మరో మాజీ మిలిటెంట్ కాల్చివేత | Former militant gunned down in Kashmir | Sakshi
Sakshi News home page

మరో మాజీ మిలిటెంట్ కాల్చివేత

Published Mon, Jun 15 2015 10:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

మరో మాజీ మిలిటెంట్ కాల్చివేత

మరో మాజీ మిలిటెంట్ కాల్చివేత

శ్రీనగర్:   జమ్ము కశ్మీర్లో పౌరుల ప్రాణాలకు  రక్షణ లేకుండా పోతోంది.  కశ్మీర్లోని  సొపారాలో మాజీ మిలిటెంట్ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఉదయం కాల్చి చంపారు. ముంద్జీ గ్రామానికి చెందిన అజయ్ అహ్మద్ రేషిపై  ఓ దుండగుడు తుపాకీతో అతి సమీపంనుంచి  కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో అతను చనిపోయాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన అజయ్  సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ వార్త  దావానంలా వ్యాపించడంతో ఆందోళన చెలరేగింది.  అక్కడక్కడ రాళ్లు రువ్విన సంఘటను చోటు  చేసుకున్నాయి. షాపులను మూసి వేశారు.    కాగా గత మూడు వారాలుగా ఆరుగురు మాజీ మిలిటెంట్లు దుండగుల చేతుల్లో హతమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement