jantar mantar dharna
-
INDIA bloc: విపక్షాల గొంతు నొక్కుతోంది
న్యూఢిల్లీ: బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేస్తోందని ‘ఇండియా’ కూటమి నేతలు హస్తిన వేదికగా ధ్వజమెత్తారు. ఆప్ కనీ్వనర్ కేజ్రీవాల్‌ను అన్యాయంగా జైళ్లో పడేసి ఆరోగ్యపరిస్థితిని దారుణంగా దిగజార్చారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను విడుదలచేయాలంటూ కూటమి నేతలు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. భారత్ మాతాకీ జై, నియంతృత్వం నశించాలి నినాదాలతో ధర్నాస్థలి హోరెత్తింది. ఆప్ పిలుపుమేరకు చేపట్టిన ఈ ధర్నాకు ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత దీపాంకర్ భట్టాచార్య, లోక్‌సభలో కాంగ్రెస్ డెప్యూటీ లీడర్ గౌరవగొగోయ్, శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్, ఆప్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు హాజరయ్యారు. -
అరాచక పాలనపై ధర్మాగ్రహ జ్వాల.. ఢిల్లీలో జగన్ ధర్నా (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీ ధర్నా.. జగన్‌కు జాతీయ నేతల మద్దతు (ఫొటోలు)
-
ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?: వైఎస్ జగన్
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతో పాటు, చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికి కూడా విఘాతం కలుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మీడియా ముందుకు రావాల్సి వస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయి. వందల ఇళ్లను ధ్వంసం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా అక్రమ కేసులో పెట్టారు. గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. వైఎస్సార్సీపీని అణగదొక్కడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం అయింది. అందుకే హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహిస్తోంది. మా హయాంలో ఏనాడూ ఇలాంటి దాడులు, దౌర్జన్యాల్ని ప్రొత్సహించలేదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు, ఇలాంటివేమీ చేయలేదు. హత్యలు చేయలేదు. దాడులు చేయలేదు. ఆస్తుల విధ్వంసం చేయలేదు. ఎవరి ఇళ్లలోకి చొరబడి, వారిని వేధించలేదు. వారిపై దాడి చేయలేదు. ఎక్కడా పౌరుల హక్కులకు భంగం కలిగించలేదు. చంద్రబాబు కుమారుడైనా నారా లోకేష్ ఒక మంత్రిగా ఉండి.. రెడ్‌బుక్ పేరిట హోర్డింగ్‌లు పెట్టాడు. ఎవరెవరి మీద దాడుల చేయాలి. ఎవరిని ఎలా వేధించాలి. అన్న అన్ని వివరాలు రాసినట్టు.. అందులో లోకేష్ స్వయంగా ప్రకటించారు. తనకు నచ్చనివారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పోలీసులు కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే, వాటన్నింటినీ వెంటనే ఆపలేకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడుల, ఆస్తుల విధ్వంసం, చీనీ తోటల ధ్వంసం.. వీటన్నింటిపై ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశాము. వీడియోలు కూడా ప్రదర్శిస్తున్నాం. దయచేసి, ఒక్కసారి ఈ ఫోటోలు, వీడియోలు చూడండి. రాష్ట్రంలో దారుణస్థితిని అర్ధం చేసుకొండి. మా పార్టీ ప్రజా ప్రతినిధులు.. చివరకు ఒక ఎంపీ కూడా తన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి. మా పార్టీ ఎంపీ మిధున్‌రెడ్డిపై పట్టపగలే రాళ్లదాడి జరిగింది. ఆయన వాహనాలు ధ్వంసం చేశారు.ఇన్ని జరుగుతున్నా, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఆ విధంగా రాజ్యాంగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. అంత కంటే దారుణం ఏమిటంటే.. మా రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న వారి నుంచి కాపాడకపోగా.. వారిపై కేసులు నమోదు చేయకపోగా.. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. ఇంత కంటే దారుణం ఇంకా ఎక్కడైనా ఉంటుందా?. దయచేసి, మీరంతా ఇక్కడి ఫోటోలు, వీడియోలు చూడండి. ఇలాంటి ఘటనలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగడం సబబేనా? అన్నది ఆలోచించండి. ఇక్కడ మా నిరసన కార్యక్రమానికి మీరు అండగా నిలవమని కోరుతున్నాను. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం. అందుకే మరోసారి నేషనల్ మీడియాను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇక్కడి ఫోటోలు, వీడియోలు చూడండి. ఇలాంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగడం సబబేనా? అన్నది ఆలోచించండి.ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, మీ ఇంట్లోకి చొరబడి, మీపై దాడి చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని మీరెలా ఎదుర్కొంటారు? దానిపై మీరెలా స్పందిస్తారు?. కాబట్టి, దయచేసి ఇక్కడి గ్యాలరీలో ఫోటోలు, వీడియోలు చూడండి. రాష్ట్రంలో దారుణ పరిస్థితి గురించి తెలుసుకొండి. ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి అని జగన్ విజ్ఞప్తి చేశారు. -
నేడు ఢిల్లీకి సీఎంలు సిద్ధరామయ్య, పినరయి విజయన్.. కేంద్రం తీరుకు నిరసన!
కర్ణాటకలోని అధికార కాంగ్రెస్, కేరళలోని అధికార ఎల్డీఎఫ్ పార్టీలు కేంద్రంలోని బీజేపీ తీరుపై ఆందోళనకు నడుం బిగించాయి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నేడు (బుధవారం) ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక దౌర్జన్యాలకు, అన్యాయానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలకు ప్లాన్ చేసింది. చలో ఢిల్లీ పిలుపులో భాగంగా సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా కాంగ్రెస్ అగ్రనేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు (బుధవారం) కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వ అన్యాయ, వివక్షాపూరిత విధానాల వల్ల 2017-18 నుంచి కర్ణాటక ప్రభుత్వానికి రూ.1.87 లక్షల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నేటి ఉదయం 7 ఉదయం 11 గంటల నుండి జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టనుంది. గ్రాంట్లు ఇవ్వడంలో కర్ణాటకపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సౌకర్యాల కల్పనలో కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు అన్యాయం చేసిందని సీఎం ఆరోపించారు. ‘మేరా ట్యాక్స్ మేరా అధికార్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఈ నిరసనను ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. తమ నిరసన భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) వ్యతిరేకం కాదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఐక్యంగా ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తోందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంటామన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా తమకు సరైన ఉపశమనం లభించలేదని కర్ణాటక ప్రభుత్వం ఆరోపిస్తోంది. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా అందలేదని డీకే శివకుమార్ ఆరోపించారు. కాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా దేశ రాజధానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేరళ ఎల్డిఎఫ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తుంది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు కేరళ ప్రభుత్వం కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగింది. -
సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం!
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని... వెంటనే ఆయనను అరెస్టు చేయాలని భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసులు బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయకపోతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న ఈ స్టార్ రెజ్లర్లు స్పష్టం చేశారు. కొందరు మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించారని తాము చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తేలితే తమపైనే కేసు నమోదు చేయాలని 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన సాక్షి వ్యాఖ్యానించింది. మూడు నెలల క్రితం చేపట్టిన నిరసనను విరమించి తప్పు చేశామని... ఈ విషయంలో తమను కొందరు తప్పుదోవ పట్టించారని సాక్షి, వినేశ్, బజరంగ్ విచారం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తుల మాటలు వినబోమని, రెజ్లింగ్ శ్రేయోభిలాషుల సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కన్నౌట్ ప్లేస్ పోలీసు స్టేషన్‌కు తాము వెళ్లినా పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన బజరంగ్ పూనియా తెలిపాడు. ‘అంతర్జాతీయ టోర్నీల్లో దేశం కోసం పతకాలు సాధించినపుడు కేంద్ర ప్రభుత్వం సన్మానిస్తుంది. కానీ మా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే మాత్రం ఇదే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని బజరంగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో కేంద్ర క్రీడా శాఖ నియమించిన పర్యవేక్షక కమిటీ మా పట్ల పక్షపాతంగా వ్యవహరించింది. కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే లైంగిక వేధింపులకు గురైన బాధితుల వివరాలు తెలుస్తాయి. బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ కావడం, ఆ పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్లు అనిపిస్తోంది’ అని ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ విజేత వినేశ్ వ్యాఖ్యానించింది. మరోవైపు మే 7వ తేదీన జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలకు గుర్తింపు లేదని... భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటయ్యే అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. మేరీకోమ్ సారథ్యంలోని పర్యవేక్షక కమిటీ తమ నివేదిక అందించిందని... నివేదికను పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా క్రీడా శాఖ వివరించింది. పర్యవేక్షక కమిటీ నివేదిక ప్రకారం డబ్ల్యూఎఫ్ఐలో పారదర్శకత కొరవడిందని... రెజ్లర్ల సమస్యలు వినేందుకు, పరిష్కరించేందుకు ఎలాంటి వ్యవస్థ లేదని తాము గుర్తించినట్లు తెలిపింది. విచా రణ పూర్తి చేసి నివేదిక అందించడంతో పర్యవేక్షక కమిటీ పని ముగిసిందని క్రీడా శాఖ తెలిపింది. -
జంతర్ మంతర్వద్ద వైఎస్ షర్మిల ధర్నా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని, అయినా ఇప్పటివరకు దీనిపై ఎటువంటి విచారణ చేపట్టలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షరి్మల ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పోరాడేందుకు ఎంపీలు కూడా తనతో కలసి రావాలని ఆమె సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ మంగళవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనుందని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఎస్సారెస్పీ ఫేజ్–2, ఎల్లంపల్లి, వరద కాలువ, దేవాదుల, మిడ్‌మానేర్ లాంటి ప్రాజెక్టులు నీళ్లు ఇస్తుంటే అవి కాళేశ్వరం నుంచి వస్తున్న ట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఒక మహిళ బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు సిగ్గు లేకుండా మద్దతిస్తున్నారని మండిపడ్డారు. -
‘సాయ్’ స్పందన సరిగా లేదు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని భారత టాప్ రెజ్లర్లంతా పునరుద్ఘాటించారు. బ్రిజ్‌భూషణ్‌ను తప్పించి ఆటను కాపాడాలంటూ బుధవారం అనూహ్యంగా నిరసనకు దిగిన రెజ్లర్లు రెండో రోజూ దానిని కొనసాగించారు. బజ్రంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ తదితరులు ఇప్పటికే నిరసనలో పాల్గొంటుండగా గురువారం ఒలింపిక్ రజత పతక విజేత రవి దహియా, అన్షు మలిక్ కూడా వారికి సంఘీభావం ప్రకటించారు. రెజ్లర్ల ఆరోపణలకు స్పందిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికారులు వారితో చర్చించేందుకు సిద్ధమయ్యారు. సుమారు గంట పాటు వారితో రెజ్లర్ల భేటీ సాగింది. అయితే దీనిపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు అండగా నిలుస్తామని అధికారులు చెబుతున్నా...వారి స్పందన సంతృప్తికరంగా లేదని, చర్యల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని రెజ్లర్లు చెప్పారు. ‘లైంగిక వేధింపులకు గురైన మరికొందరు బాధితులు ఇవాళ మాతో చేరారు. వారి పేర్లు ప్రస్తుతానికి బహిరంగపర్చదల్చుకోలేదు. ఏదైనా పరిష్కారం వస్తుందని భావించాం. కానీ ప్రభుత్వ స్పందన చూస్తే అలా అనిపించడం లేదు. ఇక మేం చట్టపరంగా, న్యాయపరంగా తేల్చుకుంటాం. బ్రిజ్‌భూషణ్ రాజీనామా మాత్రమే కాదు... ఆయనపై కేసు నమోదు చేయించి జైలుకు కూడా పంపిస్తాం. మేమంతా ఒలింపిక్ విజేతలం, ప్రపంచ విజేతలం. అన్నీ నిజాలే చెబుతున్నాం. తగిన ఆధారాలూ ఉన్నాయి. మా ఆరోపణలపై సందేహాలు వద్దు’ అని వినేశ్ స్పష్టం చేసింది. బీజేపీకి చెందిన మరో అగ్రశ్రేణి రెజ్లర్ బబితా ఫొగాట్ కూడా ప్రభుత్వం తరఫున చర్చలకు ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రిని కలిసిన రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలతో నిరసన తెలుపుతున్న రెజ్లర్లు గురువారం రాత్రి మరో కీలక అడుగు వేశారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి, రెజ్లర్ల మధ్య గంటకు పైగా చర్చలు కొనసాగాయి. చర్చల తుది ఫలితంపై స్పష్టత లేకున్నా... బ్రిజ్‌భూషణ్ రాజీనామాకే ఠాకూర్ కూడా మద్దతు పలికినట్లు తెలిసింది. 24 గంటల్లోగా ఆయన తన రాజీనామాను ప్రకటించాలని, లేదంటే తామే ఆయనను తొలగిస్తామని కూడా స్పష్టం చేసినట్లు రెజ్లింగ్ వర్గాల సమాచారం. -
జంతర్ మంతర్ వద్ద బృందా కారత్కు చేదు అనుభవం
ఢిల్లీ: సీపీఐ(ఎం) నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్(75)కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన వద్దకు గురువారం ఆమె చేరుకున్నారు. అయితే.. వేదిక ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించాలన్న ఆమె ప్రయత్నానికి రెజ్లర్లు అడ్డు తగిలారు. రాజకీయ ఎజెండాగా ఈ వ్యవహారాన్ని మార్చేయడం సరికాదంటూ మైకులోనే చెబుతూ ఆమెను వేదికపైకి ఎక్కకుండా అడ్డుకున్నారు. ఒలింపిక్స్ మెడలిస్ట్ అయిన బజరంగ్ పూనియా.. ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్టేజ్‌పైకి బృందా కారత్ ఎక్కేందుకు యత్నించగా.. తమ పోరాటాన్ని రాజకీయం చేయొద్దంటూ పూనియా ఆమెకు విజ్ఞప్తి చేశారు. దయచేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అదే సమయంలో మరికొందరు రెజ్లర్లు.. కారత్ను ఉద్దేశిస్తూ ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేయడం గమనార్హం. కారత్‌తో పాటు మరికొందరు కమ్యూనిస్ట్ నేతలు ఆ సమయంలో వేదిక మీదకు వెళ్లకుండా నిలిచిపోయారు. ఆపై కాసేపటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. #WATCH | CPI(M) leader Brinda Karat asked to step down from the stage during wrestlers' protest against WFI at Jantar Mantar in Delhi. pic.twitter.com/sw8WMTdjsk — ANI (@ANI) January 19, 2023 రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ కైసర్‌గంజ్ ఎంపీ(ఉత్తర ప్రదేశ్) బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి. అవినీతి, మానసికంగా వేధింపులు, లైంగిక వేధింపుల పర్వం కొనసాగుతోందంటూ హస్తిన నడిబొడ్డున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కామన్ వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్, మరో ఛాంపియన్ సాక్షి మాలిక్‌లు స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో.. వ్యవహారం మరింత ముదిరింది. బ్రిజ్ భూషణ్, కోచ్‌లు.. మహిళా రెజర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపించారు వాళ్లు. ఇక ఈ ఆరోపణలను తోసిపుచ్చిన బ్రిజ్ భూషణ్.. తాను పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమంటూ ప్రకటించారు. ఆరోపణలు నిరూపిస్తే తల నరుక్కునేందుకు సిద్ధమంటూ ప్రకటించారు కూడా. జజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు వారం కిందట తనను కలిశారని, ఇద్దరూ ఎలాంటి సమస్యలు లేవని తనతో చెప్పారని, ఈ నిరసనల వెనుక తనను దించేసే కుట్ర జరుగుతోందని, ఓ బడా పారిశ్రామికవేత్త హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారాయన. మరోవైపు ఈ వ్యవహారంలో గురువారం కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. శాస్త్రి భవన్‌లోని కేంద్ర క్రీడా శాఖల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో చర్చించడానికి రెజ్లర్లు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని భజరంగ్ పూనియా సైతం ధృవీకరించారు. సమావేశం తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ పూనియా రెజ్లర్ల నిరసనకు మద్దతు ప్రకటించారు. రెజ్లర్లకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆమె ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. I request PM Modi to make sure that our wrestlers get justice. I will continue to stand with our athletes: Dr Krishna Poonia, Congress MLA & former gold-medal-winning track & field athlete, at Jantar Mantar in Delhi pic.twitter.com/GEVTLJFT2Z — ANI (@ANI) January 19, 2023 -
తగ్గిన ఉద్రిక్తత
న్యూఢిల్లీ: అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు గాడిన పడుతున్నాయి. శనివారం ప్రజలు బయటకు వచ్చి తమ పనుల్లో నిమగ్నమయ్యారు. నిత్యావసరాలు సమకూర్చుకోవడంతోపాటు, దెబ్బతిన్న ఆస్తులను, మంటల్లో దహనమైన ఇళ్ల శిథిలాలను తొలగించి, చక్కదిద్దుకోవడం ప్రారంభించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించేందుకు బలగాల కవాతు చేస్తున్నారు. అల్ల్లర్లను నిరసిస్తూ ‘ఢిల్లీ పీస్ ఫోరం’ అనే ఎన్జీవో జంతర్‌మంతర్ వద్ద శాంతి ర్యాలీ చేపట్టింది. జాతీయ జెండాను చేతబూనిన వందలాది మంది ప్రదర్శనకారులు జై శ్రీరాం, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. నిరసన తెలిపితే కేసులా?: కాంగ్రెస్ ఢిల్లీ అల్లర్లపై పోలీసుల దర్యాప్తు ఏకపక్షంగా సాగుతోందని, దీనిపై నిగ్గు తేల్చేందుకు అమికస్ క్యూరీని నియమించాలని సుప్రీంకోర్టును కాంగ్రెస్ కోరింది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ శనివారం వ్యాఖ్యానించారు. ‘విద్వేష పూరిత ప్రసంగం అర్థం ఏంటి? బీజేపీ నేతల ప్రసంగాలు విద్వేషపూరితం కాదు. అదే ఆందోళనకారులు మాట్లాడితే సంఘ విద్రోహం కేసులు పెడుతున్నారు’ అని తెలిపారు. రెచ్చగొట్టడంలో వారికి ప్రావీణ్యం: నక్వి ప్రతిపక్షాలు ఢిల్లీ అల్లర్ల బాధితుల గాయాలను రెచ్చగొడుతున్నాయని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి శనివారం ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలకు ప్రజలను రెచ్చగొట్టడంలో మంచి నైపుణ్యం ఉందని మీడియాతో వ్యాఖ్యానించారు. ఫిర్యాదుల కోసం... మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో మెసేజీలను ఫార్వర్డ్ చేసి, ప్రచారం కల్పించడం నేరమని ఢిల్లీ ప్రభుత్వం శనివారం పేర్కొంది. వీటిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం యోచి స్తోంది. ఈశాన్య ఢిల్లీలోని పాఠశాలలను మార్చి 7వ తేదీ వరకు తెరవరాదని ప్రభుత్వం నిర్ణయించింది. -
నిరసనలపై నిషేధం తగదు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్, బోట్‌క్లబ్ వంటి ప్రాంతాల్లో నిరసనలు, బైఠాయింపులపై పూర్తి నిషేధం విధించటం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకు బదులు అక్కడ ప్రజలు స్వేచ్ఛగా నిరసనలు తెలిపేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. జంతర్‌మంతర్, ఇండియా గేట్ దగ్గరి బోట్ క్లబ్ వద్ద వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఆందోళనలు చేపట్టరాదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) విధించిన నిషేధానికి వ్యతిరేకంగా మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ తదితర స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో శాంతి భద్రతల సమస్య, హింసాయుత పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే విధించే 144వ సెక్షన్ వంటి ఆజ్ఞల్ని అధికారులు అమలు చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై ఎన్జీటీ తరఫు లాయర్ వాదిస్తూ..‘జంతర్‌మంతర్ రోడ్డులో వివిధ సంఘాలు, సంస్థలు, పార్టీలు చేపట్టే ఆందోళనల కారణంగా ప్రజా జీవనానికి ఆటంకం కలగటంతోపాటు, శబ్దకాలుష్యం, తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. పూర్తిస్థాయి నిషేధం తగదని, ప్రజల నిరసన హక్కుకు భంగం కలగకుండా మార్గదర్శకాలు రూపొం దించాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. -
తెలుగువాళ్లు అతి మంచివాళ్లు: లక్ష్మీ పార్వతి
న్యూఢిల్లీ: తెలుగువాళ్లు తెలివి తక్కువ వాళ్లు కాదని, అతి మంచివాళ్లు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సమైక్య ధర్నాలో లక్ష్మీ పార్వతి ప్రసంగించారు. తమిళనాడు కంటే ఎదిగిపోతున్నామనే కుట్రతో సోనియాతో కలిసి రాష్ట్ర విభజనకు చిదంబరం కుట్ర చేశారని ఆరోపించారు. తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టి కుంపట్లు రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాలు నాటకాలు మానుకోవాలని సూచించారు. తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ తర్వాత వైఎస్ జగన్ ఒక్కరే పాటు పడుతున్నారని పేర్కొన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం నిలబట్టానికి రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్ అని లక్ష్మీ పార్వతి అన్నారు. -
బాబును భావితరాలు క్షమించవు: ఎంపీ మేకపాటి
‘‘తెలుగువారందరూ 50-60 ఏళ్లుగా గొప్పగా అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ నేడు మనం గర్వించే రాజధానిగా తయారైంది. అలాంటిది ఉన్నఫళంగా సీమాంధ్రలో వేరే రాజధాని కట్టుకోమంటే చంద్రబాబు కూడా సరేనంటూ నాలుగు లక్షల కోట్లు అడిగారు. విభజనకు సరేనని ఉత్తరం ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు.. తన ఎంపీలతో రాజీనామాలు చేయించి.. మరికొందరితో పార్లమెంట్ ఉభయసభలను స్తంభింపచేయించారు. బాబును భావితరాలు కూడా క్షమించవు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ‘‘చంద్రబాబు కూడా ఆలోచించాలి. తన మాట కాదని ఎంపీలు రాజీనామా చేశారా? ఆయనిచ్చిన ఉత్తరానికి వ్యతిరేకంగా చేశారా? అదే జరిగితే మీ పార్టీలో మీ మాటకు కట్టుబడే పరిస్థితి లేదా? తెలుగు ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో మీరు ఆడుతున్న నాటకాల్ని నేడు ప్రతి చిన్న కుటుంబంలోని వారూ గ్రహించారు, మీ మోసాల్ని ఎవరూ మెచ్చరు..’’ అని హితవు పలికారు. వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలనే.. ‘‘సీమాంధ్రలోనే కాదు తెలంగాణలో సైతం జగన్‌కు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రజాభిమానం చాలా గొప్పగా ఉంది. మొత్తం 30-37 ఎంపీ సీట్లు గెలవడంతోపాటు, 180-190 అసెంబ్లీ సీట్లు సాధించి మా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏం చేసైనా ఈ అవకాశాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే విభజన ప్రకటన చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచీ వాళ్ల ధ్యేయమంతా ఎలా ఇబ్బంది పెట్టాలన్నదే. ఆ ధ్యేయంతోనే సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం ప్రకటించింది. ఇది అనాలోచిత నిర్ణయం’’ అని విమర్శించారు. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి సీఎంగా ఉండగా తీర్మానం చేసి పంపితే.. దాన్ని పట్టించుకోకుండా ఇప్పటివరకూ తెలంగాణపై అసెంబ్లీలో ఏ తీర్మానం చేయని ఆంధ్రప్రదేశ్‌ను చీల్చాల్సిన అవసరం ఏమిటి? నేడు దేశంలో చాలా రాష్ట్రాలను విభజించాలని చాలా డిమాండ్లు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వాటన్నింటి జోలికీ పోకుండా ఒక్క ఆంధ్రప్రదేశ్‌ను, తెలుగు ప్రజలను రాజకీయ కారణాలతో, తెలంగాణలో పది సీట్లు వస్తాయనే ఉద్దేశంతో ఇలా చేస్తారా?’’ అని మేకపాటి ప్రశ్నాస్త్రాలు సంధించారు. చీల్చడం చంద్రబాబుకు కొత్త కాదు: జూపూడి రాష్ట్రాన్ని, కులాలను, కుటుంబాన్ని చీల్చడం చంద్రబాబుకు కొత్త కాదని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ దుయ్యబట్టారు. విభజనపై సీమాంధ్ర అగ్నిగుండంలా రగులుతోంటే బాబు సమైక్యంగా ఉండాలని అమెరికా సభల్లో కథలు చెప్పడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్సీపీ ధర్నాలో జూపూడి మాట్లాడుతూ.. అర్ధరాత్రి ఢిల్లీ పెద్దలతో మాట్లాడే బాబు రాష్ట్ర విభజనపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ‘సమన్యాయం చేయలేకపోతే విభజనపై నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్‌కు లేదు. విజయమ్మ దీక్ష దేశ రాజకీయాల్లో మలుపు. జగన్ దీక్ష దేశ రాజకీయ నేతలను ఆలోచింపజేస్తుంది. ఆయన నాయకత్వంలో 42 మంది ఎంపీలు పార్లమెంటుకు వస్తే దేశ రాజకీయాలను శాసిస్తారనే భయంతోనే ఢిల్లీ పెద్దలు కుట్రతో ఆయనను జైలులో పెట్టారు’ అని ధ్వజమెత్తారు. జగన్‌ను ఎదుర్కోలేకే కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డాయని వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, భూమన కరుణాకర్‌రెడ్డి, టి.బాలరాజు, కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బాబు లేఖతోనే విభజన: ఉమ్మారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విడగొడితే తనకు అభ్యంతరం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ ఇచ్చారని.. ఆ కారణంతోనే విభజనకు కాంగ్రెస్ సిద్ధపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారమిక్కడ వైఎస్ విజయమ్మ ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న వెంటనే బాబు.. నాలుగైదు లక్షల కోట్లు ఇవ్వండి, మేం వెళ్లి ప్రత్యేక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం అంటూ బేరసారాలకు దిగారు. సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని గమనించి వెంటనే ప్లేటు ఫిరాయిస్తూ సమస్యలంటూ ప్రధానికి లేఖ రాశారు. రెండు కళ్ల ధోరణి, రెండు నాల్కల ధోరణి మానుకోకపోతే బాబు చరిత్రహీనులవుతారు’ అని విమర్శించారు. ఆత్మగౌరవ యాత్రకు వెళ్తే.. జనాగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుందనే మానుకున్నారని చెప్పారు.