జమ్మూ కశ్మీర్‌లో పేలుడు.. నలుగురి మృతి | Four killed in blast at scrap dealer shop in JK Baramulla district | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్‌లో పేలుడు.. నలుగురి మృతి

Published Mon, Jul 29 2024 4:43 PM | Last Updated on Mon, Jul 29 2024 4:43 PM

Four killed in blast at scrap dealer shop in JK Baramulla district

జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం పేలుడు సంభవించింది. సోపోర్‌ పట్టణంలోని షేర్‌ కాలనీలో స్క్రాప్‌ డీలర్‌ దుకాణంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నజీర్ అహ్మద్ నద్రో(40), మహమ్మద్ ఆజర్‌(25), ఆజిమ్‌ అష్రఫ్‌ మిర్‌(20), ఆదిల్ రషీద్ భట్‌(23) గా స్థానిక అధికారులు గుర్తించారు.

పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసులు సంఘటానికి స్థలానికి చేరుకొని సహాయక చర్యులు చేపట్టారు. ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

అయితే  షాప్‌ డీలర్‌, మరికొంతమంది ట్రక్కు నుంచి కొన్ని పదార్థాలను దించుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే చనిపోగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement