ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తెల్ల బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు  | Hyderabad: Suspended BJP MLA Raja Singh Gets New Bulletproof Car | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తెల్ల బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు 

Published Tue, Feb 28 2023 3:16 AM | Last Updated on Tue, Feb 28 2023 2:57 PM

Hyderabad: Suspended BJP MLA Raja Singh Gets New Bulletproof Car - Sakshi

అబిడ్స్‌: తన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం తరచూ మొరాయిస్తోందని, నూతన వాహనాన్ని సమకూర్చాలని గత కొద్దిరోజులుగా గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేస్తున్న విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. ఆయన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని మార్చింది. ఈ మేరకు సోమవారం పోలీసు శాఖ అధికారులు నూతనంగా కేటాయించిన తెలుపురంగు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని ఆయన నివాసానికి తరలించారు.

కాగా ఈ విషయమై ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సంప్రదించగా తాను శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉన్నట్లు తెలిపారు. తెలుపు రంగు, 2017 మోడల్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని తన ఇంటి వద్ద ఉంచినట్లు తెలిపారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడం సంతోషకరమని, ప్రస్తుతం కేటాయించిన వాహనం ఏ కండీషన్‌లో ఉందో చూడాల్సి ఉందన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement