తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: షర్మిల | YSR Telangana Party (YSRTP) Not Contest In Telangana Assembly Elections 2023: YSRTP President Y S Sharmila - Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్‌టీపీ పోటీ చేయట్లేదు: షర్మిల

Published Fri, Nov 3 2023 12:56 PM | Last Updated on Fri, Nov 3 2023 1:17 PM

No Contest YSRTP In Telangana Assembly Elections Says YS Sharmila - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని శుక్రవారం ఆమె మీడియాకు తెలిపారు. ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని ఆమె తెలిపారు.

ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాము నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డకోకూడదనే ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులన్నా, కార్యకర్తలన్నా తనకు అపారమైన గౌరవం ఉందని,  ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు... తనను కుటుంబ సభ్యురాలిగా వారు చూశారని ఆమె తెలిపారు. 

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నామని... తమ పార్టీ తరపున పలువురిని ఎన్నికల బరిలో నిలపాలని తాను అనుకున్నానని చెప్పారామె. తాను ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో అడుగు పెడతాననే పూర్తి నమ్మకం తనకు ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్న ఆమె..  ఈ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని కోరారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement