bulletproof vehicle
-
మొరాయిహించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. మరో వాహనం ఎక్కి వినుకొండకు ప్రయాణం
-
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తెల్ల బుల్లెట్ ప్రూఫ్ కారు
అబిడ్స్: తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తోందని, నూతన వాహనాన్ని సమకూర్చాలని గత కొద్దిరోజులుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చింది. ఈ మేరకు సోమవారం పోలీసు శాఖ అధికారులు నూతనంగా కేటాయించిన తెలుపురంగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయన నివాసానికి తరలించారు. కాగా ఈ విషయమై ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సంప్రదించగా తాను శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉన్నట్లు తెలిపారు. తెలుపు రంగు, 2017 మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తన ఇంటి వద్ద ఉంచినట్లు తెలిపారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడం సంతోషకరమని, ప్రస్తుతం కేటాయించిన వాహనం ఏ కండీషన్లో ఉందో చూడాల్సి ఉందన్నారు. -
సీఆర్పీఎఫ్ ఇక మరింత బలోపేతం
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో జవాన్ల భద్రతా చర్యల్లో భాగంగా కీలక ముందడుగు పడింది. వారి భద్రత కోసం మందుపాతర రక్షిత వాహనాలను (ఎమ్‌పీవీ), 30 సీటర్ బస్సులను సమకూర్చనున్నట్లు భద్రతా దళాధికారి ఒకరు తెలిపారు. అలాగే కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన, శాంతి భద్రతల విధులను నిర్వహిస్తున్న 65 బెటాలియన్లలో బాంబులను గుర్తించే, నిర్వీర్యం చేసే స్క్వాడ్ బృందాలను పెంచాలని కూడా పారామిలిటరీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై పేలుడు పరికరం ఉపయోగించి చేసిన బాంబు దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఆర్పీఎఫ్లో ఈ మేరకు చర్యలు చేపట్టారు. ‘కశ్మీర్లో మాకున్న ప్రతికూలతల నివారణకు చర్యలు చేపడుతున్నాం. బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, ఎక్కువ మొత్తంలో ఎమ్‌పీవీలను సేకరిస్తున్నాం. పెద్ద బస్సులకు భద్రత కష్టంగా ఉంటుంది. అందుకే 30 మంది మాత్రమే కూర్చోడానికి వీలుండే బస్సులను సమకూరుస్తున్నాం’అని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఆర్.భట్నాగర్ పేర్కొన్నారు. -
సీఎంతో సహా అందరి నుంచి వసూలు చేసున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న 90 రోజుల పాటు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు వినియోగించిన 33 మంది ప్రజాప్రతినిధుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలైన కిషన్‌రెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అప్పటి సీఎల్పీ నేత జానారెడ్డి సహా అందరి నుంచి ఇం టెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) విభాగం నోటీసుల ద్వారా చార్జీలు చెల్లించాలని ఆయా పార్టీల కార్యాలయాలకు లేఖలు రాసిం దని తెలిపారు. ఈ మేరకు సంబంధిత వాహనాలకు చార్జీలతో పాటు, డ్రైవర్ బత్తా వసూలుచేయాలని ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలున్న ట్లు డీజీపీ తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడిన వారిలో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి రూ.7.7 లక్షలు, తక్కువగా ఉపయోగించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.53 వేలు చెల్లించాల్సి ఉంది. -
పోలీస్ అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలువురు ఐపీఎస్ అధికారులకు పోలీస్ శాఖ కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సమకూర్చింది. ఇందులో భాగంగా డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు అదనపు డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్, డీఐజీలు ప్రభాకర్‌రావు, రాజేశ్‌కుమార్, ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్ భగవత్, సత్యనారాయణ, రవీందర్, భూపాలపల్లి, భద్రాచలం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లా ఎస్పీలకు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చూనర్ వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేదు.. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కొన్ని టీవీ చానళ్లలో వచ్చిన వార్తలను వారు ఖండించారు. ఏపీ నుంచి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వచ్చే సమయంలో మాత్రం రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున ఎస్కార్ట్ ఇస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్‌కు ఏపీ ప్రభుత్వమే వాహనం సమకూర్చాల్సి ఉంటుందని, తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. -
‘రెండేళ్లలో 360 మంది ఉగ్రవాదుల హతం’
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల జీవితకాలం తగ్గిపోయిందని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్ చెప్పారు. భద్రతా దళాలు చేపట్టిన వరస ఆపరేషన్లలో రెండేళ్ల వ్యవధిలో 360 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు. మిలిటెన్సీలో చేరుతున్న స్థానిక యువత సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయని, ఆయుధాలు చేతపట్టకుండా వారిని ఒప్పించేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనైనా పనిచేసేలా సీఆర్పీఎఫ్ సిబ్బందికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సహా ఇతర రక్షణ పరికరాలను అందిస్తున్నామని వెల్లడించారు. ‘ఈ ఏడాది 142 మంది, గతేడాది 220 మందిని హతమార్చాం. ఆర్మీ శిబిరాలపై ఆత్మాహుతి దాడులను తిప్పికొట్టాం’ అని అన్నారు. -
డీసీఎం శ్రీరామ్‌కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ తయారీ లైసెన్స్
న్యూఢిల్లీ: డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ తాజాగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, మానవ రహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), ఇతర ప్రొడక్టుల తయారీకి సంబంధించి కేంద్రం నుంచి లైసెన్స్ పొందింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) నేతృత్వంలోని ఆర్మ్స్ లైసెన్స్ అథారిటీ నుంచి ఇండస్ట్రియల్ లైసెన్స్ లభించిందని సంస్థ రెగ్యులేటరీకి తెలిపింది. వార్షికంగా వివిధ విభాగాల్లో ఉపయోగించే సాయుధ వాహనాలు, ప్రత్యేక వాహనాలు సహా 3,000 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్‌ను తయారు చేస్తామని పేర్కొంది. అలాగే గ్రౌండ్ డేటా టర్మినల్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్స్, లాంచర్లతోపాటు 500 యూఏవీలను కూడా రూపొందిస్తామని తెలిపింది. కాగా కంపెనీ చెక్కర, ఇండస్ట్రియల్ ఫైబర్, రసాయనాలు వంటి విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
కేసీఆర్ కాన్వాయ్ లోకి కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ లోకి కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం వచ్చి చేరింది. కేసీఆర్ జిల్లాల పర్యటనలో భాగంగా అదనపు భద్రతకు రక్షక్ ప్లస్ అనే అత్యాధునికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ సచివాలయంలో పరిశీలించారు.