Rajiv Roy Bhatnagar
-
‘రెండేళ్లలో 360 మంది ఉగ్రవాదుల హతం’
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల జీవితకాలం తగ్గిపోయిందని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్ చెప్పారు. భద్రతా దళాలు చేపట్టిన వరస ఆపరేషన్లలో రెండేళ్ల వ్యవధిలో 360 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు. మిలిటెన్సీలో చేరుతున్న స్థానిక యువత సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయని, ఆయుధాలు చేతపట్టకుండా వారిని ఒప్పించేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనైనా పనిచేసేలా సీఆర్పీఎఫ్ సిబ్బందికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సహా ఇతర రక్షణ పరికరాలను అందిస్తున్నామని వెల్లడించారు. ‘ఈ ఏడాది 142 మంది, గతేడాది 220 మందిని హతమార్చాం. ఆర్మీ శిబిరాలపై ఆత్మాహుతి దాడులను తిప్పికొట్టాం’ అని అన్నారు. -
సీఆర్పీఎఫ్ డీజీగా రాజీవ్ భట్నాగర్
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మావోల మెరుపుదాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలైన నేపథ్యంలో సీఆర్పీఎఫ్కు కేంద్రప్రభుత్వం నూతన సారథిని ఎంపికచేసింది. ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1983 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రాయ్ భట్నాగర్ను సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. ఫిబ్రవరి 28న కె.దుర్గాప్రసాద్ డీజీగా పదవీవిరమణ చేశాక ఆ పదవిలో శాశ్వత ప్రాతిపదికన ఎవరినీ నియమించలేదు. మరోవైపు, ఇండో– టిబెటెన్ బోర్డర్ పోలీస్ దళాలకు డీజీగా 1983వ బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి ఆర్కే పచనందను నియమించారు. ఛత్తీస్‌గఢ్‌లో దట్టమైన అడవుల్లో సైతం మావోలపై ఆకాశమార్గంలో నిఘాకు సాయపడే అత్యంత అధునాతన రాడార్ వ్యవస్థలను సమకూర్చుకోవాలని కేంద్రం యోచిస్తోంది.