హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ లోకి కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం వచ్చి చేరింది. కేసీఆర్ జిల్లాల పర్యటనలో భాగంగా అదనపు భద్రతకు రక్షక్ ప్లస్ అనే అత్యాధునికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ సచివాలయంలో పరిశీలించారు.