మరో మాజీ మిలిటెంట్ కాల్చివేత
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో పౌరుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. కశ్మీర్లోని సొపారాలో మాజీ మిలిటెంట్ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఉదయం కాల్చి చంపారు. ముంద్జీ గ్రామానికి చెందిన అజయ్ అహ్మద్ రేషిపై ఓ దుండగుడు తుపాకీతో అతి సమీపంనుంచి కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో అతను చనిపోయాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన అజయ్ సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ వార్త దావానంలా వ్యాపించడంతో ఆందోళన చెలరేగింది. అక్కడక్కడ రాళ్లు రువ్విన సంఘటను చోటు చేసుకున్నాయి. షాపులను మూసి వేశారు. కాగా గత మూడు వారాలుగా ఆరుగురు మాజీ మిలిటెంట్లు దుండగుల చేతుల్లో హతమయ్యారు.