
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi new CM) కొత్త సీఎం ఎవరు? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ ఉత్కంఠతకు తెరపడేలా బినోయ్ సామాజిక వర్గానికి (Baniya community) చెందినే నేతకే బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
పలు రాజకీయ, సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉన్న బినోయ్ సామాజికి వర్గ కీలక మహిళా నేత, షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తాకే (Rekha Gupta) అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత బీజేపీలో ఎవరూ మహిళా సీఎం లేకపోవటం ఆమెకు మరింత కలిసివచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవాళ రాత్రి ఢిల్లీ బీజేపీ శాసన సభాపక్షం తమ నేతను ఎంపిక చేసుకోనుంది. రాత్రి 7 గంటలకు సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించనుంది. ఈ తరుణంలో ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీతో పాటు మాజీ సీఎం, కేజ్రీవాల్‌ను ఓడించిన బనియా సామాజిక వర్గం నేతకే సీఎం పట్టం కట్టే యోచనలో కమలం అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం.
ఢిల్లీ రాజకీయాల్లో బనియా సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో పాటు,మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించేందుకు బనియా వర్గం ఓట్లు దోహదం చేసినట్లు హస్తిన రాజకీయాల్లో తలపండిన నేతలు చెబుతున్న మాట. ఆ సామాజిక వర్గానికి చెందిన వారు వాణిజ్యం, వ్యాపారం,రాజకీయాల్లో ప్రముఖ పాత్రపోషిస్తున్నారు. కేజ్రీవాల్ సైతం బనియా సామాజిక వర్గం. కాబట్టే ఆ సామాజిక వర్గానికి చెందిన నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
బినోయ్ సామాజిక వర్గం నుంచి విజేందర్ గుప్తా, రేఖాగుప్తా, జితేందర్ మహాజన్ ఈ ముగ్గురు నేతలు సీఎం రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో బినోయ్ సామాజిక వర్గంలో కీలక మహిళా నేత రేఖా గుప్తా వైపు బీజేపీ పెద్దలు మొగ్గు చూపుతున్నారు. షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బనియా సామాజిక వర్గానికి చెందిన రేఖా గుప్తా ఆర్‌ఎస్‌ఎస్‌తో మంచి అనుబంధం ఉంది. దీనికి తోడు ఢిల్లీ మేయర్‌గా పనిచేశారు. అదే సమయంలో ప్రస్తుత బీజేపీలో ఎవరూ మహిళా సీఎం లేకపోవటం మరింత కలిసివస్తోంది.
రేఖా గుప్తాతో పాటు బీజేపీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేసిన విజేందర్ గుప్తా సైతం ఉన్నారు.ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యం ఉన్నప్పటికీ 2015, 2020 రెండుసార్లూ విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రోహిణి స్థానం నుంచి గెలుపొందారు. అంతేకాదు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు.
జితేంద్ర మహాజన్.. ఆర్ఎస్ఎస్‌తో బలమైన సంబంధాలు ఉన్న బనియా సామాజిక వర్గానికి చెందిన జితేంద్ర మహాజన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. రోహ్‌తాస్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడోసారి ఆయన విజయం సాధించారు. జాతీయ నాయకులతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.
మరి ఈ ముగ్గురిలో సీఎం ఎవరు? అనేది అధికారిక ప్రకటన ఈ రోజు రాత్రి 7గంటల తరువాత వెలువడనుంది. ఢిల్లీ సీఎం ఎవరు? అని తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment