
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలతో నేడు సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం 4.30 గంటలకు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్, హేమంత్ సోరెన్, శరద్ పవార్, సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విపక్షాల ఐక్యత, కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి ప్రతిపక్ష పార్టీలను సిద్ధం చేయటం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిని ఓడించటం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
చదవండి : పన్నీరుకు ‘ఇంటిగండం’..?
Comments
Please login to add a commentAdd a comment