
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల జీవితకాలం తగ్గిపోయిందని సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్ చెప్పారు. భద్రతా దళాలు చేపట్టిన వరస ఆపరేషన్లలో రెండేళ్ల వ్యవధిలో 360 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు. మిలిటెన్సీలో చేరుతున్న స్థానిక యువత సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయని, ఆయుధాలు చేతపట్టకుండా వారిని ఒప్పించేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనైనా పనిచేసేలా సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సహా ఇతర రక్షణ పరికరాలను అందిస్తున్నామని వెల్లడించారు. ‘ఈ ఏడాది 142 మంది, గతేడాది 220 మందిని హతమార్చాం. ఆర్మీ శిబిరాలపై ఆత్మాహుతి దాడులను తిప్పికొట్టాం’ అని అన్నారు.