శ్రీనగర్: కశ్మీర్‌లో ఉగ్ర దాడికి కుట్ర పన్నిన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. శ్రీనగర్ శివారులో శనివారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు పోలీసులు గాయపడ్డారు. శ్రీనగర్ సమీపంలోని చట్టాబల్‌లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు గస్తీని పెంచాయి. కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ దళాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హతమైన ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన వారేనని కశ్మీర్ రేంజ్ ఐజీ ప్రకాశ్ పాని చెప్పారు.
ఘటనా స్థలం నంచి మూడు ఏకే రైఫిళ్లు, ఐదు తుపాకీ మేగజీన్లు, మందుగుండు సామగ్రి, వైద్య పరీక్షల కిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఒకరిని స్థానికుడు ఫయాజ్ అహ్మద్ హమ్మల్‌గా గుర్తించారు. మరోవైపు, కశ్మీర్‌లోని బందీపురా జిల్లాలో అనుమానిత లష్కరే ఉగ్రవాదులు ఇద్దరు పౌరులను అపహరించి కాల్చి చంపారు. వారి మృతదేహాలను శనివారం మధ్యాహ్నం స్థానికులు ఓ మసీదు సమీపంలో గుర్తించారు. బాధితుల ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment