కశ్మీర్‌లో విపరీతమైన మంచు.. రహదారుల మూసివేత | Watch: Higher Reaches Of Kashmir Receive Fresh Snowfall, Rains Drench Plains Video Goes Viral - Sakshi
Sakshi News home page

Jammu And Kashmir First Snowfall: కశ్మీర్‌లో విపరీతమైన మంచు.. రహదారుల మూసివేత

Published Fri, Nov 10 2023 11:11 AM | Last Updated on Fri, Nov 10 2023 11:30 AM

Video: Higher Reaches Of Kashmir Receive Fresh Snowfall - Sakshi

జమ్మూకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. హిమపాతంతో కశ్మీర్‌లోని అనేక ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. కశ్మీర్‌ లోయలోని ఎత్తైన ప్రాంతాలైన పిర్ కీ గలి, జోజిలా, గుల్‌మార్గ్‌లలో శుక్రవారం తొలి హిమపాతం నమోదైందికొండలపై నుంచి భారీగా మంచు గడ్డలు కిందకు పడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

మంచు కారణంగా నిలిచిపోయిన కొన్ని వాహనాలను అధికారులు తొలగించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వాతావరణ కార్యాలయం ప్రకారం, రాత్రిపూట భారీగా మంచు కురిసే అవకాశం ఉంది. కాబట్టి హైవే మూసి ఉంటుందని వారు తెలిపారు. హిమపాతం ముగిసిన తర్వాత హైవేను క్లియర్ చేసే పని ప్రారంభమవుతుందని వారు తెలిపారు.

చాలా ప్రాంతాల్లో రోడ్లపై విపరీతమైన మంచు పేరుకుపోవడంతో అధికారులు రహదారులను మూసేశారు. కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ప్రత్యామ్నాయ లింక్ అయిన మొఘల్ రోడ్‌ను హిమపాతం కారణంగా గురువారం వాహనాల రాకపోకలకు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. పోషణ- పీర్‌ కి గలి మధ్య మంచు కురుస్తుండటంతో రహదారి మూసుకుపోయిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు జమ్మూలోని పూంచ్, రాజౌరి జిల్లాలను దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాతో కలుపుతుంది.

రహదారులపై మంచు పేరుకుపోవడంతో దాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపై పలు వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి సమయాల్లో భారీగా మంచు కురిసే అకాశం ఉందని స్థానిక వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement