తెలుగువాళ్లు అతి మంచివాళ్లు: లక్ష్మీ పార్వతి | Telugu people good human beings, says Lakshmi Parvathi | Sakshi
Sakshi News home page

తెలుగువాళ్లు అతి మంచివాళ్లు: లక్ష్మీ పార్వతి

Published Mon, Feb 17 2014 3:13 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

తెలుగువాళ్లు అతి మంచివాళ్లు: లక్ష్మీ పార్వతి - Sakshi

తెలుగువాళ్లు అతి మంచివాళ్లు: లక్ష్మీ పార్వతి

న్యూఢిల్లీ: తెలుగువాళ్లు తెలివి తక్కువ వాళ్లు కాదని, అతి మంచివాళ్లు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సమైక్య ధర్నాలో లక్ష్మీ పార్వతి ప్రసంగించారు.

తమిళనాడు కంటే ఎదిగిపోతున్నామనే కుట్రతో సోనియాతో కలిసి రాష్ట్ర విభజనకు చిదంబరం కుట్ర చేశారని ఆరోపించారు. తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టి కుంపట్లు రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాలు నాటకాలు మానుకోవాలని సూచించారు. తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ తర్వాత వైఎస్ జగన్ ఒక్కరే పాటు పడుతున్నారని పేర్కొన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం నిలబట్టానికి రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్ అని లక్ష్మీ పార్వతి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement