sopore
-
జమ్మూ కశ్మీర్లో పేలుడు.. నలుగురి మృతి
జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం పేలుడు సంభవించింది. సోపోర్ పట్టణంలోని షేర్ కాలనీలో స్క్రాప్ డీలర్ దుకాణంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నజీర్ అహ్మద్ నద్రో(40), మహమ్మద్ ఆజర్(25), ఆజిమ్ అష్రఫ్ మిర్(20), ఆదిల్ రషీద్ భట్(23) గా స్థానిక అధికారులు గుర్తించారు.పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసులు సంఘటానికి స్థలానికి చేరుకొని సహాయక చర్యులు చేపట్టారు. ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే షాప్ డీలర్, మరికొంతమంది ట్రక్కు నుంచి కొన్ని పదార్థాలను దించుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే చనిపోగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. -
మీటింగ్‌పై ఉగ్రదాడి: కాల్పుల్లో ఇద్దరు మృతి
సోపోర్: ప్రజాప్రతినిధులు, అధికారులే టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేశారు. సమావేశం కొనసాగుతున్న సమయంలో కాల్పులు చేయడంతో అందరూ పప్రాణభయంతో పరుగులు ఎత్తారు. ఈ సమయంలో జరిగిన కాల్పుల్లో ఓ కౌన్సిలర్, మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే చైర్పర్సన్ మాత్రం త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. సోపోర్ ప్రాంతంలో బ్లాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (బీడీసీ) ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ ఫరీదా ఖాన్ (బీజేపీ), ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. చర్చిస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు పప్రారంభించారు. కాల్పులు జరగడంతో ఆమె వెంటనే ఆస్పత్రిలోకి వెళ్లారు. కాల్పుల్లో గాయపడిన కౌన్సిలర్ రియాజ్ అహ్మద్, పోలీస్ అధికారి షవకాత్ అహ్మద్ మృతి చెందారు. ఈ దాడుల్లో ఒక పౌరుడు గాయపడ్డాడు. -
కశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్
శ్రీనగర్ : ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు మంగళవారం తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని సోపోర్ జిల్లాలో సోమవారం సాయంత్రం భద్రతా బలగాలు, పోలీసులు సమిష్టిగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా లష్కరే తోయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. తుజార్ గ్రామంలో ఓ ఇంటిపై గ్రెనేడ్ దాడి చేసిన కేసులో ఈ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధ సామాగ్రి, హ్యాండ్ గ్రెనేడ్స్తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదుల బాంబు దాడి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్ బాంబుతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ చుట్టుపక్కన ప్రాంతాన్ని ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతోంది. -
ఉగ్రవాదుల కుట్ర భగ్నం, ఐదుగురి అరెస్ట్
శ్రీనగర్: ఒకవైపు గణతంత్ర దినోత్సవం దగ్గరపడుతోంటే మరోవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల ఉనికి భద్రత దళాలను కలవరపెడుతోంది. తాజాగా కశ్మీర్ లోని సొపోర్ లో ఉగ్రవాద సంస్థ హర్కత్- ఉల్ ముజాహిదీన్ కుట్రను భద్రత బలగాలు భగ్నం చేశాయి. రిపబ్లిక్ డే వేడుకలు లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసిన హర్కత్- ఉల్ ముజాహిదీన్ కు చెందిన అయిదుగురు టెర్రరిస్టులను భద్రత బలగాలు అరెస్ట్ చేశాయి. వీరి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేశారు. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాల్లో ఇప్పటికే 14 మంది ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. -
తండ్రీకొడుకుల హత్యకు నిరసనగా బంద్
శ్రీనగర్: ఓ తండ్రి అతడి మూడేళ్ల బాలుడి హత్యా ఘటనకు సంబంధించి ఆదివారం కాశ్మీర్‌లోయలో బంద్ పాటిస్తున్నారు. ఎక్కడికక్కడ దుకాణాలు మూసివేశారు. రోడ్లతోపాటు పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. బషీర్ అహ్మద్ అనే వ్యక్తి గతంలో కొన్ని తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అనంతరం అలాంటి పనులకు స్వస్తి పలికి తిరిగి మారిపోయి జైలు శిక్షను పూర్తి చేసి వచ్చిన క్రమంలో ఆయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. అనంతరం అతడి మూడేళ్ల కూమారుడిని కూడా చంపేశారు. ఈ ఘటన బారాముల్లా జిల్లాలో సోపోర్ పట్టణంలో చోటు చేసుకుంది. దీంతో హర్పియత్ కాన్ఫరెన్స్‌కు చైర్మన్ సయ్యద్ అలీ జిలానీ ఈ బంద్‌కు పిలుపునిచ్చాడు. -
పోలీసు పోస్ట్ పై ఉగ్రవాదుల దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బారాముల్లా జిల్లాలోని సొపోర్ లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. మసీదుకు రక్షణ కల్పిస్తున్న పోలీసు పోస్ట్ పై మంగళవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో పోలీసు కానిస్టేబుల్, పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. తుజ్జార్ షరీఫ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ ఫయాజ్ అహ్మద్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. కానిస్టేబుల్ నుంచి ఐఎన్ఎస్ఏఎస్ తుపాకీని లాక్కుని ఉగ్రవాదులు పారిపోయారని తెలిపారు. సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించినట్టు చెప్పారు. -
మరో మాజీ మిలిటెంట్ కాల్చివేత
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో పౌరుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. కశ్మీర్‌లోని సొపారాలో మాజీ మిలిటెంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఉదయం కాల్చి చంపారు. ముంద్జీ గ్రామానికి చెందిన అజయ్ అహ్మద్ రేషిపై ఓ దుండగుడు తుపాకీతో అతి సమీపంనుంచి కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో అతను చనిపోయాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన అజయ్ సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ వార్త దావానంలా వ్యాపించడంతో ఆందోళన చెలరేగింది. అక్కడక్కడ రాళ్లు రువ్విన సంఘటను చోటు చేసుకున్నాయి. షాపులను మూసి వేశారు. కాగా గత మూడు వారాలుగా ఆరుగురు మాజీ మిలిటెంట్లు దుండగుల చేతుల్లో హతమయ్యారు. -
లష్కరే తోయిబా అగ్రనేత హతం
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్‌లోని భారాముల్లా జిల్లా సోపోరే పట్టణంలో ఈ రోజు భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య దాదాపు ఆరు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని లష్కరే తోయిబాకు చెందిన అగ్రనేతగా గుర్తించారు. అతని వద్ద నుంచి పోలీసులు ఏకె47 తుపాకీతోపాటు మరికొన్ని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
బిల్డింగ్‌లో తీవ్రవాదులు ... పోలీసులు కాల్పులు
జమ్మూ కాశ్మీర్: తీవ్రవాదులు, పోలీసులకు మధ్య హోరాహోరీ కాల్పులతో జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. సోపోర్‌లోని ఓ భవంతిలో లష్కరే తోయిబా తీవ్రవాదులు ఆశ్రయం పోందారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు ఆ ప్రాంతానికి చేరుకుని పలు నివాసాలలో తనిఖీలు చేపట్టారు. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైయన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. దాంతో ఇరువైపులా హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. అయితే తీవ్రవాదులు ఆశ్రయం పొందిన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు.