ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు | Delhi BJP Started Preparations for Assembly Elections | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు

Published Sat, Jul 6 2024 9:24 AM | Last Updated on Sat, Jul 6 2024 12:49 PM

Delhi BJP Started Preparations for Assembly Elections

త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఆదివారం జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశంలో  ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు, అధికారులు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సమావేశంలో బీజేపీ నేతలు అభినందనలు తెలియజేయనున్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ చర్యలను ఖండిస్తూ, పలు రాజకీయ తీర్మానాలను కూడా ఆమోదించనున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా 2025 మొదట్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement