బంగ్లా షేక్‌ హసీనాకు బిగ్‌ షాక్‌ | Case against Bangladesh Sheikh Hasina | Sakshi
Sakshi News home page

బంగ్లా షేక్‌ హసీనాకు బిగ్‌ షాక్‌

Published Sun, Mar 30 2025 9:02 AM | Last Updated on Sun, Mar 30 2025 12:40 PM

Case against Bangladesh Sheikh Hasina

ఢాకా: అంతర్గత తిరుగుబాటు ద్వారా యూనుస్‌ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారంటూ బంగ్లాదేశ్‌ పదవీచ్యుత ప్రధాని షేక్‌ హసీనాపై కేసు నమోదైంది. హసీనా, మరో 72 మందిపై క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్టుమెంట్‌(సీఐడీ) ఢాకాలోని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు చేపట్టాలంటూ సీఐడీని గురువారం కోరిందన్నారు.

ఈ సందర్బంగా ‘జోయ్‌ బంగ్లా బ్రిగేడ్‌’పేరుతో ఏర్పాటైన ఆన్‌లైన్‌ వేదికపై 2024 డిసెంబర్‌ 19వ తేదీన కొందరు సమావేశమై దేశంలో అంతర్యుద్దం ద్వారా హసీనాను తిరిగి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే విషయమై చర్చించినట్లు సమాచారము ఉందని సీఐడీ తన ఫిర్యాదులో పేర్కొంది. మధ్యంతర ప్రభుత్వాన్ని కొనసాగనివ్వరాదని డాక్టర్‌ రబ్బీ ఆలం సారథ్యంలో జరిగిన ఈ వర్చువల్‌ సమావేశం నిర్ణయించిందన్నారు.

షేక్‌ హసీనా తదితరులు పాల్గొన్న ఈ భేటీ రికార్డింగ్స్‌ తమకు లభ్యమైనట్లు సీఐడీ తెలిపింది. హసీనా ఆదేశాల మేరకు అమెరికాలో ఉంటున్న అవామీ లీగ్‌ నేత ఆలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన మొత్తం 577 మంది పాల్గొన్నట్లు సీఐడీ తెలిపింది. ఈ కేసులో ఆలంను రెండో నిందితుడిగా పేర్కొంది. కాగా, యూనుస్‌ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్‌లో ఉంటున్న హసీనాపై పలు ఆరోపణల కింద కేసులు నమోదు చేయడం తెలిసిందే.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement