న్యూఢిల్లీ:వణికించే చలిలో ఢిల్లీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నేతల మధ్య మాటల తూటాలు పేలడం ఇప్పటి నుంచే మొదలైంది.
ముఖ్యంగా అధికార ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్),ఢిల్లీ బీజేపీ అగ్ర నేతల మధ్య వాగ్యుద్ధం సార్టైంది. తాజాగా బీజేపీ ‘మార్పు కోసం’ అని ఇచ్చిన నినాదంపై ఆప్ అధినేత,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
తమ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, ఉచిత నీరు లాంటి సంక్షేమ పథకాలను రద్దు చేయడమే బీజేపీ తెచ్చే మార్పని కౌంటర్ ఇచ్చారు. కేజ్రీవాల్ కామెంట్స్‌పై ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవ స్పందించారు.
ఎన్నికల వేళ తమ నినాదం జనాల్లోకి బాగా వెళ్లడాన్ని ఆప్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కేజ్రీవాల్ సహా ఆప్ అగ్రనేతలంతా పీకల్లోతు అవినీతిలోకి కూరుకుపోయారని ఆరోపించారు. కాగా, వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆప్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.
ఇదీ చదవండి: టార్గెట్ కాంగ్రెస్..మమత రాజకీయం ఇదేనా
Comments
Please login to add a commentAdd a comment