Kishtwar town
-
కిష్ట్వార్లో కొనసాగుతున్న కర్ఫ్యూ
మత ఘర్షణల నేపథ్యంలో కిష్ట్వార్ పట్టణంలో విధించిన కర్ఫ్యూ ఎట్టి పరిస్థితుల్లో సడలించేది లేదని ఆ జిల్లా మేజిస్ట్రేట్ బషీర్ అహ్మద్ ఖాన్ బుధవారం స్పష్టం చేశారు. కర్ఫ్యూ సడలించిన పక్షంలో అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో విధించిన కర్ఫ్యూ నేటితో ఆరో రోజుకు చేరిందన్నారు. గత ఆరు రోజులుగా విధించిన కర్ఫ్యూను ఒక్క సారి కూడా సడలించలేదన సంగతిని ఖాన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదని తెలిపారు. అయితే పట్టణంలో విధించిన కర్ఫ్యూ వల్ల స్థానికులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను విలేకర్ల బృందం స్థానికంగా పర్యటించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జమ్మూలోని పలు ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను కొంత సేపు సడలిస్తున్నారు. ఆ సమయంలో స్థానికులు తమకు అవసరమైన నిత్యవసర సరకులను కొనుగోలు చేస్తున్నారని జమ్మూలోని ఉన్నతాధికారి వివరించారు. అయితే గురువారం జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక విద్యార్థులు ఎవరు ఆ వేడుకలకు హాజరుకాకుడదంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15 సందర్భంగా ఏమైన ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆదికారులు వివరించారు. -
కాశ్మీర్ వ్యాలీలో స్తంభించిన జనజీవనం
కిష్ట్వార్ పట్టణంలో ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో శనివారం కాశ్మీర్ వ్యాలీలో హురియత్ కాన్ఫరెన్స్ బంద్కు పిలుపునిచ్చింది. దాంతో ఆ ప్రాంతంలో జనజీవనం దాదాపుగా స్తంభించింది. దుకాణాలు, వ్యాపార సంస్థలు అన్ని మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయలు, బ్యాంక్ కార్యకలాపాలు అంత సజావుగా సాగడం లేదు. అలాగే వేసవి కారణంగా ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కిష్ట్వార్ పట్టణంలో పరిస్థితులను సమీక్షించిన తరువాత తమ తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని హురియత్ కాన్ఫరెన్స్ నేతలు వెల్లడించారు. కిష్ట్వార్ పట్టణంలో రెండు మతాలకు చెందిన వర్గాల మధ్య శుక్రవారం జరిగిన అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య శనివారానికి రెండుకు చేరింది. ఈ ఘర్షణలో మరో 20 మంది గాయపడి వివిధ ఆసుపత్రల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
కిష్ట్వార్ అల్లర్ల ఘటనలో మరొకరు మృతి
జమ్మూలోని కిష్ట్వార్ పట్టణంలో నిన్న జరిగిన అల్లర్లలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి శనివారం ఉదయం మరణించాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు శనివారం జమ్మూలో వెల్లడించారు. అయితే మరణించిన వ్యక్తికి సంబంధించిన వివరాలు ఏవి తమ వద్ద లేదని వారు తెలిపారు. శుక్రవారం పట్టణంలో ఇరు మతాలకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులును జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించాడని పేర్కొన్నారు. ఆ ఘర్షణలో భాగంగా ఇరు మతాలకు చెందని ఆందోళనకారులు పట్టణంలో దుకాణాలు, కార్యాలయాలు, పెట్రోల్ పంపులను తగుల బెట్టారు. ఆ నేపథ్యంలో ఉన్నతాధికారులు పట్టణంలో నిరవధిక కర్ప్యూ ను విధించారు. రెండో రోజు కూడా ఆ కర్ప్యూ కొనసాగుతుంది. ఘర్షణలో నిన్న మరణించిన మృతుడు అరవింద కుమార్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పట్టణంలో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో జిల్లా ఉన్నతాధికారులను బదిలీ చేస్తు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం శనివారం ఉత్తుర్వులు జారీ చేసింది.