
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నాయకత్వంలో నడుస్తున్న ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది వినియోగదారులు ఈ సోషల్ మీడియా యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు వెల్లడించారు.
ఆన్‌లైన్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ నివేదికల ప్రకారం.. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ అంతరాయంపై కంపెనీ స్పందించలేదు.
X Twitter Down, Users Face Outage:
Social media platform X has started showing troubles as several users reported it was not working in India which could be because of a technical glitch. pic.twitter.com/mmhRrJP6Oa— Divya 🦋 (@Hiraeth85) March 10, 2025
యాప్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.. చాలా మంది వినియోగదారులకు "ఏదో తప్పు జరిగింది, మళ్లీ లోడ్ చేయడానికి ప్రయత్నించండి" అనే సందేశం వచ్చింది.
డౌన్‌డెటెక్టర్ డేటా ప్రకారం 57% మంది వినియోగదారులు X యాప్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నారని, 34% మంది వెబ్‌సైట్‌లో సమస్యలు ఉన్నాయని, 9% మంది సర్వర్ సమస్యలను నివేదించారని తేలింది. UKలో, 61% మంది వినియోగదారులు అప్లికేషన్ గురించి, 34% మంది వెబ్‌సైట్ గురించి, 5% మంది సర్వర్ సమస్యలను ఎదుర్కొన్నారు.
𝕏 is down / having connection issues. @grok is also down and unable to complete requests.
— Nicky 🇬🇧 (@NickyThomas) March 10, 2025
Comments
Please login to add a commentAdd a comment