కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్‌ | 5 terrorist associates of Lashkar e Taiba arrested Jammu Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్‌

Published Tue, Apr 14 2020 12:13 PM | Last Updated on Tue, Apr 14 2020 12:27 PM

5 terrorist associates of Lashkar e Taiba arrested Jammu Kashmir - Sakshi

శ్రీనగర్‌ : ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసినట్టు జమ్మూ కశ్మీర్‌ పోలీసులు మంగళవారం తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో సోమవారం సాయంత్రం భద్రతా బలగాలు, పోలీసులు సమిష్టిగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా లష్కరే తోయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

తుజార్‌ గ్రామంలో ఓ ఇంటిపై గ్రెనేడ్‌ దాడి చేసిన కేసులో ఈ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధ సామాగ్రి, హ్యాండ్‌ గ్రెనేడ్స్‌తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement