సోపోర్: ప్రజాప్రతినిధులు, అధికారులే టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేశారు. సమావేశం కొనసాగుతున్న సమయంలో కాల్పులు చేయడంతో అందరూ పప్రాణభయంతో పరుగులు ఎత్తారు. ఈ సమయంలో జరిగిన కాల్పుల్లో ఓ కౌన్సిలర్, మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే చైర్‌పర్సన్ మాత్రం త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది.
సోపోర్ ప్రాంతంలో బ్లాక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (బీడీసీ) ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చైర్‌పర్సన్ ఫరీదా ఖాన్ (బీజేపీ), ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. చర్చిస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు పప్రారంభించారు. కాల్పులు జరగడంతో ఆమె వెంటనే ఆస్పత్రిలోకి వెళ్లారు. కాల్పుల్లో గాయపడిన కౌన్సిలర్ రియాజ్ అహ్మద్, పోలీస్ అధికారి షవకాత్ అహ్మద్ మృతి చెందారు. ఈ దాడుల్లో ఒక పౌరుడు గాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment