Kashmir Valley
-
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.. రెండు వారాల్లో నాలుగోసారి..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వలస కార్మికులే టార్గెట్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్‌లో శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడిన ఇద్దరిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు ఉస్మాన్ మాలిక్ (20), సోఫియాన్ (25)గా గుర్తించారు. అయితే, వారిద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా.. గత రెండు వారాల్లో కశ్మీర్ లోయలో వలస కార్మికులపై నాలుగో సారి దాడి జరిగింది. అక్టోబరు 20న గందర్బల్ జిల్లాలోని సొరంగం నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రదాడిలో స్థానిక వైద్యుడు, బీహార్‌కు చెందిన ఇద్దరు కార్మికులతో సహా ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. -
BSF: 150 మంది ఉగ్రవాదులు కాచుక్కూర్చున్నారు..
శ్రీనగర్: శీతాకాలం సమీపిస్తున్నండగా కశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి 150 మంది వరకు ఉగ్రవాదులు మన భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్(సరిహద్దు భద్రతా దళం) తెలిపింది. చొరబాటుదారులు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ‘చొరబాటు యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ నిఘా విభాగాల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దుల్లో భద్రతపై అప్రమత్తంగా ఉన్నాం’అని బీఎస్ఎఫ్ ఐజీ(కశ్మీర్) అశోక్ యాదవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ‘పాక్ వైపు సరిహద్దులకు సమీపంలోని స్థావరాల్లో ఉండే ముష్కరుల గురించిన అంచనాలను బట్టి, చొరబాటుయత్నాలను తిప్పికొట్టి, వారిపై పైచేయి సాధించేలా మా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం’అని యాదవ్ వివరించారు. ‘ఎల్వోసీకి సమీపంలోని స్థావరాల్లో కాచుకుని ఉండే ఉగ్రవాదుల సంఖ్య 130–150 మధ్య మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంతకంటే కాస్త ఎక్కువమందే ఉండొచ్చు’అని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎల్వోసీ వెంట ఉన్న తంగ్ధర్, కెరన్ సెక్టార్ల పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణాకు అవకాశాలున్నాయంటూ ఆయన..వీటిని అడ్డుకునేందుకు మొబైల్ బంకర్లు, మహిళా ట్రూపర్లను రంగంలోకి దించామని వెల్లడించారు. స్మగ్లర్లు డ్రగ్స్ కొరియర్లుగా మహిళలను వాడుకుంటున్నారని ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. -
కల్నల్ మన్‌ప్రీత్‌కు కీర్తిచక్ర
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులతో పోరులో వీరమరణం పొందిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ హుమయూన్ ముజ్జామిల్ భట్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర అవార్డ్‌ను ప్రకటించింది. రైఫిల్మన్ రవికుమార్ (మరణానంతరం), మేజర్ మల్ల రామగోపాల్ నాయుడు, (మరణానంతరం)లనూ కీర్తిచక్రతో ప్రభుత్వం గౌరవించింది. శాంతిసమయంలో ప్రకటించే రెండో అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డ్‌కు ఈసారి నలుగురికి ఎంపికచేశారు. అనంత్ నాగ్ అడవుల్లో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులను నేరుగా ఎదుర్కొని ఒక ఉగ్రవాదిని కల్నల్ మన్‌ప్రీత్ హతమార్చారు. తర్వాత నక్కిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ముర్ము బుధవారం మొత్తం 103 గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించారు. కీర్తిచక్రతోపాటు 18 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్, 63 మందికి సేనా మెడల్, 11 మందికి నావో సేనా మెడల్, ఆరుగురికి వాయుసేనా మెడల్ ప్రకటించారు. ఒక ప్రెసిడెంట్ తట్‌రక్షక్ మెడల్, మూడు తట్‌రక్షక్ మెడళ్లనూ తీర గస్తీ దళాలకు ప్రకటించారు. -
Madhavi Latha: ఆమె నదిని దాటించింది
కింద గాఢంగా పారే చీనాబ్ నది. పైన 359 మీటర్ల ఎత్తులో రైలు బ్రిడ్జి. కశ్మీర్ లోయలో ఉధమ్‌పూర్ నుంచి బారాముల్లా వరకు వేయదలచిన భారీ రైలు మార్గంలో చీనాబ్‌ను దాటడం ఒక సవాలు. దాని కోసం సాగిన ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణంలో మన తెలుగు ఇంజినీర్ మాధవీ లత కృషి కీలకం. ‘వరల్డ్ హైయ్యస్ట్ రైల్వే బ్రిడ్జి’ నిర్మాణంలో పాల్గొన్న మాధవీ లత పరిచయం. ఒక సుదీర్ఘకల నెరవేరబోతోంది. సుదీర్ఘ నిర్మాణం ఫలవంతం కాబోతూ ఉంది. దేశ అభివృద్ధిలో కీలకమైన రవాణా రంగంలో ఎన్ని ఘన నిర్మాణాలు సాగితే అంత ముందుకు పోతాము. అటువంటి ఘన నిర్మాణం జాతికి అందుబాటులో రానుంది. జమ్ము కశ్మీర్లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వేవంతెన ట్రయల్ రన్ పూర్తి చేసుకుని త్వరలోనే కార్యకలాపాలు నిర్వహించనుంది. అయితే ఈ క్లిష్టమైన నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజినీర్ కీలకపాత్ర పోషించడం ఘనంగా చెప్పుకోవాల్సిన సంగతి. తెనాలికి చెందిన ప్రొఫెసర్ గాలి మాధవీలతదే ఈ ఘనత. చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ భారతీయ రైల్వే 2004లో జమ్ము–కశ్మీర్లో భారీ రైలు ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేసింది. జమ్ము సమీపంలోని ఉధంపూర్ నుంచి శ్రీనగర్ సమీపంలోని బారాముల్లా వరకు రైలు మార్గం నిర్మించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ మార్గంలో రీసీ జిల్లా బాక్కల్ దగ్గర చీనాబ్ నదిపై వంతెన నిర్మించాల్సి వచ్చింది. ఇది చాలా క్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు వంతెన అవుతుంది. అయినప్పటికీ మన ఇంజినీర్లు దశల వారీగా నిర్మాణం పూర్తి చేయగలిగారు. జూలైలో దీని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలవుతాయి. ప్రొఫెసర్‌గా పని చేస్తూ... ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవీలత కాకినాడలో ఇంజినీరింగ్ చేశారు. ఐ.ఐ.టి. మద్రాస్‌లో పీహెచ్డీ చేశారు. బెంగళూరులోని ఐ.ఐ.ఎస్.సి.లో ‘రాక్ మెకానిక్స్’లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను కొనసాగించారు. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న మాధవీలత అక్కడే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్ గా కూడా ఉంటూ సైన్స్ ను, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువ చేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ‘రాక్ మెకానిక్స్’లో మాధవీలతకు ఉన్న అనుభవమే ఆమెను చీనాబ్ వంతెన నిర్మాణంలో పాల్గొనేలా చేసింది. చీనాబ్ వంతెన నిర్మాణానికి రూ.1400 కోట్లు వ్యయం చేస్తే 300 మంది సివిల్ ఇంజినీర్లు, 1300 మంది వర్కర్లు రేయింబవళ్లు పని చేశారు. బ్రిడ్జ్‌ను రెండు కొండల మధ్య నిర్మించాల్సి ఉన్నందున ఇంజినీరింగ్ డిజైన్ చాలా క్లిష్టంగా మారింది. అయినప్పటికీ అక్కడి రాళ్లను పరిశోధించి, అధ్యయనం చేసిన మాధవీలత, పటిష్టమైన వాలు స్థిరీకరణ ప్రణాళికను రూపొందించి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆమె విశ్లేషణ, సాంకేతిక సూచనలను దేశంతోపాటు విదేశాల్లోని పలువురు నిపుణులు తనిఖీ చేసి ఆమోదించడంతో వంతెన నిర్మాణం ముందుకు సాగింది. ఈ రైలు మార్గంలో నిర్మించిన కొన్ని సొరంగాల నిర్మాణంలోనూ మాధవీలత పాల్గొన్నారు. అవకాశం ఇలా... ఉధంపూర్ – బారాముల్లా కొత్త రైలుమార్గంలో చీనాబ్ నదిపై స్టీల్ ఆర్చ్ వంతెన నిర్మాణ బాధ్యతను కొంకణ్ రైల్వేస్ ‘ఆఫ్కాన్స్ ’ సంస్థకు ఇచ్చింది. ఆఫ్కాన్స్ సంస్థకు జియో టెక్నికల్ కన్సల్టెంటుగా ఉన్న మాధవీలతకు అలా ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. ‘ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. చీనాబ్ నదిపై రెండు ఎత్తయిన వాలుకొండలను కలుపుతూ సాగిన ఈ వంతెన నిర్మాణంలో వాలు స్థిరత్వం కీలకమైంది. రాక్ మెకానిక్స్ సాంకేతికత, స్థిరత్వ అంశాలను అర్థం చేసుకోవటం, కొండ వాలుల స్థిరత్వాన్ని పొందటానికి నేను పరిష్కారాలను అందించటంతో ఇప్పుడో ఇంజినీరింగ్ అద్భుతం సాక్షాత్కరించింది. జోన్ భూకంపాలను, గంటకు 266 కి.మీ వేగంతో వీచే గాలులను, తీవ్రమైన పేలుళ్లను తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది’ అన్నారు మాధవీలత. ‘నేల పటిష్టతపై ఐ.ఐ.టి మద్రాస్‌లో నా పీహెచ్డీ పరిశోధనల్లో భాగంగా పాలిమర్లను ఉపయోగించి పటిష్టమైన రోడ్ల నిర్మాణానికి వినూత్న సాంకేతిక విధానాన్ని రూపొందించాను. ఆ దిశగా మూడు దశాబ్దాలపాటు చేసిన పరిశోధనల ఫలితంగా నేడు భూకంప నిరోధక శక్తి కలిగిన నిర్మాణాల్లో పాలిమర్‌లని, రబ్బర్ టైర్ల వంటి వ్యర్థపదార్థాలని వినియోగించగలుగుతున్నాం’ అన్నారు. చీనాబ్ వంతెన నిర్మాణానికి రేయింబవళ్లు శ్రమించిన మాధవీలత, ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన కుటుంబ ప్రాధాన్యతలను పక్కనపెట్టి, సైట్‌ను సందర్శించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, ‘నా పిల్లల పరీక్షల సమయాల్లో కూడా వాళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చేది. నా భర్త హరిప్రసాద్‌రెడ్డి, పిల్లలు అభిజ్ఞ, శౌర్యల సహనం, సహకారాలతో ఇది సాధ్యమైంది. చీనాబ్ వంతెన నా సొంత ప్రాజెక్టులా మారిపోయింది’ అన్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
కశ్మీర్లో విపరీతమైన మంచు.. రహదారుల మూసివేత
జమ్మూకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. హిమపాతంతో కశ్మీర్‌లోని అనేక ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. కశ్మీర్ లోయలోని ఎత్తైన ప్రాంతాలైన పిర్ కీ గలి, జోజిలా, గుల్మార్గ్లలో శుక్రవారం తొలి హిమపాతం నమోదైందికొండలపై నుంచి భారీగా మంచు గడ్డలు కిందకు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంచు కారణంగా నిలిచిపోయిన కొన్ని వాహనాలను అధికారులు తొలగించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వాతావరణ కార్యాలయం ప్రకారం, రాత్రిపూట భారీగా మంచు కురిసే అవకాశం ఉంది. కాబట్టి హైవే మూసి ఉంటుందని వారు తెలిపారు. హిమపాతం ముగిసిన తర్వాత హైవేను క్లియర్ చేసే పని ప్రారంభమవుతుందని వారు తెలిపారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై విపరీతమైన మంచు పేరుకుపోవడంతో అధికారులు రహదారులను మూసేశారు. కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ప్రత్యామ్నాయ లింక్ అయిన మొఘల్ రోడ్‌ను హిమపాతం కారణంగా గురువారం వాహనాల రాకపోకలకు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. పోషణ- పీర్ కి గలి మధ్య మంచు కురుస్తుండటంతో రహదారి మూసుకుపోయిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు జమ్మూలోని పూంచ్, రాజౌరి జిల్లాలను దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాతో కలుపుతుంది. రహదారులపై మంచు పేరుకుపోవడంతో దాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపై పలు వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి సమయాల్లో భారీగా మంచు కురిసే అకాశం ఉందని స్థానిక వాతావరణశాఖ అధికారులు తెలిపారు. #WATCH | Jammu and Kashmir: Gulmarg receives season's first snowfall. pic.twitter.com/xGHbRm46Wa — ANI (@ANI) November 10, 2023 -
Colonel Manpreet Singh Funeral: జై హింద్ పాపా!
చండీగడ్: వయసు నిండా ఆరేళ్లే. ఇంకా ముక్కు పచ్చలే ఆరలేదు. కళ్లెదుట కన్న తండ్రి పార్థివ దేహం. అయినా సరే, వీర మరణం పొందిన తండ్రికి అంతే వీరోచితమైన వీడ్కోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడో ఏమో.. అంతటి అంతులేని దుఃఖాన్నీ పళ్ల బిగువున అదిమిపెట్టాడు. యుద్ధానికి సిద్ధమయ్యే సైనిక వీరుల యూనిఫాం ధరించాడు. త్రివర్ణ పతాకం కప్పి ఉన్న తండ్రి శవపేటికను మౌనంగా సమీపించాడు. ఆ పేటికనే చిట్టి చేతులతో బిగియారా కౌగిలించుకున్నాడు. ఆ సమయాన ఆ చిన్ని మనసులో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో! ఎన్నెన్ని భావాలు చెలరేగాయో! ఎంతటి దుఃఖం పొంగుకొచ్చిందో! అవేవీ పైకి కనిపించనీయలేదు. కన్నీటిని కనీసం కంటి కొసలు కూడా దాటి రానివ్వలేదు. తండ్రి పార్థివ దేహం ముందు సగౌరవంగా ప్రణమిల్లాడు. రుద్ధమైన కంఠంతోనే, ‘జైహింద్ పాపా‘ అంటూ తుది వీడ్కోలు పలికాడు. అందరినీ కంట తడి పెట్టించాడు...! చండీగఢ్: కశ్మీర్ లోయలో ఉగ్ర ముష్కరులను ఏరిపారేసే క్రమంలో వీర మరణం పొందిన సైనిక వీరులు కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ దోంచక్ అంత్యక్రియలు శుక్రవారం అశ్రు నయనాల నడుమ ముగిశాయి. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో మన్‌ప్రీత్ స్వగ్రామం బహరౌన్ జియాన్‌లో ఉదయం నుంచే సందర్శకుల ప్రవాహం మొదలైంది. చూస్తుండగానే జనం ఇసుకేస్తే రాలనంతగా పెరిగిపోయారు. వారందరి సమక్షంలో పూర్తి సైనిక లాంఛనాల నడుమ మన్ ప్రీత్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ సందర్భంగా కుమారుడు కబీర్ సింగ్ కనబరిచిన గుండె దిటవు, ’జైహింద్ పాపా’ అంటూ తండ్రికి తుది సెల్యూట్ చేసిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ తో పాటు రాష్ట్ర మంత్రులు, మాజీ సైనికాధిపతి వేదప్రకాశ్ మాలిక్, సైనిక ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మేజర్ ఆశిష్ అంత్యక్రియలు కూడా హరియాణాలోని పానిపట్‌లో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. బుధవారం కశ్మీర్‌లోని కోకొర్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్ ప్రీత్, మేజర్ ఆశిష్‌తో పాటు మొత్తం ముగ్గురు సైనిక సిబ్బంది, ఒక డీఎస్పీ అసువులు బాయడం తెలిసిందే. గుండెలవిసేలా రోదించిన భార్య మన్ ప్రీత్ అంత్యక్రియల సందర్భంగా గుండెలవిసేలా రోదించిన ఆయన భార్యను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. గవర్నర్, మంత్రులు తదితరులు మన్ ప్రీత్ భార్య, తల్లి తదితరులను ఓదార్చారు. అంత్యక్రియల సందర్భంగా భారత్ మాతా కీ జై నినాదాలతో ఊరంతా మారుమోగింది. మన్ ప్రీత్ చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభావంతుడని ఆయన చిన్ననాటి గురువులు గుర్తు చేసుకున్నారు. తమ అభిమాన శిష్యుని అంత్యక్రియల సందర్భంగా వారంతా వెక్కి వెక్కి రోదించారు. ‘మేము వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తున్నాం. అదే సమయంలో, దేశం కోసం ప్రాణాలను ధార పోసిన మా శిష్యుణ్ణి చూసి గర్వంగానూ ఉంది‘ అని మన్‌ప్రీత్‌కు ఒకటో తరగతిలో పాఠాలు చెప్పిన ఆశా చద్దా అనే టీచర్ చెప్పారు. మూడో తరం సైనిక వీరుడు మన్‌ప్రీత్ తన కుటుంబంలో మూడో తరం సైనిక వీరుడు. ఆయనత తాత సైన్యంలో పని చేశారు. ఆయన తండ్రి సైన్యం నుంచి రిటైరయ్యాక తొమ్మిదేళ్ల క్రితం మరణించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లి తన కుమారుని పార్థివ దేహం కోసం ఉదయం నుంచే ఇంటి ముందు వేచి చూస్తూ గడిపింది. సైనిక వాహనం నుంచి శవపేటిక దిగగానే కుప్పకూలింది! -
ఉగ్ర నెట్‌వర్క్‌లోకి చిన్నారులు, మహిళలు..!
శ్రీనగర్: భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) మరో ప్రమాదకర పన్నాగాన్ని అమలు చేస్తోంది.కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల సంప్రదాయ సమాచార నెట్‌వర్క్‌ను సైన్యం దాదాపు నిర్వీర్యం చేసింది. దీంతో ఐఎస్ఐ మరో ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఉగ్ర మూకల మధ్య సమాచార మార్పిడికి మహిళలు, బాలికలు, మైనర్లను పావులుగా వాడుకుంటోంది. ఇటీవలి కాలంలో ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు తమకు దొరికాయని శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ అమన్‌దీప్ సింగ్ అవుజ్లా తెలిపారు. ముఖ్యంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, డ్రగ్స్, ఆయుధాల రవాణాకు మహిళలు, బాలికలు, మైనర్లను వాడుకోవడం అనే కొత్త ప్రమాదం వచ్చిపడిందన్నారు. ఉగ్రమూకలు సమాచార బట్వాడాకు ప్రస్తుతం సెల్ఫోన్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయని చెప్పారు. లోయలో ప్రశాంతతకు భగ్నం కలిగించేందుకు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉగ్ర మూకలు వ్యూహాలు పన్నుతుండటంతో బలగాలు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. కశ్మీర్లో చొరబాట్లు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, పీర్ పంజాల్ దక్షిణ ప్రాంతం, పంజాబ్‌ల్లో పెరిగాయన్నారు. ఉత్తర కశ్మీర్‌లోని మచిల్‌లో ఇటీవలి చొరబాటుయత్నమే ఇందుకు తాజా ఉదాహరణ అని చెప్పారు. హింస పట్ల స్థానిక ప్రజల్లోనూ మార్పు కనిపిస్తుండటం ప్రశంసనీయమైన విషయమన్నారు. భద్రతా బలగాలకు కశ్మీర్ ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు. -
హైదరాబాద్ మీదుగా కశ్మీర్ లోయకు ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మీదుగా కశ్మీర్ లోయకు మే 11న ప్రత్యేక రైల్వే సేవలు ప్రారంభిస్తున్నట్టు సౌత్ స్టార్ రైల్ ప్రతినిధులు తెలిపారు. భారతీయ రైల్వే ప్రారంభించిన భారత్ గౌరవ్ పథకంలో భాగంగా ‘సౌత్ స్టార్ రైల్’ నూతన రైల్వే సేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా ‘సౌత్ స్టార్ రైల్’ ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేశ్ ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. వేసవి విడిది నేపథ్యంలో థీమ్ టూరిస్ట్ ప్యాకేజీలో భాగంగా కశ్మీర్‌కు ప్రత్యేక రైల్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ రైలు కోయంబత్తూర్ నుంచి ప్రారంభమై హైదరాబాద్, వరంగల్, ధర్మపురి, విజయవాడ, ఈరోడ్, సేలం, ఎలహంక, పెరంబుదూర్ మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ టూర్ ఆపరేటర్లను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ప్యాకేజీ వ్యవధి 12 రోజులని తెలిపారు. ఇందులో ప్రత్యేక సదుపాయాలతో పాటు ప్రయాణ బీమా, సైట్ సీయింగ్, భోజన వసతులు అందిస్తున్నామని రీజినల్ మేనేజర్ సంతోష్ వివరించారు. బుకింగ్ తదితర సమాచారం కోసం 7876101010 నంబర్ లేదా ఠీఠీఠీ.ట్చజీ ్టౌuటజీటఝ.ఛిౌఝలో సంప్రదించవచ్చని సూచించారు. -
కశ్మీర్ లోయలో వరుస హత్యలు.. హిజ్బుల్ ఉగ్రవాది అరెస్ట్
బెంగళూరు: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ టాప్ కమాండర్, టెర్రరిస్ట్ తాలిబ్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కశ్మీర్ లోయలో హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు బెంగుళూరులో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో ఉగ్రవాది అరెస్టుపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ప్రజల కదలికలపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందన్నారు. ఉగ్రవాదిని అరెస్ట్ చేయడంలో తమ పోలీసులు పూర్తి సహాయం అందించారన్నారు. బెంగుళూరులో తాలిబ్ హుస్సేన్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేయడంలో తాము సాయం చేసినట్లు వెల్లడించారు. కశ్మీర్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. రాహుల్ భట్ హత్యలో ఇద్దరు ఉగ్రవాదులు ప్రమేయం ఉండగా ఒకరిని అంతమొందించినట్లు తెలిపారు. అమ్రీన్ భట్ హత్య కేసులో, ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టారు. ఇక విజయ్ కుమార్ హత్యలో కేసులో ఉగ్రవాదులు గుర్తించామని వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. కాగా జూన్ 2న జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. మేనేజర్ క్యాబిన్లో ఉన్న విజయ్ కుమార్‌ను ఓ ఉగ్రవాది తన చేతుల్లోని తుపాకీతో కాల్చేశాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో మేనేజర్ అక్కడే కుప్పకూలిపోయాడు. చదవండి: బీజేపీకి సంకటం.. దేశ ప్రతిష్టకు భంగపాటు -
మానవత్వానికి మృత్యులోయ
గత నెల ఓ కశ్మీరీ పండిట్, ఓ వైన్‌షాపు ఉద్యోగి, మొన్న ఓ టీవీ నటి, నిన్న ఓ స్కూల్ టీచర్, ఇవాళ గురువారం ఓ బ్యాంకు మేనేజర్. మరి, రేపు...? తలచుకొంటేనే నిద్ర పట్టని ఈ వరుస హత్యలతో దాదాపు 75 లక్షల మందికి ఆవాసమైన కశ్మీర్ లోయ వణికిపోతోంది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని అమాయకులను లక్ష్యంగా చేసుకొని, మే 1 నుంచి ఇప్పటికి 8 మందిని ముష్కరులు పొట్టనబెట్టుకున్నారు. దేశంలోని వైవిధ్యానికీ, లౌకికవాదానికీ ప్రతీకగా నిలుస్తున్న హిందూ కశ్మీరీలు, ముస్లిమ్ కశ్మీరీలు, స్థానికేతరులు – ఇలా మత, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ఇప్పుడు తీవ్రవాదుల లక్ష్యమే. ప్రధాన మంత్రి ప్యాకేజీ కింద కశ్మీరీ లోయకు తిరిగొచ్చిన హిందూ ప్రభుత్వోద్యోగులు వందల మంది భయాందోళనలతో పెట్టేబేడా సర్దుకొని, వెళ్ళిపోతుండడం పెనువిషాదం. ఈ తాజా దృశ్యాలు మళ్ళీ 1990 నాటి పరిస్థితిని తలపించాయి. ప్రాణాలు పోతుంటే, పాలనా యంత్రాంగం ఏం చేస్తోందన్న జవాబు లేని ప్రశ్నను సంధించాయి. కశ్మీర్లో కేంద్రం కనుసన్నల్లోని లెఫ్టినెంట్ గవర్నర్ పాలన ఉన్నా, ఈ పరిస్థితి తలెత్తడం పాలకుల ఘోర వైఫల్యమే. అమరనాథ్ యాత్ర కూడా సమీపిస్తుండడంతో తక్షణ దిద్దుబాటు కోసం హోమ్‌మంత్రి కశ్మీర్‌పై ఉన్నత స్థాయి భద్రతా సమావేశం పెట్టడం, భద్రతా సలహాదారుతో భేటీ కావడం అనివార్యమయ్యాయి. అయితే కశ్మీర్లో శాంతిభద్రతలు నెలకొనడం దాయాది పాకిస్తాన్‌కు సుతరామూ ఇష్టం ఉండదని తెలిసిందే. అక్కడ చిచ్చు రేపి చలిమంట కాసుకుందామనేది దీర్ఘకాలంగా దాని ప్రణాళిక. తాజా ఘటనలూ అందుకు తగ్గట్టే ఉన్నాయి. కశ్మీరీ ముస్లిమ్ పౌరులు ఎప్పటి నుంచో లక్ష్యం కాగా, ఇప్పుడు కశ్మీరీ పండిట్లు, ఇతర హిందూ, సిక్కు మతస్థులు, వలస కార్మికులపై హత్యాకాండ పెరిగింది. ఒకపక్క కశ్మీర్లో ఈ మైనారిటీలకు స్థానం లేదని చాటి, మరోపక్క దేశంలోని మిగతా ప్రాంతాల్లో మతపరమైన విభేదాలు రేపే పన్నాగం నడుస్తోంది. ముందుగా రెక్కీ చేసి మరీ అమాయకుల్ని చంపుతున్నారంటే, ఉగ్రమూకలు ఎలాంటి భయాందో ళనలు రేపాలనుకుంటున్నాయో అర్థమవుతోంది. ప్రభుత్వోద్యోగులు తమను కశ్మీర్ నుంచి జమ్మూకు సామూహిక బదలీ చేయాల్సిందంటూ వీధికెక్కడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కశ్మీర్ లోయలోని వలస క్యాంపుల్లో ఉండాలని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వం ఉద్యోగులకు వినతి చేయాల్సి వస్తోంది. హిందూ ప్రభుత్వోద్యోగులను జిల్లా కేంద్రాలకు పంపిస్తామంటోంది. కానీ, రాజధాని శ్రీనగర్ సైతం సురక్షితం కానప్పుడు, ఉద్యోగులను జిల్లా కేంద్రాలకు పంపిస్తామన డంలో అర్థం లేదు. అలాగని ఉద్యోగులు కోరుతున్నట్టు అందరూ జమ్మూకు తరలిపోవడం సాధ్యమా? వందల సంఖ్యలో వలస వస్తున్న కశ్మీరీలను భరించే ప్రాథమిక వసతులు జమ్మూలోనూ లేవు. ఒకవేళ రేపు జమ్మూలోనూ ఇలాంటి భద్రతా సమస్యే తలెత్తితే, వీళ్ళంతా ఇంకెక్కడికి పోవాలి? కశ్మీర్లో హిందువులు 2 శాతం లోపే! అక్కడకు ఎస్సీ –ఓబీసీ కోటాలో ఉద్యోగాలకు వచ్చినవారు, దీర్ఘకాలంగా ఉంటున్న రాజస్థానీ రాజ్‌పుత్‌లు, పొట్టచేతబట్టుకొని వచ్చిన బిహారీలు, లౌకికవాద ముస్లిమ్‌లు– అందరూ బాధితులే. తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు కనీసం మరో రెండు మూడేళ్ళు పడుతుందని భద్రతా వర్గాలే చెబుతున్నాయి. అప్పటి దాకా వీళ్ళు బలిపశువులు కావాల్సిందేనా? ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితులు చక్కబడిపోయాయనీ, పోతాయనీ అనుకుంటే అది భ్రమేనని తేలిపోయింది. కశ్మీర్లో సాధారణ పరిస్థితి నెలకొన్నదన్న పాలకుల మాటలోని డొల్లతనమూ బయటపడింది. స్థానికంగా తీవ్రవాదుల భర్తీ తగ్గి, విదేశీ తీవ్రవాదుల సంఖ్య పెరగడం కొత్త ట్రెండ్. ఆకస్మిక తీవ్రవాద దాడి చేసి, మళ్ళీ అందరిలో ఒకరిగా గడిపేసే ‘హైబ్రిడ్ తీవ్రవాదులు’ అనే కొత్త పదం కశ్మీరీ రక్తచరిత్రలో వచ్చి చేరింది. వీటిని అడ్డుకోకపోతే, ఎంతకాలమైనా ఇదే పరిస్థితి. పాల కులు అది గుర్తించాలి. జమాతే శక్తులు వివిధ వర్గాల్లో జొరబడి, కీలక సమాచారాన్నీ, అమాయకుల ఆనుపానుల్నీ లీక్ చేస్తున్నాయని పోలీసుల మాట. దానిపై దృష్టి పెట్టి, ఇంటి దొంగలను ఏరి వేయాలి. రాష్ట్రంలో రాజకీయ శూన్యత పూరించి, ప్రజాస్వామ్య సర్కారుకు సత్వరం దోవ చేయాలి. రాష్ట్రాల కన్నా మనుషుల మనసులు గెలవడం ముఖ్యం. భిన్న వర్గాల మధ్య సౌహార్దం మరీ ముఖ్యం. పరస్పరం అనుమానాలు ప్రబలే మాటల వల్ల ఏం ప్రయోజనం? టూరిస్టులు పెరిగినంత మాత్రాన సాధారణ స్థితి నెలకొన్నట్టు కాదు. కశ్మీర్‌ది పర్యాటకాభివృద్ధిని మించిన సమస్య. కశ్మీరీల భద్రతకు ముందుగా తీవ్రవాద నిర్మూలన కీలకం. ఉపాధి కోల్పోయిన స్థానికులు ఉగ్రమూకల వైపు ఆకర్షితులు కాకుండా చూడడం ముఖ్యం. ప్రాంతీయాభివృద్ధి మాటలే కాదు... ప్రజాస్వామికంగా వ్యవహరించడం ఇంకా ముఖ్యం. స్థానిక సెంటిమెంట్లను పక్కనబెట్టి, కశ్మీర్ స్వయంప్రతిపత్తినీ, రాష్ట్ర ప్రతిపత్తినీ ఏకపక్షంగా రద్దు చేసిన పాలకులు... ప్రతిపక్షాలనూ నిర్వీర్యం చేయాలన్న నిరంకుశ ధోరణిలోనే వెళితే కష్టం. కశ్మీరీ ప్రధాన స్రవంతి నాయకత్వమైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమో క్రాటిక్ పార్టీలను ప్రజాక్షేత్రంలో కలుపుకొనిపోవాలి. స్థానికులలో ధైర్యం పాదుగొల్పాలి. ఆందోళన లకు చెవి ఒగ్గకుండా, ఆయుధబలంతో ఉక్కుపాదం మోపాలని చూస్తే ఉగ్రచర్యలు కొత్త పిలకలు వేస్తాయి. ఎంతసేపటికీ తప్పంతా పాత పాలకులదే అని చేతులు కడిగేసుకుందా మంటే కుదరదు. పాత సమస్యపై పాలకులు కొత్తగా ఆలోచించాలి. శాంతిస్థాపనకు కొత్త వ్యూహంతో రావాలి. పాలించే రాష్ట్రాల సంఖ్యలో మరో అంకె పెంచుకోవడం కన్నా, ప్రజలకూ, దేశానికీ అదే ముఖ్యం. -
కుల సమాజమే కానీ...
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ... దేశంలో మత అసహనం, హిందువుల్లో ఉన్మాదం పెరుగుతోందని; ప్రజాస్వామ్య సంస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయనీ బీజేపీ వ్యతిరేక పార్టీలు చేస్తున్న ఆరోపణలలో నిజం ఎంత అనే విషయాన్ని వాస్తవిక దృష్టికోణంలో పరిశీలించాలి. హిందుత్వ సంస్థలు హిందువులను రెచ్చగొడుతున్నాయనీ, మైనారిటీలపై ముఖ్యంగా... ముస్లింలపై విద్వేషాన్ని, పగను ప్రోది చేస్తున్నాయని ఆ పార్టీల ఆరోపణ! వాస్తవంగా ఈ దేశంలో హిందువులు ఒక మత సమూహం కాదు. ఇది కులపరంగా విభజితమైన సమాజం. ఈ సమాజంలో అనాదిగా అసంఘటిత ఛాయలే దర్శనమిస్తున్నాయి. ఈ సమాజం నుండి రాజకీయంగా ఎదిగిన నాయకులందరూ కులపరమైన ఆలోచనా దృక్పథంతోనే ఉంటారు. అంతేకానీ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి ఇత్యాది విషయాలను అర్థం చేసుకునే స్థాయి వీరికి ఉండదు. అదే ఉంటే దేశ విభజన జరిగేది కాదు. కశ్మీర్ రావణ కాష్ఠం అయ్యేది కాదు. కాశ్మీరు లోయ నుండి 3 లక్షల మంది హిందువులను తరిమివేయడం జరిగేది కాదు. హిందువులందరూ ఒకే సమూహం అనే భావం ఉన్నట్లయితే ఈ ఘటనలన్నింటికీ ప్రతిచర్యలు వేరే విధంగా ఉండేవి. ఈ దేశంలో మైనారిటీల పట్ల లౌకికవాద పార్టీ నాయకులు అందరూ మూకుమ్మడిగా ఒకే మాట మీద ఉండటంతో... కులాల వారీగా విభజితమైన హిందువుల్లో అసంతృప్తి, ఆవేదన పుట్టుకొచ్చి కొంత చైతన్యం అంకురించింది. దాన్ని హిందుత్వ రాజకీయ పార్టీ అయిన బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుని కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాలలోనూ అధికారంలోకి వచ్చింది అనేది వాస్తవం. (క్లిక్: ఇలా ఎన్ని పేర్లు మారుద్దాం?) లౌకిక వాదులుగా చెప్పుకునేవారు ప్రధాని మోదీపై వ్యతిరేకత, ద్వేషాలను.. దేశంపై వ్యతిరేకతగా మార్చుకోవడం.. వారి విచిత్రమైన భావదాస్యపు ఆలోచనకు ప్రతీక! ప్రపంచంలో ఏ దేశంలోనూ మన దేశంలోని మైనార్టీలు అనుభవించే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కనిపించవు. పాక్ వంటి చోట్ల దేశ విభజన తర్వాత హిందూ జనాభా తగ్గిపోతుంటే.. మనదేశంలో మాత్రం ముస్లిం జనాభా పెరిగిపోవడం మైనారిటీలకు ఇక్కడ ఉన్న స్వేచ్ఛకు సంకేతంగా చెప్పవచ్చు. (క్లిక్: ఆ హత్యను ఖండిస్తున్నాం) – ఉల్లి బాల రంగయ్య రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
కశ్మీర్‌పై షహబాజ్ కారుకూతలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన వెంటనే షహబాజ్ షరీఫ్ తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. కశ్మీర్ అంశాన్ని, భారత్ 370 ఆర్టికల్‌ను రద్దుచేయడాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు. కశ్మీర్ లోయలో ప్రజలు రక్తమోడుతున్నారని, కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ దౌత్య, నైతిక మద్దతిస్తుందని చెప్పారు. కశ్మీర్ విషయాన్ని ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు. భారత్‌తో సత్సంబంధాలనే తాను కోరుకుంటున్నానని, కానీ కశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా అది సాధ్యం కాదని చెప్పారు. పొరుగుదేశాలను ఎవరం ఎంచుకోలేమని, వాటితో కలిసి జీవించాలని, దురదృష్టవశాత్తు దేశ విభజన సమయం నుంచి భారత్‌తో పాక్‌కు సత్సంబంధాలు లేవని చెప్పారు. 2019లో అధికరణ 370 రద్దు సహా పలు సీరియస్ చర్యలను భారత్ చేపట్టిందని, దీంతో కశ్మీర్ లోయలో, రోడ్లపై కశ్మీరీల రక్తం చిందుతోందని విషం కక్కారు. కశ్మీర్ విషయంపై చర్చకు మోదీ ముందుకురావాలని, ఆ సమస్య పరిష్కారమైతే ఇరుదేశాలు పేదరికం, నిరుద్యోగంలాంటి ఇతర కీలకాంశాలపై దృష్టి పెట్టవచ్చని సూచించారు. రాబోయే తరాలు ఎందుకు బాధలు పడాలని, ఐరాస తీర్మానాలకు, కశ్మీరీల ఆంక్షాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరిద్దామని ఆహ్వానించారు. పఠాన్‌కోట్ దాడి తర్వాత ఇండో–పాక్ సంబంధాలు దిగజారాయి. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా తొలగించడం, అధికరణ 370ని రద్దు చేయడంతో పాక్‌లోని భారత హైకమిషనర్‌ను పాక్ బహిష్కరించింది. అనంతరం భారత్‌తో వాయు, భూమార్గాలను మూసివేసింది. వాణిజ్యాన్ని, రైల్వే సేవలను నిలిపివేసింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు నిలిపివేస్తే చర్చలు జరుపుతామని భారత్ తేల్చిచెబుతోంది. -
కశ్మీరీ పండిట్ల గాథ...
భూతల స్వర్గమైన కశ్మీర్ లోయలో 32 ఏళ్ల క్రితం జరిగిన ఆ దారుణాలు లక్షలాది మంది గుండెల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. నిత్య భయోత్పాతానికి, సామూహిక హత్యాకాండకు జడిసి కట్టుబట్టలతో లోయను వీడి వచ్చిన నాటినుంచీ వాళ్లు న్యాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. సొంత నేలకు దూరంగా, ఏ సదుపాయాలూ లేని శరణార్థి శిబిరాల్లో ఎవరికీ పట్టని అనాథల్లా నిస్సహాయంగా బతుకీడుస్తున్నారు. వాళ్లే... కశ్మీరీ పండిట్లు. ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు మారుతున్నా తమ గోడు పట్టించుకుంటున్న వారే లేరన్న వారి ఆక్రందన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. కశ్మీర్ ఫైల్స్ సినిమా సృష్టించిన వివాదంతో పండిట్ల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది... కశ్మీరీ పండిట్ల ఊచకోతకు, తదనంతర సామూహిక వలసలకు మూగ సాక్షిగా 1990 సంవత్సరం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఆ అల్లర్ల అనంతరం 1990 జనవరి–మార్చి మధ్య లక్షన్నర మంది కశ్మీరీ పండిట్లలో కనీసం లక్ష మందికి పైగా లోయను వీడినట్టు పలు నివేదికలు తేల్చాయి. మహా అయితే 3,000 కుటుంబాలు అక్కడ మిగిలాయని అంచనా. అవి కూడా 2010 నాటికి 800కు తగ్గాయి. కశ్మీర్ ప్రభుత్వ పునరావాస కమిషన్ (శరణార్థుల) అధికారిక వెబ్సైట్ ప్రకారమే 60 వేల కుటుంబాలు లోయను వీడాయి. వీరిలో చాలామంది 30 ఏళ్లుగా జమ్మూ, పరిసరాల్లోని శరణార్థి శిబిరాల్లో దయనీయ పరిస్థితుల్లో తలదాచుకుంటున్నారు. మరో 23 వేల కుటుంబాలు దేశ నలుమూలల్లోనూ విదేశాల్లోనూ స్థిరపడ్డాయి. లోయలో ఇంతటి కల్లోలానికి కారణమైన హిందూ, ముస్లిం ఘర్షణలు 1980ల నుంచే పెరుగుతూ వచ్చాయి. నిజానికి లోయలో 1950ల నుంచి చూసినా హిందూ పండిట్ల సంఖ్య 4 నుంచి 5 శాతం మించి లేదని గణాంకాలు చెప్తున్నాయి. 94 శాతం దాకా ముస్లిం జనాభాయే. అయినా లోయను సంపూర్ణంగా ఇస్లామీకరించే ప్రయత్నాలు 1980ల్లో ఊపందుకున్నాయి. ఫలితంగా స్థానిక ముస్లింలలో హిందువులపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. వారి నివాసాలపై దాడులతో మొదలై హిందూ నేతలను హతమార్చడం దాకా వెళ్లింది. వేర్పాటువాదమే సిద్ధాంతంగా జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వంటివి పుట్టుకు రావడంతో పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడింది. 1990 జనవరి హింసాకాండకు ఇదంతా ఓ భయానక నేపథ్యంగా అమరింది. ఆ మూడు నెలలూ... 1990 జనవరి తొలి రోజులు కశ్మీరీ పండిట్ల గుండెల్లో ఆరని మంటలు రగిల్చాయి. అప్పటికే తారస్థాయికి చేరిన మత అసహనం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. హిందువులు మతం మారడమో, లోయను వీడటమో, మరణించడమో తేల్చుకోవాలంటూ తీవ్రవాద మూకలు పండిట్ల ఇండ్లపై పడి మారణహోమం సృష్టించారు. కనిపించిన వారినల్లా కాల్చి చంపుతూ నరమేధానికి దిగారు. ఆ క్రమంలో అంతులేని దారుణ అత్యాచారాలకు, చెప్పుకోలేని ఘోరాలకు పాల్పడ్డారు. దాంతో పండిట్ల కుటుంబాలు కట్టుబట్టలతో లోయ ను వీడాయి. ఈ హింసాకాండలో మరణించిన హిందువులు 100 లోపేనని అధికారిక గణాంకాలు చెప్తున్నా వాస్తవ సంఖ్య వేలల్లో ఉంటుందంటారు. పట్టించుకున్న వాళ్లే లేరు... జమ్మూ, పరిసరాల్లోని శిబిరాల్లో తలదాచుకున్న పండిట్లు, కొద్ది నెలల్లో లోయకు తిరిగి వెళ్తామన్న ఆశలు క్రమంగా ఆవిరవడంతో దశాబ్దాలుగా అక్కడే బతుకీడుస్తున్నారు. ప్రభుత్వపరంగా వీరికి పెద్దగా సాయం కూడా అందడం లేదు. 2004లో యూపీఏ ప్రభుత్వం పండిట్ల కోసం టౌన్‌షిప్‌ల్లోని చిన్న ఫ్లాట్లను కొందరు కొనుక్కోగా ఆ స్తోమతలేని చాలామంది ఇప్పటికీ దయనీయంగానే గడుపుతున్నారు. ఆర్థిక కష్టాలతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు కూడా. అయినా నాటి గాయాలు వీరిలో ఎంత తాజాగా ఉన్నాయంటే... ఇప్పటికీ చాలామంది తమ అవస్థలపై పెదవి విప్పేందుకు కూడా ఇష్టపడటం లేదు! 2008లో ప్రధాని పునరావాస ప్యాకేజీ కింద పండిట్లకు కొన్ని ఉద్యోగాలివ్వడంతో సరిపెట్టారు. వారికి ఉద్యోగాలతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.7.5 లక్షల దాకా ఆర్థిక సాయం ఇస్తామని 2021లో కేంద్రం ప్రతిపాదించినా ముందడుగు పడలేదు. దాంతో మోదీ ప్రభుత్వం కూడా తమకోసం చేసిందేమీ లేదంటూ పండిట్లు వాపోతున్నారు. కశ్మీరీ పండిట్ల డిమాండ్లు ► కనీసం రూ.25 వేల పై చిలుకు నెలవారీ పరిహారం ► కేంద్రపాలిత ప్రాంత హోదాతో కూడిన ప్రత్యేక హోమ్‌లాండ్ ► మైనారిటీ హోదా, తదనుగుణమైన హక్కులు, ప్రయోజనాలు ► నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు తేల్చాలి. అన్నివిధాలా న్యాయం చేయాలి ► తమ నివాసాలు, భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించి వెనక్కి ఇప్పించాలి ఒక విజయం, వంద వివాదాలు కశ్మీరీ పండిట్ల ఊచకోత, వలసలపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ.15 కోట్లతో రూపొందిన ఈ సినిమా 20 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల పై చిలుకు కలెక్షన్లు రాబట్టి రికార్డుల మోత మోగించింది. మార్చి 11న కేవలం 600 థియేటర్లలో పెద్దగా హడావుడి లేకుండా విడుదలైనా, చూస్తుండగానే టాక్ ఆఫ్ ద కంట్రీగా మారిపోయింది. ప్రధాని మోదీ మొదలుకుని అమిత్ షా తదితర కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రముఖులంతా సినిమాను ప్రశంసలతో ముంచెత్తడమే గాక అందరూ తప్పక చూడాలంటూ పిలుపునిచ్చారు. ఇందుకు విపరీతమైన మౌత్ పబ్లిసిటీ తోడై చూస్తుండగానే 4,000కు పైగా థియేటర్లకు విస్తరించింది. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ఉచితంగా షోలు వేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపులిచ్చాయి. యూఏఈ, సింగపూర్ వంటి దేశాల్లో కూడా నిషేధం తొలగి త్వరలో విడుదలవుతుండటంతో కలెక్షన్లు ఇంకా కొనసాగేలా ఉన్నాయి. అయితే సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పైగా దీన్ని బీజేపీ ప్రమోట్ చేస్తోందన్న అభిప్రాయంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. సినిమాకు అనుకూలంగా, వ్యతిరేకంగా విమర్శలు, ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి. సినిమా అవాస్తవాలమయమని ఆప్ వంటి పార్టీలు అంటున్నాయి. మరో వర్గం మాత్రం సినిమాలో నిజాలు చూపించారని, పండిట్ల గుండెకోత ఇప్పటికైనా వెలుగులోకి వచ్చిందని అంటోంది. బెదిరింపుల నేపథ్యంలో అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రత కల్పించాల్సి వచ్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
‘లోయ’కు గొంతునిచ్చారు
సంగీతం మగవారిది అని అక్కడ కొందరు అనుకుంటారు. ‘మాది కూడా’ అని ఈ ఆడపిల్లలు అన్నారు. కశ్మీర్ లోయలో ఐదారుమంది ఆడపిల్లలు కలిసి ‘వికసించే పూలు’ పేరుతో ఒక సూఫీ సంగీత బృందంగా ఏర్పడ్డారు. వారే పాడతారు. వారే వాయిద్యాలు వాయిస్తారు. కశ్మీర్ మొత్తంలో ఆ మాటకొస్తే దేశంలోనే ఇలాంటి సర్వ మహిళా సూఫీ గీత బృందం లేదు. నిరాశ నిశ్శబ్దపు లోయకు ఈ సంగీతం అవసరం అని వారు అనుకుంటున్నారు. ఒకరిద్దరు భృకుటి ముడివేసినా వీరుగొంతు ఎత్తగానే అప్రయత్నంగా కనులు విప్పారుస్తున్నారు. కశ్మీర్ సూఫీ గర్ల్స్ పరిచయం. ఆ నలుగురైదుగురు అమ్మాయిలు అలా చెట్ల మధ్యగా నడుచుకుంటూ ఒక తిన్నె మీదకు చేరుకుంటారు. తాము తెచ్చుకున్న చాదర్లను నేల మీద పరిచి తామూ వాయిద్యాలు పట్టుకుని కుదురుగా కూచుంటారు. ఒకమ్మాయి సంతూరును సవరిస్తుంది. ఒకమ్మాయి తబలా మీటుతుంది. ఒకమ్మాయి కశ్మీరి వయొలిన్లో కంపనం తెస్తుంది. మెల్లగా అందరూ పాటలు మొదలెడతారు. ప్రకృతి వాటిని పులకించి వింటుంది. బహుశా ఆధ్యాత్మిక తాదాత్మ్యం కూడా చెందుతుంది. ఎందుకంటే వారు పాడేది సూఫీ భక్తి సంగీతం కనుక. కశ్మీర్లో గత రెండేళ్ల నుంచి ఈ బృందం అందరినీ ముచ్చటగొలుపుతోంది. ఈ బృందం తనకు పెట్టుకున్న పేరు ‘వికసించే పూలు’. కాని కశ్మీర్ ప్రాంతం, దేశం సులువుగా ‘సూఫీ గర్ల్స్’ అని పిలుస్తున్నారు. లోయలో బృంద గీతం కశ్మీర్ బండిపోర జిల్లాలో గనస్థాన్ అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో ఈ సంగీత గాథను ఇర్ఫానా యూసఫ్ అనే కాలేజీ అమ్మాయి మొదలెట్టింది. ఆ అమ్మాయి తండ్రి సంగీత విద్వాంసుడు. సాయంత్రమైతే ఇంట్లోని వాయిద్యాలు తబలా, సితార్, సంతూర్ తీసి సాధన చేస్తుండేవాడు. ఇర్ఫానా అది గమనించి తానూ నేర్చుకుంటానని చెప్పింది. అయితే సంగీత వాయిద్యాలను అమ్మాయిలకు నేర్పడం పట్ల ఆ ప్రాంతంలో కొంత పట్టింపు ఉంది. ఇర్ఫానా తండ్రి దానిని పట్టించుకోలేదు. కూతురు ఎప్పుడైతే నేర్చుకుంటానందో ఆ ప్రాంతంలోని ఉస్తాద్ ముహమ్మద్ యాకూబ్ షేక్ అనే గురువు దగ్గరకు తీసుకువెళ్లి చేర్పించాడు. ఉస్తాద్ ముహమ్మద్ షేక్ ఆ ప్రాంతంలో అమ్మాయిలకు సంగీతం నేర్పిన తొలి గురువు. సంగీతం మగవారిది మాత్రమే కాదు అమ్మాయిలది కూడా అని అతని విశ్వాసం. ఆయనకు ఉన్న పేరుకు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. అలా ఇర్ఫానా సంగీతం నేర్చుకుంది. నేర్చుకున్న సంగీతాన్ని దూరదర్శన్‌లో ప్రదర్శించింది. అంతే. ఆమె ఊళ్లో ఆ కార్యక్రమాన్ని చూసిన ఇతర అమ్మాయిలు ఎంత స్ఫూర్తి పొందారంటే ‘మనమంతా ఒక బృందంగా ఏర్పడి కచ్చేరీలు ఇద్దాం’ అని అనేవరకు. ఇర్ఫానాకు కావలసింది అదే. లోయ వినాలనుకుంటున్న సంగీతమూ అదే. ‘సూఫీ సంగీతంలో దేవుణ్ణి, ప్రవక్తని, పీర్లను స్తుతించడం ఉంటుంది. వారి గొప్పతనాన్ని శ్లాఘించడం, కృతజ్ఞతను ప్రకటించడం ఆ పాట ల్లో ఉంటుంది. పారశీ గీతాలు మాకు తెలియకపోయినా పెద్దల నుంచి అర్థం తెలుసుకుని పాడుతున్నాం’ అంటున్నారు ఈ అమ్మాయిలు. సూఫీ సంగీతం కశ్మీరీ ఫోక్లోర్ పాడే బృందాలు కశ్మీర్లో చాలానే ఉన్నాయి. కాని సూఫీ సంగీతం పాడే బృందాలు లేవు. మగవారే పాడుతున్నారు. కశ్మీర్ అంతటా ఉర్సుల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, ఇళ్లల్లో జరిగే ఉత్సవాల్లో సూఫీ సంగీతం వినిపించడం ఆనవాయితీ. పారశీ, కశ్మీరీ భాషల్లో కశ్మీర్ ప్రాంతంలోని సూఫీ గురువులు పూర్వం రాసిన గీతాలను లయబద్ధంగా పాడటం అక్కడ ఎంతో ఆదరంతో చూస్తారు. ‘సూఫీ సంగీతంలో 12 నిర్దేశిత స్వరాలు ఉంటాయి. వాటిలోనే పాడాలి. వాటిలో కొన్ని స్వరాలకు కొన్ని సమయాలు ఉంటాయి. ఉదాహరణకు మొకామ్-ఏ-కూహి స్వరాన్ని రాత్రి తొలిజాము లోపల పాడేయాలి. ఆ తర్వాత పాడకూడదు. కొన్ని సాయంత్రాలు మాత్రమే పాడాలి’ అంటుంది ఇర్ఫానా. ఈ అమ్మాయిల తల్లిదండ్రులందరూ వీరి పాటకు సమ్మతించారు. కొందరు మొదట ‘ఆడపిల్లలకు పాటలా’ అని అన్నా తర్వాత ఈ బృందానికి వస్తున్న పేరును ప్రోత్సహిస్తున్నారు. ‘మా దగ్గర నిన్నమొన్నటి వరకూ సొంత వాయిద్యాలు లేవు. కాని మా కచ్చేరీలు మొదలయ్యాక వచ్చిన డబ్బుతో వాటిని కొనుక్కున్నాం. అందుకు దాదాపు లక్ష రూపాయలు అయ్యింది’ అంది ఫర్హానా. యూనివర్సిటీలోనూ కశ్మీర్ యూనివర్సిటీలో సంగీత వాయిద్యాల శాఖ ఉంది. ఫర్హానా అక్కడ సంతూర్ వాయిద్యం లో శిక్షణ కోసం చేరినప్పుడు ఆ అమ్మాయితో పాటు మరొక్క అమ్మాయి మాత్రమే ఆ కోర్సులో ఉంది. వాయిద్యాలన్నీ అక్కడ దుమ్ము పట్టి కనిపించేవి. ఇవాళ వీరికి వచ్చిన పేరు చూసి వాయిద్యాలు నేర్చుకోవడానికి చేరుతున్న ఆడపిల్లల సంఖ్య పెరిగింది. ‘మేము యూనివర్సిటీలో నేర్చుకుంటున్నాం. ఇంటికి వచ్చి సంప్రదాయబద్ధంగా గురువు దగ్గరా నేర్చుకుంటున్నాం. సంగీతం నేర్చుకోవడం ఆషామాషీ కాదు. తాళం పట్టాలి’ అంటారు ఈ అమ్మాయిలు. ‘కశ్మీర్లో ఆధునిక పోకడలు ఏనాడో మొదలయ్యాయి. కళ, సాంస్కృతిక రంగాలలో చాదస్తాలు తగ్గాయి. కశ్మీర్లో కళా వికాసం జరుగుతోంది. ప్రోత్సాహం దక్కితే మాలాంటి అమ్మాయిలు ఇంకా చాలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటోంది ఈ బృందం. ‘వికసించే పూలు’ బృందానికి ముఖ్య నగరాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. లాక్డౌన్ లేకపోతే వారు మరింతగా వినిపించి ఉండేవారు. తెలుగు నగరాల్లో కూడా వీరిని చూస్తామని ఆశిద్దాం. - సాక్షి ఫ్యామిలీ -
అద్భుతం సృష్టించిన భారతీయ రైల్వే
కౌరి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌కి సంబంధించిన ఆర్చ్ నిర్మాణం సోమవారం పూర్తయిందని భారతీయ రైల్వేస్ ప్రకటించింది. దీంతో వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, ఒక్క ఏడాదిలో వంతెన నిర్మాణం సంపూర్ణమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయను ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఉద్దేశించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు రూ. 1486 కోట్లు ఖర్చయ్యాయి. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులో భాగంగా 1.315 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు మరో రెండున్నరేళ్లలో పూర్తికానుందని ఉత్తర రైల్వే జీఎం అశుతోష్ గంగల్ చెప్పారు. తాజాగా పూర్తి చేసిన ఆర్చ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతమన్నారు. ప్రధాని మోదీ విజన్‌తో స్ఫూర్తి పొందిన రైల్వేస్ తాజా నిర్మాణంతో భారత్‌ను అత్యున్నతంగా నిలిపిందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇది ఒక అద్భుతమన్నారు. వంతెన ప్రత్యేకతలు ► పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జ్ 35 మీటర్ల ఎత్తులో ఉంది. చీనాబ్ నదీ ఉపరితలం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ► 2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మధ్యలో 2009లో నిలిచిపోయాయి. ► 2017 నుంచి వంతెనపై ఆర్చ్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ ఆర్చ్ పొడవు 467 మీటర్లు, బరువు 10619 మెట్రిక్ టన్నులు. ► 28660 మెట్రిక్ టన్నుల ఇనుము, 66వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వాడారు. ► 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. ► నిర్మాణంలో ‘టెక్లా’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డిటైలింగ్ చేశారు. నిర్మాణంలో వినియోగించిన స్టీల్ –10 నుంచి + 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలదు. -
కశ్మీర్లో ఆపరేషన్ సక్సెస్: ప్రధాన ఉగ్రవాది అరెస్ట్
కశ్మీర్: ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న లష్కరే -ఈ -ముస్తఫా వ్యవస్థాపకుడు హిదాయతుల్లా మాలిక్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కశ్మీర్లో జరిపిన దాడుల్లో ఈ కీలకమైన ఉగ్రవాది ఆచూకీ లభించింది. అదుపులోకి తీసుకునే క్రమంలో అతడు ఎదురుదాడికి దిగాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అతి కష్టమ్మీద హిదాయతుల్లాను అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి కశ్మీర్ వెళ్తుండగా అతడిని అరెస్ట్ చేశారు. జమ్మూ, అనంత్‌నాగ్ పోలీసులు సంయుక్తంగా శనివారం ఆపరేషన్ చేపట్టగా కుంజువాణి ప్రాంతంలో హిదాయతుల్లా కనిపించాడు. వాహనాల తనిఖీ సమయంలో కనిపించిన అతడి వివరాలు అడగడానికి ప్రయత్నించగా పోలీసులపై తుపాకీతో ఎదురు దాడి దిగాడు. దీంతో పోలీసులు అతడిని చుట్టుముట్టేసి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పిస్టోల్, ఓ గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ సీనియర్ ఎస్పీ శ్రీధర్ పాటిల్ తెలిపారు. కశ్మీర్ లోయలో జైషే- ఈ- మహ్మద్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ్సాలి ఉంది. -
చైనాతో తాడోపేడో: సిలిండర్లు నిల్వ చేసుకోండి
శ్రీనగర్: సరిహద్దుల్లో తరచూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాతో తాడోపేడో తేల్చుకోవాలని ఇండియా భావిస్తోందా? ఆ దిశగా అడుగులు వేస్తోందా? తాజాగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గమనిస్తే ఇలాంటి అనుమానాలే తలెత్తుతున్నాయి. కశ్మీర్ లోయలో రెండు నెలలకు సరిపడా ఎల్పీజీ సిలిండర్లను నిల్వ చేసి పెట్టుకోవాలని చమురు మార్కెటింగ్ కంపెనీలకు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల విభాగం డైరెక్టర్ జూన్ 27న ఆదేశాలు జారీ చేశారు. వీటిని అత్యవసరమైన ఆదేశాలుగా పేర్కొన్నారు. (పథకం ప్రకారమే డ్రాగన్ దాడి!) చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇవ్వడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్ లోయలో కొండ చరియలు విరిగిపడుతుండడంతో జాతీయ రహదారులను మూసివేయాల్సి ఉంటుందని, అందుకే గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వర్షా కాలంలో ఇలాంటి ఆదేశాలు సాధారణమేనంటున్నాయి. కాగా, చైనా పక్కా పథకం ప్రకారమే గల్వాన్ సరిహద్దుల్లో భారత్‌పై కయ్యానికి కాలు దువ్వినట్టుగా తాజాగా వెల్లడైంది. జూన్ 15 రాత్రి ఘర్షణలకి ముందే కరాటే, కుంగ్‌ఫూ వంటి యుద్ధ కళల్లో ఆరితేరిన మార్షల్ యోధులు, ఎవరెస్టు వంటి పర్వత శ్రేణుల్ని అలవోకగా ఎక్కగలిగే నైపుణ్యం కలిగిన వీరుల్ని చైనా సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని చైనా జాతీయ మీడియానే స్వయంగా తెలిపింది. (స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి: ప్రధాని మోదీ) -
లోయలో ఇంటర్నెట్ ఎప్పుడు?
శ్రీనగర్: లద్దాఖ్‌లోని కార్గిల్ జిల్లాలో 145 రోజుల తర్వాత శుక్రవారం మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునఃప్రారంభం కాగా కశ్మీర్ లోయలో ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మోదీ నేతృత్వంలోని కేంద్రసర్కారు ఆర్టికల్ 370ని రద్దు చేసి ఇప్పటికే 145 రోజులవుతోంది. గత నాలుగు నెలల నుంచి కార్గిల్‌లో ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగనందున అక్కడ మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సేవలను దుర్వినియోగం చేయొద్దని అక్కడి మత పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రం ఆగస్ట్ 5న ఆర్టికల్–370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసినప్పటి నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కశ్మీర్లో గత 145 రోజులుగా డిజిటల్ బ్లాకవుట్ కొనసాగుతుండగా ఇది ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతోందో తెలియదు. సమీప భవిష్యత్తులో సేవలను పునఃప్రారంభించే సూచనలు కూడా కనిపించడం లేదు. -
ధోని తిరుగు ప్రయాణం..
లెహ్: పారామిలటరీ రెజిమెంట్‌లో సేవ చేసేందుకు వెళ్లిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. దాన్ని విజయవంతంగా ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ మేరకు న్యూఢిల్లీకి బయల్దేరే క్రమంలో లెహ్ ఎయిర్‌పోర్ట్‌లో ధోని దర్శనిమిచ్చాడు. భారత సైన్యంలో 106 టీఏ పారా బెటాలియన్‌తో కలిసి 15 రోజుల పాటు ధోని పనిచేశాడు. జూలై 30వ తేదీ నుంచి ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవడంతో అక్కడ విధుల్లో పాల్గొన్నాడు. ఆగస్టు15 వ తేదీతో ధోని కాల పరిమితి ముగియడంతో ఇంటికి చేరుకునేందు తిరుగు ప్రయాణం అయ్యాడు. కశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీలను ధోని నిర్వర్తించాడు. కశ్మీర్‌లోని మిలిటెంట్ల ఏరివేతలో ప్రధాన భూమిక పోషించే విక్టర్ ఫోర్స్‌లో ధోని పనిచేశాడు. ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని.. సైన్యంతో కలిసి విధులు నిర్వర్తించేందుకు వెస్టిండీస్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోని తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. పారాట్రూపర్ గా ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకొని విమానంలో నుంచి పారాచూట్ సహాయంతో దూకి శిక్షణ పొందారు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోనీ పారాచూట్ సహాయంతో కిందకు దూకి, నేల మీద సురక్షితంగా ల్యాండవ్వడంతో ఆయన పారాట్రూపర్ గా అర్హత పొందారు. -
క్రికెట్‌కు బ్రేక్..సైనిక విధుల్లో ధోని
-
సైనిక విధుల్లో చేరిన ధోని
జమ్మూ : దేశ రక్షణలో భాగం కావాలని రెండు నెలలు ఆటకు విరామం పలికిన టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని బుధవారం విధుల్లో చేరాడు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆగస్ట్ 15 వరకు కశ్మీర్ లోయలో సేవలందించనున్నాడు. కశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీలను ధోని నిర్వర్తించనున్నాడు. కశ్మీర్‌లోని మిలిటెంట్ల ఏరివేతలో ప్రధాన భూమిక పోషించే విక్టర్ ఫోర్స్‌లో ధోని పనిచేయనున్నాడని, సైన్యంతో పాటే ఉంటాడని భారత ఆర్మీ ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచకప్ ముగిసిన అనంతరం దేశ రక్షణకు అహర్నిశలు శ్రమించే సైన్యం విధుల్లో తాను భాగం కావాలని భావించిన ఈ మిస్టర్ కూల్.. స్వయంగా వెస్టిండీస్ పర్యటనకు తప్పుకున్న విషయం తెలిసిందే. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోనీ తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. పారాట్రూపర్ గా ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకొని విమానంలో నుంచి పారాచూట్ సహాయంతో దూకి శిక్షణ పొందారు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోనీ పారాచూట్ సహాయంతో కిందకు దూకి, నేల మీద సురక్షితంగా ల్యాండవ్వడంతో ఆయన పారాట్రూపర్ గా అర్హత పొందారు. మిలయన్ డాలర్ల విలువ కలిగిన ధోనిలాంటి దిగ్గజం సాధారణ సైనికుడిలా దేశ కోసం సేవ చేయడం నేటి యువతకు మార్గదర్శకంగా ఉండనుంది. ముఖ్యంగా వారు దేశసైన్యంలో చేరే ఆసక్తిని రేకిత్తిస్తోంది. తన విధులు ప్రారంభించిన ధోనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. -
ధోని.. నీ దేశభక్తికి సెల్యూట్: విండీస్ క్రికెటర్
హైదరాబాద్: రెండు నెలలు ఆర్మీకి సేవలందించాలన్న టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే ఆర్మీ ఉన్నతాధికారులతో సహా, టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, కపిల్ దేవ్ వంటి దిగ్గజాలు ధోని నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ ధోని తీసుకున్న నిర్ణయానికి ముగ్దుడయ్యాడు. అంతేకాకుండా అతడి దేశభక్తి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా గతేడాది రాష్ట్రపతి నుంచి పద్మ విభూషణ్ అందుకుంటున్న వీడియోని జతచేశాడు. ‘మైదానంలో ధోని ఎంతో స్పూర్తినిస్తాడు. అతను గొప్ప దేశ భక్తుడు. దేశానికి సేవలందించాలన్న అతని అంకితభావం అమోఘం’అంటూ కాట్రెల్ తొలి ట్వీట్లో పేర్కొన్నాడు. అనంతరం మరో ట్వీట్లో ‘ఈ వీడియోని స్నేహితులు, కుటుంబ సభ్యులకి షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అటువంటి క్షణాన్ని నేను ఎంత గర్విస్తానో వాళ్లకి తెలుసు. ఆ క్షణంలో ధోని, అతని భార్య సాక్షిని చూస్తేంటే జీవిత భాగస్వామిపై, దేశం పట్ల ఉన్న ప్రేమ ప్రతిబింబిస్తుంది’అంటూ ధోని పద్మవిభూషణ్ తీసుకుంటున్న వీడియోను జతచేసి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం కాట్రెల్ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ‘మైదానంలో నువ్వు సెల్యూట్‌తో సంబరాలు చేసుకుంటే .. నీ ట్వీట్‌కు, మంచితనానికి మేమందరం సెల్యూట్ చేస్తున్నాం’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, కాట్రెల్ కూడా జమైకా సైన్యంతో కలిసి పనిచేస్తూనే క్రికెట్ ఆడుతున్నాడు. దీంతో.. ఇప్పటికీ అతను మైదానంలో వికెట్ పడగొడితే..? సైనికుడి తరహాలో ఫీల్డ్ అంపైర్ వైపు వాక్ చేసి సెల్యూట్ కొట్టి సంబరాలు చేసుకుంటాడు. తాజాగా ధోనీకి కూడా గౌరవంగా ట్వీట్ ద్వారా సెల్యూట్ కొట్టాడు. తన రెండు నెలల సైనిక శిక్షణను ధోని గత గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. జులై 31 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌తో కలిసి ధోనీ పనిచేయనున్నాడు. కశ్మీర్లో ఉన్న విక్టర్ ఫోర్స్‌తో ధోనీ కలవనున్నాడు. అక్కడ పారాచూట్ రెజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా ధోని పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీలను నిర్వర్తించనున్నాడు. This man is an inspiration on the cricket field. But he is also a patriot and a man that gives to his country beyond duty. I have been at home in Jamaica with my boys these past weeks and had time to reflect (1/2) — Sheldon Cotterell (@SaluteCotterell) July 28, 2019 I shared this video with friends and family because they know how I feel about honour but the moment between wife and husband truly shows an inspirational kind of love for country and partner. Please enjoy as I did. pic.twitter.com/Pre28KWAFD — Sheldon Cotterell (@SaluteCotterell) July 28, 2019 -
కశ్మీర్‌కు పదివేల బలగాలు
న్యూఢిల్లీ/కశ్మీర్: కశ్మీర్ లోయకు పదివేల మంది భద్రతా బలగాలను తక్షణం తరలించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు, శాంతి భద్రతల విధి నిర్వహణకు వీరిని పంపుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 100 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్)ను తక్షణం తరలించాలని కేంద్ర హోం శాఖ ఈనెల 25వ తేదీన ఉత్తర్వులు వెలువరించిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మరికొన్ని బలగాలను కూడా తరలించే యోచనలో కేంద్రం ఉందని కూడా వెల్లడించారు. ఒక సీఏపీఎఫ్ కంపెనీలో 100 మంది సిబ్బంది ఉంటారు. కశ్మీర్ లోయకు పంపే వారిలో సీఆర్పీఎఫ్కు చెందిన 50 కంపెనీలు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) నుంచి 30, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ నుంచి పదేసి కంపెనీల చొప్పున బలగాలు ఉంటాయన్నారు. వీరందరినీ రైళ్లు, విమానాల్లో విధులు చేపట్టే ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఉగ్ర నిరోధక చర్యలతోపాటు అమర్నాథ్ యాత్రకు బందోబస్తు కల్పిస్తున్న 80 బెటాలియన్ల బలగాలకు వీరు అదనమన్నారు. ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపాలని యోచిస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ బలగాలను మోహరిస్తోందని భావి స్తున్నారు. బలగాలను తరలించాలన్న కేం ద్రం నిర్ణయాన్ని పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. జైషే టాప్ కమాండర్ హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ అగ్రశ్రేణి జైషే మహమ్మద్ (జేఎం)కు చెందిన కమాండర్ మున్నా లాహోరిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శుక్రవారం రాత్రి సోపియాన్‌లోని బోన్బజార్ ప్రాంతం బండే మొహల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గత నెలలో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన కారు పేలు డుకు లాహోరి కారణమని పోలీసులు తెలి పారు. పాక్ జాతీయుడైన మున్నా లాహోరి కశ్మీర్లో వరుస పౌర హత్యలకు పాల్పడ్డా డని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదుల నియా మకం కోసం లాహోరిని జైషే నియమిం చిందని, అతడు పేలుడు పరికరాల తయా రీలో సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు. -
‘ధోనికి ప్రత్యేక రక్షణ అవసరం లేదు’
న్యూఢిల్లీ: దేశ రక్షణలో భాగమైన సైనికుడికి ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన అవసరంలేదని.. అతడే దేశానికి, ప్రజలకు రక్షణగా నిలవాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనిని ఉద్దేశించి పేర్కొన్నారు. రెండు నెలల సైనిక శిక్షణను ధోని గురువారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 31 నుంచి ఆగస్ట్ 15 వరుకు కశ్మీర్ లోయలో విధులు నిర్వర్తించనున్నాడు. ఈ సందర్భంగా బిపిన్ రావత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ధోని ట్రైనింగ్ ప్రారంభమైంది. 106 టెర్రిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో చేరాడు. కశ్మీర్లో విక్టర్ ఫోర్స్ పేరిట నిర్వహించే యూనిట్లో ఈ బెటాలియన్ పని చేయనుండగా.. వారితో పాటే ధోని కూడా ఉండనున్నారు. కమ్యూనికేషన్, స్టాటిక్ రక్షణలో ఈ బెటాలియన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ బెటిలియన్‌లోనే ధోని పని చేయడం అతడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ధోనికి ప్రత్యేకంగా వసతులు ఏర్పాటుచేయలేదు. మామూలు సైనికుడికి ఎలాంటి సదుపాయాలు అందిస్తామో ధోనికి కూడా అవే లభిస్తాయి. ఇక ధోని కోసం ప్రత్యేక రక్షణ కల్పించము. అతడే దేశానికి, ప్రజలకు రక్షణగా ఉంటాడు’అంటూ బిపిన్ రావత్ వివరించారు. ఇక ప్రపంచకప్ అనంతరం క్రికెట్‌కు రెండు నెలల పాటు సెలవు తీసుకున్న ధోని.. ఆర్మీకి సేవలందించాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా అనుమతించడంతో ధోని ఆర్మీ ట్రైనింగ్‌కు మార్గం సుగుమమైంది. ‘ధోనిలాంటి భారత క్రికెట్ దిగ్గజం తీసుకున్న నిర్ణయం.. దేశ యువతలో సైన్యంలో పని చేయాలన్న స్ఫూర్తిని కలిగిస్తుంది. అతడు కోరుకునేది కూడా అదే’ అని ఓ అధికారి తెలిపాడు. వైమానిక దళ విమానం నుంచి ఐదు పారాచూట్ జంపింగ్‌లు చేయడం ద్వారా ధోని 2015లోనే పారాట్రూపర్‌గా అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
ధోని ఆర్మీ సేవలు కశ్మీర్ లోయలో!
న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని రెండు నెలల పాటు సైన్యంలో సేవలందించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ ముగిసిన అనంతరం దేశ రక్షణకు అహర్నిశలు శ్రమించే సైన్యం విధుల్లో తానూ భాగం కావాలని ఈ మిస్టర్ కూల్ నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని జులై 31 నుంచి ఆగస్ట్ 15 వరకు కశ్మీర్ లోయలో సేవలందించనున్నాడు. దీనికి సంబంధించి ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీలను ధోని నిర్వర్తించనున్నాడని అధికారులు తెలిపారు. కాగా ధోనీ 2011 సంవత్సరంలోనే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందారు. ఆయన టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 106 ఇన్ ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన వారు. ఈ బెటాలియన్ లోనే పారచూట్ శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెటాలియన్ బెంగళూరు హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా పనిచేస్తుంది. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోనీ తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. పారాట్రూపర్ గా ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకొని విమానంలో నుంచి పారాచూట్ సహాయంతో దూకి శిక్షణ పొందారు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోనీ పారాచూట్ సహాయంతో కిందకు దూకి, నేల మీద సురక్షితంగా ల్యాండవ్వడంతో ఆయన పారాట్రూపర్ గా అర్హత పొందారు. -
కశ్మీర్లో ఉగ్ర దుశ్చర్య
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా దళాలపై జరిపిన దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రదాడిని తిప్పికొట్టడానికి భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని అధికారులు వెల్లడించారు. ‘116వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు, రాష్ట్ర పోలీసులు ఇక్కడి కేపీ రోడ్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఒక్కసారిగా తమ వద్ద ఉన్న రైఫిళ్లతో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. అలాగే వారి వాహనంపై గ్రెనేడ్లను విసిరారు. దీంతో జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా గాయపడిన మరో ముగ్గురుని ఆస్పత్రికి తరలించాం’అని తెలిపారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన అనంతనాగ్ పోలీస్ స్టేషన్ అధికారి అర్షద్ అహ్మద్‌ను చికిత్స కోసం శ్రీనగర్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ ఉగ్రవాదులను జైషే మొహ్మద్ ఉగ్రవాద గ్రూపునకు చెందిన వారుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
సీఆర్పీఎఫ్ ఇక మరింత బలోపేతం
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో జవాన్ల భద్రతా చర్యల్లో భాగంగా కీలక ముందడుగు పడింది. వారి భద్రత కోసం మందుపాతర రక్షిత వాహనాలను (ఎమ్‌పీవీ), 30 సీటర్ బస్సులను సమకూర్చనున్నట్లు భద్రతా దళాధికారి ఒకరు తెలిపారు. అలాగే కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన, శాంతి భద్రతల విధులను నిర్వహిస్తున్న 65 బెటాలియన్లలో బాంబులను గుర్తించే, నిర్వీర్యం చేసే స్క్వాడ్ బృందాలను పెంచాలని కూడా పారామిలిటరీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై పేలుడు పరికరం ఉపయోగించి చేసిన బాంబు దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఆర్పీఎఫ్లో ఈ మేరకు చర్యలు చేపట్టారు. ‘కశ్మీర్లో మాకున్న ప్రతికూలతల నివారణకు చర్యలు చేపడుతున్నాం. బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, ఎక్కువ మొత్తంలో ఎమ్‌పీవీలను సేకరిస్తున్నాం. పెద్ద బస్సులకు భద్రత కష్టంగా ఉంటుంది. అందుకే 30 మంది మాత్రమే కూర్చోడానికి వీలుండే బస్సులను సమకూరుస్తున్నాం’అని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఆర్.భట్నాగర్ పేర్కొన్నారు. -
లష్కరే కమాండర్ నవీద్ జఠ్ హతం
శ్రీనగర్: కశ్మీర్ లోయలో భద్రతా సిబ్బంది, పౌరులపై పలు అమానుష దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా కమాండర్ నవీద్ జఠ్ (22) హతమయ్యాడు. కశ్మీరీ సీనియర్ పాత్రికేయుడు షుజాత్ బుఖారీ హత్య కేసులో అతడే ప్రధాన నిందితుడు. కశ్మీర్ బుద్గాం జిల్లాలోని ఓ గ్రామంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో జఠ్తో పాటు అతని సహచరుడుని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. గతంలో జఠ్ ఆరు సార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అతడు పోలీసు కస్టడీ నుంచే నాటకీయ పరిణామాల నడుమ పారిపోవడం సంచలనం సృష్టించింది. జఠ్ పాకిస్తానీయుడని, విధానపర లాంఛనాల ప్రకారం అతని మృతదేహాన్ని పాకిస్తాన్‌కు అప్పగిస్తామని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిందిలా.. మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో బుద్గాంలోని కుత్పోరా చాతర్ గామ్ అనే ప్రాంతంలో బుధవారం వేకువ జామునే భద్రతా సిబ్బంది తనిఖీల్ని ముమ్మరం చేశారు. జమ్మూ కశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ బృందం, ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు తొలుత భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. సూర్యోదయం అయ్యాక ఇద్దరు మిలిటెం ట్లను భద్రతా సిబ్బంది అంతమొందించారు. మృతుల్లో ఒకరిని నిషేధిత ఎల్ఈటీ కమాండర్ నవీద్ జఠ్గా గుర్తించారు. కసబ్‌కు సహాధ్యాయి.. పాక్‌లోని ముల్తాన్‌లో జన్మించిన నవీద్ జఠ్.. 26/11 ముంబై దాడిలో సజీవంగా చిక్కిన అజ్మల్ కసబ్‌కు మదరసాలో సహాధ్యాయి. వీరిద్దరు అక్కడే ఆయుధాల వాడకంలో శిక్షణ పొందారు. సముద్ర మార్గంలో వినియోగించే దిక్సూచి కంపాస్, జీపీఎస్, వైర్లెస్ సెట్లు, స్కైప్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన మొబైల్ ఫోన్లను ఆపరేట్ చేయడంలో జఠ్ నైపుణ్యం సంపాదించాడు. 2012, అక్టోబర్‌లో జఠ్ తన సహచరులతో కలసి కశ్మీర్ లోయలోకి చొరబడినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. లోయలో ఎన్నో ఉగ్రదాడులు, బ్యాంకు దొంగతనాల్లో అతని పాత్ర ఉందని భావిస్తున్నారు. -
కశ్మీర్లో ‘స్నైపర్’ కలకలం
శ్రీనగర్: కశ్మీర్ వ్యాలీలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు స్నైపర్ (దొంగచాటుగా) దాడులకు దిగడం భద్రతా దళాలను కలవరపరుస్తోంది. గత నెల నుంచి ఇప్పటివరకు ముగ్గురు భద్రతా సిబ్బంది స్నైపర్ దాడుల్లో మృతిచెందారు. దీంతో ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన వ్యూహాన్ని అవ లంబించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. నిఘా అధికారుల సమాచారం మేరకు జైషే ఉగ్రవాదులు రెండు వేర్వేరు గ్రూపులను నిర్వహిస్తున్నారని నిర్ధారణకు వచ్చారు. ఈ రెండు గ్రూపుల్లో ఒక్కో దాంట్లో ఇద్దరు చొప్పున స్నైపర్లు కశ్మీర్ లోయలో సెప్టెంబర్ మొదటివారంలో ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం స్థానికుల సహాయంతో పుల్వామాలో ఆశ్రయం పొందినట్లు భావిస్తున్నారు. లోయలో స్నైపర్ దాడులు చేసేందుకు వీరంతా పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా శిక్షణ పొం దారని, వీరి వద్ద అఫ్గానిస్తాన్‌లో యూఎస్ భద్రతా దళాలు ఉపయోగించే ఎమ్–4 కార్బైన్ ఆయుధాలున్నట్లు చెబుతున్నారు. -
హిజ్బుల్ టాప్ కమాండర్ వనీ హతం
శ్రీనగర్: నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు కశ్మీర్ లోయలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఆ సంస్థ టాప్ కమాండర్ మనాన్ బషీర్ వనీతో పాటు అతని అనుచరుడు హతమయ్యారు. 27 ఏళ్ల వనీ పీహెచ్‌డీని మధ్యలో మానేసి మిలిటెన్సీ బాటపట్టాడు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన మరో ఉగ్రవాదిని ఆషిక్ హుస్సేన్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాదులకు గౌరవసూచకంగా శుక్రవారం బంద్ పాటించాలని వేర్పాటువాద నాయకులు పిలుపునిచ్చారు. లొంగిపొమ్మన్నా వినలేదు.. హంద్వారాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం అందడంతో భద్రతా దళాలు వెళ్లి అక్కడ గురువారం వేకువజాము నుంచే సోదాలు నిర్వహించాయి. ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు తొలుత భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారని, దీనికి స్పందించిన భద్రతా దళాలు కూడా కాల్పులకు దిగినట్లు ఓ అధికారి తెలిపారు. ఇలా ఇరు పక్షాల మధ్య ఉదయం 11 గంటల వరకు కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. మిలిటెంట్లు లొంగిపోవాలని పోలీసులు పలుమార్లు మైకు ద్వారా ప్రకటించినా ఎలాంటి ప్రయోజనంలేకపోయిందని అన్నారు. ఎన్కౌంటర్ ముగిశాక ఆ ఇంటి నుంచి వనీ, హుస్సేన్‌ల మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. అంత్యక్రియలకు 10వేల మంది: లోలాబ్ ప్రాంతంలోని టేకిపురా సమీపంలో ఉన్న వనీ స్వగ్రామంలో జరిగిన అతని అంత్యక్రియలకు సుమారు 10 వేల మంది హాజరయ్యారు. మరోవైపు, బషీర్ వనీ మరణవార్త తెలియగానే శ్రీనగర్‌లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వారు. శాంతి, భద్రతల సమస్య తలెత్తకుండా ఉత్తరకశ్మీర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలను అధికారులు మూసేశారు. పుకార్లు, విద్వేష ప్రసంగాలు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించాలని వేర్పాటువాద నాయకులు పిలుపునిచ్చారు. స్వీయపాలన కోసం పోరాడుతున్న ఓ భావి మేధావిని కోల్పోయామని మితవాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ చెప్పారు. వనీ ఎన్‌కౌంటర్‌పై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా విచారం వ్యక్తం చేశారు. పీహెచ్డీ వద్దని మిలిటెన్సీలోకి 2016లో బుర్హాన్ వనీ హతమైన తరువాత మిలిటెన్సీ వైపు ఆకర్షితులైన విద్యావంతుల్లో బషీర్ వనీ ఒకడు. ముందునుంచి చదువుల్లో చురుకుగా ఉన్న బషీర్ వనీ ప్రతిష్టాత్మక సైనిక్ స్కూల్లో 11, 12వ తరగతులు పూర్తిచేశాడు. మెరిట్ విద్యార్థిగా పాఠశాల, కళాశాల రోజుల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. ఎన్సీసీ క్యాడెట్‌గా పంద్రాగస్టు, రిపబ్లిక్ డే కవాతుల్లో కూడా పాల్గొన్నాడు. 2010, 2016లో కశ్మీర్ లోయలో చెలరేగిన తీవ్ర నిరసనల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి వాడు, అలీగఢ్ యూనిర్సిటీలో పీహెచ్డీ చదువుతుండగా 2017 చివరన దక్షిణ కశ్మీర్‌కు చెందిన కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయంతో మిలిటెన్సీలో చేరాడు. ఈ ఏడాది జనవరి 3న అలీగఢ్ వర్సిటీని వదిలి వెళ్లాడు. అతని పేరు ఇప్పటికీ వర్సిటీ అధికారిక వెబ్సైట్లో కనిపిస్తోంది. భూగర్భశాస్త్రంలో పీహెచ్డీ చదువుతున్న వనీకి భోపాల్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘బెస్ట్ పేపర్ ప్రజెంటేషన్’ అవార్డు కూడా దక్కింది. -
కశ్మీర్ లోయ ‘స్థానికం’లో ఓటింగ్ 8.3 శాతమే
శ్రీనగర్: ప్రధాన రాజకీయ పార్టీల బహిష్కరణ పిలుపు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో మొదటి విడత స్థానిక ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ నమోదయింది. కశ్మీర్ లోయలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ సోమవారం మొదటి విడత 83 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 84,692 మంది ఓటర్లకు గాను 7,057 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉగ్రవాద ప్రభావిత కశ్మీర్ లోయలో కేవలం 8.3 శాతం ఓటింగ్ నమోదయింది. జమ్మూలోని కార్గిల్‌లో అత్యధికంగా 78 శాతం, లేహ్‌లో 52 శాతం పోలింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు. కుప్వారా, హంద్వారా మునిసిపల్ కమిటీ ఎన్నికల్లో వరుసగా 36.6 శాతం, 27.8శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
‘రెండేళ్లలో 360 మంది ఉగ్రవాదుల హతం’
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల జీవితకాలం తగ్గిపోయిందని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్ చెప్పారు. భద్రతా దళాలు చేపట్టిన వరస ఆపరేషన్లలో రెండేళ్ల వ్యవధిలో 360 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు. మిలిటెన్సీలో చేరుతున్న స్థానిక యువత సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయని, ఆయుధాలు చేతపట్టకుండా వారిని ఒప్పించేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనైనా పనిచేసేలా సీఆర్పీఎఫ్ సిబ్బందికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సహా ఇతర రక్షణ పరికరాలను అందిస్తున్నామని వెల్లడించారు. ‘ఈ ఏడాది 142 మంది, గతేడాది 220 మందిని హతమార్చాం. ఆర్మీ శిబిరాలపై ఆత్మాహుతి దాడులను తిప్పికొట్టాం’ అని అన్నారు. -
దేశంలోకి జైషే ఉగ్రవాదులు
శ్రీనగర్: కశ్మీర్లోకి 20 మందికిపైగా ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘావర్గాలు తెలిపాయి. వీరు కశ్మీర్‌లోయతో పాటు ఢిల్లీలో పెద్దఎత్తున విధ్వంసానికి పాల్పడే అవకాశముందని హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కశ్మీర్, ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు పాక్ నుంచి పీర్‌పంజాల్ పర్వతశ్రేణి ద్వారా కశ్మీర్లోకి చొరబడ్డారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వీరందరూ చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయి వచ్చారని వెల్లడించారు. ఉగ్రవాదుల వద్ద భారీఎత్తున పేలుడుపదార్థాలు, ఆయుధాలు ఉన్నాయన్నారు. ఇంత భారీస్థాయిలో ఉగ్రవాదులు చొరబడటం చాలా అరుదని వ్యాఖ్యానించారు. ఇస్లాం విస్తరణకు కీలకంగా నిలిచిన బద్ర్ యుద్ధం ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం శనివారం (రంజాన్ నెల 17వ రోజు) జరిగింది. అందుకే ఈరోజు వారు విధ్వంసం సృష్టించే అవకాశముంది. కీలకమైన సైనిక స్థావరాలతో పాటు ఇతర ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్లో గ్రెనేడ్ దాడి నిఘావర్గాలు హెచ్చరించిన కొన్నిగంటల్లోనే కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలో అధికార పీడీపీ నేత, త్రాల్ ఎమ్మెల్యే ముస్తాక్ షా ఇంటిపై గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. గ్రెనేడ్ ఇంట్లోని పచ్చిక ప్రాంతంలో పేలడంతో ఎవ్వరికీ గాయాలుకాలేదు. -
‘కశ్మీర్’పై యశ్వంత్ కీలక వ్యాఖ్యలు
-
‘కశ్మీర్’పై యశ్వంత్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా తప్పుపట్టారు. లోయలోని ప్రజలు భారత్‌కు దూరమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్వంత్ ఈ విషయాలు వెల్లడించారు. ముద్రా బ్యాంకు, జనధన్ యోజన వంటి కార్యక్రమాలు విజయవంతమైనట్లు ప్రభుత్వం చెబుతున్నదంతా ప్రచార ఆర్భాటమేనని అన్నారు. ‘జమ్మూ కశ్మీర్ ప్రజలను విస్మరించడం నన్ను బాధిస్తోంది. భావోద్వేగాల పరంగా వారిని మనం దూరం చేసుకున్నాం. వారు మనపై నమ్మకం కోల్పోయారని తెలుసుకోవాలంటే లోయలో పర్యటించాల’ని అన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి జరిపే చర్చల్లో ఏదో ఒక దశలో పాకిస్తాన్‌కు చోటు కల్పించడం తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీని తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం బాధించిందని సిన్హా తెలిపారు. మోదీని కలిసేందుకు 10 నెలల క్రితమే తాను సమయాన్ని కోరినా ఇప్పటివరకు ఇవ్వలేదని వెల్లడించారు. అయితే ఈ నెల 14న మోదీ, సిన్హా ఒకే వేదికపై కనిపించనున్నారు. పట్నా యూనివర్సిటీ శతవార్షికోత్సవాలకు వీరిద్దరూ హాజరుకానున్నారు. పూర్వ విద్యార్థిగా సిన్హాను ఆహ్వానించినట్టు వీసీ రాస్ బిహారి సింగ్ తెలిపారు. పట్నా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో సిన్హా గ్రాడ్యుయేషన్ చేశారు. -
కశ్మీర్ లోయలో కొనసాగుతున్న ఆంక్షలు
శ్రీనగర్: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబు దుజానా మరణించడంతో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా అధికారులు కశ్మీర్ లోయలో ఆంక్షలు విధించారు. వేర్పాటువాద నాయకులు బంద్‌కు పిలుపునిచ్చి నిరసన ప్రదర్శనలు దిగుతుండటంతో ఇవాళ (బుధవారం) విద్యాసంస్థలను మూసివేయడంతో, పాటు ఇంటర్నెట్ సేవల్ నిలిపివేశారు. పలు రైళ్లను తాత్కాలికంగా ఆపేశారు. నిన్న పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో లష్కర్-ఇ-తైబా డివిజినల్ కమాండర్ అబు దుజానా, అతని సహచరుడు ఆరిఫ్ లాలిహారి, ఓ పౌరుడు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో శ్రీనగర్‌లోని ఖాన్యార్, రైనావారి, నౌహట్టా, సఫా కాడల్, ఎంఆర్ గంజ్ పోలీస్స్టేషన్ల పరిధిలో కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే కశ్మీర్ యూనివర్సిటీ, ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలు బుధవారం జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశాయి. -
'ఇస్లాం కోసం రాళ్లు రువ్వండి'
శ్రీనగర్: ఇస్లాం కోసం కశ్మీరీ యువత పోలీసులు, బలగాలపై రాళ్లు రువ్వాలంటూ హిజ్బుల్ మొజాహిద్దీన్ మిలిటెంట్ జకీర్ రషీద్ భట్ పిలుపునిచ్చాడు. గత ఏడాది హిజ్బుల్ మిలిటెంట్ బుర్హాన్ వానీని బలగాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. బుర్హాన్ స్ధానంలోకి వచ్చిన రషీద్.. కశ్మీరీల నేషనిలిజం కోసం మిలిటెంట్ల ఉద్యమం ప్రారంభమైందనే వ్యాఖ్యలను కొట్టిపడేశాడు. సెక్యులారిటీ, ఫ్రీడమ్ లాంటి పదాలకు మిలిటెన్సీలో చోటే లేదని హురియత్ కశ్మీర్ యువతలో అలాంటి భ్రమలు కలిగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన రషీద్ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. మొత్తం 12 నిమిషాల పాటు మాట్లాడిన రషీద్.. ఇస్లాం పేరిట దాడులు చేయాలని అన్నాడు. కశ్మీర్లో త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకుండా బహిష్కరించాలని కోరాడు. రాళ్లు ఒకరికోసం రువ్వుతున్నట్లు భావించకుండా ఇస్లాం కోసం చేస్తున్నట్లు భావించాలని అన్నాడు. ఏదో ఒక రోజు కశ్మీర్ వ్యాలీలో ఇస్లాం జెండా రెపరెపలాడుతుందని వ్యాఖ్యానించాడు. -
జమ్ము-శ్రీనగర్ హైవేలో వన్ వే ట్రాఫిక్
శ్రీనగర్: జమ్మూ-శ్రీనగర్ హైవేలో వాహనాలను శనివారం వన్ వేలో మాత్రమే అనుమతిస్తున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. రోడ్డు మార్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, ఆర్మీ, పారామిలిటరీ బలగాలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు ప్రయాణించే వాహనాలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. కశ్మీర్ లోయకు సరుకుల రవాణాకు ఉపయోగించే ఏకైక మార్గం ఇదే కావడంతో రోడ్డు మూసివేత ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చలికాలంలో కొండచరియలు విరిగిపడటం, మంచు కారణంగా ఈ రోడ్డును అధికారులు మూసివేసి ఉంచారు. ఈ సమయంలో పర్యాటకులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
కశ్మీర్‌పై ప్రభావం చూపిస్తున్న పెద్ద నోట్ల రద్దు
-
కశ్మీర్ లో 250మంది ఉగ్రవాదులు!
న్యూఢిల్లీ: దాదాపు 250మందికి పైగా ఉగ్రవాదులు కశ్మీర్ వ్యాలీలో నక్కి ఉన్నట్లు భారత్ ప్రభుత్వానికి సమాచారం అందింది. నిర్దేశిత దాడులకు ప్రతీకారంగా ఆర్మీపై దాడులు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదులు కశ్మీర్ లోకి వచ్చినట్లు తెలిసింది. లష్కర్-ఈ-తోయిబా, జైష్-ఈ-మొహమ్మద్, హిజ్బుల్ మొజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు సర్జికల్ స్ట్రైక్స్ కు ముందే కశ్మీర్ లోకి ప్రవేశించినట్లు ఇంటిలిజెన్స్ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అప్పటినుంచి కశ్మీర్ లోనే వీరందరూ తలదాచుకుంటున్నారని పేర్కొంది. వీరందరికీ భారత ఆర్మీపై ప్రతీకారం తీర్చుకోవాలనే సూచనలు అందాయని ఇంటిలిజెన్స్ తెలిపింది. దీంతో జమ్మూకశ్మీర్ లోని భద్రతా దళాలు అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం కోరింది. ఉగ్రవాదులు ఆర్మీపై దాడికి దిగితే తిప్పికొట్టాలని చెప్పింది. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించినా అక్కడక్కడా భద్రతను ఏర్పాటుచేయడం కష్టతరంగా మారింది. దీంతో ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను కూడా చేపట్టారు. దాదాపు 100మందికి పైగా ఉగ్రవాదులు చొరబాటుకు ఎల్వోసీ ఆవల వేచి చూస్తున్నట్లు సమాచారం. గత నెల రోజుల్లో చొరబాటుకు ప్రయత్నించిన 40మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. బారాముల్ల, పాంపోర్, హంద్వారా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చొరబాటుకు టెర్రరిస్టులు యత్నించారు. -
భారత్-పాక్ సరిహద్దులో భూకంపం
కశ్మీర్ : భారత్-పాకిస్తాన్ సరిహద్దులో శనివారం భూకంపం సంభవించింది. భూప్రకంనలు తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు అయింది. పాకిస్తాన్‌లోని తూర్పు స్వాత్ వ్యాలీలో భూమి కంపించినట్లు యూఎఓస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అలాగే కశ్మీర్ వ్యాలీలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమాన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 1.34 గంటలకు భూకంపం వచ్చింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా పాక్ రాజధాని ఇస్లామాబాద్, ఖైబర్- పఖ్తుంఖ్వా (కేపీ) ప్రావిన్స్‌తో పాటు పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలు ప్రకంపనలు వచ్చినట్లు ప్రాంతీయ విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది. -
'కశ్మీర్ ను సైనికుల స్మశానంగా మారుస్తాం'
హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ను భారతీయ సైనికుల స్మశానంగా మారుస్తామని అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆల్ పార్టీ మీట్ కు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. ఓ ఇంగ్లీషు చానెల్ కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చిన సలాహుద్దీన్.. కశ్మీర్ పై చర్చలు వ్యర్ధమని అన్నారు. కేవలం మిలిటెన్సీ మాత్రమే కశ్మీర్ సమస్యకు సమాధానం ఇస్తుందని చెప్పారు. కశ్మీరీ లీడర్ షిప్, ప్రజలు, ముజాహిద్దీన్ లు కశ్మీర్ సమస్యకు శాంతియుత మార్గం లేదని తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ కేవలం వ్యాలీలో శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికేనని చెప్పారు. కశ్మీర్ వ్యాలీని మిలిటెంట్ల చేతుల్లోకి తీసుకోవాలని పిలుపునిచ్చారు. జులై 8న బుర్హాన్ వానీ కాల్చివేత తర్వాత మిలిటెన్సీ ఉద్యమం కొత్త మలుపు తిరిగిందని తెలిపారు. ఆర్మీని పెద్ద ఎత్తున మోహరించడం వల్ల మిలిటెన్సీ ఉద్యమం మరింత బలపడుతుందని అన్నారు. కశ్మీర్ సమస్యను ప్రభుత్వం గుర్తించకపోవడం వల్ల దీనిపై ప్రత్యేకంగా చర్చించాల్సిన పని లేదన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం కూడా తాను తుపాకీ పట్టడానికి ఒక కారణమని చెప్పారు. -
కశ్మీర్ లోయలో కర్ఫ్యూ ఎత్తివేత
-
కశ్మీర్లో రాజ్‌నాథ్ రెండురోజుల పర్యటన
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. రెండురోజుల పాటు పర్యటనలో ఆయనతో పాటు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి కూడా వెళ్లనున్నారు. కశ్మీర్ లోయలో తాజా పరిస్థితులుపై ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, సీనియర్ మంత్రులతో హోంమంత్రి సమీక్షించనున్నారు. కాగా హోంమంత్రి జమ్ములో పర్యటించడం ఈ నెలలో ఇది రెండోసారి. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దాలంటూ విపక్ష నేతలు...రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. సమస్య పరిష్కారానికి ప్రధాని ఈ సందర్భంగా విపక్ష నేతలకు హామీ ఇచ్చారు. అలాగే తాజా పరిస్థితులపై రాజ్‌నాథ్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా ముజాహిదీన్ కమాండర్, యువ వేర్పాటువాద నేత బుర్హాన్ వాని జులై 9న భద్రతాదళాల ఎన్కౌంటర్లో చనిపోయిననాటి నుంచి ప్రారంభమైన ఉద్రిక్తత నేటికి 46 రోజులు దాటింది. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో 68 మంది మరణించారు. వేలమంది గాయపడ్డారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల ఆంక్షలు కొనసాగుతున్నాయి. -
కశ్మీర్లో మళ్లీ కాల్పులు ఇద్దరు జవాన్ల మృతి
-
కశ్మీర్లో మళ్లీ కాల్పులు ఇద్దరు జవాన్ల మృతి
కశ్మీర్ లోయలో మళ్లీ తీవ్రవాదులు సోమవారం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రడాడుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల ఘటనతో కశ్మీర్ లోయలో ఉద్రిక్తంగా మారింది. శ్రీనగర్ నౌహట్టా డౌన్ టౌన్‌లోని చారిత్మ్రాక జమా మస్జిద్ వద్ద భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి జరపగా ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని, ఎదురు కాల్పులు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో కాల్పులు జరగడం ఆందోళనకు దారితీసింది. దీంతో అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. మిలిటెంట్లు ఓ భవనంలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.అయితే ఈ మిలిటెంట్లను గుర్తించాల్సి ఉంది. రెండు ఏకే తుపాకులు, ఎనిమిది వారపత్రికలను వీరు స్వాధీనం చేసుకున్నారు. సీఆర్పీఎఫ్ 49వ బెటాలియన్‌కు చెందిన ప్రమోద్ కుమార్ జవానుకు మెడ భాగంలో బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం అతన్ని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి భార్య, ఓ కూతురు(7) ఉన్నారు. అతని అంత్యక్రియలు మంగళవారం అతని స్వగ్రామమైన కంటారాలోని మిహిజంలో జరగనున్నాయి. -
కశ్మీర్ లో పాక్ జెండా ఎగరనుందా..
పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కశ్మీర్ వ్యాలీలో రంగం సిద్ధమవుతోందని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. మునుపెన్నడూ లేని విధంగా గ్రామీణ కశ్మీర్ లో పాక్ జెండాలు ఎగురవేయడానికి వేర్పాటువాదులు, స్థానిక మిలిటెంట్లు వ్యూహాలు రచించినట్లు సమాచారం. ఇంటిలిజెన్స్ ఇన్ పుట్స్ నేపథ్యంలో పాక్ డే సంబరాలను అడ్డుకునేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. ప్రజలను సంబరాల్లో పాల్గొనకుండా చేయడం వల్ల పౌరులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని కూడా ఇంటిలిజెన్స్ అధికారులను హెచ్చరించింది. సపోర్ నుంచి వాట్లాబ్, బందిపొర వరకూ దాదాపు 25 ప్రదేశాల్లో ఇనుప పైపులు, కర్రలతో జెండాను ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ తెలిపింది. సపోర్-దొవాబ్గాహ్-రఫియాబాద్ మార్గంలో 20 ప్రదేశాల్లో, పుల్వామా, సపోర్, అనంతనాగ్ లలో మరికొన్ని చోట్ల పాక్ జెండాలను ఎగురవేసేందుకు పక్కాప్రణాళిక రూపొందిందని తన రిపోర్టులో పేర్కొంది. రూరల్ కశ్మీర్ లో ప్రొ-పాకిస్తానీ ర్యాలీలు భారత్ కు తలనొప్పిగా మారాయి. శాంతియుతంగా నిరసనలు తెలిపే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆదేశాలు జారీ చేశారు. -
మీడియా స్వేచ్ఛకు గండం
సమస్యలు పరిష్కరించడం చేతగానప్పుడు, సంక్షోభం ముదురుతున్నప్పుడు పాలకులంతా ఏం చేస్తారో జమ్మూ-కశ్మీర్‌లోని పీడీపీ-బీజేపీ ప్రభుత్వం కూడా అదే చేసింది. బుర్హాన్ వానీ అనే మిలిటెంటును ఎన్కౌంటర్లో కాల్చిచంపిన తర్వాత కశ్మీర్ లోయలో నెలకొన్న ఉద్రిక్తతలను ఎలా అదుపు చేయాలో తెలియక అయోమయంలో కూరుకుపోయిన ప్రభుత్వం మీడియా గొంతు నొక్కే పనిలో బడింది. ఫలితంగా గత మూడు రోజులుగా ఆ రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉన్న జిల్లాల్లో పత్రికల ప్రచురణ ఆగిపోయింది. తమ నేరానికి సాక్ష్యం లేకుండా చేయా లన్న ఉద్దేశంతో కావొచ్చు... మీడియా కార్యాలయాలపై అర్ధరాత్రుళ్లు దాడులు చేసి ప్రచురణ, పంపిణీ నిలిపేయాలని నోటిమాటగా ఆదేశాలిచ్చారు. పాత్రికేయు లనూ, ఇతర సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. కొందరిని అరెస్టుచేశారు. ఫలితంగా అనేక ఉర్దూ, ఆంగ్ల దినపత్రికలు ఆగిపోయాయి. టర్కీలో ఇంచుమించు ఇదే సమయంలో అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించిన సైన్యం అచ్చం ఇదే తరహాలో మీడియా కార్యాలయాలపై దాడులకు దిగింది. అది కొన్ని గంటల్లోనే ముగిసిపోయింది. కానీ కశ్మీర్లో మూడురోజులుగా ఇది కొనసాగు తూనే ఉంది. ఇన్నిరోజులు గడిచినా నోరెత్తని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రకరకాల సాకులు వెదుకుతోంది. తొలుత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సలహాదారు అమితాబ్ మట్టూ పత్రికా సంపాదకుల దగ్గరకెళ్లి క్షమాపణలు చెప్పారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. ఆ తర్వాత ఆయన మాట మార్చారు. మీడియాపై దాడులకు కారణమైన సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ఫయాజ్ అహ్మద్‌ను బదిలీ చేస్తున్నామన్నారు. మీడియా నియంత్రణకు తాము ఎవరికీ ఆదేశాలి వ్వలేదని చెప్పారు. వాస్తవానికి దాడులు జరిగిన మర్నాడు రాష్ట్ర విద్యామంత్రి నయీమ్ అఖ్తర్ పత్రికా సంపాదకులను పిలిచి... కర్ఫ్యూకు సంబంధించి కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నందున పత్రికల పంపిణీ సాధ్యంకాదు గనుక మూడురోజులు నిలిపేయాలని అడిగారు. వీరి ప్రకటనలు సృష్టించిన అయోమ యానికి కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు చేసిన ప్రకటన తోడయింది. అసలు కశ్మీర్ లోయలో మీడియాపై నిషేధమే లేదని ఆయన చెబుతున్నారు. సీఎం మెహబూబా ఈ సంగతిని తనకు స్వయంగా చెప్పారని ఆయనంటున్నారు. ఇందులో ఎవరి మాట నిజం? జరిగింది తప్పని గుర్తించి ఉంటే అది స్థానిక అధి కారివల్ల జరిగిందో, తమవల్ల జరిగిందో వివరణనివ్వాలి. ఏ స్థాయిలో తప్పు జరి గినా బాధ్యత నెత్తినేసుకుని బహిరంగ క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు పునరావృతం కావని హామీ ఇవ్వాలి. అలాకాక పత్రికలు యధావిధిగా పనిచేసుకోవచ్చునని చెప్పడం వల్ల లేదా నిషేధమే లేదని బుకాయించడంవల్ల అంతా సమసిపోతుందని అనుకోవడం తెలివితక్కువతనం. సిగ్గుమాలిన పని చేయడానికి లేని భయం దాన్ని ఒప్పుకోవడానికి ఎందుకు? కశ్మీర్లో వానీ ఎన్కౌంటర్ ఉదంతం తర్వాత ఇంటర్నెట్ మాధ్యమంపై నిషేధం ఉంది. సెల్ ఫోన్ నెట్ వర్క్‌లు ఆగిపోయాయి. పత్రికల్ని కూడా ఆపేస్తే జరుగుతున్నదేమిటో ఎవరికీ తెలియకుండా పోతుందని, అప్పుడు పరిస్థితి దారి కొస్తుందని ఎలా అనుకున్నారో అంతుబట్టని విషయం. ఇందిరాగాంధీ పాలనలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు మీడియాపై ఈ మాదిరి ఆంక్షలే విధించారు. అందు వల్ల సమాచారం ఆగిందేమీ లేదు. సరిగదా దానికి అనేక ఊహాగానాలు, వదం తులు కూడా జతచేరాయి. మరోపక్క కింది స్థాయిలో జరుగుతున్నదేమిటో ప్రభు త్వానికి తెలియకుండా పోయింది. చివరకు ఎమర్జెన్సీ ఎత్తేశాక జరిగిన ఎన్నికల్లో ఇందిర ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. కశ్మీర్లో అవాంఛనీయమైనవి జరు గుతున్నాయనుకుంటే వాటిని నిలిపేయడం సబబవుతుంది. దిద్దుబాటు చర్యలు ప్రారంభించడం సబబవుతుంది. అంతేతప్ప అలా జరుగుతున్నవి బయటకు పొక్క నివ్వకూడదనుకోవడం సరైందేనా? ఎన్ని లోటుపాట్లున్నా మన దేశంలో మీడియా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంది. దాని పనికి అడ్డం రాకుండా ఉంటే వాస్తవ మైన, విశ్వసనీయమైన సమాచారం అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి చేరు తుంది. అందువల్ల మేలే తప్ప కీడు ఉండదు. లోటుపాట్లుంటే చక్కదిద్దుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. వదంతులపై ఆధారపడకుండా నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రజలకు వీలవుతుంది. మతిమాలిన నిషేధాలతో ఈ రెండింటికీ చేటు కలుగుతుంది. ఉద్రిక్త వాతావరణం అలుముకొని ఉన్న కశ్మీర్‌లాంటి ప్రాంతా లలో ఇందువల్ల పరిస్థితి మరింత వికటిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే అక్కడ ప్రజలకు వాస్తవ సమాచారం చేరడం ఎంత అవసరమో అర్ధమవుతుంది. జమ్మూ-కశ్మీర్ పాలకుల చేతగానితనం గత కొన్నిరోజులుగా తెలుస్తూనే ఉంది. వివిధ ఘటనల్లో 42మంది చనిపోగా, దాదాపు 2,000మంది గాయపడ్డారు. పరిస్థితి మెరగవుతున్న సూచనలు లేవు. కర్ఫ్యూ ఇంకా అమల్లోనే ఉంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మీడియా ద్వారా ప్రజలకు చేరువకావాల్సింది పోయి దాన్ని అడ్డుకోవాలని చూడటం ఆశ్చర్యకరం. నిజానికి ఇది ఎక్కడో కశ్మీర్లో నెలకొన్న సమస్య మాత్రమే కాదు. మొన్నటికి మొన్న కాపు నేత ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షకు కూర్చున్న సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాపై ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఆంక్షలకే దిగింది. సాక్షాత్తూ హోంమంత్రి చినరాజప్ప ముద్రగడ దీక్ష విరమించేంతవరకూ రాష్ట్రంలో ‘సాక్షి’ టీవీ ప్రసారా లను అడ్డుకుంటామని నిస్సిగ్గుగా ప్రకటించారు. తీరా ఉన్నత న్యాయస్థానంలో అందుకు సంబంధించిన కేసు విచారణకొచ్చే సమయానికి ప్రభుత్వం మాట మార్చింది. ప్రసారాల నిలిపివేతలో తమకు సంబంధం లేదని బుకాయించింది. అంతకుముందూ ఆ తర్వాతా అనేక అక్రమ కేసులు బనాయించింది. ఇప్పుడు కశ్మీర్లో కూడా తప్పును ఒక అధికారిపై నెట్టి పాలకులు తప్పుకో జూస్తున్నారు. కనీస విలువల్లేని ఇలాంటి పాలకులు మీడియాస్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు. ప్రజాస్వామ్యాన్నే అర్ధరహితం చేస్తున్నారు. ప్రజల నిరంతర అప్రమత్తతే ఈ వంచ కుల ఆట కట్టించగలదు. -
కశ్మీర్ ఘటనపై అమెరికా ఆందోళన
వాషింగ్టన్: కశ్మీర్లో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 30 మంది ప్రాణాలుకోల్పోవడం తమను బాధించిందని అమెరికా పరిపాలన అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఓ ప్రకటనలో చెప్పారు. అదే సమయంలో అది భారతదేశ వ్యక్తిగత వ్యవహారం అని కూడా స్పష్టం చేశారు. ఎలాంటి సమస్య అయినా ఓ శాంతిపూర్వకమైన పరిష్కారంతో ఎవరు ముందుకొచ్చినా తాము దానికి మద్దతు ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. ఇది ముఖ్యంగా భారతదేశ వ్యవహారం అయినందున ఇంతకంటే ఎలాంటి ప్రకటనలు చేయబోమని అందులో పేర్కొన్నారు. -
సీఎస్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీల లేఖ
కాశ్మీర్ లోయలో చిక్కుకున్న తెలంగాణాకు చెందిన సుమారు 1000 మంది అమర్నాథ్ యాత్రికులను సురక్షితంగా వెనక్కి రప్పించడంపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ రాజీవ్‌శర్మకు టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు లేఖ రాశారు. తక్షణమే కాశ్మీర్‌కు ప్రత్యేక టీంను పంపించి యాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. కాశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో మూడు రోజుల నుంచి యాత్రికులు ఇబ్బందులు పడుతోన్నారు. -
అట్టుడుకుతోన్న కశ్మీర్ లోయ..
-
అట్టుడుకుతోన్న కశ్మీర్ లోయ..
శ్రీనగర్: ఆందోళనకారుల రాళ్ల దాడి, పోలీసుల కాల్పులతో కశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ కు నిరసనగా లోయలోని కుల్గాం, అనంత్ నాగ్, బారాముల్లా జిల్లాల్లో జరుగుతోన్న ఆందోళనలు హింసాయుతంగా మారాయి. ఆందోళనకారులు పోలీస్, ఆర్మీ చెక్ పోస్టులపై రాళ్లు రువ్వారు. కుల్గాం లోని బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. నిరసనకారుల్ని అదుపుచేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించారు. రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు సహా 11 మంది గాయపడ్డారు. (చదవండి: ఈ టెర్రరిస్టు ఒక్కరిని కూడా చంపలేదు!) అనంతనాగ్ జిల్లాలోని బందిపోరా, ఖాజిగుండ్, లర్నోలో, కుల్గాం జిల్లాలోని మీర్ బజార్, దమ్హాల్ ప్రాంతాల్లో, అనంత్ నాగ్ జిల్లాలోని వార్పోరాలో ఆందోళనకారుల ఉధృతి తీవ్రంగా ఉందని, దక్షిణ కశ్మీర్ లోని ఓ మైనారిటీల నివాస సముదాయం వద్ద పహారా కాస్తున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని పోలీస్ అధికారులు చెప్పారు. (చదవండి: అమర్ నాథ్ యాత్ర నిలిపివేత) బుర్హాన్ ఎన్ కౌంటర్ నిరసనల వేడి శ్రీనగర్ ను కూడా రగిలిస్తుండటంతో అధికారులు అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అమర్ నాథ్ యాత్ర ఆసాంతం కశ్మీర్ లోయ గుండా సాగాల్సిఉండగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సీఆర్ఫీఎప్ డీజీ దుర్గా ప్రసాద్ తెలిపారు. మరోవైపు అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. -
నేడు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్
-
నేడు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్
శ్రీనగర్: కశ్మీర్ లోయలో శనివారం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కశ్మీర్ లోయలో పలు ప్రాంతాల్లో ఈ రోజు ఆంక్షలు విధించారు. శుక్రవారం భద్రత దళాలు అనంతనాగ్‌లో మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బర్హణ్ వనీతో పాటు మరో ఇద్దరిని కాల్చిచంపారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రలను కాపాడేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. సంఘ విద్రోహశక్తులు వదంతులు ప్రచారం చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేశారు. పుల్వామా జిల్లా వ్యాప్తంగా అధికారులు ఆంక్షలు విధించారు. అనంతనాగ్, షోపియన్, పుల్గాం, సొపొరె పట్టణాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. శ్రీనగర్‌లో ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు విధించారు. ఈ రోజు జరగాల్సిన స్కూలు బోర్డ్ పరీక్షలన్నింటినీ వాయిదా వేశారు. కశ్మీర్ ప్రాంతంలోని బారాముల్లా నుంచి జమ్ములోని బనిహాల్‌కు వెళ్లే రైలు సర్వీసులను కూడా రద్దు చేశారు. -
కాశ్మీర్లో వేర్పాటువాదుల తెగింపు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని వేర్పాటువాదులు భారత్‌కు వ్యతిరేకంగా మరో అంకానికి తెరతీశారు. ఇప్పటి వరకు నిరసనల, ఆందోళనలు,హార్తాళ్లు, పాక్ జెండా ప్రదర్శనల ద్వారా పాకిస్థాన్ అనుకూల చర్యలకు దిగి.. తాజాగా భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు అనుకూల ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏకంగా 21 కిలోమీటర్లపాటు మారథాన్ ప్రారంభించారు. హజ్రత్బల్ ప్రాంతంలోని కాశ్మీర్ యూనివర్సిటీ నుంచి ఈ ర్యాలీ ప్రారంభంకాగా మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీ సమాచారం ముందుగానే తెలుసుకున్న పోలీసులు భారీగా ఆ ప్రాంతంలో మోహరించగా వేర్పాటువాదులువారిపై రాళ్లు రువ్వారు. భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా బయలుదేరడం గమనార్హం. అయితే, పోలీసులు జోక్యం చేసుకున్నారని ఘర్షణ వాతావరణం నెలకొందని తెలిసి ఆయన ఆగిపోయారు. ఇక రాష్ట్రానికి చెందిన 15 మంది అథ్లెట్స్ కూడా పాల్గొనేందుకు తమ పేరును నమోదు చేసుకోవడం గమనార్హం. మొత్తం పదిహేను వేలమంది ఈ ర్యాలీలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. -
ఐఎస్ జెండాలతో ఎంత నష్టమో ఆలోచించారా?
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఐఎస్ఐఎస్ సంస్థ జెండాలు ఎగురవేయడంపై వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ సయ్యద్ అలీ షా గిలానీ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం శ్రీనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కశ్మీర్ లో జరుగుతున్న పోరాటంలో ఐఎస్ లాంటి సంస్థల ప్రమేయం అవసరమే లేదన్నారు. శుక్రవారం శ్రీనగర్‌లోని ఓ మసీదు వద్ద భారత్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో కొందరు యువకులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగురవేశారు. గడిచిన కొద్ది నెలలుగా కశ్మీర్ లోయలో పాక్ జెండాలు ఎగరడం పరిపాటిగా మారినప్పటికీ మొదటిసారి ఐఎస్ జెండాలు కనిపించడంతో సర్వత్రా ఆశ్చర్యాగ్రహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి చర్యలు కశ్మీర్ విముక్తి పోరాటాన్ని నీరుగార్చుతాయని, జెండాలు పట్టుకున్న యువకులు ఈ చర్య ఎంత నష్టం కలిగిస్తుందో ఒక్కసారి ఆలోచించి ఉండాల్సిందని గిలానీ అన్నారు. 'ఇప్పటికే మా అస్థిత్వపోరాటాన్ని ఉగ్రవాదంగా చూపుతోన్న భారత ప్రభుత్వం.. దీనిని అవకాశంగా మలుచుకుంటుందని, అంతర్జాతీయ వేదికలపై మమల్ని ఏకాకిగా నిలబెట్టే అవకాశం ఉంది' అని వ్యాఖ్యానించారు. -
పుట్టింట్లో ‘ప్రత్యేక’ పథకం
ఉన్న ఊరు... కన్నతల్లి అంటారు. పుట్టి పెరిగిన ఊరుతో ప్రతివారికీ ప్రగాఢమైన అనుబంధం ఉంటుంది. ఉపాధి కోసమో, ఉన్నత చదువుల నిమిత్తమో, మెరుగైన అవకాశాల కోసమో అక్కడినుంచి కదలక తప్పని స్థితి ఏర్పడినప్పుడు ఎవరికైనా కలిగే భావోద్వేగాలు మాటలకందనివి. కానీ తరతరాలనుంచి కశ్మీర్ లోయలో ఉంటున్న పండిట్లది అంతకన్నా దుర్భరమైన స్థితి. పాతికేళ్లనాడు ఉగ్రవాదం విరుచుకుపడినప్పుడు వారు చిగురుటాకుల్లా వణికారు. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దాడులు, హత్యలు, గృహదహనాలతో అట్టుడికిన ఆ భయంకర అధ్యాయం ఎందరినో వలసబాట పట్టించింది. ఆ సమయంలో దాదాపు నాలుగు లక్షలమంది పౌరులు జమ్మూ మొదలుకొని దేశంలోని చాలా ప్రాంతాలకు వలసపోయారు. వారిలో చాలామంది ఇప్పటికీ శరణార్థుల్లా బతుకులీడుస్తున్నారు. ఇలాంటి వారందరూ మళ్లీ స్వస్థలాలకు రావొచ్చని, తాము అందుకవసరమైన పథకాన్ని రూపొందిస్తామని ఎన్నికల సందర్భంలో బీజేపీ హామీ ఇచ్చినప్పుడు అందరూ హర్షించారు. వేర్పాటువాద హురియత్ వర్గాలు కూడా కశ్మీర్ పండిట్ల పునరాగమనం తమకు ఆమోదయోగ్యమని ప్రకటించాయి. కశ్మీర్లో ఏర్పడ్డ పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నదన్నప్పుడు దాదాపు అన్ని పార్టీలూ మెచ్చుకున్నాయి. తీరా మూడు రోజులనాడు ప్రధాని నరేంద్రమోదీని, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశాక జమ్మూ-కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రకటించిన పథకం అందరినీ ఆశ్చర్యపరిచింది. పండిట్లను సైతం విస్తుగొల్పింది. కశ్మీర్ పండిట్ల కోసం ప్రత్యేక నివాస ప్రాంతాలను ఏర్పాటు చేస్తామన్నదే సయీద్ ప్రకటన సారాంశం. ఇందు కోసం త్వరలోనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్టు కూడా ఆయన చెప్పారు. రెండున్నర దశాబ్దాలుగా కశ్మీర్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. అప్పుడప్పుడు ప్రశాంత పరిస్థితులు ఏర్పడినట్టు కనబడినా వెనువెంటనే అశాంతిలో చిక్కుకోవడం అక్కడ సర్వసాధారణమైంది. ఇలాంటి ఉద్రిక్త వాతావరణం సమసిపోయి ప్రశాంతత ఏర్పడాలని, కనీస ప్రజాస్వామిక వాతావరణం ఉండాలని కశ్మీర్ పౌరులందరూ కోరుకుంటున్నారు. లోయనుంచి ప్రాణభయంతో వెళ్లిపోయిన కశ్మీర్ పండిట్లు తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడితేనే నిజమైన అర్ధంలో ప్రశాంతత ఏర్పడినట్టవుతుంది. అందుకవసరమైన చర్యలు తీసుకోవడం మంచిదే. కశ్మీర్‌లోని మారుమూల గ్రామాల్లో సైతం ముస్లింలు, పండిట్లు తరతరాలుగా కలిసిమెలిసి ఉన్నారు. పర్వదినాల్లో అందరూ సమష్టిగా పాలుపంచుకున్నారు. అయిదారు వందల ఏళ్లక్రితం కశ్మీర్ ప్రాంతం అఫ్ఘాన్ల వశమైనప్పుడు ఆ ప్రాంతంలో ఇస్లాం ప్రవేశించింది. పండిట్లతోసహా వేర్వేరు కులాలవారంతా ఆ మతంలో చేరారు. ఇప్పటికీ చాలా మంది కశ్మీర్ నేతల పేర్లలో ఆ కుల మూలాలుంటాయి. కశ్మీర్ పండిట్లు స్వస్థలానికి వెళ్లడమంటే మళ్లీ తమ ఊళ్లకు తాము వెళ్లగలగడం. అంతేతప్ప శ్రీనగర్ శివార్లలో వందెకరాలో, రెండొందల ఎకరాలో భూమిని సేకరించి అందులో అపార్టుమెంట్లు లేదా నివాసగృహాలు నిర్మించడం కాదు. అలా చేయడ ం వారిని అవమానించడంతో సమానమవుతుంది. కశ్మీర్ పండిట్లు తిరిగి రావడాన్ని పాకిస్థాన్ ప్రోద్బలమున్న ఉగ్రవాద శక్తులు మినహా మిగిలినవారంతా స్వాగతిస్తున్నారు. అలాంటపుడు పండిట్లను ఇప్పుడున్న సమాజంలో భాగస్వాములను చేసి సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడటానికి దోహదం చేయాలి తప్ప సొంతగడ్డపైనే పరాయివారిగా, అంటరానివారిగా మార్చకూడదు. పండిట్లకు ప్రత్యేక జోన్‌ను ఏర్పాటుచేస్తే వారి భద్రత సులభమవుతుందన్న ఆలోచన కూడా సరికాదు. శ్రీనగర్వంటిచోట ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండే కంటోన్మెంట్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. భిన్న వర్గాలమధ్య సుహృద్భావ సంబంధాలు, పరస్పర విశ్వాసం సమాజాన్ని భద్రంగా, సురక్షితంగా ఉంచుతాయి తప్ప తుపాకుల నీడలో అంతా క్షేమంగా ఉంటుందనుకుంటే పొరపాటు. అయితే, పండిట్లను మళ్లీ వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో ఇబ్బందులు లేకపోలేదు. వారిలో చాలామంది తమ స్థిరాస్తులను అమ్ముకుని నిష్ర్కమించారు. ఆయా ప్రాంతాల్లో మళ్లీ వారి జీవికకు అవసరమైన పరిస్థితులు సృష్టించడం, ఆవాసం కల్పించడం సవాలే. కానీ ప్రభుత్వం తల్చుకుంటే అది అసాధ్యమేమీ కాదు. పండిట్లు వెనక్కొస్తే వారిని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తామని... వారి ఇళ్లు వారికి ఇవ్వడానికి సిద్ధమేనని గతంలోనే పలువురు కశ్మీర్ ముస్లింలు తెలిపారు. కశ్మీర్ పండిట్లకు ప్రత్యేక జోన్ ప్రతిపాదన బయటికొచ్చాక వెల్లువెత్తిన నిరసనలను చూసి పీడీపీ నేతలు గొంతు సవరించుకున్నారు. తమ ఉద్దేశం అది కాదని మాటమార్చారు. కానీ భూసేకరణ జరిపి పండిట్లకు ప్రత్యేక నివాస ప్రాంతం ఏర్పర్చడమంటే ఏమిటో వారు వివరించలేకపోతున్నారు. బీజేపీ నేతలు ఈ ప్రతిపాదన గురించి మాట్లాడకపోయినా విశ్వహిందూ పరిషత్ వంటి పరివార్ సంస్థలు ప్రత్యేక జోన్ ఏర్పాటులో తప్పేముందని ప్రశ్నిస్తున్నాయి. పండిట్లను తిరిగి లోయకు రప్పిస్తే అక్కడ తమ ఓటు బ్యాంకు ఏర్పడుతుందన్న ఉబలాటం బీజేపీకి ఉన్నట్టు కనబడుతోంది. ముస్లిం ఓట్లను పీడీపీ... హిందూ ఓట్లను తామూ పంచుకుంటే తమ కూటమికి భవిష్యత్తులో ఢోకా ఉండదని ఆ పార్టీ అనుకుంటున్నది. కానీ తాత్కాలిక ప్రయోజనాలను నెరవేర్చే ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలు అనూహ్యమైన సామాజిక అస్థిరతలను సృష్టిస్తాయి. ఇన్నేళ్లుగా మారణకాండ సాగిస్తున్నా ఉగ్రవాదులకు సాధ్యపడని హిందూ-ముస్లిం విభేదాలు ఇలాంటి నిర్ణయాలవల్ల పుట్టి విస్తరిస్తాయి. కశ్మీర్ చరిత్ర, సంస్కృతి తెలిసున్నవారు... ప్రత్యేకించి ఆ గడ్డపై పండిట్ల సాధకబాధకాలు అవగాహన చేసుకున్నవారు ఇలాంటి దుస్సాహసానికి దిగరు. -
కాశ్మీర్లో జీలం ఉగ్రరూపం
-
కాశ్మీర్లో వర్షం.. రోడ్లపైనే వరద బాధితులు
శ్రీనగర్: భారీ వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం కాశ్మీర్ లోయలో శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడింది. నిరాశ్రయులైన వరద బాధితులు రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 60 ఏళ్లుగా ఎన్నడూ చూడనివిధంగా కాశ్మీర్‌ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఐదు రోజులుగా వర్షం తెరిపినివ్వడంతో సైన్యం వరద బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగింది. ఈ రోజు వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
ఎన్కౌంటర్లో తీవ్రవాది హతం
జమ్మూ: తూర్పు కాశ్మీర్ హంద్వారా బెల్ట్‌లో ఆర్మీ జవాన్లకు, తీవ్రవాదులకు మంగళవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆ ఎన్కౌంటర్లో ఓ తీవ్రవాది మరణించాడని రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు. గస్తీ తిరుగుతున్న జావాన్లపైకి తీవ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని... దాంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు తీవ్రవాదులపైకి ఎదురు కాల్పులకు దిగారు. దీంతో ఓ విదేశీ తీవ్రవాది హతమైయ్యాడని ఉన్నతాధికారి తెలిపారు. -
కాశ్మీర్లో ఇద్దరు పోలీసుల కాల్చివేత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ వేర్పాటు వాద గెరిల్లాలు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆదివారం కాశ్మీర్ లోయలోని పుల్వామా జిల్లాలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు యవర్ మసూదిన్ ఇంటివద్ద భద్రత సిబ్బందిపై కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మరణించారు. వారిని మసూదిన్కు భద్రతగా నియమించారు. ఉగ్రవాద వేర్పాటు వాదులు దాడి చేసిన అనంతరం భద్రత సిబ్బంది వారి కోసం గాలిస్తున్నారు. శ్రీనగర్ 20 కిలోమీటర్ల దూరంలో గల ఖ్రేవ్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. -
కాశ్మీర్‌లోయలో బంద్ ప్రశాంతం
హురియత్ కాన్ఫరేన్స్ పిలుపు మేరకు కాశ్మీర్ వ్యాలీలో శనివారం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదని తెలిపారు. వ్యాలీలో పలు పట్టణాల్లో ముందస్తుగా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా భద్రత సిబ్బందిని మోహరించామని తెలిపారు. దుకాణాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మూసివేశారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వేర్పాటువాదులు గిలానీ, ఉమర్ ఫరూఖ్, జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసీన్ మాలిక్‌లను పోలీసులు గృహ నిర్బంధించారు. షోపియాన్ పట్టణంలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించడం పట్ల శుక్రవారం వేర్పాటువాదులు ఆ పట్టణంలో ర్యాలీ నిర్వహించాలని భావించారు. అందులోభాగంగా వారిని భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకుని గృహ నిర్భంధంలో ఉంచింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ వ్యాలీలో శనివారం బంద్‌కు హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సయ్యద్ అలీ షా జిలానీ పిలుపు నిచ్చారు. షోపియాన్ పట్టణంలో విధించిన కర్ఫ్యూ 9వ రోజుకు చేరుకుంది. -
కాశ్మీర్ వ్యాలీలో స్తంభించిన జనజీవనం
కిష్ట్వార్ పట్టణంలో ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో శనివారం కాశ్మీర్ వ్యాలీలో హురియత్ కాన్ఫరెన్స్ బంద్‌కు పిలుపునిచ్చింది. దాంతో ఆ ప్రాంతంలో జనజీవనం దాదాపుగా స్తంభించింది. దుకాణాలు, వ్యాపార సంస్థలు అన్ని మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయలు, బ్యాంక్ కార్యకలాపాలు అంత సజావుగా సాగడం లేదు. అలాగే వేసవి కారణంగా ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కిష్ట్వార్ పట్టణంలో పరిస్థితులను సమీక్షించిన తరువాత తమ తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని హురియత్ కాన్ఫరెన్స్ నేతలు వెల్లడించారు. కిష్ట్వార్ పట్టణంలో రెండు మతాలకు చెందిన వర్గాల మధ్య శుక్రవారం జరిగిన అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య శనివారానికి రెండుకు చేరింది. ఈ ఘర్షణలో మరో 20 మంది గాయపడి వివిధ ఆసుపత్రల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.