శ్రీనగర్: భారీ వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్లో మళ్లీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం కాశ్మీర్ లోయలో శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడింది. నిరాశ్రయులైన వరద బాధితులు రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
60 ఏళ్లుగా ఎన్నడూ చూడనివిధంగా కాశ్మీర్ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఐదు రోజులుగా వర్షం తెరిపినివ్వడంతో సైన్యం వరద బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగింది. ఈ రోజు వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కాశ్మీర్లో వర్షం.. రోడ్లపైనే వరద బాధితులు
Published Sun, Sep 14 2014 9:45 AM | Last Updated on Wed, Aug 1 2018 3:52 PM
Advertisement
Advertisement