
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి తాము బయటకు వచ్చే ప్రసక్తే లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రివాల్ తేలి్చచెప్పారు. ఇండియా కూటమిలోనే భాగస్వామిగా ఉంటామని చెప్పారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
విపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యరి్థగా మీ పేరును ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించగా... తామే ప్రధానమంత్రి అని దేశంలోని 140 మంది భారతీయులు భావించేలా ఒక వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరం ఉందని కేజ్రివాల్ బదులిచ్చారు. కేవలం ఒక వ్యక్తిని కాదని, పౌరులందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పారు.