![ఉగ్రవాదుల కుట్ర భగ్నం, ఐదుగురి అరెస్ట్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41453538759_625x300.jpg.webp?itok=bBRb1DyZ)
ఉగ్రవాదుల కుట్ర భగ్నం, ఐదుగురి అరెస్ట్
శ్రీనగర్: ఒకవైపు గణతంత్ర దినోత్సవం దగ్గరపడుతోంటే మరోవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల ఉనికి భద్రత దళాలను కలవరపెడుతోంది. తాజాగా కశ్మీర్ లోని సొపోర్ లో ఉగ్రవాద సంస్థ హర్కత్- ఉల్ ముజాహిదీన్ కుట్రను భద్రత బలగాలు భగ్నం చేశాయి. రిపబ్లిక్ డే వేడుకలు లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసిన హర్కత్- ఉల్ ముజాహిదీన్ కు చెందిన అయిదుగురు టెర్రరిస్టులను భద్రత బలగాలు అరెస్ట్ చేశాయి. వీరి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేశారు. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాల్లో ఇప్పటికే 14 మంది ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.