కశ్మీర్లో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 30 మంది ప్రాణాలుకోల్పోవడం తమను బాధించిందని అమెరికా పరిపాలన అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో చెప్పారు.
వాషింగ్టన్: కశ్మీర్లో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 30 మంది ప్రాణాలుకోల్పోవడం తమను బాధించిందని అమెరికా పరిపాలన అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఓ ప్రకటనలో చెప్పారు. అదే సమయంలో అది భారతదేశ వ్యక్తిగత వ్యవహారం అని కూడా స్పష్టం చేశారు.
ఎలాంటి సమస్య అయినా ఓ శాంతిపూర్వకమైన పరిష్కారంతో ఎవరు ముందుకొచ్చినా తాము దానికి మద్దతు ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. ఇది ముఖ్యంగా భారతదేశ వ్యవహారం అయినందున ఇంతకంటే ఎలాంటి ప్రకటనలు చేయబోమని అందులో పేర్కొన్నారు.