సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు షర్మిల. న్యూఢిల్లీలోని AICC కార్యాలయానికి భర్త అనిల్‌తో వచ్చిన వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల.. కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు.
షర్మిల ఏమన్నారంటే..
- వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉంది
- ఈరోజు నుంచి కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ ఒక భాగం
- దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్
- దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్
- కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదు
- రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం మా నాన్న కల
- కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తా
- రాహుల్ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
- ఆ యాత్రతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
- రాహుల్ జోడో యాత్ర ప్రజలతో పాటు నాలో కూడా విశ్వాసం నింపింది
- సెక్యులర్ పార్టీ కేంద్రంలో లేనందువల్లే మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి
- దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే
- కాంగ్రెస్‌లో చేరినందుకు గర్వపడుతున్నాను.
ఇక, వైఎస్సార్‌టీపీని 2021 జులై 8వ తేదీన ప్రారంభించారు షర్మిల. 2021 అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి పాదయాత్ర చేశారు షర్మిల. ఈరోజు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. షర్మిల చేరిక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు నేతలు హాజరయ్యారు.
Senior leader from Andhra Pradesh YS Sharmila ji joins the INC in the presence of Congress President Shri @kharge, Shri @RahulGandhi and General Secy (Org.) Shri @kcvenugopalmp at the AICC HQ in New Delhi. pic.twitter.com/LqMvqqqwCm
— Congress (@INCIndia) January 4, 2024
AICC కార్యాలయంలో చేరిక అనంతరం సోనియా నివాసానికి వెళ్లారు షర్మిల, అనిల్. సోనియాను కలిసి పార్టీలో స్వాగతించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేయమని సోనియా చెప్పారని, దేశమంతా రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా.. పార్టీ కోసం పని చేస్తానని, మీడియా అడిగే అన్ని ప్రశ్నలకు ఒకటి రెండు రోజుల్లో అన్నిటికీ సమాధానం చెప్తానని, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ బరిలో దిగుతానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment