కేంద్రంపై ఇండియా కూటమి ధ్వజం
జంతర్‌మంతర్ వద్ద ధర్నా
న్యూఢిల్లీ: బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేస్తోందని ‘ఇండియా’ కూటమి నేతలు హస్తిన వేదికగా ధ్వజమెత్తారు. ఆప్ కనీ్వనర్ కేజ్రీవాల్‌ను అన్యాయంగా జైళ్లో పడేసి ఆరోగ్యపరిస్థితిని దారుణంగా దిగజార్చారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను విడుదలచేయాలంటూ కూటమి నేతలు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. భారత్ మాతాకీ జై, నియంతృత్వం నశించాలి నినాదాలతో ధర్నాస్థలి హోరెత్తింది.
ఆప్ పిలుపుమేరకు చేపట్టిన ఈ ధర్నాకు ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత దీపాంకర్ భట్టాచార్య, లోక్‌సభలో కాంగ్రెస్ డెప్యూటీ లీడర్ గౌరవగొగోయ్, శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్, ఆప్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment