
శ్రీనగర్: మంచువర్షంతో హిమాలయ రాష్ట్రాలు శ్వేతవర్ణం అద్దుకున్నాయి. జమ్మూకశ్మీర్‌తోపాటు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో గత నాలుగురోజులుగా భారీగా హిమపాతం నమోదవుతోంది. శ్రీనగర్‌లోని అనేక ప్రాంతాలను తొలకరి మంచు పలకరించింది. రాజౌరీ, సోన్‌మార్గ్‌లో రోడ్లపై అడుగులమేర మంచు పేరుకుపోవడంతో.. అధికారులు క్లీనింగ్ చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌తోపాటు గంగోత్రి, యమునోత్రి క్షేత్రాల్లోనూ భారీగా మంచు కురుస్తోంది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు, మనాలీ మంచువర్షంతో తడిసిముద్దవుతున్నాయి. ప్రఖ్యాత కల్ఫ పర్వతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. మంచు పెరగడంతో హిమాచల్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. టూరిస్టులు మంచులో కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక భారీ మంచువర్షంతో జమ్మూకశ్మీర్‌లో జనజీవితం స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు పట్టపగలే కొవ్వొత్తుల మధ్య పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment