కిష్ట్వార్ పట్టణంలో ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో శనివారం కాశ్మీర్ వ్యాలీలో హురియత్ కాన్ఫరెన్స్ బంద్కు పిలుపునిచ్చింది.
కిష్ట్వార్ పట్టణంలో ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో శనివారం కాశ్మీర్ వ్యాలీలో హురియత్ కాన్ఫరెన్స్ బంద్కు పిలుపునిచ్చింది. దాంతో ఆ ప్రాంతంలో జనజీవనం దాదాపుగా స్తంభించింది. దుకాణాలు, వ్యాపార సంస్థలు అన్ని మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయలు, బ్యాంక్ కార్యకలాపాలు అంత సజావుగా సాగడం లేదు. అలాగే వేసవి కారణంగా ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
కిష్ట్వార్ పట్టణంలో పరిస్థితులను సమీక్షించిన తరువాత తమ తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని హురియత్ కాన్ఫరెన్స్ నేతలు వెల్లడించారు. కిష్ట్వార్ పట్టణంలో రెండు మతాలకు చెందిన వర్గాల మధ్య శుక్రవారం జరిగిన అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య శనివారానికి రెండుకు చేరింది. ఈ ఘర్షణలో మరో 20 మంది గాయపడి వివిధ ఆసుపత్రల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.