శ్రీనగర్: ఓ తండ్రి అతడి మూడేళ్ల బాలుడి హత్యా ఘటనకు సంబంధించి ఆదివారం కాశ్మీర్లోయలో బంద్ పాటిస్తున్నారు. ఎక్కడికక్కడ దుకాణాలు మూసివేశారు. రోడ్లతోపాటు పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. బషీర్ అహ్మద్ అనే వ్యక్తి గతంలో కొన్ని తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు.
అనంతరం అలాంటి పనులకు స్వస్తి పలికి తిరిగి మారిపోయి జైలు శిక్షను పూర్తి చేసి వచ్చిన క్రమంలో ఆయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. అనంతరం అతడి మూడేళ్ల కూమారుడిని కూడా చంపేశారు. ఈ ఘటన బారాముల్లా జిల్లాలో సోపోర్ పట్టణంలో చోటు చేసుకుంది. దీంతో హర్పియత్ కాన్ఫరెన్స్కు చైర్మన్ సయ్యద్ అలీ జిలానీ ఈ బంద్కు పిలుపునిచ్చాడు.
తండ్రీకొడుకుల హత్యకు నిరసనగా బంద్
Published Sun, Sep 20 2015 9:55 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM
Advertisement
Advertisement