ఖాన్‌పూర్: దేశంలోని విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పడిన మహాకూటమిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిప్పులుచెరిగారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రోజుకో ప్రధాని మారతారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బుధవారం బీజేపీ క్షేత్ర స్థాయి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మహాకూటమి గెలిస్తే ప్రధానమంత్రిగా సోమవారం మాయావతి, మంగళవారం అఖిలేశ్ యాదవ్, బుధవారం మమతా బెనర్జీ, గురువారం శరత్ పవార్, శుక్రవారం దేవెగౌడ, శనివారం ఎంకే స్టాలిన్ ఉంటారని.. ఆదివారం ప్రధాని పదవికి సెలవిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ముందు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని మహాకూటమిని డిమాండ్ చేశారు. బీజేపీలో నాలుగు ‘బీ’లు ఉన్నాయని.. ‘భడ్తా భారత్’, ‘బన్తా భారత్’అని అన్నారు. ఇక మహాకూటమిలో కూడా నాలుగు ‘బీ’లు ఉన్నాయని అవి బువా (ఆంటీ), భతీజా (అల్లుడు), భాయ్ (సోదరుడు), బెహెన్ (సోదరి) అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment