లండన్: బ్రిటన్‌లో లేబర్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఎన్నిక అయ్యారు. అయితే గతంలో లేబర్ పార్టీ కశ్మీర్ విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేయటంతో భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా లేబర్ పార్టీ అధికారంలోకి రావటంతో భారత్‌తో భాగస్వాయం విషయం తెరపైకి వచ్చింది. అయితే లేబర్ పార్టీ గతంలో భారత్‌పై చేసిన ఆరోపణలు, వైఖరిని ప్రధాని కీర్ స్టార్మర్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.
2019లో లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ వార్షిక సమావేశంలో భారత్‌లోని కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన చోటుచేసుకుందని, అక్కడి పరిస్థితిపై ఎమర్జెన్సీ తీర్మానం ప్రవేశపెట్టారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేమయంలో లేబర్ పార్టీ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.
లేబర్ పార్టీ ఆరోపణలు సరైన సమాచారం లేని, నిరాధారమైనవి అని భారత్ మండిపడింది. అప్పట్లో జెరెమీ కార్బిన్‌పై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత సంతతి ఎంపీలు వ్యతిరేకించారు. జెరెమీపై చేసిన తీర్మానం భారత వ్యతిరేక విధానమని ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక..2020లో కొన్ని కారణాల వల్ల ఆయన్ను లేబర్ పార్టీ సస్పెండ్ చేసింది.
అయితే కొత్తగా ఎన్నికైన ప్రధాని కీర్ స్టార్మర్ భారత్‌తో భాగస్యామ్యం, సంబంధాల విషయంలో తన పార్టీ వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చుకుంటామని తెలిపారు. గతంలో చేసిన ఆరోపణలపై తమ పార్టీ వైఖరీ మార్చుకుంటామని పేర్కొన్నారు. భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్దతతో ఉన్నట్లు తెలిపారు.
‘‘ లేబర్ పార్టీ ఇతర దేశాలతో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాలను మెరుగుపర్చుకుంటుంది. స్వేచ్ఛా వాణిజ్యం, భద్రత, విద్య, టెక్నాలజీ, పర్యావరణ మార్పులు వంటి పలు రంగాల్లో మేము భారత్ కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం’’ అని మేనిఫోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో లేబర్ పార్టీ తన భారత వ్యతిరేక వైఖరిని మార్చుకొని భాగస్వామ్య సంబంధాలు పెంచుకునే దిశగా వెళ్లుతున్నట్లు స్పష్టం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment