. ఒకప్పుడు మోదీకి ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కల చెదిరి ఎన్డీయే పంచన చేరిపోయారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా... బీసీ నాయకుడిగా (కుర్మీ) నితీశ్‌కు ఉన్న ఇమేజి నుంచి లబ్దిపొందేందుకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పుకునేందుకు కమలదళం ఆయనకు సీఎం పీఠం అప్పగించింది. 21 ఏళ్లుగా ఒడిశా సీఎంగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ (75 ఏళ్లు) ఎన్డీయే నుంచి వైదొలిగినా... ఇరుపక్షాలకు సమదూరం పాటిస్తూ తటస్థ వైఖరితో ఉన్నారు. పైగా ఆయనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు లేదు. దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తానన్న ఒకప్పటి బ్యూరోక్రాట్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ, పంజాబ్‌ను దాటి ప్రభావం చూపలేకపోయారు. వెనుకడుగు వేయకపోవడమే దీదీ బలం రాజకీయాల్లో చేరినప్పటి నుంచే మమతకు ఫైర్‌బ్రాండ్‌గా పేరుంది. పోరాటమే ఆమె ఊపిరి. ఎట్టి పరిస్థితుల్లో, ఎంతటి ప్రతికూలతలు ఎదురైనా తలవంచని నైజం. మొన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో ఆమె ధీరత్వం మరింత ప్రస్పుటమైంది. మోదీని ఢీకొట్టే శక్తి ఆమెకే ఉందని జనబాహుళ్యంలో అభిప్రాయం బలపడుతోంది. మరోవైపు విపక్షాలకు రోజురోజుకు కాంగ్రెస్‌పై నమ్మకం సడలుతోంది. ఈ రెండింటినీ తనకు అనుకూలాంశాలుగా మలచుకొని... మోదీకి ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మమత. యూపీ (80), మహారాష్ట్ర (48) తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలున్న మూడోరాష్ట్రం బెంగాల్, 2019లో బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో (43.39 శాతం ఓట్లతో) 22 సీట్లు సాధించిన మమత... తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఓట్లశాతాన్ని 47.94 శాతానికి పెంచుకోగలిగారు. 2024కు వచ్చేసరికి బెంగాల్లో 42 సీట్లలో కనీసపక్షం 35 గెలిచినా... ఒకటి, రెండు లోక్‌సభ స్థానాలుండే ఈశాన్యరాష్ట్రాలు, గోవా లాంటి చోట్ల విస్తరిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? కాంగ్రెస్‌తో పొసగని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే ప్రస్తుతం మమతతో సన్నిహితంగా మెలుగుతోంది. 2024 ఇంకా సమయం ఉంది కాబట్టి ఇతర ప్రాంతీయ పార్టీలు వేచిచూసే ధోరణిని అవలంభిస్తాయి. ఆలోపు మాత్రం కాంగ్రెస్‌ను వీలైనంతగా దెబ్బతీసి... తనను తాన ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించుకునే ప్రయత్నం మమత సీరియస్‌గా చేస్తున్నట్లు కనపడుతోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆమె అడుగులు, ఎత్తుగడలు కూడా అలాగే ఉన్నాయి. అందుకే వీలైనంతగా విపక్షనేతలను కలిసి వారితో సంబంధాలు నెరుపుతున్నారు. వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈశాన్యంలో విస్తరణపై దష్టి అఖిల భారత మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సుస్మితా దేవ్ (అస్సాం)ను టీఎంసీలో చేర్చుకున్నారు. రాజ్యసభకు పంపారు. రాయిజోర్ దళ్ నేత, ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్‌ను ఆయన పార్టీని టీఎంసీలో విలీనం చేయాలని కోరారు. అస్సాం అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే తమకు ముఖ్యమని, అందుకే విలీనానికి అంగీకరించలేదని, తృణమూల్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమేనని ఆయన ప్రకటించారు. త్రిపురలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాన్ని దష్టిలో పెట్టుకొని నాలుగైదు నెలలుగా త్రిపురలో బలపడటానికి మమత గట్టి ప్రయత్నమే చేశారు. కాకపోతే మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 334 స్థానాలకు గాను బీజేపీ 329 చోట్ల నెగ్గి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. సీట్లు రాకున్నా త్రిపురలో ఎంట్రీ ఇచ్చిన కొద్దినెలల్లోనే టీఎంసీ దాదాపు 20 శాతం ఓట్లను తెచ్చుకోవడం గమనార్హమని అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు. మేఘాలయలో కాంగ్రెస్‌కు చావుదెబ్బ మేఘాలయలో 17 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ను మమత గట్టి దెబ్బకొట్టారు. నవంబరు 24న మాజీ సీఎం ముకుల్ సంగ్మాతో సహా 12 ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా అక్కడ టీఎంసీ ప్రతిపక్షపార్టీగా అవతరించింది. 2022 ఫిబ్రవరి– మార్చి నెలల్లో జరిగే గోవా ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ప్రకటించిన టీఎంసీ వేగంగా పావులు కదిపింది. కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ సీఎం లుజిన్హో ఫలేరోను, భారత టెన్నిస్ దిగ్గజం లియాండ్ పేస్‌ను మమత అక్కున చేర్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే లుజిన్హో ఫలేరోను బెంగాల్ నుంచి రాజ్యసభకు పంపారు. టీఎంసీ ఉపాధ్యక్షుడిగా కూడా నియమించారు. మేఘాలయ, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో తృణమూల్‌కు రాష్ట్ర పార్టీగా ఇప్పటికే గుర్తింపు ఉంది. ఢిల్లీకి చెందిన మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ కీర్తీ ఆజాద్, రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా పేరున్న అశోక్ తన్వర్‌లు గత వారమే టీఎంసీలో చేరారు. జి–23 నేతల్లోనూ చాలామందితో ఆమె టచ్‌లో ఉన్నారనేది తెరపైకి వస్తున్న మరో కొత్త అంశం. ఇటీవలే జీ–23 నేతల్లో ఒకరైన గులాంనబీ ఆజాద్‌కు సన్నిహితులైన నలుగురు మాజీ కశ్మీర్ మంత్రులతో సహా 20 మంది కాంగ్రెస్ గుడ్‌బై కొట్టారు. సుస్మితాదేవ్, లుజిన్హో ఫలేరోలను పార్టీలో చేరిన వెంటనే రాజ్యసభకు పంపడం ద్వారా కాంగ్రెస్ నేతలకు తాను సముచిత స్థానం, గౌరవం ఇస్తానని మమత సంకేతాలు పంపుతున్నారు. అఖిలపక్షానికీ దూరం పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సోమవారం (నవంబరు 29) రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే చాంబర్లో అఖిలపక్ష భేటీ జరిగింది. దీనికి తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉండటం గమనార్హం. ఆప్ కూడా డుమ్మా కొట్టింది. అలాగే 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌పై నిరసనల్లోనూ టీఎంసీ... కాంగ్రెస్‌కు దూరం పాటించింది. లోక్‌సభలో వాకౌట్ కూడా చేయలేదు. రాజ్యాంగంలో రాసుందా? నవంబరు 22న మమత ఢిల్లీకి వచ్చారు. మూడురోజులు దేశరాజధానిలో ఉన్నారు. బెంగాల్‌కు సంబంధించిన వ్యవహారాలపై ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తారని అంతా భావించినా... అలాంటిదేమీ జరగలేదు. ఇదే విషయాన్ని 24న ఓ విలేకరి ప్రశ్నిం చగా... మమత సహనం కోల్పోయారు. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ సోనియాను కలవడం తప్పనిసరా? అలాగని రాజ్యాంగంలో రాసుందా? అంటూ సదరు విలేకరిని ఎదురు ప్రశ్నించారు. నేనెవరి అపాయింట్‌మెంట్‌నూ కోరలేదు... వారు పంజాబ్ ఎన్నికల సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. వారి పార్టీ కోసం వారిని పనిచేసుకోనివ్వండి’ అని అన్నారు. దీదీకి కాంగ్రెస్ పొడగిట్టడం లేదని ఆమె మాటలు స్పష్టం చేశాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
అభివృద్ధి ఎజెండాకు విపక్షాల అడ్డంకులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆరోపించారు. ఆయన సోమవారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమీక్షా సమావేశం, పార్టీ జాతీయ ఆఫీసు బేరర్ల భేటీలో పాల్గొన్నారు. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో బీజేపీ కార్యకర్తలు సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశం కోసం పనిచేశారని నడ్డా అభినందించారు. బీజేపీ జాతీయ ఆఫీసు బేరర్ల భేటీ వివరాలను చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మీడియాకు తెలియజేశారు. ఈ సమావేశంలో కోవిడ్–19 మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి ఎజెండా, ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ వంటి కార్యక్రమాలను నడ్డా ప్రస్తావించారు. వీటిని పార్టీకి చెందిన వివిధ మోర్చాల ద్వారా క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాలి్సన ప్రణాళికలపై చర్చ జరిగింది. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలపైనా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇన్‌చార్‌్జలుగా ఉన్న ప్రధాన కార్యదర్శులు, ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు నియమించిన ఇన్‌చార్‌్జలు ఇచ్చిన నివేదికలపై చర్చ సాగింది. వ్యాక్సినేషన్లో ఉచితంగా ఇస్తున్న టీకా డోసులు వంద కోట్లకు చేరువవుతున్నాయని, ఈ ఘట్టాన్ని జాతీయ పండుగగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
ప్రతిపక్షాలది దగాకోరు రాజకీయం
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ప్రతిపక్షాలు బూటకపు మేధోతనాన్ని, దగాకోరు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. దశాబ్దాల క్రితమే అనేక ప్రయోజనాలు పొందాల్సిన ప్రజలకు ఇంతవరకు ఎలాంటి ఫలాలు అందలేదని, అలాంటివారికి సరైన ఫలితాలు అందించాలంటే భారీ, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓపెన్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. నూతన సాగు చట్టాలు, జీఎస్టీ అమలు, ఆధార్, నూతన పార్లమెంట్ భవన నిర్మాణం తదితర అనేక అంశాలపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన దుయ్యబట్టారు. ఈ అంశాలన్నింటిపై తొలుత ఏకీభవించిన తర్వాత రాజకీయ కారణాలతో విపక్షాలు యూటర్న్ తీసుకొని ద్వేషపూరిత ప్రచారం ఆరంభించాయని ఆరోపించారు. ప్రస్తుతం సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నవారిని చూస్తే ప్రజలకు బూటకపు మేధోతనం, దగాకోరుతనమంటే ఏమిటో తెలుస్తోందన్నారు. ఒక రాజకీయ పార్టీ ఒక వాగ్దానమిచ్చి తర్వాత నెరవేర్చలేకపోవడం వేరని, కానీ సంస్కరణలపై ముందు ఏకీభవించి తర్వాత యూటర్న్ తీసుకొని దు్రష్పచారం చేయడం సహించరానిదని ఆరోపించారు. ఇప్పుడు తమ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నవారే వారివారి మేనిఫెస్టోల్లో ఇవే అంశాలను పొందుపరిచారని, అయితే ప్రజామోదం పొందిన తమ పార్టీ వీటిని అమలు చేయడంతో సహించలేక అనైతికంగా వ్యవహిస్తున్నారని విమర్శించారు. రైతులకు ఏది ప్రయోజనం అని ఆలోచించకుండా తమ రాజకీయాలకు ఏది ప్రయోజనమని విపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. కరోనా కట్టడిలో భేష్ అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా కరోనాను కట్టడి చేయడంలో భారత్ ఎంతో మెరుగ్గా వ్యవహరించిందని మోదీ చెప్పారు. కోవిడ్ విషయంలో తమ ప్రభుత్వ చర్యలను విమర్శించిన వారిపై ఆయన విరుచుకుపడ్డారు. వీరి లక్ష్యం అంతర్జాతీయంగా భారత్ పేరును నాశనం చేయడమేనని నిప్పులు చెరిగారు. కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడ్డాయని, మనం మాత్రం నెగిటివ్ ప్రచారాలను తట్టుకొని కరోనా కట్టడిలో మెరుగ్గా వ్యవహరించామని చెప్పారు. అవసరం వచి్చనప్పుడు ఇండియా ఐక్యంగా నిలబడుతుందనే పాఠాన్ని కోవిడ్ తెలియజేసిందన్నారు. ‘‘భారత్ టీకాను రూపొందించకపోతే ఏమయ్యేదో ఆలోచించండి. పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పటికీ ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కోవిడ్ టీకా లభించడం లేదు. కానీ మనం వ్యాక్సినేషన్లో విజయవంతం అయ్యాము.’’అని చెప్పారు. స్వాలంబంన(ఆత్మనిర్భరత) ఇందుకు కారణమన్నారు. విమర్శలను తాను స్వాగతిస్తానని, ఆరోగ్యవంతమైన పురోగతికి ఇవి అవసరమని ఆయన చెప్పారు. కానీ అలాంటి నిజమైన విమర్శలు చాలా స్వల్పమని, అసంబద్ధ ఆరోపణలే అధికమని విచారం వ్యక్తం చేశారు. మిమ్మల్ని మీరే అవహేళన చేసుకుంటున్నారు నూతన పార్లమెంటు ఆవశ్యకతపై గొంతెత్తిన పారీ్టలే నేడు తాము నిర్మిస్తున్న నూతన భవన సముదాయాన్ని వ్యతిరేకిస్తున్నాయని, ఇది వారిని వారు అవహేళన చేసుకోవడమేనని మోదీ ఎద్దేవా చేశారు. గతంలో ఈ పార్టీల నేతలు కొత్త భవనం కావాలని కోరలేదా? అని ప్రశ్నించారు. దాన్ని సాకారం చేయాలని యతి్నస్తుంటే ఏవో కుంటిసాకులతో వ్యతిరేకించడం ఎంతవరకు సబబన్నారు. నిజానికి దేశ ప్రజలకు అనేక ప్రయోజనాలు దశాబ్దాల క్రితమే అందాల్సిఉందని, కానీ ఇంతవరకు వీరికి సరైన ఫలాలు అందలేదని వివరించారు. అలాంటివారికి సత్ఫలితాలివ్వడానికి పనిచేస్తున్నామని, ఇందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తే తీసుకుంటామని చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో చర్చలకు సిద్ధమని తమ ప్రభుత్వం తొలినుంచి చెబుతోందని గుర్తు చేశారు. ఇప్పటికి అనేక మార్లు వారితో చర్చలు జరిపామని, కానీ నిజానికి చట్టాల్లో ఏం మార్చాలో వారికే స్పష్టత లేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలన్నీ కాం గ్రెస్ గోత్రీకుల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యేవని ఎద్దేవా చేశారు. అందుకే గత ప్రభుత్వాలన్నీ ఒకేవిధమైన రాజకీయ, ఆర్థిక ఆలోచనతో వ్యవహరించాయని, కానీ తొలిసారి వాజ్‌పేయికి ప్రజలు ప్రత్యామ్నాయ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తన హయాంలో తొలిసారి కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారన్నారు. ప్రజలు సంపూర్ణ మార్పు కోరారనేందుకు ఇదే నిదర్శనమన్నారు. -
సెంట్రల్ విస్టాపైనా విమర్శలా?
న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ప్రధాని∙మోదీ విమర్శించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో రక్షణ శాఖ కార్యాలయ భవనాలు భాగమేనని, ఈ విషయంలో ప్రతిపక్షాలు నోరెత్తడం లేదని పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కస్తూ ర్బాగాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూలో నిర్మించిన రెండు నూతన బహుళ అంతస్తుల రక్షణ శాఖ కార్యాలయ కాంప్లెక్స్‌లను మోదీ గురువారం ప్రారంభించారు. ఇక్కడ 7,000 మందికిపైగా రక్షణ శాఖ, సైనిక దళాల ఉద్యోగులు పని చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తవుతుందన్న నమ్మకం ఉందన్నారు. భారత రక్షణ దళాలు మరింత సమర్థంగా, ప్రభావవంతంగా పని చేసేందుకు మనం కొనసాగిస్తున్న ప్రయత్నాలకు ఈ నూతన డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్‌లు బలం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని అంటే కేవలం నగరమేనా? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మించిన స్థావరాల నుంచే ఇప్పటిదాకా రక్షణ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు సాగాయని, ఆధునిక అవసరాల దృష్ట్యా కొత్త భవనాలు నిర్మించినట్లు మోదీ వివరించారు. ఇకపై దేశ రక్షణకు సంబంధించి త్రివిధ దళాల కార్యకలపాలు ఇక్కడి నుంచి నడుస్తాయని అన్నారు. రాజధానిలో ఆధునిక రక్షణ వ్యవస్థను సృష్టించే యజ్ఞంలో ఇదొక భారీ ముందడుగు అని వ్యాఖ్యానించారు. డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్‌ల గురించి మాట్లాడితే ఆరోపణల్లోని డొల్లతనం బయటపడుతుందనే భయంతో దీనిపై నోరువిప్పడం లేదని ప్రతిపక్ష నేతలపై మోదీ ధ్వజమెత్తారు. రాజధాని అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదని, దేశ బలం, సంస్కృతి, ఆలోచనా శక్తి, అంకితభావానికి చిహ్నమని ఉద్ఘాటించారు. డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్‌లను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. నిధులు, వనరులను రక్షణ శాఖ సమకూర్చింది. వీటితో 9.60 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీసు స్పేస్ అందుబాటులోకి వచ్చింది. 14 కార్యాలయాలను కేజీ మార్గ్ కాంప్లెక్స్‌లోకి, 13 కార్యాలయాలను ఆఫ్రికా అవెన్యూ కాంప్లెక్స్‌లోకి తరలించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆఫ్రికా అవెన్యూలోని డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. త్రివిధ దళాల అధికారులతో సమావేశమయ్యారు. -
నేడు విపక్ష నేతలతో సోనియా వర్చువల్ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలతో నేడు సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం 4.30 గంటలకు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్, హేమంత్ సోరెన్, శరద్ పవార్, సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విపక్షాల ఐక్యత, కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి ప్రతిపక్ష పార్టీలను సిద్ధం చేయటం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించటం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. చదవండి : పన్నీరుకు ‘ఇంటిగండం’..? ‘చెన్నై’కు మైసూర్ శిలాఫలకాలు -
ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు మొసలి కన్నీరు మాని పార్లమెంటులో వారి ప్రవర్తనపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, ప్రభుత్వం ఎంపీలపై దాడి చేసిందని విపక్షాలు నిరసన ర్యాలీలో విమర్శలు గుప్పించగా దీనికి కౌంటర్‌గా 8 మంది కేంద్ర మంత్రులు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మార్షల్స్‌పై విపక్ష సభ్యులు దురుసుగా ప్రవర్తించారని ప్రత్యారోపణ చేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్, నఖ్వీ, భూపేంద్ర యాదవ్, అర్జున్ మేఘ్వాల్, వి.మురళీధరన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాహితంపై వారికి చింతలేదు అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ‘దేశ ప్రజలు తమ సమస్యలు పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వస్తాయని ఆశించారు. దేశ ప్రజల హితం కానీ, రాజ్యాంగ విలువలపై గానీ వారికి చింత లేదు. విపక్షాలు మొసలి కన్నీరు కార్చడం ఆపి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని పేర్కొన్నారు. ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ‘పార్లమెంటు సమావేశాల ముందు అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడే విపక్షాలు సభను నడవనివ్వమన్న సంకేతాలు ఇచ్చాయి. సభను నడవనివ్వబోమని చెప్పేశారు. మేం చాలా సందర్భాల్లో వారితో మాట్లాడాం. కనీసం మొదటి రోజు మంత్రి మండలిలోని నూతన సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని అనుమతించాలని కోరాం. అందుకు కూడా ఒప్పుకోలేదు. రెండు సభల్లో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాల్లో వారు వారి డిమాండ్లను పెట్టారు. స్వల్పకాలిక చర్చలు జరపాలని కోరారు. ధరల పెరుగుదల, కోవిడ్, వ్యవసాయం తదితర అంశాలపై చర్చకు చైర్మన్ అనుమతించారు. పెగసస్ వంటి అంశాలను పట్టుబట్టుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సభాకార్యకలాపాలకు విఘాతం కలిగించారు. ముఖ్యమైన బిల్లులను కూడా చర్చకు అనుమతించలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇలా ఎన్ని చేశారో రికార్డులు చూడొచ్చు.. ఆనాడు ఏపీ విభజన వంటి ముఖ్యమైన బిల్లులు కూడా గందరగోళంలో ఆమోదింపజేసుకున్నారు’ అని దుయ్యబట్టారు. ‘నాలుగో తేదీన ఆరుగురు సభ్యులను సస్పెండ్ చేయగా.. గ్లాసులు పగలగొట్టుకుని లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. అధికారులకు గాయాలయ్యేలా చేశారు. రాజ్యసభలో టేబుల్ ఎక్కి ఆందోళన చేశారు. అది బిల్లుపై చర్చ కూడా కాదు. చర్చకు సిద్ధంగా ఉంటే సభను సోమవారం వరకూ నిర్వహిస్తామని చెప్పాం. కానీ వారు సహకరించకపోగా.. ఇన్సూరెన్స్ బిల్లు, ఓబీసీ బిల్లు ఆమోదింపజేసుకుంటే మంగళవారం నాటి పరిణామాల కంటే తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడేమో మహిళా ఎంపీలపై పురుష మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. దేశ ప్రజలు చూస్తున్నారు. వారికి ఏమాత్రం ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేం రాజ్యసభ చైర్మన్‌ను కూడా కోరాం. విపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాం.. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఇది పునరావృతం కాకూడదు..’ అని పేర్కొన్నారు. మార్షల్స్‌పై దాడులకు దిగారు: గోయల్ రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని మండిపడ్డారు. సభ ఆస్తులను ధ్వంసం చేశారని, మార్షల్స్‌పై దురుసుగా ప్రవర్తించారని, భౌతిక దాడులకు దిగారని, వారి దుష్ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 12 మంది మహిళా మార్షల్స్, 18 మంది పురుష మార్షల్స్.. మొత్తం 30 మంది మార్షల్స్ మాత్రమే ఉన్నారని వివరించారు. విపక్షాలది కేవలం డ్రామా అని, ఓబీసీ బిల్లు విషయంలో కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చర్చను సాగనిచ్చారని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఈ మంత్రులంతా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యని కలిసి సభలో పార్లమెంటరీ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దురదృష్టకరమైన రీతిలో ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బయటివారెవరూ లేరు.. ఉభయ పక్షాలు తనతో భేటీ అయిన అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అధికారులతో సమావేశం నిర్వహించి మంగళవారం నాటి పరిణామాలను మరోసారి ఆరాతీశారు. బయటివారెవరూ సభలోకి రాలేదని, తొలుత 14 మంది మార్షల్స్ ఉన్నారని, క్రమంగా సభలో పరిస్థితిని బట్టి మార్షల్స్ సంఖ్య 42కు చేరిందని వారు చైర్మన్‌కు నివేదించారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే! పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, సభాకార్యకలాపాలకు కొందరు ఎంపీలు విఘాతం కలిగించిన తీరుపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తను సహించకూడదని, తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో చోటుచేసుకున్న దురదృష్టకరమైన సంఘటనలను సమీక్షించేందుకు గురువారం వీరిద్దరూ సమావేశమయ్యారని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. సభాపతులు పదేపదే చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ అత్యున్నత చట్టసభ హుం దాతనాన్ని దిగజార్చేలా వ్యవహరించారని వీరిరువూ అభిప్రాయపడ్డట్లు అధికారులు తెలిపారు. గతంలో జరిగిన సంఘటనల ను, తీసుకున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని, భవిష్యత్తు కార్యాచరణకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయని సభాపతులు అభిప్రాయపడ్డారు. -
ఆరు బిల్లులు.. మూడింటికి ఆమోదం
న్యూఢిల్లీ: పెగసస్ నిఘా వ్యవహారం, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర అంశాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు తమ నిరసన, నినాదాలను కొనసాగించాయి. లోక్‌సభలో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే ప్రభుత్వం ఆరు బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిలో మూడు బిల్లులు ఆమోదం పొందాయి. తమ డిమాండ్లపై చర్చించాలంటూ సభా కార్యకలాపాలకు ప్రతిపక్షాలు అడ్డు తగులుతుండడంతో పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. సభ సజావుగా సాగకున్నా బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదిస్తుండడం పట్ల కాంగ్రెస్ పార్టీ సభ్యులు అధిర్ రంజన్ చౌదరి, మనీష్ తివారీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య నియమాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. 10 నిమిషాల్లోనే బిల్లులా? లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్(అమెండ్మెంట్) బిల్లు–2021, ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(అమెండ్మెంట్) బిల్లు–2021, కానిస్టిట్యూషన్(షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (అమెండ్మెంట్) బిల్లు–2021, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి(అమెండ్మెంట్) బిల్లు–2021, నేషనల్ కమిషనర్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్(అమెండ్మెంట్) బిల్లు–2021తోపాటు కానిస్టిట్యూషన్ (127వ సవరణ) బిల్లు–2021ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే బిల్లులను ప్రవేశపెట్టారని ఆర్ఎస్పీ సభ్యుడు ప్రేమచంద్రన్ విమర్శించారు. ఇలా చేయడాన్ని దోసెలు వేయడంతో పోల్చారు. లోక్‌సభ సోమవారం ఉదయం ప్రారంభమైన తర్వాత స్పీకర్ బిర్లా క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వారికి సభ తరపున నివాళులరి్పంచారు. టోక్యో ఒలంపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు ఓంబిర్లా అభినందనలు తెలిపారు. పెగసస్‌పై కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మేఘవాల్ మధ్య వాగ్వాదం జరిగింది. పెగసస్, సాగు చట్టాలపై ప్రతిపక్షాలు పట్టు వీడకుండా ఆందోళనలు కొనసాగిస్తుండడంతో సోమవారం రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ట్యాకేషన్ చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికంటే కేవలం కొన్ని నిమిషాల ముందు సప్లిమెంటరీ అజెండాను అందజేయడం ఏమిటని కాంగ్రెస్ ఎంపీ ఖర్గే ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు విధానాలను తాము అంగీకరించబోమంటూ కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. లోక్‌సభలో.. రాష్ట్రాలకు ‘ఓబీసీ’ అధికారాల పునరుద్ధరణ బిల్లు ఇతర వెనకబడిన తరగతుల జాబితాను సొంతంగా సిద్ధంచేసే అధికారాలను రాష్ట్రాలకు మళ్లీ కట్టబెట్టేందుకు ఉద్దేశించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లు–2021ను కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సమాఖ్య స్ఫూర్తిని మరింతగా పెంపొందించేందుకు వీలుగా సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతు(ఎస్ఈబీసీ)ల జాబితాలను రాష్ట్రాలు సొంతంగా రూపొందించుకునేందుకుగాను ఆర్టికల్ 342ఏ, తదనుగుణంగా ఆర్టికల్ 338బీ, 366లకు రాజ్యంగ సవరణలు చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. బిల్లును సభలో ప్రవేశపెట్టగానే కొందరు కాంగ్రెస్ సభ్యులు సహా చాలా మంది సభ్యులు ఈ బిల్లుకు తమ పూర్తి మద్దతు తెలిపారు. పెగసస్ అంశంపై వెల్‌లోకి దూసుకెళ్లి సభ కొనసాగుతున్నంతసేపూ నిరసన తెలుపుతున్న సభ్యులు నిరసనలు ఆపి వెనక్కి వచ్చి కూర్చుని బిల్లుకు మద్దతు పలకడం గమనార్హం. -
రైతు వ్యతిరేక చట్టాలు వద్దేవద్దు
న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని 14 ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేశారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు సాగిస్తున్న పోరాటానికి సంఘీభావంగా వారు శుక్రవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కిసాన్ సంసద్‌లో (రైతుల పార్లమెంట్) పాల్గొన్నారు. అంతకముందు ప్రతిపక్ష నేతలంతా పార్లమెంట్ హౌస్ వద్ద కలుసుకొని, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు. అనంతరం బస్సులో జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. ‘నల్ల’ వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలవాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దేశంలోని రైతులందరికీ తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. నల్ల సాగు చట్టాలపై కేవలం చర్చలతో కాలయాపన చేస్తే సరిపోదని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెగసస్ నిఘా అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. దేశంలో ప్రజల ఫోన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిఘా పెట్టారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కిసాన్ సంసద్‌లో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత మనోకుమార్ ఝా, సీపీఎం నుంచి ఎలమారమ్ కరీమ్, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, ఐయూఎంఎల్ నేత మహమ్మద్ బషీర్, డీఎంకే నాయకుడు తిరుచ్చి శివ తదితరులు పాల్గొన్నారు. టీఎంసీ, ఆప్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కిసాన్ సంసద్ వద్ద ప్రతిపక్ష నేతలతో కలిసి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ -
మెట్టు దిగని విపక్షాలు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ నిఘా, కొత్త వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు పట్టిన పట్టు వీడకుండా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గురువారం సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తూ నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో విపక్ష సభ్యులు హోరెత్తించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేదాకా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లోక్‌సభ ఉదయం ప్రారంభం కాగానే స్పీకర్ బిర్లా టోక్యో ఒలింపిక్ క్రీడల్లో 41 ఏళ్ల తర్వాత పతకం సాధించిన భారత హాకీ జట్టుకు అభినందనలు తెలియజేశారు. పలు క్రీడల్లో పతకాలు సొంతం చేసుకున్న భారత మహిళా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. సభలో ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి చేరుకొని నినాదాలు మొదలుపెట్టారు. ప్రతిపక్షాల నిరసన కొనసాగుతుండగానే 10 ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలను సభ్యులు అడిగారు. ప్రశ్నోత్తరాల్లో ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉందని, ఇందులో పాలుపంచుకోవాలని స్పీకర్ కోరారు. పార్లమెంట్ సభా సంప్రదాయాలను ఉల్లంఘించవద్దని సూచించారు. పార్లమెంట్ సమావేశాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని, సభ ఎందుకు సాగడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు లెక్కచేయకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఢిల్లీలో దళిత బాలికపై అత్యాచారం, హత్య ఘటనను సభలో లేవనెత్తారు. దీనిపై స్పందించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత అధిర్ రంజన్ దీనిపై మళ్లీ మాట్లాడారు. దళిత బాలిక వ్యవహారంపై కాంగ్రెస్ వాదనను కేంద్ర సహాయ మంత్రి మేఘవాల్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు–2021ను ప్రవేశపెట్టారు. ఇన్‌కం యాక్ట్ ఆఫ్ 1961, ఫైనాన్స్ యాక్ట్ ఆఫ్ 2012కు సవరణ చేస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఎగువ సభలో రెండు బిల్లులకు ఆమోదం తమ డిమాండ్లపై రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. పెగసస్, కొత్త సాగు చట్టాలపై సభలో చర్చించాలని పేర్కొన్నారు. వారి ఆందోళనలు, నినాదాల కారణంగా సభను సభాపతి పలుమార్లు వాయిదా వేశారు. ఒకవైపు విపక్షాల నినాదాలు కొనసాగుతుండగానే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ‘ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఆమోదించింది. ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ బిల్లు–2021’ను గురువారం లోక్‌సభలో ఆమోదించారు. ఈ బిల్లుపై పర్యావరణ మంత్రి భూపేందర్ రాజ్యసభలో మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వాయు కాలుష్యానికి కారణమైన వారికి సెక్షన్ 14 కింద జరిమానా విధిస్తారని, పంటల వ్యర్థాలను దహనం చేసే రైతులకు ఈ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశారు. ఈ బిల్లు వాయు కాలుష్యానికి సంబంధించినదని, సభలో మాత్రం శబ్ద కాలుష్యం ఉందని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. -
ప్రతిపక్షాలది ‘సెల్ఫ్ గోల్’ : ప్రధాని మోదీ
లక్నో: ప్రజాసంక్షేమమే పరమావధిగా కొనసాగే పార్లమెంట్ సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ విపక్షాలు ‘సెల్ఫ్ గోల్’ చేసుకుంటున్నాయని ప్రధాని మోదీ విపక్షాల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఒకవైపు, పలు రంగాల్లో విజయపరంపరలో ‘గోల్’ తర్వాత గోల్ కొడుతూ దేశం ముందుకు సాగుతుంటే, మరో పక్క స్వీయ ప్రయోజనాలు చూసుకుని విపక్షాలు ‘సెల్ఫ్ గోల్స్’ చేస్తున్నాయని మోదీ ఆరోపించారు. ప్రధానమంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన దినోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తున్న సందర్భంగా గురువారం కేంద్రప్రభుత్వ ఆహార భద్రతా పథకం లబ్దిదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. గత ఏడాది అయోధ్య రామమందిరం కోసం ‘భూమి పూజ’ కార్యక్రమాన్నీ ఘనంగా చేసుకున్నాం. ఈసారి ప్రఖ్యాత ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్టు విజయకేతనం ఎగరేసింది. 50 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయింది. రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూళ్లు, వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయ పెరుగుదల, విక్రాంత్ యుద్ధవిమాన వాహక నౌక తయారీ.. ఇలా దేశం ఎంతగా పురోగతిని కోరుకుంటోంది.. ఎంతటి ఘన విజయాలను సాధిస్తోంది. ఎంతగా దేశం పురోగమిస్తుందనేవి ఏవీ విపక్షాలకు పట్టవు. స్వీయ ప్రయోజనాలే లక్ష్యంగా పెగసస్ అంశంపై పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి ’ అని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. యూపీ సీఎంను ఉద్దేశిస్తూ.. ‘ ఆయన సీఎం యోగి మాత్రమే కాదు. కర్మయోగి’ అని కొనియాడారు. మానవాళికి సవాలుగా పరిణమించిన మహా విపత్తును ఎలా ఎదుర్కోవాలా అని ప్రతీ పౌరుడు శ్రమిస్తుంటే.. వీరు( విపక్ష సభ్యులు) జాతి ప్రయోజనాలకోసం చట్టాలు చేసే పార్లమెంట్ సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ వీరు దేశ ప్రగతిని ఆపే పనిలో ఉన్నారు. కానీ 130 కోట్ల భారతీయులు దేశం ముందుకు సాగడం కోసం పాటుపడుతున్నారు. భారత్ ముందడుగు వేస్తోంది(భారత్ చల్ పఢా హై)’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ దేశ ప్రగతి పథం ఢిల్లీకి యూపీ మీదుగా వెళ్తోంది. యూపీని వాడుకుని కొన్ని ‘కుటుంబాలు’ మాత్రమే బాగుపడ్డాయి. ఆ కుటుంబాల వారు యూపీ అభివృద్ధికి చేసింది శూన్యం ’ అని మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. -
పార్లమెంట్‌ను కుదిపేసిన పెగసస్
న్యూఢిల్లీ: పెగసస్ దుమారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌పై నిగ్గు తేల్చాలంటూ ప్రతిపక్షాలు ఉభయసభలను అడ్డుకున్నాయి. దీంతో పలుమార్లు సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం సభ ఆరంభమైన వెంటనే సభ్యులు కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మీరాబాయి చానును అభినందించారు. వెంటనే రాజ్యసభలో కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకుపోయారు. రూల్ 267 కింద విపక్ష నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, వేణుగోపాల్, తిరుచ్చి శివ, సుకేందు శేఖర్ రాయ్, ఎలమారమ్ కరీన్ తదితరులు ఇచ్చిన నోటీసులను అనుమతించేది లేదని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య చెప్పారు. సభ్యులు కోరుకునే అంశాలపై చర్చ సభా సాధారణ సమయంలో చేయవచ్చన్నారు. రోజూవారీ కార్యకలాపాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చించేందుకు రూల్ 267 కింద నోటీసులు ఇస్తారు. విపక్ష సభ్యులు ప్రజాసంబంధమైన అంశాలను చర్చించకుండా అడ్డుకుంటున్నారంటూ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. కరోనా టీకాలు, నిరుద్యోగిత, విద్యాసమస్యలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు, దక్షిణాఫ్రికాలో భారతీయులపై దాడులు, పత్రికా స్వేచ్ఛ, కావేరీ జలాల పంపిణీ వంటి పలు అంశాలు చర్చకు రాకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్నారు. సభ ఐదుమార్లు వాయిదా పడింది. సాయంత్రమైనా సాగని సభ రాజ్యసభ సాయంత్రం సమావేశమైన తర్వాత వెల్‌లో నిరసన తెలుపుతున్న విపక్ష సభ్యులు తమ తమ సీట్లకు వెళ్లారు. నావిగేషన్ బిల్లుపై చర్చ ఆరంభం కాగానే తిరిగి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. రూల్ 267 కింద చర్చకు అనుమతించాలని ఖర్గే డిమాండ్ చేశారు. పెగసస్ విషయమై ఐటీ మంత్రి ఇప్పటికే సమాధానమిచ్చారని మరో మంత్రి అబ్బాస్ నఖ్వీ గుర్తు చేశారు. ప్రభుత్వం సభా కార్యకలాపాలు సాగేందుకు వీలుగా సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆర్జేడీ విమర్శించింది. అయితే విపక్ష నేతలను తాము సంప్రదించామని, కానీ వారిలో వారికే ఏకాభిప్రాయం రాలేదని లీడర్ ఆఫ్ హౌస్ పీయూష్ గోయల్ తెలిపారు. సభా నియమాల ప్రకారం ప్రధాని, విపక్ష నేత ప్రసంగించే సమయంలో ఎవరూ అడ్డుకోకూడదని, కానీ విపక్ష నేత ఖర్గే ప్రసంగాన్ని ఒకమంత్రి అడ్డుకున్నారని డీఎంకే విమర్శించింది. ఈ వాదోపవాదాల మధ్య సభ మంగళవారానికి వాయిదా పడింది. లోక్‌సభలో అదే ధోరణి రాజ్యసభలో కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పెగసస్‌పై చర్చించాలని విపక్షాలు సభను అడ్డుకున్నాయి. ప్రధాని వచ్చి సభకు సమాధానమివ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ జవాబ్‌దో(మోదీ ప్రభుత్వమా, సమాధానమివ్వు) అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు రెడీగా ఉందని, అందుకు ముందుగా సభ్యులు తమ సీట్లకు వెళ్లాలని స్పీకర్ కోరారు. సభ్యులు వినకపోవడంతో సభ వాయిదా పడింది. అనంతరం సమావేశమవగానే ప్రభుత్వం రెండు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. ఫ్యాక్టరింగ్ నియంత్రణ బిల్లు, ఎన్ఐఎఫ్టీఈఎం బిల్లులను సంబంధిత మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. అయితే వీటిపై చర్చకు విపక్ష సభ్యులు అంగీకరించకుండా వెల్‌లో నిరసనలు కొనసాగించారు. కొందరు రైతు చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యులు చర్చలో పాల్గొనాలని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి జోషీ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. లోకసభ స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి సైతం సభాకార్యకలాపాలు కొనసాగించేందుకు సహకరించాలని సభ్యులను కోరారు. అయినా పరిస్థితి మారలేదు. నిరసనలు ఆగకపోవడంతో చర్చలేకుండానే బిల్లులు ఆమోదం పొందినట్లు రమాదేవి ప్రకటించారు. మధ్యాహ్న సమయంలో ఆర్థికమంత్రి దివాలా చట్ట సవరణ బిల్లును సభ ముందుంచారు. దీనిపై చర్చ జరగలేదు. అనంతరం సభ తర్వాతి రోజుకు వాయిదా పడింది. రెండు బిల్లులకు ఆమోదం నిరసనల మధ్య లోక్‌సభలో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఫ్యాక్టరింగ్ నియంత్రణ సవరణ చట్టం 2020ని ఆర్థిక మంత్రి నిర్మల ప్రవేశపెట్టారు. ఎంఎస్ఎంఈ రంగానికి చేయూతనిచ్చేందుకు ఈ సవరణలు తెచ్చామన్నారు. ఫ్యాక్టరింగ్ చట్టానికి తాజా సవరణలు చేశారు. బిల్లుపై స్టాండింగ్ కమిటీ సూచనలు సైతం ప్రభుత్వం అంగీకరించిందని నిర్మల చెప్పారు. ఎంఎస్ఎంఈ సంస్థలకు మరింత మూలధనం దొరికేందుకు ఈ బిల్లు వీలు కల్పించనుంది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ బిల్లును లోక్‌సభ తొలుత ముందుకు తెచ్చారు. అనంతరం నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఫుడ్‌టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మేనేజ్మెంట్ బిల్ 2021ను సైతం లోక్‌సభ ముందుకు ప్రభుత్వం తెచ్చింది. కొన్ని కీలక ఫుట్టెక్నాలజీ సంస్థలను జాతీయంగా కీలక సంస్థలుగా ప్రకటించడంతో పాటు, ఆయా రంగాల్లో ప్రయోగాలకు సంబం« దించిన వివరాలు ఈ బిల్లులో పొందుపరిచారు. రాజ్యసభలో ఈ బిల్లుకు మార్చిలోనే ఆమోదం లభించింది. విపక్షాల నిరసనతో చర్చలేకుండానే రెండు బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. కార్గిల్ వీరులకు నివాళి కార్గిల్ వీరులకు పార్లమెంట్ ఉభయసభలు ఘనంగా నివాళులు అర్పించాయి. కార్గిల్ విజయ్ దివస్ 22వ వార్షికోత్సవం సందర్భంగా 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించాయి. ‘‘22 సంవత్సరాల క్రితం ఇదే రోజు మన సాహసిక సైనికులు దేశంలో కొంత భూభాగాన్ని ఆక్రమించిన శత్రుమూకను ఓడించాయి. కార్గిల్ హైట్స్‌ను తిరిగి సాధించి దేశానికి గర్వించే విజయాన్ని అందించాయి’’అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో నివాళులు అర్పించారు. భారత జవానుల సాహసాన్ని, త్యాగాన్ని ఆయన కీర్తించారు. అనంతరం సభ్యులు మౌనంగా నిలబడి వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయ్ చానును సభ అభినందించింది. అద్భుత ప్రదర్శనతో చాను వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం కోసం 21 సంవత్సరాల నిరీక్షణకు తెరదించిందని వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. లోక్‌సభ సభ్యులు సైతం కార్గిల్ వీరులకు నివాళులు అర్పించడంతో పాటు చానును అభినందించారు. రాజ్యసభలో మాట్లాడుతున్న ఖర్గే -
PM MODI: మీరు అనుభవించే బాధను..నేను అనుభవిస్తున్నాను!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు ప్రాణ వాయువు సకాలంలో అందడం లేదు. దీంతో అధిక సంఖ్యలో కరోనా రోగులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రస్తుతం దేశంలో 2.43 కోట్లకు పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్‌లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ మేరకు మోదీ మాట్లాడుతూ.. సెకండ్‌వేవ్‌లో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో టెస్టులు పెంచాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడమే కాకుండా, ఇంటింటి సర్వే, టెస్టింగ్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు పడుతున్న బాధలపై శుక్రవారం జరిగిన సమావేశంలో మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎంత బాధ పడ్డారో..నేను అంతే బాధను అనుభవిస్తున్నాను. ఈ 100 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అడుగడుగునా పరీక్షిస్తోంది. ఇది కంటికి కనిపించని శత్రువు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 18 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఆస్పత్రులు ఉచితంగా టీకాలు అందిస్తున్నాయి. కాబట్టి మీవంతు వచ్చినపుడు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి’ అని మోదీ కోరారు. ఇక మూడు వారాలుగా దేశంలో 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3.26 లక్షల కేసులతో నమోదు కాగా..మొత్తం కేసులు 2.43 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా రోగులు మరణిస్తున్నారు. ఆస్పత్రుల్లో పడకలు, మందుల కోసం సోషల్ మీడియాలో అభ్యర్థనలు వెల్లువెత్తున్నాయి. కరోనా కారణంగా అత్యధిక ప్రభావం చూపించిన జిల్లా అధికారులతో వచ్చే మంగళవారం, గురువారాల్లో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించనున్నారు. (చదవండి: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం..) -
బడ్జెట్‌పై కాంగ్రెస్ పెడార్థాలు తీస్తోంది
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇటీవల తాము ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ప్రతిపక్షాలు అపార్థాలు సృష్టిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ రహదారుల నిర్మాణం, పేదలకు పక్కా ఇళ్లు, ఉచితంగా వంటగ్యాస్, రేషన్ పంపిణీ వంటివి చేపడుతున్నా మోదీ ప్రభుత్వం ధనికులకు అనుకూల మంటున్నాయని విమర్శించారు. శుక్రవారం మంత్రి రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. కోవిడ్ మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైన తరుణంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనకు బడ్జెట్ ఒక ఆయుధమని ఆమె అభివర్ణించారు. ‘స్వల్పకాలిక తక్షణ పరిష్కారాలను వెదకడానికి బదులుగా ఆర్థిక వ్యవస్థపై గుణాత్మక ప్రభావం చూపే ఉద్దీపనను, గట్టి ఉద్దీపనను కల్పించేందుకు ఈ బడ్జెట్లో ప్రయత్నం జరిగింది. ఈ క్లిష్ట సమయంలో సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు స్వల్ప కాలిక చర్యలు తీసుకుంటూనే మాధ్యమిక, దీర్ఘ కాలిక స్థిరవృద్ధి సాధనకు చర్యలు ప్రకటించాం’ అని తెలిపారు. దేశంలోని పేదలు, బడుగు వర్గాలకు సాయపడేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నా, ప్రభుత్వం కొందరు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోందన్న ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం ఆగడం లేదు’ అని అన్నారు. ‘మా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్కెట్‌ప్లేస్, యూపీఐలను కొందరు ధనికులు, కొందరు అల్లుళ్లే వినియోగిస్తున్నారా?’ అంటూ మంత్రి వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. బడ్జెట్లో పేర్కొన్న అంకెలపై మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అనుమానం వ్యక్తం చేయడంపై ఆమె స్పందిస్తూ..‘యూపీఏ హయాంలో అభివృద్ధి సాధించినట్లు చూపేందుకు కృత్రిమ గణాంకాలతో వ్యయాన్ని పెంచారు. సబ్సిడీని ప్రభుత్వ బడ్జెట్ నుంచి కంపెనీలకు తరలించారు. కానీ, 2021–22 బడ్జెట్లో పారదర్శకత పాటిస్తూ వ్యయ వివరాలన్నీ స్పష్టంగా పేర్కొన్నాం’అని తెలిపారు. -
కాంగ్రెస్‌ది రుధిర వ్యవసాయం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రక్తంతో వ్యవసాయం చేస్తుందని, బీజేపీ అలా కాదని రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విపక్షంపై మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ విడుదల చేసిన ఒక పుస్తకంలోని వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. తోమర్ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో అనంతరం వాటిని రికార్డుల నుంచి తొలగించారు. ‘మేం తీసుకువచ్చిన చట్టాలను నల్లచట్టాలని అంటున్నారు. ఆ చట్టాల్లో నలుపు(తప్పు) ఎక్కడ ఉందని, రైతులకు వ్యతిరేకంగా అందులో ఏం ఉందని రెండు నెలలుగా రైతులను అడుగుతున్నాం. రైతు వ్యతిరేకత ఎక్కడ ఉందో చూపిస్తే సరిదిద్దుతామని కూడా చెబుతున్నాం. వారి నుంచి జవాబు లేదు. వీరి(విపక్ష సభ్యులను చూస్తూ) నుంచీ జవాబు లేదు’అని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ మార్కెట్లు, కనీస మద్దతు ధర విధానం కొనసాగుతాయని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాల్లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తోమర్ పునరుద్ఘాటించారు. సవరణలకు సిద్ధంగా ఉన్నామంటే దానర్ధం చట్టాల్లో లోపాలున్నాయని తాము అంగీకరించనట్లు కాదని, రైతుల ఆందోళనలను గౌరవించి, సవరణలకు సిద్దమయ్యామని వివరించారు. రైతులే కాదు, వారి మద్దతుదారులు కూడా వ్యవసాయ చట్టాల్లో ఏ ఒక్క లోపాన్ని కూడా చూపలేకపోయారని తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేయడం లేదని, కేవలం ఒక్క రాష్ట్రానికి చెందిన రైతులే ఉందోళనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారిని కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు సమాచారంతో రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నీటితో వ్యవసాయం చేస్తారని అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ మాత్రం రక్తంతో వ్యవసాయం చేస్తుంది. రక్తంతో సాగు చేయడం బీజేపీకి తెలియదు’అని మండిపడ్డారు. వ్యవసాయ మార్కెట్లకు వెలుపల కోరుకున్న ధరకు, ఎలాంటి పన్ను లేకుండా తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం తాజా చట్టాలతో రైతులకు లభిస్తుందన్నారు. కాంట్రాక్ట్ వ్యవసాయంతో రైతులు పన్ను లేకుండానే తమ ఉత్పత్తులకు అమ్ముకోవచ్చని, ఒప్పందం నుంచి ఎలాంటి పరిహారం చెల్లించకుండానే వైదొలిగే అవకాశం కేంద్రం తీసుకువచ్చిన చట్టాల్లో ఉందని వివరించారు. కానీ, పంజాబ్‌లో అమల్లో ఉన్న చట్టం(పంజాబ్ కాంట్రాక్ట్ లా) అందుకు విరుద్ధంగా ఉందని, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రైతు.. జరిమానా చెల్లించడంతో పాటు జైలుకు కూడా వెళ్లేలా ఆ చట్టంలో నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. అంతే కాదు, ఆ చట్టం ప్రకారం తమ ఉత్పత్తులను అమ్మే రైతులు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారని, అయితే, అహంకారం ఎక్కడ ఉందని, చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, చివరకు చట్టాల అమలును 18 నెలల పాటు నిలిపేసేందుకు కడా సిద్ధమైందని చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యుడు వినయ్ సహస్రబుద్ధే వ్యాఖ్యానించారు.సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ‘కరోనా కన్నా ముందే ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రకటించిన అనాలోచిత లాక్‌డౌన్‌తో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో రైతులు న్యాయం కోసం యుద్ధం చేస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. సాగు చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలని కాంగ్రెస్ సభ్యుడు ప్రతాప్ సింగ్ బాజ్వా వ్యాఖ్యానించారు. రైతు నిరసన కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ‘బెర్లిన్ వాల్’తో పోల్చారు. జనవరి 26న రైతు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన అల్లర్లపైనిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిజాలు మాట్లాడిన వారిని ద్రోహులంటున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై దేశద్రోహం కేసులు పెడ్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించారు. విపక్ష సభ్యులకు తోమర్ సరైన, వివరణాత్మక జవాబు ఇచ్చారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ప్రసంగాన్ని ప్రజలంతా వినాలని ఆ ప్రసంగం వీడియో లింక్‌ను ట్యాగ్ చేశారు. సంప్రదాయాల ప్రకారమే.. వ్యవసాయ బిల్లులను రూపొందించే విషయంలో ప్రభుత్వం అన్ని సంప్రదాయాలను పాటించిందని, రాష్ట్రాలతో పాటు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను తీసుకుందని ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపింది. లోక్‌సభ సోమవారానికి వాయిదా సాగు చట్టాలకు వ్యతిరేకంగా లోక్‌సభలో విపక్షాల నిరసనతో శుక్రవారం కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ఫిబ్రవరి 3న ప్రారంభించిన బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీకి, ఆ తరువాత తన ప్రసంగాన్ని కొనసాగించే అవకాశమే లభించలేదు. శుక్రవారం కూడా సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వెల్ వద్దకు దూసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో, సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు. భయపడను: మీనా హ్యారిస్ .భారత్‌లో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్న రైతులకు తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సోదరి కుమార్తె, న్యాయవాది, రచయిత మీనా హ్యారిస్(36) మరోసారి తేల్చిచెప్పారు. రైతులకు మద్దతుగా ట్వీట్లు చేసినందుకు తనను దూషిస్తూ ఇండియాలో జరిగిన ప్రదర్శనల ఫొటోను ఆమె ట్విట్టర్లో తాజాగా షేర్ చేశారు. ‘‘భారతదేశంలోని రైతుల మానవ హక్కులకు మద్దతుగా మాట్లాడుతూనే ఉంటా. భయపడే ప్రసక్తే లేదు. నిశ్శబ్దంగా ఉండను’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. రైతుల పోరాటం గురించి మీనా హ్యారిస్ కొన్ని రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పాప్ స్టార్ రిహన్నా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి. వారిపై ప్రభుత్వ అనుకూల వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నాయి. గ్రెటానా.. ఆమెవరో నాకు తెలియదు: తికాయత్ రైతుల ఉద్యమానికి అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతుపై శుక్రవారం భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. విదేశాల్లోని ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు తమ ఉద్యమానికి మద్దతిస్తే ప్రభుత్వానికి సమస్య ఏంటని ప్రశ్నించారు. అయితే, ఉద్యమానికి మద్దతుగా ట్వీట్స్ చేసిన పాప్ సింగర్ రిహానా, నటి మియా ఖలీఫా, యువ పర్యావరణ వేత్త గ్రెటా థన్‌బర్గ్ సహా ఆ ప్రముఖులంతా ఎవరో తనకు తెలియదన్నారు. ‘ఎవరు వారంతా?’ అని ఆసక్తిగా మీడియాను ఎదురు ప్రశ్నించారు. వారెవరో వివరించిన తరువాత.. ‘వారు మా ఉద్యమానికి మద్దతిస్తే సమస్యేంటి? వారు మాకేమీ ఇవ్వడం లేదు. ఏమీ తీసుకెళ్లడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో చక్కా జామ్ లేదు నేడుతలపెట్టిన రహదారుల దిగ్బంధన కార్యక్రమం ‘చక్కా జామ్’ను ఢిల్లీలో నిర్వహించడం లేదని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద ఇప్పటికే ‘చక్కా జామ్’ పరిస్థితి ఉన్నందున ప్రత్యేకంగా ఆ కార్యక్రమం అవసరం లేదని భావిస్తున్నామంది. దేశవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని జాతీయ, రాష్ట్ర రహదారుల దిగ్బంధన కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, యూపీలోని శామలి జిల్లా భైన్స్వాల్లో శుక్రవారం జరిగిన రైతు మహాసభకు వేలాదిగా రైతులు హాజరయ్యారు. -
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూ దేశ రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు కాంగ్రెస్ సహా 18 ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఎస్పీ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్(ఎం), ఏఐయూడీఎఫ్ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ‘దేశ జనాభాలో 60 శాతం ప్రజలు, కోట్లాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆధారపడిన వ్యవసాయ రంగం భవిష్యత్తుకు ప్రమాదకరంగా బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా రుద్దుతున్న వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంఘటితంగా రైతులు పోరాడుతున్నారు. గడిచిన 64 రోజులుగా తీవ్రమైన చలిని, భారీ వర్షాలను లెక్కచేయకుండా దేశ రాజధానిలో రైతులు తమ హక్కులు, న్యాయం కోసం పోరాడుతున్నారు. సుమారుగా 155 మంది రైతులు తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వంలో కదలిక లేకపోగా.. వాటర్ కెనాన్లతో, టియర్ గ్యాస్‌తో, లాఠీఛార్జీలతో జవాబు ఇచ్చింది. రైతుల న్యాయమైన ఉద్యమాన్ని ప్రభుత్వ ప్రాయోజిత తప్పుడు సమాచారంతో ఉద్యమాన్ని తక్కువ చేసి చూపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దేశ ఆహార భద్రత స్వరూపం ముక్కలవుతుంది.. ‘మూడు సాగు చట్టాలు రాష్ట్రాల హక్కులపై, రాజ్యాంగం ప్రసాదించిన సమాఖ్య స్ఫూర్తిపై దాడి. ఈ చట్టాలను వెనక్కి తీసుకోనిపక్షంలో అవి దేశ ఆహార భద్రత స్వరూపాన్ని ముక్కలు చేస్తాయి. అంతేకాకుండా కనీస మద్దతు ధర, ప్రభుత్వ ధాన్య సేకరణ వ్యవస్థలను ధ్వంసం చేస్తాయి’ అని పేర్కొన్నాయి. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు.. ‘ప్రధాని, బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి మాకు దిగ్భ్రాంతి కలిగించింది. అందువల్ల మేం సంఘటితంగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తున్నాం. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాం’ అని కాంగ్రెస్‌సహా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. -
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారత్ బంద్ జరగనుంది. ఈ దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్ఎస్ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆయా పార్టీల కార్యకర్తలు బంద్‌లో చురుగ్గా పాలుపంచుకోనున్నారు. బంద్‌లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌ను పాటించాలని ఎవరినీ ఒత్తిడి చేయవద్దని సూచించాయి. శాంతియుతంగా నిరసన తెలపాలని, అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు, రైతులు ప్రకటించిన భారత్ బంద్‌నకు నైతిక మద్దతు తెలుపుతున్నామని పది కార్మిక సంఘాల ఐక్య కమిటీ సోమవారం ప్రకటించింది. బంద్‌కు మద్దతు తెలుపుతూనే, కార్మికులు విధుల్లో పాల్గొంటారని పేర్కొంది. డ్యూటీలో ఉండగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తారని, విధుల్లోకి వెళ్లేముందు కానీ విధులు ముగిసిన తరువాత కానీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపింది. కార్మికులు స్ట్రైక్ చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని హిందూ మజ్దూర్ సభ ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ వివరించారు. కాగా, బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు కోవిడ్–19 ముప్పు పొంచి ఉన్న కారణంగా, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని, శాంతిసామరస్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీలోని పలు సరిహద్దుల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో గత 12 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర మంత్రులు ఇప్పటివరకు ఐదు విడతలుగా జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసిన విషయం తెలిసిందే. మరో విడత చర్చలు బుధవారం జరగనున్నాయి. వేలాదిగా రైతులు నిరసన తెలుపుతున్న సింఘు సరిహద్దును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సందర్శించారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ‘తాత్కాలిక జైళ్లుగా ఢిల్లీలోని స్టేడియంలను వాడుకునేందుకు అనుమతించాలని మాపై భారీగా ఒత్తిడి వచ్చింది. మేం వారి ఒత్తిడికి తలొగ్గలేదు. అది ఉద్యమానికి సహకరించింది’ అని కేజ్రీవాల్ తెలిపారు. రైతులకు కష్టం కలగకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ‘ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక సేవకుడిలా మీ వద్దకు వచ్చాను’ అని రైతులతో పేర్కొన్నారు. ఆప్ నేతలు, కార్యకర్తలు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మద్దతివ్వండి బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్‌లో పాల్గొనేలా ఎవరినీ ఒత్తిడి చేయవద్దని తమ మద్దతుదారులను కోరాయి. శాంతియుతంగా బంద్ జరపాలని, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని భారతీయ కిసాన్ ఏక్తా సంఘటన్ అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ దాలేవాలా కోరారు. ‘మేం పిలుపునిచ్చిన బంద్ రాజకీయ పార్టీలిచ్చే బంద్ లాంటిది కాదు. ఇది ఒక సైద్ధాంతిక లక్ష్యం కోసం మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు.. నాలుగు గంటల పాటు జరిపే ప్రతీకాత్మక బంద్. ఈ నిరసనతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఆ నాలుగు గంటల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం’ అని రైతు సంఘం నేత రాకేశ్ తికాయిత్ వివరించారు. ఆ నాలుగు గంటల పాటు దుకాణాలను మూసేయాలని వ్యాపారస్తులను కోరుతున్నామన్నారు. ఆ నాలుగు గంటల పాటు టోల్ ప్లాజాలను, కీలక రహదారులను నిర్బంధిస్తామని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళన కొనసాగు తుందని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు. తాజా చట్టాలు రైతులకు లబ్ధి చేకూరుస్తాయని ఇన్నాళ్లు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి సవరణలు చేసేందుకు సిద్ధమని ఎందుకు చెప్తోందని మరో రైతు నేత దర్శన్ పాల్ ప్రశ్నించారు. బంద్‌కు మద్దతుగా మంగళవారం అన్ని రవాణా కార్యకలాపాలను నిలిపేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) ప్రకటించింది. ఏఐఎంటీసీ దేశవ్యాప్తంగా దాదాపు 95 లక్షల మంది ట్రక్కు యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో, దేశవ్యాప్తంగా నిత్యావసరాల రవాణాపై ప్రతికూల ప్రభావం పడనుంది. అతిపెద్ద రైల్వే కార్మిక విభాగాలైన ‘ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్’, ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్’ కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి. బంద్‌కు మద్దతుగా రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శనలు చేస్తారని తెలిపాయి. కాగా, తమ కార్యకలాపాలు మంగళవారం కూడా కొనసాగుతాయని వాణిజ్యవేత్తల సంఘం సీఏఐటీ, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేశాయి. బంద్‌లో నేరుగా పాల్గొనబోవటం లేదని బ్యాంక్ యూనియన్లు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. విరామ సమయాల్లో బంద్‌కు మద్దతుగా బ్యాంక్ బ్రాంచ్‌ల ముందు ప్లకార్డులను ప్రదర్శిస్తారని తెలిపింది. ప్రతిపక్షాల ద్వంద్వ నీతి రైతుల ఉద్యమానికి మద్దతివ్వడం విపక్షాల ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ విమర్శించింది. సాగు చట్టాల్లోని నిబంధనలను కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్షాలు గతంలో మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఉన్న అన్ని ఆంక్షలను తొలగిస్తామని 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్ర చేస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతూ.. ఉనికి కోసం రైతు ఉద్యమాన్ని వాడుకుంటున్నాయని, రైతుల్లోని కొన్ని వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. 16 రాష్ట్రాలపై ప్రభావం బంద్ వల్ల 16 రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని సూచించింది. బంద్‌లో పాల్గొనే వామపక్ష అనుకూల అతివాదులు సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని జోనల్ మేనేజర్లకు సూచించారు. సైకిల్‌పై 300 కి.మీ. పంజాబ్, హరియాణాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు వెళ్లి నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ఇద్దరు యువకులు సైకిల్ మీద ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించారు. జోవన్ ప్రీత్ సింగ్ (24), గురిందర్ జీత్ (26)లు పంజాబ్‌లోని బర్నాలా నుంచి రెండు రోజుల క్రితం ప్రయాణమై సోమవారానికి ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. ట్రాక్టర్లలో ప్రయాణించాలంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, అందుకే సైకిళ్లపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దారిపొడవునా అప్పటికే రైతులు ఉండటంతో తిండికేమీ లోటు లేదని, రాత్రి వేళ ట్రాక్టర్లలో పడుకున్నామని చెప్పారు. ఆ చట్టాలు మంచివే.. కొత్త సాగు చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి చెప్పారు. ఈ చట్టాలను సమర్ధిస్తున్న రైతుల బృందంతో తోమర్ సోమవారం సమావేశమయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, హరియాణాకు చెందిన రైతు కన్వల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఈ బృందం తోమర్‌ను కలిసింది. ఈ బృందంలో భారతీయ కిసాన్ యూనియన్(అత్తార్) జాతీయ అధ్యక్షుడు అత్తార్ సింగ్ సంధూ కూడా ఉన్నారు. సాగు చట్టాలను రద్దు చేయవద్దని, అవసరమైతే కొన్ని సవరణలు చేయాలని ఈ బృందం మంత్రిని కోరింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తమ ప్రభుత్వం ఎదుర్కోగలదని తోమర్ వ్యాఖ్యానించారు. రైతుల కోసం వైఫై.. ఢిల్లీ–హరియాణా సరిహద్దుల వద్ద ఉన్న రైతులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీఓ ముందుకు వచ్చింది. ఢిల్లీ సరిహద్దు వద్ద ఓ రూటర్ ఏర్పాటు చేశామని, అలాగే హరియాణా సరిహద్దు వద్ద పోర్టబుల్ డివైజ్‌ల నుంచి వైఫై సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రైతులు తమ ఇంట్లో ఉన్నవారితో మాట్లాడుకుంటారని, రైతుల పిల్లలు ఆన్లైన్ క్లాసులకు హాజరువుతారని ఎన్జీవో సభ్యులు తెలిపారు. అర్జున, పద్మ అవార్డులను వెనక్కు ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్న మాజీ క్రీడాకారులు రైతుల డిమాండ్లు ► ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. ► కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని వ్యవసాయ చట్టంలో చేర్చాలి. ► మండీల నుంచి కొనుగోళ్లను ప్రభుత్వమే చేపట్టాలి. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవసాయ కోర్టులు నెలకొల్పాలి. రైతుల అనుమానాలు ► సాగు రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ► ఒకే దేశం –ఒకే మార్కెట్ విధానంతో భవిష్యత్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. ► మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుంది. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాలను సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి రావడం. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్‌తో భూములకు రక్షణ కరువవుతుంది. ► నిత్యావసర సరుకుల సవరణ చట్టంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏమంటోంది? ► సాగు చట్టాలకు రైతు సంఘాలు కోరిన మేరకు సవరణలు చేపట్టేందుకు సిద్ధం. ► కనీస మద్దతు ధర విధానం యథా ప్రకారం కొనసాగుతుంది. దీనిపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. ► రాష్ట్రానికి చెందిన మండీలను ప్రభావితం చేయడం మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం. ► రైతులు అభ్యంతరం తెలుపుతున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ► కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాలను సూచనలు కోరుతున్నాం. పీటముడి ఎక్కడ? ► వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీసం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. -
ఒకరికొకరు టచ్‌లో విపక్ష నేతలు
న్యూఢిల్లీ: ఒకవేళ ఎన్డీయేకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రానిపక్షంలో, వెంటనే స్పందించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేందుకు వీలుగా ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు ఒకరితో మరొకరు టచ్‌లో ఉండనున్నారు. విపక్షాలన్నిటినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు వీలుగా నిరంతర సంప్రదింపుల్లో ఉండాలని ఎన్డీయేతర పార్టీల నేతలు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాల కథనం ప్రకారం.. ఎన్డీయేకి మెజారిటీ రాని పక్షంలో తమను ఒక సముదాయం (బ్లాక్)గా పేర్కొంటూ విపక్షాలు రాష్ట్రపతికి ఒక లేఖ రాస్తాయి. ఏకైక అతిపెద్ద పార్టీ విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరతాయి. ఈ మేరకు విపక్ష పార్టీలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించాయి. ఎన్నికల బరిలో 724 మంది మహిళలు సార్వత్రిక ఎన్నికల బరిలో 8,049 మంది అభ్యర్థులు ఉండగా, వీరిలో 724 మంది మహిళలు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు తెలిపాయి. 17వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా 54 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దించగా, బీజేపీ 53 మందితో రెండో స్థానంలో నిలిచింది. బీఎస్పీ 24 మంది మహిళా అభ్యర్థులతో మూడో స్థానంలో ఉంది. 222 మంది మహిళలు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. -
కుల రాజకీయాలు ఫలించవు
కనౌజ్/హర్దొయి/సీతాపూర్: విపక్ష కూటమి కుల రాజకీయాలు ఫలించవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ అవకాశవాదుల కూటమికి కేంద్రంలో బలమైన (మజ్బూత్) ప్రభుత్వం కాకుండా నిస్సహాయ (మజ్బూర్) ప్రభుత్వం కావాలని, ఎందుకంటే ప్రజాధనాన్ని దోచుకుంటూ కులాల మంత్రం జపించడమే వారి లక్ష్యమని విమర్శించారు. తనను కుల రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి మంచి పట్టున్న కనౌజ్‌తో పాటు హర్దొయి, సీతాపూర్‌లలో నిర్వహించిన ఎన్నికల సభల్లో మోదీ మాట్లాడారు. ఎస్పీతో పాటు విపక్ష బీఎస్పీ, ఆర్‌ఎల్డీలపై విరుచుకుపడ్డారు. ఆదో పెద్ద కల్తీ (మహా మిలావతి) కూటమిగా అభివర్ణించారు. కుల రాజకీయాలపై తనకు నమ్మకం లేదన్నారు. అంబేడ్కర్‌కు కాంగ్రెస్ కనీస గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల యాప్‌కు ‘భీమ్’గా నామకరణం చేసిందని గుర్తుచేశారు. బీజేపీకి మద్దతు పలకాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘మీరు వేసే ప్రతి ఓటూ నేరుగా మోదీ ఖాతాలోకే వస్తుంది. మాయావతీజీ, నేను చాలా వెనుకబడిన వారం. కానీ నన్ను మాత్రం కుల రాజకీయాల్లోకి లాగొద్దని చేతులు జోడించి కోరుతున్నా. మొత్తం 130 కోట్ల మంది ప్రజలు నా కుటుంబమే. నన్ను విమర్శించేవారు చెప్పేవరకు దేశానికి నా కులమేంటో తెలియదు. వెనుకబడిన కులంలో పుట్టడమనేది దేశానికి సేవ చేయడానికి లభించిన ఓ అవకాశంగా నేను భావిస్తున్నా..’అని మోదీ అన్నారు. ఓటమి అంచుల్లో ఉన్న విపక్షాలు దుర్భాషలకు దిగుతున్నాయని విమర్శించారు. మీరెన్ని (విపక్షాలు) ప్రయత్నాలు చేసినా వచ్చేది.. అని మోదీ అనగానే ప్రజలు ‘మళ్లీ మోదీనే’అంటూ నినదించారు. ఎస్పీ, బీఎస్పీల అవకాశవాదాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అంబేడ్కర్‌ను అగౌరవ పరిచిన ఎస్పీ కోసం మాయావతి ఓట్లు అడుగుతున్నారని మోదీ అన్నారు. కేవలం అధికారం కోసమే మాయావతి ఎస్పీ మద్దతు కోరుతున్నారని విమర్శించారు. మే 23న చరిత్ర సృష్టిస్తాం కొందరు తెలివైనవారు బంగాళాదుంప నుంచి బంగారం వెలికితీస్తామనే హామీ ఇచ్చారని రాహుల్‌గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాంటి హామీ తాను కానీ, తన పార్టీ కానీ ఇవ్వలేదన్నారు. నెరవేర్చలేని వాగ్దానాలు తాము చెయ్యబోమని, అబద్ధాలు చెప్పమని అన్నారు. మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత చరిత్ర సృష్టిస్తామని మోదీ అన్నారు. మండుటెండలో సైతం తన సభలకు జనం పోటెత్తడాన్ని బట్టి. 2014 నాటి రికార్డును తిరగరాసేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నట్టుగా కన్పిస్తోందని చెప్పారు. చౌకీదార్‌ను, రామభక్తులను విమర్శించిన వారి పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను నిద్రపోనివ్వని, అవినీతిపరులను వణికించే, దేశానికి మరిన్ని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టే బీజేపీకి ఓటేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు. -
రిజర్వేషన్లు రద్దు చేయం
ఉదయ్‌పూర్, నందూర్బార్: తాను అధికారంలో ఉన్నంతవరకు రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తర మహారాష్ట్రలో నందూర్బార్లో సోమవారం ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన మోదీ కోటా పరిమితుల్ని దాటి తాను ఏమీ చేయనని హామీ ఇచ్చారు. ‘‘డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి. మోదీ అధికారంలో ఉన్నంతవరకూ వాటిని ఎవరూ ముట్టుకునే సాహసం కూడా చేయలేరు‘‘ అని అన్నారు. గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటించిన మోదీ వారి భూముల నుంచి బలవంతంగా ఖాళీ చేయించమని హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో అధికంగా ఉత్పత్తి అయ్యే చెరుకు నుంచి ఇథనాల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చునని, దీని వల్ల స్థానికులకు ఉద్యోగాలు కల్పన సులభంగా జరుగుతుందని అన్నారు. కానీ కాంగ్రెస్–ఎన్సీపీ నేతలు ఆ పని చెయ్యనివ్వకుండా అడ్డుకుంటున్నారని ప్రధాని ఆరోపించారు. నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అన్నీ అందేలా జన్‌ధన్ యోజన అకౌంట్లు తెరిచి, వాటిని ఆధార్‌తో లింకప్ చేసి, మొబైల్ కనెక్టివిటీని కూడా ఏర్పాటు చేశామని, ఈ చర్యల వల్ల కింది స్థాయిలో దళారుల జోక్యాన్ని అరికట్టి అవినీతిని నిరోధించామని మోదీ వివరించారు. యూపీఏ పిరికిపందలా వ్యవహరించింది జాతీయ భద్రత అంశంలో యూపీఏ పిరికిపందలా వ్యవహరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఉగ్రవాదం పీచమణచడంలో తమ ప్రభుత్వం ధైర్యంగా ముందడుగు వేసిందని అన్నారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లా, రాజస్థాన్ ఉదయ్పూర్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సోమవారం పాల్గొన్న మోదీ శ్రీలంకలో పేలుళ్ల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం వల్లే భారత్‌లో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. ‘2014కి ముందు భారత్ పరిస్థితి ఎలా ఉండేది ? బాంబు పేలుళ్లు ఒక నిత్యకృత్యంగా మారాయి. ముంబై, పుణె, హైదరాబాద్, వారణాసి, అయోధ్య, జమ్ము ఇలా ఎన్నో నగరాల్లో పేలుళ్లు జరిగాయి’ అని మోదీ గుర్తు చేశారు. అప్పట్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వం ఏం చేసేది? అచ్చంగా పాకిస్తాన్ మాదిరిగానే ఒక సంతాప సభ ఏర్పాటు చేసి , నాలుగు కన్నీటి బొట్లు రాల్చి చేతులు దులుపుకునేది‘‘ అని మోదీ వ్యంగ్య బాణాలు విసిరారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా పట్టుకోగలను సర్జికల్ స్ట్రయిక్స్‌పై సాక్ష్యాధారాలు కావాలన్న కాంగ్రెస్ నేతల డిమాండ్‌ని తిప్పికొట్టారు. విపక్షాలే దీని గురించి ప్రశ్నిస్తున్నాయి కానీ ప్రజలకు తమపై నమ్మకం ఉందన్నారు. ఈ విషయం మొదటి రెండు దశల ఓటింగ్ సరళిలోనే అర్థమైందన్నారు. తాను జాతీయ భద్రత, వంశ పరిపాలన గురించి మాట్లాడితే కొందరికి షాక్ తగులుతుందంటూ పరోక్షంగా రాహుల్‌కు చురకలు అంటించారు. -
ప్రతిపక్షాలపై ‘వీడియో’ అస్త్రాలు
న్యూఢిల్లీ: బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై సైన్యం దాడులను ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెప్పేందుకు బీజేపీ యానిమేటెడ్ వీడియోలను రూపొందించింది. రాహుల్, ఇతర ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా ప్రధాని మోదీని హీరోగా చూపుతూ క్రీడా నేపథ్యంలో తయారుచేసిన వీడియోలను ఆదివారం బీజేపీ విడుదల చేసింది. క్రికెట్, కబడ్డీ, చెస్ ఆటల క్లిప్పింగ్‌లను ఈ వీడియోలకోసం తీసుకున్నామని, పార్టీ అధికారిక ట్విట్టర్ సైట్లో ప్రకటించారు. దాదాపు అన్ని వీడియోలలోనూ మోదీ హీరోగా, ప్రతిపక్షాలపై ఒంటరిగా, అజేయంగా పోరాడుతున్నట్టుగా రూపొందించారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందించిన ఒక వీడియోలో మోదీ సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించినట్టుగా, ప్రతిపక్షాలు అంపైర్‌ను ఆ విజయానికి సాక్ష్యం చూపమని అడుగుతున్నట్టుగా ఉంది. ఈ వీడియోను ట్యాగ్చేస్తూ అరుణ్ జైట్లీ ‘భారత్ విజయానికి ఎవరు సాక్ష్యాలు అడుగుతారు, అపజయానికి కారణాలు వెతుక్కునే వారే ఈ విజయానికి రుజువులు కావాలని అడుగుతారు’అని చెప్పారు. కబడ్డీ వీడియోలో ప్రతిపక్షాలన్నింటినీ మోదీ ఒక్కడే మట్టి కరిపించినట్టుగా ఉంది. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఓటర్లకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడమే లక్ష్యంగా వీటిని తయారుచేసినట్లు బీజేపీ తెలిపింది. -
మేమొస్తే నోట్లరద్దుపై దర్యాప్తు
కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ హయాంలో చేపట్టిన నోట్లరద్దుపై విచారణ చేయిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మోదీ ప్రభుత్వం రద్దు చేసిన ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఇక్కడ ఆమె పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఉపాధి హామీ పథకం అమలును ఏడాదిలో 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచుతామనీ, అలాగే కూలీని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. వస్తుసేవల పన్ను(జీఎస్టీ) విధానం ప్రజలకు వాస్తవంగా ఉపయోగపడుతుందా లేదా అనే దానిపై నిపుణులతో సమీక్ష చేపడతామన్నారు. పెద్ద నోట్లరద్దుతోపాటు, జీఎస్టీ అమలు ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ఉద్యోగావకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు కేటాయించిన ఉద్యోగాలను భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు. అడ్వాణీజీతో మాట్లాడా ‘ఈరోజు బీజేపీ కురువృద్ధ నేత ఎల్కే అడ్వాణీజీతో మాట్లాడా. ఆయన ఆరోగ్యం గురించి వాకబుచేశా. నేను ఫోన్ చేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వ్యవస్థాపక సభ్యులు, పార్టీకి మూలస్తంభాల్లాంటి వారైన అడ్వాణీ, మనోహర్ జోషిలను బీజేపీ అలా ఎందుకు వ్యవహరిస్తోంది. ఇప్పుడు వారిని ఎందుకు వదిలివేసింది? గురువులకు గురుదక్షిణ ఇలా కూడా చెల్లిస్తారా అని ఆశ్చర్యం వేస్తోంది. అయినా, ఆ పార్టీ అంతరంగిక విషయాలపై నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు’ అని మోదీనుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
నా యుద్ధం ఉగ్రవాదంపై... విపక్షాల దాడి నాపై
అహ్మదాబాద్/అదాలజ్/ధర్: పొరుగుదేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమివేయాలని తాను యుద్ధం చేస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం తనపై దాడి చేయాలని చూస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం ప్రధాని గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ‘నేను ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లు (ప్రతిపక్షాలు) నన్ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. పేదరికంపై నేను పోరాడుతుండగా వాళ్లు చౌకీదార్‌ను తొలగించేందుకు చూస్తున్నారు. నిజాయతీపరుడైన ఈ చౌకీదార్‌తో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వాళ్లు మోదీ హఠావో అంటూ అరుస్తున్నారు’ అని చెప్పారు. పాక్‌కు బుద్ధి చెప్పాం పాక్‌లోకి ప్రవేశించి ఉగ్రశిబిరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగ్గిన బుద్ధి చెప్పామని ప్రధాని అన్నారు. ‘పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాం. తీరు మారకుంటే తలెత్తే పరిణామాలేమిటో పాక్‌కు ముందే చెప్పాం’ అని అన్నారు. కానీ, ఎయిర్‌స్ట్రైక్ పాక్‌పై జరిగినా భారత్‌లో ఉన్న కొందరికి ఆ దెబ్బ తగిలిందని ఎద్దేవా చేశారు. ‘పుల్వామాకు ప్రతీకారంగా మనం చేసిన దాడిని ప్రపంచమంతా మద్దతు పలుకుతుండగా అత్యంత కల్తీ కూటమి(ప్రతిపక్ష మహాకూటమి) నేతలు మాత్రం పాక్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. రాహుల్ ‘ఆకలి బాధ’ వ్యాఖ్యలపై.. ఒక్క పూట కూడా ఖాళీ కడుపుతో నిద్రించని వారు మాత్రమే ఆకలి బాధ మానసికమైందని అంటారంటూ మోదీ ఎద్దేవా చేశారు. ‘పేదరికం పేరుతో ఓట్లు దండుకుని దేశాన్ని 55 ఏళ్లపాటు పాలించిన వీళ్లకు పేదరికం అనేది కేవలం మానసిక భావన’ అని 2013లో రాహుల్ చేసిన ప్రకటనను ఉదహరిస్తూ వ్యాఖ్యానించారు. అన్నీ ప్రభుత్వమే చేయాలనుకుంటున్నారు ‘ప్రభుత్వమే ప్రతీ పనినీ చేపట్టాలని ప్రజలు భావిస్తున్నారు. ఫలానా పనిని ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. ఇది కొత్త ఒరవడి’ అని అన్నారు. -
విపక్షాల తీరు పాక్‌కు ఆయుధం
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో విపక్షాల వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. సాయుధ బలగాల ఆపరేషన్‌ను శంకించడం ద్వారా దేశంపై బురద జల్లేలా పాకిస్తాన్ చేతికి ఆయుధం ఇచ్చినట్లయిందని దుయ్యబట్టారు. 2004–14 మధ్య కాలంలో విఫల ప్రభుత్వాన్ని నడిపిన యూపీయే ఇప్పుడు మరింత ఘోరమైన విపక్ష పాత్ర పోషిస్తోందని మండిపడ్డారు. ‘విపక్షాలు నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది’ పేరిట ఆయన ఆదివారం ఫేస్బుక్లో ఒక బ్లాగ్ రాశారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఉగ్రదాడుల్ని ఖండించకపోవడాన్ని కూడా జైట్లీ తప్పుపట్టారు. భారత్, పాకిస్తాన్‌లు పరస్పర వినాశనానికి పిచ్చిగా ఆరాటపడటం తనను కలవరపెడుతోందని మన్మోహన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల నుంచి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే భారత హక్కును మన్మోహన్ సందేహించారన్నారు. బాలాకోట్, పుల్వామా ఘటనలను ప్రధాని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ సహా 21 విపక్ష పార్టీలు చేసిన తీర్మానంపై జైట్లీ స్పందించారు. ‘విపక్షాల తీర్మానం దేశ ప్రయోజనాలను గాయపరిచింది. విపక్షాల ప్రకటనను పాక్ వాడుకుంది. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. అలాగే సంయమనం, రాజనీతిజ్ఞతనూ ప్రదర్శించాల్సి ఉంది’ అని అన్నారు. -
దేశమంతా ఒకే గళం
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్ని ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో చెప్పాయి. ఉగ్రదాడి అంశంపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలో ఢిల్లీలో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. భద్రతా దళాలకు సంఘీభావం తెలిపి, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం కోసం తామంతా కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో ఓ తీర్మానాన్ని పార్టీలన్నీ ఆమోదిస్తూ దాడిని, ఉగ్రవాదులకు సరిహద్దుల అవతలి నుంచి అందుతున్న సాయాన్ని ఖండించాయి. అన్ని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను పిలిచి ప్రధాని మోదీ ఓ సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నేత ఆజాద్ సూచించారు. ఆయన సూచనను తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్, సీపీఐ నాయకుడు డి.రాజ సమర్థించారు. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం విడుదల చేసిన తీర్మానంలో ‘ఉగ్రదాడులను ఎదుర్కోవడంలో భారత్ ఇప్పటిరకు స్థైర్యాన్ని ప్రదర్శించింది. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ నిశ్చయంతో ఉందని దేశం మొత్తం ముక్తకంఠంతో చెబుతోంది. ఉగ్రవాదులతో పోరాడి దేశాన్ని రక్షిస్తున్న భద్రతా దళాలకు మేం అంతా సంఘీభావం తెలుపుతున్నాం’ అని నేతలు పేర్కొన్నారు. పాక్‌ను పరోక్షంగా పేర్కొంటూ సీమాంతర ఉగ్రవాదం కారణంగా సమస్యలను ఎదుర్కుంటోందని తీర్మానం తెలిపింది. అంతకుముందు రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఉగ్రదాడి గురించి, శుక్రవారం తన కశ్మీర్ పర్యటన వివరాలు అందరికీ తెలియజేశారు. ‘ఉగ్రవాదంపై పోరును అర్థవంతమైన దిశలో చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. బలగాల త్యాగాలు ఊరికేపోవు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు శాంతి కావాలి. వారు మనతోపాటే ఉన్నారు. కానీ కొన్ని సంఘవిద్రోహ శక్తులు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారు’ అని రాజ్‌నాథ్ ఇతర నాయకులకు తెలిపారు. సర్జికల్ దాడి ప్రభావం లేదు: సంజయ్ బీజేపీ మిత్రపక్షం శివసేన నేత సంజయ్ రౌత్ అఖిలపక్ష భేటీలో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి స్ఫూర్తిని పొంది (ఇందిర నేతృత్వంలో 1971 యుద్ధంలో పాక్‌పై భారత గెలుపు) పాకిస్తాన్‌ను నేరుగా దెబ్బ కొట్టాలని అన్నారు. కేంద్రం గొప్పగా చెప్పుకుంటున్న సర్జికల్ స్ట్రైక్స్ పాక్‌పై ఏమైనా ప్రభావం చూపి ఉంటే ఇప్పుడు ఈ దాడి జరిగేది కాదని ఆయన పేర్కొన్నారు. లాహోర్, ఇస్లామాబాద్ సహా పాకిస్తాన్ లోపలి భాగాలపై దాడి జరగాలన్నారు. ఉడీ సైనిక శిబిరంపై 2016లో ఉగ్రవాదులు దాడి జరిపిన అనంతరం ప్రతీకారంగా పాక్–భారత్ సరిహద్దుల్లో, నియంత్రణ రేఖకు అవతల, పాక్ వైపున ఉన్న ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ, సింధియా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బంధోపాధ్యాయ, టీఆర్ఎస్ నుంచి జితేందర్ రెడ్డి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఎల్జేపీ నేత రాం విలాస్ పాశ్వాన్, ఆప్ నేత సంజయ్ సింగ్, ఆర్ఎల్ఎస్పీ నుంచి ఉపేంద్ర కూష్వాహ, ఆర్జేడీ నాయకుడు జయ ప్రకాశ్ నారాయణ్ యాదవ్ తదితరులు కూడా అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. తీర్మానాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తోమర్ చదివి వినిపించారు. దాడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని కశ్మీర్ విద్యార్థులపై దాడులు జరగొచ్చన్న సమాచారం ఉన్నప్పటికీ ప్రజలంతా సంయమనాన్ని పాటించాలన్న అంశం ఈ తీర్మానంలో లేకపోవడం తనను నిరాశ పరిచిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు ఉగ్రవేటకు చర్యలు భద్రతా సమీక్షలో రాజ్‌నాథ్ దాడి జరిగిన రెండ్రోజుల అనంతరం శనివారం దేశవ్యాప్తంగా ప్రస్తుత భద్రతా పరిస్థితులపై హోం మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష నిర్వహించారు. కశ్మీర్ లోయలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను వేటాడేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతీయ భద్రతా సలహాదారు (నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ – ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్ తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దుతోపాటు దేశ వ్యాప్తంగా ప్రస్తుత భద్రతా పరిస్థితిని అధికారులు రాజ్‌నాథ్‌కు ఈ సమావేశంలో వివరించినట్లు హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని ఎదుర్కొనేందుకు తీసుకున్న భద్రతా చర్యలను హోం మంత్రికి అధికారులు వివరించారు. జమ్మూ కశ్మీర్‌లోని వేర్పాటు వాదులకు ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణపై సమీక్ష నిర్వహించి, పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న వేర్పాటు వాదులకు భద్రతను ఉపసంహరించాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా గుడిగెరె గ్రామంలో అమర జవాన్ హెచ్.గురు అంత్యక్రియలకు భారీగా హాజరైన ప్రజలు భోపాల్‌లో కొవ్వొత్తులు వెలిగించి అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది -
ఈవీఎం ఫలితాలను వీవీప్యాట్లతో పోల్చాలి
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాల ప్రకటనకు ముందుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)ల ద్వారా వెల్లడైన ఫలితాలను ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్(వీవీప్యాట్లు)లతో సరిపోల్చాలని ప్రతిపక్షాలు కోరాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)ని కలిసి వినతిపత్రం ఇచ్చాయి. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఫలితాలను వీవీ ప్యాట్లతో పోల్చి చూడాలనీ, సగం ఈవీఎంల ఫలితాలనైనా వీవీప్యాట్లతో సరిపోల్చి చూశాకే ఫలితాలను వెల్లడించాలని నేతలు కోరారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థికి, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి 5 శాతం కంటే తక్కువగా ఓట్ల తేడా ఉన్న సందర్భాల్లో కూడా ఆ నియోజకవర్గంలోని అన్ని ఈవీఎంలను వీవీప్యాట్లతో పూర్తిగా సరిచూసిన తర్వాతే ఫలితం ప్రకటించాలన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, తెలంగాణలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని తేలినట్లు వివరించారు. ఈసీని కలిసిన నేతల్లో కాంగ్రెస్‌కు చెందిన గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, చంద్రబాబు నాయుడు(టీడీపీ), మజీద్ మెమన్(ఎన్సీపీ), డెరెక్ ఒ బ్రియాన్(టీఎంసీ), ఫరూఖ్ అబ్దుల్లా(ఎన్సీ) తదితరులున్నారు. సాధ్యమైతే చేస్తాం:ఈసీ ప్రతిపక్షాలు పేర్కొన్న అంశాలకు సంబంధించి కోర్టు తీర్పులను, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్ అశోక్ లావాసా తెలిపారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థికి, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి 5 శాతం ఓట్ల తేడా ఉన్నప్పుడు ఈవీఎంలతోపాటు వీవీప్యాట్లను పరిశీలించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. -
4న ఈసీతో విపక్షాల భేటీ
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) వినియోగంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యాయి. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..‘లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై విస్తృతంగా చర్చించాం. అలాగే దేశంలో నిరుద్యోగిత, వ్యవసాయం, రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలపై దాడిపై మరింత లోతుగా చర్చించేందుకు అన్నిపక్షాలు అంగీకరించాయి. ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ నెల 4న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుసుకుని తమ అభ్యంతరాలు, ఆందోళనల్ని తెలియజేస్తాయి’ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శరద్ పవార్(ఎన్సీపీ), ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), రామ్‌గోపాల్ యాదవ్(సమాజ్‌వాదీ పార్టీ), సతీశ్‌చంద్ర మిశ్రా(బీఎస్పీ), కనిమొళి(డీఎంకే), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ), డి.రాజా(సీపీఐ), టీకే రంగరాజన్(సీపీఎం), జయంత్ చౌదరి(ఆర్జేడీ)తో పాటు కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ పాల్గొన్నారు. -
మహాకూటమి గెలిస్తే రోజుకో ప్రధాని
ఖాన్పూర్: దేశంలోని విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పడిన మహాకూటమిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిప్పులుచెరిగారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రోజుకో ప్రధాని మారతారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బుధవారం బీజేపీ క్షేత్ర స్థాయి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మహాకూటమి గెలిస్తే ప్రధానమంత్రిగా సోమవారం మాయావతి, మంగళవారం అఖిలేశ్ యాదవ్, బుధవారం మమతా బెనర్జీ, గురువారం శరత్ పవార్, శుక్రవారం దేవెగౌడ, శనివారం ఎంకే స్టాలిన్ ఉంటారని.. ఆదివారం ప్రధాని పదవికి సెలవిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ముందు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని మహాకూటమిని డిమాండ్ చేశారు. బీజేపీలో నాలుగు ‘బీ’లు ఉన్నాయని.. ‘భడ్తా భారత్’, ‘బన్తా భారత్’అని అన్నారు. ఇక మహాకూటమిలో కూడా నాలుగు ‘బీ’లు ఉన్నాయని అవి బువా (ఆంటీ), భతీజా (అల్లుడు), భాయ్ (సోదరుడు), బెహెన్ (సోదరి) అని అన్నారు. -
చర్చకు నోచుకోని ‘ట్రిపుల్ తలాక్’
న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే విపక్షాలు పట్టు విడవకపోవడంతో ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో చర్చ ప్రారంభం కాలేదు. బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న తమ డిమాండ్‌ను ప్రతిపక్షాలు పునరుద్ఘాటించాయి. సోమవారం న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరినా, విపక్షాలు సహకరించకపోవడంతో కార్యకలాపాలు జరగకుండానే సభ వాయిదా పడింది. అంతకుముందు కావేరి నదీ జలాల పంపిణీ వివాదంపై ఏఐఏడీఎంకే ఎంపీలు నిరసనకు దిగడంతో సభ వాయిదా పడింది. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టాక మరో 15 నిమిషాలు అంతరాయం ఏర్పడింది. తర్వాతా పరిస్థితి మారకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను బుధవారానికి వాయిదా వేశారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ రూపొందించిన తాజా బిల్లు గురువారం లోక్‌సభలో ఆమోదం పొందింది. సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తున్న కేంద్రం రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ..బిల్లు తాజా రూపం చాలా క్రూరంగా ఉందని, దాన్ని మరింత అధ్యయనం చేసేందుకు జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలని సగం కన్నా ఎక్కువ మంది ఎంపీలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఏదైనా బిల్లును చట్టం చేసే ముందు జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న సంప్రదాయాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్ స్పందిస్తూ.. బిల్లుపై చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని, అది ఆమోదం పొందడంలో కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వమే ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజకీయాలు చేస్తోందని మరో కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ తిప్పికొట్టారు. ఆర్డినెన్స్ తెచ్చినా కూడా ఈరోజు వరకు ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని, లింగ సమానత్వంతో ముడిపడిన ఈ బిల్లుపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని న్యాయ మంత్రి రవిశంకర్ అన్నారు. రఫేల్‌పై చర్చకు సిద్ధం: ఖర్గే రఫేల్ ఒప్పందంపై లోక్‌సభలో చర్చకు రావాలన్న కేంద్ర ప్రభుత్వ సవాలును కాంగ్రెస్ స్వీకరించింది. జనవరి 2న చర్చలో పాల్గొంటామని, సమయాన్ని నిర్ణయించాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరారు. రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంట్ కమిటీతో విచారణ జరిపించాలని పునరుద్ఘాటించారు. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ..ఈ అంశంపై ఖర్గే చర్చను ప్రారంభించాలని, బదులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కానీ ఖర్గే చర్చ నుంచి పారిపోతున్నారని అన్నారు. కొత్త ఏడాది నుంచి వెల్‌లోకి రాకండి కొత్త ఏడాది నుంచైనా సభ్యులు నిబంధనల మేరకు నడుచుకోవాలని, వెల్‌లోకి దూసుకురావద్దని లోక్‌సభ స్పీకర్ సుమిత్ర విజ్ఞప్తి చేశారు. రఫేల్‌పై కాంగ్రెస్, కావేరిపై ఏఐఏడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగిన సమయంలో ఆమె స్పందిస్తూ..వారంతా తన కోసమైనా మీమీ స్థానాల్లోకి వెళ్లాలన్నారు. ఆమె మాటను గౌరవిస్తూ రెండు పార్టీల సభ్యులు వెనక్కువెళ్లారు. ‘ ఈ ఏడాదిలో ఇదే ఆఖరి రోజు. మీరు వెల్‌లోకి వచ్చిన ఆఖరి రోజు కూడా ఇదే కావాలని కోరుకుంటున్నా’ అని సుమిత్రా అన్న మాటల్ని సభ్యులంతా ఓపికగా వినడం గమనార్హం. -
యూపీలో కీలక సర్వే.. బీజేపీకి కష్టమే!
న్యూఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అధికారం రావడంలో కీలకపాత్ర పోషించిన యూపీలో విపక్ష మహా కూటమి ప్రభావం స్పష్టంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజల్లో మోదీ పాలనపై సానుకూలత ఉన్నప్పటికీ.. ఎస్పీ–బీఎస్పీ కలిసి పోటీచేస్తే బీజేపీకి చిక్కులు తప్పవని స్పష్టమైంది. 47% మంది ప్రాంతీయ పార్టీలు ఏకమైతే బీజేపీ ఇప్పుడున్న స్థానాల్లో కొన్నింటిని కోల్పోవాల్సి వస్తుందని అభిప్రాయపడగా.. 32% మంది కూటమి ప్రభావం ఉండదని.. 21% మంది చెప్పలేమని పేర్కొన్నారు. ఇండియాటుడే సంస్థ సెప్టెంబర్ 15–19 మధ్యలో 30,400 మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం యూపీలో 48% మంది మళ్లీ మోదీనే ప్రధానిగా కావాలని కోరుకోగా.. 22% మంది రాహుల్ గాంధీ వైపు మొగ్గుచూపారు. 9% మంది మాయావతి ప్రధాని కావాలని అభిప్రాయపడగా.. అఖిలేశ్‌కు 7% మంది ఓకే చెప్పారు. 80 ఎంపీ స్థానాలున్న యూపీలో 2014 ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాల్లో విజయ దుందుభి మోగించి కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ప్రధానిగా మోదీ భేష్ : వారణాసి ఎంపీగా ఉన్న నరేంద్ర మోదీ పాలనపై 53% మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. 16%మంది పర్వాలేదన్నారు. 28% మాత్రం కేంద్రం పాలన బాగాలేదని అభిప్రాయపడ్డారు. ఎస్సీల్లో 39% మోదీకే జై కొట్టగా.. మాయావతికి 24%, రాహుల్‌కు 20%, అఖిలేశ్‌కు 4%మంది మద్దతు తెలిపారు. రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్రంపై విపక్షాలు చేస్తున్న విమర్శల ప్రభావం యూపీలో పెద్దగా కనిపించలేదు. 79% మంది తమకు రాఫెల్ వివాదం గురించి తెలియదని వెల్లడించారు. సీఎంగా యోగి ఓకే! ఉత్తరప్రదేశ్ తదుపరి సీఎంగా యోగికి 43% మంది మద్దతు తెలుపగా.. అఖిలేశ్‌కు 29%, మాయావతికి 18% మంది ఓటేశారు. సీఎంగా యోగి పాలనపై 41% సంతృప్తి చెందుతుండగా.. 20%మంది పర్వాలేదన్నారు. 37% మందిలో మాత్రం అసంతృప్తి వ్యక్తమైంది. అఖిలేశ్, మాయావతిలతో పోలిస్తే.. ఓబీసీలు, బ్రాహ్మణులు, ఎస్టీల్లో ఎక్కువ మంది యోగికే మద్దతు తెలిపారు. ముస్లింలు అఖిలేశ్‌కు (71%), ఎస్సీలు మాయావతికి (49%) మద్దతు ప్రకటించారు. పీఎం ఓకే.. కానీ ముఖ్యమంత్రే? ఉత్తరాఖండ్‌లో బీజేపీకి భిన్నమైన పరిస్థితి ఎదురవుతోంది. ప్రధానిగా మోదీ పనితీరుపై సంతృప్తిగానే ఉన్నా.. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌పై స్వల్ప వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొత్తంగా ప్రధానిగా మోదీకి 57% మంది, రాహుల్‌కు 32%మంది మద్దతు తెలిపారు. మోదీ పాలనపై 45% సంతృప్తి వ్యక్తం చేయగా.. 23% పర్వాలేదని, 24% బాగాలేదని అభిప్రాయపడ్డారు. అయితే సీఎంగా రావత్ పనితీరుపై 35% మంది అసంతృప్తిని వ్యక్తం చేయగా.. 30% బాగుందని, 29% పర్వాలేదని పేర్కొన్నారు. యూపీలో బీఎస్పీ–ఎస్పీ జోడీ ప్రభావం బీజేపీపై ఉంటుందా? అన్నప్రశ్నకు అవును అని 47% మంది, చెప్పలేమని 21% మంది, ప్రభావం ఉండదని 32%మంది అభిప్రాయపడ్డారు. -
కొనసాగుతున్న పెట్రో మంట
న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. విపక్షాలు భారత్ బంద్ నిర్వహించినప్పటికీ ధరల పెరుగుదల ఆగలేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో దిగుమతుల ధర పెరిగింది. దీంతో సోమవారం పెట్రోల్ ధర లీటర్‌కు 23 పైసలు, డీజిల్ 22 పైసలు పెరిగింది. తాజా మార్పులతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.80.73కు చేరగా.. డీజిల్ ధర రూ.72.83గా ఉంది. కాగా, ప్రస్తుతానికి ధరలను నియంత్రించే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేయడంతో వినియోగదారులపై మరింత భారం తప్పేట్లు లేదు. -
‘భారత్ బంద్’ పాక్షికం
న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా విపక్షాలు సోమవారం నిర్వహించిన భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా మొత్తానికి ప్రశాంతంగా ముగిసింది. కార్యాల యాలు, విద్యాసంస్థలు మూతపడటం, వాహనాలు తిరగకపోవడంతో కేరళ, కర్ణాటక, బిహార్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో జనజీవనానికి అంతరాయం ఏర్పడగా.. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం తదితర రాష్ట్రాల్లో బంద్ ప్రభావం అసలు కనిపించ లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో 21 ప్రతిపక్ష పార్టీలు భారత్ బంద్ చేపట్టగా.. రాంలీలా మైదాన్ వద్ద నిరసన ర్యాలీలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ నిప్పులు చెరిగారు. బంద్ విజయవంతమని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రకటించుకోగా.. విఫలమైందని బీజేపీ పేర్కొంది. చెదురుమదురు ఘటనలు బిహార్ రాజధాని పట్నాలో కొన్ని చోట్ల ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లపై టైర్లు మండించి రైలు సర్వీసులకు అంతరాయం కలిగించారు. ఎక్కడికక్కడ వాహనాల్ని అడ్డుకో వడంతో ట్రాఫిక్ స్తంభించింది. పలు ప్రాంతా ల్లో బస్సుల విధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటులో జాప్యం వల్ల జెహనా బాద్ జిల్లాలో మూడేళ్ల చిన్నారి మరణించిందని బీజేపీ ఆరోపించింది. ఒడిశాలో రైల్వే ట్రాక్‌లపై కాంగ్రెస్ కార్యకర్తల బైఠాయింపుతో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. 10 రైళ్లను అధికారులు రద్దు చేశారు. భువనేశ్వర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించ డంతో రవాణాకు తీవ్ర ఆటంకం కలిగింది. దుకాణాలు, మార్కెట్లు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. కేరళలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. బస్సులతో పాటు ఆటోరిక్షాలు కూడా తిరగకపోవడంతో రోడ్లనీ ఖాళీగా దర్శనమి చ్చాయి. కర్ణాటకలో బంద్ ప్రభావం పూర్తిగా కనిపించింది. బెంగళూరులో వ్యాపార సంస్థ లు, దుకాణాలు, మాల్స్, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు తిరగకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మంగళూరులో తెరచి ఉంచిన దుకాణాలు, హోటల్స్‌పై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత కొనసాగింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఎన్ఎస్, ఎస్పీ కార్యకర్తలు పలు చోట్ల ధర్నాలు నిర్వహించారు. ముంబైలో సబర్బన్, మెట్రో రైళ్లను అడ్డుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు తిరగలేదు. పలు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్న వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు పశ్చిమ బెంగాల్లో అన్ని స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు రోజువారీ కార్యక లాపాల్ని యథావిధిగా కొనసాగిం చాయి. ప్రయాణికుల నిరసనతో జాదవ్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకారులు ధర్నాను ఉపసం హరించుకున్నారు. తమిళనాడులో బంద్ ప్రభా వం నామమాత్రంగా కనిపించింది. ఢిల్లీలో కార్యాలయాలు, కళాశాలలు, స్కూళ్లు యథావిధిగా తెరచుకున్నాయి. అయితే ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ వద్ద సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతో పాటు పలువురు లెఫ్ట్ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ కారణాలతోనే : కేంద్రం అంతర్జాతీయ అంశాల ప్రభావంతోనే పెట్రో ధరలు పెరిగాయని, భారత్ బంద్ పేరిట ప్రతిపక్షాలు హింసను రేకెత్తించేందుకు ప్రయత్నించాయని బీజేపీ ఆరోపించింది. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజల తాత్కాలిక ఇబ్బంది తమకు తెలుసని, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా మని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. పెట్రో ధరల్లో హెచ్చుతగ్గులు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో లేదన్న విషయం ప్రజలు అర్థం చేసుకున్నారని, అందువల్ల బంద్ పిలుపును తిప్పికొట్టారని చెప్పారు. పెట్రో ఉత్పత్తులపై వసూలు చేస్తున్న పన్నుల మొత్తాన్ని సంక్షేమ పథకాల కోసమే ఖర్చు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రోలు ధర రూ. 39 నుంచి రూ. 71కి పెరిగిందని ఆయన తప్పుపట్టారు. ప్రతిపక్షాలు ఐక్యంగా సాగాల్సిన తరుణమిది: మన్మోహన్ న్యూఢిల్లీ: దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ వ్యవస్థను కాపాడేందుకు ప్రతిపక్ష పార్టీలు విభేదాల్ని పక్కన పెట్టి కలిసి సాగాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఉద్ఘాటించారు. పెట్రో ధరల పెంపునకు నిరనసగా ప్రతిపక్షాలు చేపట్టిన భారత్ బంద్‌లో భాగంగా ఢిల్లీలోని రాంలీలా మైదానం వద్ద నిర్వహించిన ర్యాలీలో కేంద్రంపై ఆయన విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు దేశ ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. సమాజంలోని యువత, రైతులు, సామాన్య ప్రజలు ఇలా అందరూ మోదీ ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ‘మోదీ ప్రభుత్వం ఇప్పుడు పరిధి దాటి ప్రవర్తిస్తోంది. ఆ ప్రభుత్వాన్ని మార్చే సమయం ఆసన్నమైంది. పార్టీలు చిన్నచిన్న విభేదాల్ని పక్కనపెట్టి దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సిద్ధమైనప్పుడే అది సాధ్యం’ అని పేర్కొన్నారు. మోదీజీ.. ధరలపై మౌనం వీడండి: రాహుల్ ప్రధాని మోదీ పాలనలో దేశంలో విభేదాలు పెచ్చరిల్లుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రతిపక్షాల ఐక్య కూటమి ఓడించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ర్యాలీలో మాట్లాడుతూ.. పెట్రో ధరల పెరుగుదల, రాఫెల్ ఒప్పందం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రధాని మోదీ మౌనాన్ని రాహుల్ ప్రశ్నించారు. ‘70 ఏళ్లలో జరగనిది ఈ నాలుగేళ్లలో చేశామని మోదీ చెబుతున్నారు. అది నిజమే. ఎక్కడ చూసినా ఒకరితో మరొకరు గొడవలు పడుతున్నారు. ప్రజల మధ్య విభేదాల్ని సృష్టించారు. అదే వారు సాధించింది’ అని తప్పుపట్టారు. ఈ ర్యాలీలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పట్నాలో బస్సు అద్దాల ధ్వంసం; ఢిల్లీలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సులు -
రికార్డు స్థాయికి పెట్రో మంట
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రాజధాని ఢిల్లీలో తొలిసారిగా పెట్రోల్ ధర రూ. 80 మార్కును దాటింది. డాలర్‌తో రూపాయి మారకవిలువ తగ్గడంతో దిగుమతుల ధరలు పెరిగినందువల్లే ఈ స్థాయిలో రేట్లు పెరిగిపోయాయి. శనివారం ఒక్కరోజే పెట్రోల్ ధర 39 పైసలు, డీజిల్ ధర 44 పైసలు పెరిగింది. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.80.38కి, డీజిల్ రూ.72.51కి చేరింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.87.77 కాగా, డీజిల్ రూ. 76.98కు పెరిగింది. మిగిలిన మెట్రో నగరాలు, రాష్ట్రాల రాజధానులతో పోలిస్తే ఢిల్లీలో ధరలు తక్కువగా, ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. కాగా, పెరుగుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ సోమవారం (సెప్టెంబర్ 10న) విపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర, రాష్ట్రాల పన్నుల కారణంగానే పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్ ధరలను తగ్గించే విషయంపై కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. మరో రెండు నెలల్లో 4 రాష్ట్రాలకు ఎన్నికల నేపథ్యంలో ప్రజావ్యతిరేకత రాకుండా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.