ఇండోర్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు విపక్షాల కూటమి సాకారమవుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆశాభావం వెలిబుచ్చారు. ఇప్పటికే కేసీఆర్, మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్ వంటి ముఖ్యమంత్రులు ఇందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు.
‘‘విపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో వాటికి దన్నుగా నిలిచేందుకు కాంగ్రెస్ ముందుకు రావాలని శుక్రవారం పిలుపునిచ్చారు. తద్వారా విపక్ష కూటమి బలోపేతానికి ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. తప్పుడు ఎన్‌కౌంటర్లపై కోర్టులు తమంత తాము విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమవారిని బూటకపు ఎన్‌కౌంటర్లలో హతమార్చారని భావిస్తున్న వాళ్లు ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment