సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని, అయినా ఇప్పటివరకు దీనిపై ఎటువంటి విచారణ చేపట్టలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షరి్మల ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పోరాడేందుకు ఎంపీలు కూడా తనతో కలసి రావాలని ఆమె సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ మంగళవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనుందని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఎస్సారెస్పీ ఫేజ్–2, ఎల్లంపల్లి, వరద కాలువ, దేవాదుల, మిడ్‌మానేర్ లాంటి ప్రాజెక్టులు నీళ్లు ఇస్తుంటే అవి కాళేశ్వరం నుంచి వస్తున్న ట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఒక మహిళ బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు సిగ్గు లేకుండా మద్దతిస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment