
న్యూఢిల్లీ: డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ తాజాగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, మానవ రహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), ఇతర ప్రొడక్టుల తయారీకి సంబంధించి కేంద్రం నుంచి లైసెన్స్ పొందింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) నేతృత్వంలోని ఆర్మ్స్ లైసెన్స్ అథారిటీ నుంచి ఇండస్ట్రియల్ లైసెన్స్ లభించిందని సంస్థ రెగ్యులేటరీకి తెలిపింది.
వార్షికంగా వివిధ విభాగాల్లో ఉపయోగించే సాయుధ వాహనాలు, ప్రత్యేక వాహనాలు సహా 3,000 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్‌ను తయారు చేస్తామని పేర్కొంది. అలాగే గ్రౌండ్ డేటా టర్మినల్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్స్, లాంచర్లతోపాటు 500 యూఏవీలను కూడా రూపొందిస్తామని తెలిపింది. కాగా కంపెనీ చెక్కర, ఇండస్ట్రియల్ ఫైబర్, రసాయనాలు వంటి విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment