శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వలస కార్మికులే టార్గెట్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్‌లో శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడిన ఇద్దరిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు ఉస్మాన్ మాలిక్ (20), సోఫియాన్ (25)గా గుర్తించారు. అయితే, వారిద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. గత రెండు వారాల్లో కశ్మీర్ లోయలో వలస కార్మికులపై నాలుగో సారి దాడి జరిగింది. అక్టోబరు 20న గందర్‌బల్ జిల్లాలోని సొరంగం నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రదాడిలో స్థానిక వైద్యుడు, బీహార్‌కు చెందిన ఇద్దరు కార్మికులతో సహా ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment